ఉత్తరదినచర్య – స్లోకం – 4 మరియు 5

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

శ్రీ వరవరముని దినచర్య

<< స్లోకం 3

శ్లోకం 4 & 5

తతః కనక పర్యంకే తరుణధ్యుమణిధ్యుతౌ |
విశాలవిమల స్లక్ష్ణ తుంగతూలాసనోజ్జ్వలే || (4)

సమగ్రసౌరభోద్గార నిరంతర దిగంతరే |
సోపదానే సుఖాసీనం సుకుమారే వరాసనే || (5)

$3B72773B15A9C344

ప్రతి పదార్థం:

తతః = తరువాత

తరుణధ్యుమణిధ్యుతౌ = బాల సూర్యునిలాంటి కాంతితో

విశాల విమల శ్లక్ష్ణ తుంగతూలాసనోజ్జ్వలే = విశాలమైన , శుధ్ధమైన , దృడముగా , నున్నగా , సున్నితముగా ఉన్న

సమగ్ర సౌరభ ఉద్గార నిరంతర దిగంతరే = పెరుమాళ్ళ శేష మాలల సౌరభవముతో నాలుగు దిక్కులు వ్యాపించగా

సోపదానే = ఆనుకోవటానికి వీలుగా దిండ్లు అమర్చబడిన

కనక పర్యంకే = బంగారు మంచములో

సుకుమారే = సుకుమారముగా

వరాసనే = ధ్యానము చేయుటకు అనువైఅన జింక చర్మముతో చేయబడ్డ ఆసనములో

సుఖాసీనం =   సుఖాసీనులైన

తం = ఆ మణవాళ మామునులను

చింతయామి = సదా ధ్యానిస్తాను

భావము:

సకలశాస్త్రార్థములకు లక్ష్యమైన పంచమోపాయము( రామానుజులే మొక్షోపాయము అని) మనసార విశ్వసించిన మామునులు తమ తీయని , సులభమైన మాటలతోశిష్యులను ఉల్లాస పరచి, ఆ   రామానుజులను ధ్యానించుటకు ఉపక్రమించారు. అందుకోసము స్వర్ణమయమైన మంచముమీది  ఆసనములో కూర్చున్న అందమును సదా ధ్యానము చేస్తున్నానని ఈ శ్లోకములో చెపుతున్నారు.    తామే కోరి మంచము మీద అందునా స్వర్ణమయమైన మంచము మీద కూర్చోనుట శాస్త్ర విరుధ్ధము. అయినప్పటికీ శిష్యుల కోరిక మేరకు అలా కూర్చున్నారు అని గ్రహించ వలసి వుంది.   బంగారమువెండి, కంచుఇత్తడి, రాయి మొదలైన పాత్రలలో వండిన ఆహారము స్వీకరించుట వలన సన్యాసికి పాపము చేకూరదు. ఆ పాత్రలను ఇతరుల నుండి అడిగి తీసుకుంటే పాపము కలుగుతుంది, అని మేధాతి చెప్పిన విషయమునుపరిసీలిస్తే, ఆహారమునకే కాక మంచమునకు ఉపలక్షణముగా వర్తిస్తుందని తెలుస్తున్నది. శిష్యులు బంగారు మంచమును ఇచ్చి  దాని మీద కూర్చొని తమను వీక్షించమని ప్రార్థించినపుడు వారి కోరికను నెరవేర్చుట దోషము కాదు. బంగారము మీదనో, మంచము మీదనో కోరికతో కూర్చున లేదు. శిష్యుల కోరిక తీర్చ వలచిన నిర్భందము ఆచార్యులకున్నది అది సన్యాసి అయినా తప్పు లేదు అని భావము.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2016/09/uththara-dhinacharya-4-and-5/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *