కోయిల్ తిరువాయ్మొళి – సరళ వ్యాఖ్యానము – 5.5 – ఎంగనేయో

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

కోయిల్ తిరువాయ్మొళి

<< 4.10 – ఒన్ఱుం

ఆళ్వారు పరాంగుశ నాయకి యొక్క మానసిక స్థితిని ధరించి ‘మడల్’ (ఎంబెరుమాన్ తనను విడిచిపెట్టినట్లు బహిరంగంగా ప్రకటించుట) చేయటానికి బయలుదేరారు, రాత్రిలో చాలా బాధపడ్డారని, వేకువజామున కొంత స్పష్టతను పొందారని చెబుతున్నారు. తరువాత ఆమె తల్లులు మరియు స్నేహితులు ఆమెకు సలహా ఇవ్వడం ప్రారంభించారు. ఆమె వాళ్ళ మాటలను పట్టించుకోలేదు. పైగా భగవానుడిని గురించి తలంచుకొని ఆనందిస్తూ,  అతడిని శారీరికంగా చూడలేకపోతున్నందుకు బాధ పడుతూ ఉంది. ఈ పదిగము ఆళ్వారు యొక్క సుఖ / దుఃఖము యొక్క ఫలితమని చెప్పవచ్చు. ఆళ్వారు ప్రత్యక్షము రూపంలో భగవానుడిని ఉరువెళిప్పాడు (ఊహించు కొని) ఈ పదిగాన్ని పాడారు. ఆళ్వారు ఇక్కడ నంబి ఎంబెరుమాన్ యొక్క అతి సుందర స్వరూపాన్ని పూర్తిగా ఇక్కడ ఆస్వాదించి పరమానందిస్తున్నారు.

మొదటి పాశురము: “నంబి విశేష అలంకరణ చిహ్నాలైన శంఖ చక్ర స్వరూపాలుగా ఉన్న ఆళ్వార్ల కొరకై, నా హృదయం ఆరాటపడుతుంది”. అని పరాంగుశ నాయకి తెలుపుతుంది.

ఎంగనేయో అన్నై మీర్గాల్ !  ఎన్నై మునివదు నీర్
నంగళ్‌ కోల త్తిరుక్కుఱుంగుడి నమ్బియై నాన్‌ కణ్డ పిన్
శంగినోడుం నేమియోడుం తామరై క్కణ్గళోడుం
శెంగని వాయ్‌ ఒన్ఱినోడుం శెల్గిన్ఱదెన్ నెంజమే

ఓ తల్లులారా! మీరు సంతోషముగా ఉండి, నాపై ప్రేమ వొలకబోయకుండా కోపం చూపుతున్నారు ఎందుకు? గుణ సంపూర్ణుడు, శంఖ చక్రములను ధరించి లేత కమలము వంటి ఆకర్షణీయమైన నేత్రాలతో, దొండపండు వంటి అధర సౌందర్యముతో తిరుక్కురుంగుడిలో ఉన్న అతి మనోహరుడైన నంబిని ఆస్వాదించిన తరువాత, నా హృదయం అతడికి ఆకర్షితమైపోయినది. ‘కోలం’ (ఆకర్షణీయమైన) కూడా తిరుక్కురుంగుడికి ఒక విశేషణంగా ఇక్కడ వివరించబడింది.

రెండవ పాశురము:  “దివ్య వక్షస్థలము, దివ్య భుజాలు, దివ్యాభరణాలలో అతడి (నంబి) సౌందర్యము నన్ను కమ్మివేసి వేదించేస్తుంది” అని పరాంగుశ నాయకి చెబుతుంది.

ఎన్నెంజినాల్‌ నోక్కి క్కాణీర్ ఎన్నై మునియాదే
తెన్నన్ శోలై త్తిరుక్కుఱుంగుడి నమ్బియై నాన్ కండ పిన్
మిన్నుం నూలుం కుండలముం మార్బిల్‌ తిరుమఱువుం
మన్ను పూణుం నాంగు తోళుం వందెంగుం నిన్ఱిడుమే (2)

నన్ను ఆజ్ఞాపించేందుకు బదులు, నీవు నా మనస్సుతో నంబిని దర్శించి అనుభవించాలి; దక్షిణ దిక్కులో చుట్టూ చక్కని ఉద్యానవనములతో  ఉన్న తిరుక్కురుంగుడిలో వాసమున్న నంబిని  చూసిన తరువాత, అతడి వైభవానికి ప్రతీక అయిన యజ్ఞోపవీతము, అతడి దివ్య కర్ణాభరణములు, అతడి దివ్య వక్ష స్థలములో స్థిరమై ఎన్నడూ విడదీయరాని ఆభరణమైన శ్రీవత్సము, అతడిని విడువని అనేక దివ్య ఆభరణాలు మరియు అతడి దివ్య చతుర్భుజములు నన్ను అనుసరిస్తున్నాయి, నేను వెళ్ళే చోటికి నాతో వచ్చి నాతోనే ఉంటున్నాయి..

మూడవ పాశురము:  “శ్రీ శార్ంగముతో (విల్లు) మొదలు పెట్టి ఆ నంబి యొక్క దివ్యాయుధాలు నాలోపల బయట  అన్ని చోట్లా నిత్యము నాకు గోచరిస్తున్నాయి”  అని పరాంగుశ నాయకి వివరిస్తుంది.

నిన్ఱిడుం తిశైక్కుం నైయుం ఎన్ఱు అన్నైయరుం మునిదిర్‌
కున్ఱ మాడ త్తిరుక్కుఱుంగుడి నమ్బియై నాన్ కండ పిన్
వెన్ఱి విల్లుం తండుం వాళుం శక్కరముం శంగముం
నిన్ఱు తోన్ఱి క్కణ్ణుళ్‌ నీంగా నెంజుళ్ళుం నీంగావే (3)

ఓ తల్లులారా! మీరు మొదట నన్ను పురిగొలిపి, ప్రేరేపించి ఈ ప్రేమలోకి నెట్టి, నేను నిశ్చేష్టునైనానని, బలహీనమైననాని ఇప్పుడు లాంఛనాలు వేస్తున్నారు; విశాల భవనాలతో సుసంపన్నమైన తిరుక్కురుంగుడిలో నివాసుడై ఉన్న నంబిని, అతడి గధా, విల్లు, ఖడ్గము, శంఖచక్రములను ఆస్వాదించిన తరువాత, అవన్నీ నా కళ్ళల్లో  నిలిచిపొయాయి. అదేవిధంగా, అవి నా మనస్సులో నుండి వెళ్ళట్లేదు కూడా.

నాలుగవ పాశురము:  “నంబి యొక్క ఆధిపత్యాన్ని చూపించే వారి విశేష దివ్య వస్త్రాలంకరణ ఎప్పటికీ నా మనస్సులో నిలిచి ఉంటుంది” అని పరాంగుశ నాయకి తెలుపుతుంది.

నీంగ నిల్లా క్కణ్ణ నీర్గళ్‌ ఎన్ఱు అన్నైయరుం మునిదిర్
తేన్ కొళ్‌ శోలై త్తిరుక్కుఱుంగుడి నమ్బియై నాన్ కండ పిన్
పూన్దణ్‌ మాలై త్తణ్దుళాయుం పొన్ ముడియుం వడివుం
పాంగు తోన్ఱుం పట్టుం నాణుం పావియేన్ పక్కత్తవే (4)

ముందు నుండి నంబివైపు నన్ను తోసింది నువ్వు, ఇప్పుడు నన్ను “ఆమె కన్నీళ్లు ఆగడం లేదు” అని  మాటలంటున్నావు; తేనెలు కారే తోటలు కలిగి ఉన్న తిరుక్కురుంగుడిలో  తాజా తుళసి మాలలను ధరించి ఆకట్టుకునే స్వరూపముతో ఉన్న నంబిని అనుభవించిన తరువాత, అతని ఆధిపత్యాన్ని ఎత్తిచూపే ఆకర్షణీయమైన అతడి కిరీటము, అతడి స్వరుపానికి చక్కగా హత్తుకొని ఉన్న పట్టు పీతాంబరము, అతడి తీగ లాంటి సన్నిని నడుము మొదలైనవి నన్ను ఆకర్షించి నాకు దగ్గరైనాయి. ఇప్పుడు ఇక్కడ తప్పెవరిది?

ఐదవ పాశురము:  “నంబి యొక్క శ్రీముఖ సౌందర్యము మొదలైనవి నా ఆత్మను చేరుతున్నట్లు అనిపిస్తుంది” అని పరాంగుశ నాయకి తెలుపుతుంది.

పక్కం నోక్కి నిఱ్కుం వైయుం ఎన్ఱు అన్నైయరుం మునిదిర్‌
తక్క కీర్‌త్తి త్తిరుక్కుఱుంగుడి నమ్బియై నాన్ కండ పిన్
తొక్కశోది త్తొండై వాయుం నీండ పురువంగళుం
తక్క తామరై క్కణ్ణుం పావియేన్‌ ఆవియిన్‌ మేలనవే (5)

నేను, అతడు ఎక్కడి నుండి వస్తాడా అని నిలుచొని ఎదురుచూస్తున్నానని, అతడు రాకపోయేసరికి బాధతో బలహీనపడుతున్నానని మీరు నన్ను మాటలంటున్నారు; కీర్తి ప్రసిద్దులు కలిగి ఉన్న తిరుక్కురుంగుడి నంబిని ఆస్వాదించిన తరువాత, ఎర్రని దొండ పండుల వలే  మెరిసే అతడి దివ్య అదరములు, పొడవైన దివ్య కనుబొమ్మలు, కనుబొమ్మలంత పొడవైన ఆకర్షణీయమైన అతడి దివ్య కమల నేత్రములు, అతడిని అనుభవించకుండా ఉండే పాపమున్న వారున్నారా?

ఆరవ పాశురము: “అతడి విశేష శారీరక సౌందర్యము గుణాలు, దివ్య భుజాలు, అతడి ముఖ సౌందర్యము అన్నీ నా హృదయంలోకి ప్రవేశించి నన్ను నింపివేశాయి” అని పరాంగుశ నాయకి తెలుపుతుంది..

మేలుం వన్ పళి నంగుడిక్కివళ్‌ ఎన్ఱు అన్నై కాణ కొడాళ్
శోలై శూళ్‌ తణ్‌ త్తిరుక్కుఱుంగుడి నమ్బియై నాన్ కండ పిన్
కోల నీళ్‌ కొడి మూక్కుం తామరై క్కణ్ణుం కని వాయుం
నీల మేనియుం నాంగు తోళుం ఎన్ నెంజం నిఱైందనవే (6)

ఎత్తైన ఉద్యానవనాలు చుట్టూ వ్యాపించి ఉన్న తిరుక్కురుంగుడి నంబిని చూసిన తరువాత, కల్పక లతని పోలి ఉండే అతడి పొడవైన దివ్య నాసికము (ముక్కు) , తామరను పోలి ఉండే అతని దివ్య నేత్రాలు, ఎర్రటి పండు వంటి అతటి దివ్య అదరములు, నీల వర్ణముతో చతుర్భుజాలను ధరించిన ఉన్న అతడి దివ్య స్వరూపము నా హృదయాన్ని నింపి వేసిన తరువాత ఇక ఎప్పటికీ ఎగతాళికి గురి అవుతారని పరాంగుశ నాయకి  తల్లి, ఆమెను నంబిని చూడటానికి అనుమతించట్లేదు.

ఏడవ పాశురము:  “నంబి తన దివ్య హస్థములో చక్రాన్ని ధరించి అనంత తేజోమయముతో అద్భుత ఆకర్షణ కలిగిన అతడి దివ్య స్వరూపంతో నా హృదయంలో నిలిచి ఉన్నాడు” అని పరాంగుశ నాయకి తెలుపుతుంది..

నిఱైంద వన్‌ పళి నంగుడిక్కివళ్‌ ‌ ఎన్జు అన్నై కాణ కొడాళ్‌
శిఱంద కీర్‌త్తి త్తిరుక్కుఱుంగుడి నమ్బియై నాన్ కండ పిన్
నిఱైంద శోది వెళ్ళం శూళ్ంద నీణ్డ పొన్ మేనియొడుం
నిఱైందెనుళ్ళే నిన్ఱొళిందాన్  నేమి అంగై ఉళదే (7)

అద్భుతమైన కీర్తిని కలిగిన తిరుక్కురుంగుడిలో అందమైన  దివ్య సుదర్శన చక్రము తన దివ్య హస్థములలో ధరించిన నంబిని దర్శించి అనుభవించిన పిదప, అతడి ఆకర్షణీయమైన దివ్య స్వరూపము తన హృదయంలో నిలిచిపోయి దివ్య ప్రకాశాన్ని నింపి వేసిన తరువాత, పరాంగుశ నాయకి యొక్క తల్లి, ఆమె “మొత్తం వంశానికి కలంకము” అని చెప్పి నంబిని చూడటానికి అనుమతించ లేదు .

ఎనిమిదవ పాశురము:  “విశాలమైన భుజాలవరకు తాకుతున్న అతడి అందమైన శిరోజాలు, అతడి ముఖ సౌందర్యము నా కళ్ళ ముందు కట్టినట్టుగా కనిపించి నన్ను దహించివేస్తున్నాయి” అని పరాంగుశ నాయకి తెలుపుతుంది.

కైయుళ్‌ నన్ముగం వైక్కుం నైయుం ఎన్ఱు అన్నైయరుం మునిదిర్‌
మై కొళ్‌ మాడ త్తిరుక్కుఱుంగుడి నమ్బియై నాన్ కండ పిన్
శెయ్య తామరై క్కణ్ణుం అల్గులుం శిఱ్ఱిడైయుం వడివుం
మొయ్య నీళ్‌ కుళల్‌ తాళ్ంద తోళ్గళుం పావియేన్ మున్నిఱ్కుమే (8)

ఎత్తైన భవనాలు ఉన్న తిరుక్కురుంగుడి నంబి యొక్క ఎర్రటి దివ్య కమల నయనాలు, సన్నని నడుము, అతడి స్వరూపము, అతని భుజాలపై జాలువారే దట్టమైన శిరోజాలు చూసిన తరువాత, అతడి స్వరూపము నా ముందు నిలబడి ఉండి నన్ను బలహీనము చేస్తుండగా,  ఈ బలహీనతకు దారితీసే యత్నాలలో నన్ను తోసిన తల్లులు, ఇప్పుడు కోపగిస్తున్నారు.

తొమ్మిదవ పాశురము:  “నంబి తన సౌందర్యమంతటితో సహా నా హృదయంలోకి ప్రవేశించాడు. అతడిని నేను మరువకూడదని నా హృదయాన్ని వదిలి ఒక్క క్షణం కూడా ఎక్కడికి వెళ్ళనంటున్నాడు.” అని పరాంగుశ నాయకి తెలుపుతుంది.

మున్ నిన్ఱాయ్‌ ఎన్ఱు తోళి మార్గళుం అన్నైయరుం మునిదిర్
మన్ను మాడ త్తిరుక్కుఱుంగుడి నమ్బియై నాన్ కండ పిన్
శెన్ని నీళ్‌ ముడి ఆదియాయ ఉలప్పిలణి కలత్తన్
కన్నల్‌ పాల్‌ అముదాగి వందు ఎన్ నెంజం కళియానే (9)

ఎత్తైన దివ్య కిరీటాన్ని శిరస్సున ధరించి ఎత్తైన సుస్థిర  భవనాలున్న తిరుక్కురుంగుడి నంబిని దర్శించిన తరువాత, తీయని తేనెలా, పాలలా అనంత రుచి కలిగి ఉన్నావాడు లెక్కలేనన్ని ఆభరణాలతో నా హృదయంలోకి ప్రవేశించగా, నేను ముందు నిలబడి ఉన్నానని నా స్నేహితులు మరియు తల్లులు నాపై కోపంగా ఉన్నారు.

పదవ పాశురము:  “పరమపద నిత్య వాసులైన నిత్యసూరులచే ఆస్వాదింపబడే అతడి దివ్య స్వరూపం అనంత కోటి సూర్యుల తేజము వంటి ప్రకాశముగలదు, మనందరికి  సముచిత లక్ష్యము కూడా. అటువంటి దివ్య స్వరూపము ఎవ్వరూ గ్రహించగలగలేని  నా హృదయంలో ప్రకాశిస్తున్నాడు”, అని పరాంగుశ నాయకి వివరిస్తుంది.

కళియ మిక్కదోర్‌ కాదలళ్‌ ఇవళ్‌ ఎన్ఱు  అన్నై కాణ కొడాళ్‌
వళువిల్‌ కీర్‌త్తి త్తిరుక్కుఱుంగుడి నమ్బియై నాన్ కండ పిన్
కుళుమి తేవర్‌ కుళాంగళ్ కై తొళ చ్చోది వెళ్ళత్తినుళ్ళే
ఎళువదోర్‌ ఉరువెన్నెంజుళ్‌ ఎళుం ఆర్‌క్కుం అఱివరిదే (10)

మనందరికీ సముచితమైన గమ్యము మరియు నిత్య తేజోమయముతో దివ్యంగా ప్రకాశిస్తూ నిత్య సూరుల సమూహముచే సేవించబడే అద్వితీయమైన కీర్తి ప్రతిష్ఠలు ఉన్న తిరుక్కురుంగుడి నంబి యొక్క దివ్య స్వరూపాన్ని చూసిన తరువాత, ఉన్నతమైన జ్ఞానులకు కూడా దుర్లబుడైన అతడు నా హృదయంలో విరాజితుడైనాడు. ఇంత జరిగిన తరువాత, ఆమె గొప్ప ప్రేమను కలిగి ఉందని నంబిని చూడటానికి నా తల్లి నన్ను అనుమతించట్లేదు.

పదకొండవ పాశురము:  ఈ పదిగాన్ని నేర్చుకొని పఠించిన వారికి మన వాస్థవ స్వభావ సాక్షాత్కారము ప్రాప్తిస్తుందని ఆళ్వారు వివరిస్తున్నారు, అనగా భగవత్ కైంకర్యము లభిస్తుందని అర్థమౌతుంది.

అఱివరియ పిరానై ఆళియంగైయనైయే అలఱ్ఱి
నఱియ నన్మలర్‌ నాడి నన్ కురుగూర్‌ చ్చడగోబన్ శొన్న
కుఱి కొళ్‌ ఆయిరత్తుళ్‌ ఇవై పత్తుం త్తిరుక్కుఱుంగుడి అదన్ మేల్‌
అఱియ కఱ్ఱు వల్లార్‌ వైట్టణవర్‌ ఆళ్‌ కడల్‌ జ్ఞాలత్తుళ్ళే (11)

తిరుక్కురుంగుడి నంబి సర్వోపరి, అతని దివ్య మనోహర హస్తములో దివ్య సుదర్శన చక్రాన్ని ధరించిన అతనిని, తెలుసుకోవడం అసాధ్యం; ఆళ్వార్తిరునుగారికి నాయకుడు విశిష్టమైన జ్ఞానము కలిగిన నమ్మాళ్వార్ నిత్యము భగవానుడినితో సంభాషించి ఆనందించగల అర్హత కలవారు. అటువంటి నమ్మాళ్వార్ అనుగ్రహించిన వెయ్యి పాశురములలో ఈ పదిగాన్ని నేర్చుకొని పఠించి అర్థానుసందానము చేసేవారికి ఈ భూమిపైన ప్రత్యేకమైన భగవత్ సంబంధం మరియు భగవత్  అనుభవము చేకూరుతుంది.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2020/05/thiruvaimozhi-5-5-simple/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Comment