తిరుప్పళ్ళి యెళుచ్చి – 10 – కడిమలర్

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

తిరుప్పళ్ళి యెళుచ్చి

9వ పాశురం

periyaperumal-thondaradippodiazhwar

పాశుర అవతారిక:

  • నఙ్ఞీయర్ వ్యాఖ్యానములో ప్రధానంగా – తొండరడిపొడి ఆళ్వార్ ఇలా వివరిస్తున్నారు ” మొదటిపాశురంనుండి 9వ పాశురం వరకు ఋషులు , దేవతలు తమ నిగూడమైన ఉద్ధేశ్యాలను/ఆశయాలు నెరవేర్చబడగానే వారిని వదలివేసారు. ఈ పాశురమున ఆళ్వార్ఎంపెరుమాన్ ను  మీరు దయచేసి మేల్కొని మమ్ములను అనుగ్రహింపుము, అలానే మీరు మేల్కొంటున్నపుడు ఆ నిద్రాకాలిక ముఖ సౌందర్యమును సేవించాలని కోరుకుంటున్నాము’ అని విన్నవిస్తున్నారు.
  •  పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానములోని ప్రధానాంశాలు
    • ఉపక్రమం(ఆరంభం) మరియు ఉపసంహారం(ముగింపు) ఈ రెండు కచ్చితంగా సమకాలీనత్వం / అణుగుణంగా పాటింపబడ్డాయి ఈ ప్రబంధములో. మిగితా ప్రబంధములను పరిశీలించినచో- నమ్మాళ్వార్  తమ తిరువిరుత్తం లో “అడియేన్ శెయ్యిం విణ్ణప్పం” (మొదటి పాశురం)అని ,  చివరి పాశురాన “మారన్ విణ్ణప్పం శెయ్ద” అని ముగించారు, అలాగే ఆండాళ్  తన తిరుప్పావై లో “నమక్కే పరై తరువాన్” అని మొదటి పాశురాన, చివర పాశురమున “అంగప్పరై కొణ్డ” అని,  ఆళవందార్ తమ స్తోత్రరత్న ప్రారంభమున “నాథాయ మునయే” అని చివరి శ్లోకమున “పితామహం నాథమునిం విలోక్య” అని ముగించారు. అలాగే ఆళ్వార్ ఇక్కడ “కదిరవన్ కుణదిశై చ్చిగరమ్ వన్దు అణైన్దాన్“అని ప్రథమ పాశురమున ప్రారంభించి చివరి పాశురాన “కదిరవన్ కనైకడల్ ముళైత్తననివనో ” తో ఉపసంహారం చేశారు.
    • సూర్యుని రాకతో తామరలు వికసించుట వంటి  అందమైన ఉదాహరణ ఇక్కడ వర్ణింపబడింది. ఎలాగైతే దూరదేశము నుండి వచ్చిన తన కుమారుణ్ణి చూసిన తండ్రి ముఖం ఎంత ఆనందంగా వికసించునో  అలా. నిన్న అదృశ్యమైన  సూర్యుడు మరలా తిరిగి అగుపించేసరికి   ఆ తామరలు వికసించచాయి.

కడిమలర్ కమలంగళ్ మలర్ న్దనయివయో                                                                                                                 కదిరవన్ కనైకడల్ ముళైత్తననివనో                                                                                                                   తుడియిడై యార్ శురి కుళల్ పిళిందు ఉదఱి                                                                                                               తుగిల్ ఉడుత్తు ఏఱినర్ శూళ్ పునల్ అరంగా                                                                                                             తొడైఒత్త తుళపముం కూడైయుమ్ పొలిన్దు                                                                                                               తోన్ఱియ తోళ్ తొండరడిప్పొడి యెన్నుం                                                                                                                   అడియనై| అడియనెన్ఱు అరుళి ఉన్నడియార్కు                                                                                                           ఆళ్ పడుత్తాయ్ పళ్ళియెళుందు !అరుళాయే

ప్రతిపదార్థం:

పునల్ శూళ్=పవిత్రమైన కావేరి జలంతో చుట్టబడిన
అరంగా !=శ్రీరంగమున శయనించిన శ్రీరంగనాథా!
కడి  = పరిమళ
కమలం మలర్ గళ్= తామర పుష్పములు
మలర్  న్దనయివయో= పూర్తిగా వికసించిన
కదిరవన్=సూర్యుడు(తామరలను వికసింపచేయు వాడు)
కనైకడల్= సముద్రపు ఘోష
ముళైత్తనన్=ఉదయగిరినందు ఉదయించెను  (తూర్పున)                                                                                             ఇవనో= ఇదిగో
తుడియిడై యార్ = డమరుకం  వంటి నడుము గల స్త్రీలు(డమరుకమునకు మధ్యన ఉండు సన్నన్నిభాగము వంటి)           శురి కుళల్= వారి కొప్పులు
పిళిందు ఉదఱి= బాగా విదిల్చి పిండి(నీళ్ళు లేకుండ)
తుగిల్ ఉడుత్తు = వస్త్రములను ధరించి
ఏఱినర్ = గట్టు ను ఎక్కిరి(నది నుండి ఒడ్డుకు వచ్చిరి)
తొడైఒత్త = చక్కగా కూర్చిన
తుళపముం = తులసి మాల
కూడైయుమ్ = పూల బుట్ట                                                                                                                                        పొలిన్దు  తోన్ఱియ = ధరించి వచ్చిన
తోళ్ = భుజములు                                                                                                                                     “తొండరడిప్పొడి” యెన్నుం = తొండరడి పొడి అను పవిత్ర నామమును ధరించిన
అడియనై= దాసుడను
అడియనెన్ఱు అరుళి =మీ కృపకు పాత్రుడను/అర్హుడను
ఉన్నడియార్కు = మీ దాసులకు
ఆళ్ పడుత్తాయ్=వారి సేవ యందు నియమన పరుచుము/ శేష పరుచుము
పళ్ళియెళుందు !అరుళాయే=(ఆ ప్రయోజనమునకు) కృపతో లేచి మమ్ములను అనుగ్రహింపుము.

సంక్షిప్త అనువాదం :

పవిత్రమైన కావేరీ జలంతో ఆవరింపబడిన శ్రీరంగమున పవళించిన శ్రీరంగనాథా! ప్రకృతి పరమైన శబ్దం ప్రసరించుచున్నది    సముద్రములో,   పరిమళ భరిత తామరలు   సూర్యుడు ఉదయించగానే వికసించాయి. డమరుకం(సన్నని మధ్య భాగం గల ఒక వాయిద్యం)వంటి సన్నని నడుము భాగం గల స్త్రీలు తమ కేశములను తడి లేకుండ విదిల్చి(స్నానాంతరం)వస్త్రములు ధరించి నది ఒడ్డునకు చేరారు. తొండరడిపొడి(భక్తుల పాద ధూళి) అను నామధేయం గల  ఈ దాసుడు పరమళించు తులసీ మాలలు ఉన్న బుట్టను ఈ    ప్రకాశిస్తున్న ఈ భుజములయందు ధరించి ఉన్నాడు. (కనుక) మీ కృపకు పాత్రుడను/అర్హుడను అయిన నన్ను అంగీకరించి   భాగవతుల ( మీ దాసుల)  సేవ యందు నియమన పరచుము/ శేష పరుచుము.

 నఙ్ఞీయర్ వ్యాఖ్యానములోని ప్రధానాంశములు:

  • ఆళ్వార్ ఇక్కడ ఆ సన్నని నడుము మరియు గిరిజాల(ఉంగరాల) జుట్టు ఉన్న  స్త్రీలను ఎందుకు ఉట్టంకించారు/ఉదాహరించారంటే, పెరియ పెరుమాళ్,  కు బృందావనంలో యమునా నది రేవుల/ ఘాట్ లలో   స్నానమాడి తనను తొందరగా నిద్రలేపు  గోపికలను  గుర్తుచేస్తున్నారు. పరాశర భట్టర్ వారు పెరియపెరుమాళ్ ను శ్రీకృష్ణుడిలా, ఉత్సవర్లైన నంపెరుమాళ్ ను శ్రీరాముడిలా భావించేవారు.
  • మొదట పెరియపెరుమాళ్  యొక్క గుర్తింపు  “శూళ్ పునల్ అరంగా!” అని అనడం వలన వెల్లడవుతుంది- కావేరీ జలముతో ద్వీపముగా చుట్టబడి  మరియు తనకు ఇష్ఠమైన నివాసము అగు శ్రీరంగముతో ఇతనిని గుర్తించడం జరిగినది. ఆహ్లాదకరమైన ఈ కావేరీనది పెరియపెరుమాళ్ కు విరజా నదిని(నిత్యవిభూతిని మరియు  లీలా విభూతిని వేరుపరుచునది) , సరయూ నదిని(అయోధ్య) మరియు యమునానదిని(మథుర, బృందావనం) మరిపిస్తుంది.
  • ఆళ్వార్ , ఎంపెరుమాన్ వైభవమున తగ్గట్టుగా అలకరించు అందమైన మాలలతో నిండి ఉన్న బుట్టను ధరించి ఉన్న తమ స్వరూపమును వెల్లడిచేస్తున్నారు. శ్రీరామాయణంలో లక్ష్మణుడు చేతిలో గునపమును మరియు బుట్ట(మట్టి మోయుటకు) , తన బాణం/విల్లుతో ధరించి శ్రీరామునకు మార్గదర్శిగా నిలుస్తారో అలా ఆళ్వార్ కూడ పుష్పములతో నిండిన బుట్టను ధరించిన స్వరూపముతో గుర్తించబడుతున్నారు. ఇదే జీవాత్మ యొక్క నిజమైన స్వరూపం.
  • తొండరడిపొడి ఆళ్వార్(భక్తుల పాద ధూళి) ఈ నామము ఆళ్వార్   ,   భగవంతుని దాసుల పాదాల వద్ద ఉన్న విశేష స్థానమును సూచించును.

పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానములోని ప్రధానాంశాలు:

  • కడిమలర్- పరిమళ భరిత పుష్పములు- శ్రీరంగములో ఉన్న పుష్పములన్నీ సువాసన యుక్తంగ ఉంటాయి, కారణం అది శ్రీమహాలక్ష్మి నివాస స్థలం. కావుననే నమ్మాళ్వార్ తమ తిరువాయ్ మొళి 10.10.2 లో “వాసమ్ శెయ్ పూంగుశలాళ్ తిరు” (పరిమళ భరిత కేశములు కలగిన మహాలక్ష్మి వాసస్థానం)అని కీర్తించారు.
  • తిరుప్పాణి ఆళ్వార్ తమ అమలనాదిపిరాన్ పదవ పాశురమున “కోవలనాయ్ వెణ్ణెయ్ ఉండ వాయన్ ……అణి అరంగన్”(శ్రీరంగనాథుడు వెన్నను ఆరగించిన శ్రీ కృష్ణుడే)   అని పేర్కొన్నాడు.
  • ప్రభావమైన సుదర్శనచక్రం మరియు పాంచజన్యములు భగవానుని స్వరూపమును తెలుపును ఈ విషయమును తిరుమంగై ఆళ్వార్ తమ పెరియతిరుమొళి 11.2.6 లో “ఆళియుమ్ శంగుముడైయ నంగళడిగళ్“అని అన్నారు , ఆ మాదిరిగానే  భాగవతులకు పుష్పములతో నిండిన బుట్టను ధరించుట  స్వరూప లక్షణము. భగవానునకు సమర్పించు అన్ని  కైంకర్యముల యందు  మాలాకైంకర్యం ఉత్తమ కైంకర్యముగా చెప్పబడింది,  కావుననే పెరియాళ్వార్, తొండరడిపొడిఆళ్వార్, అనంతాళ్వాన్ మొదలైన వారు ఈ కైంకర్యము ద్వారా నే భగవంతున్ని సేవించారు.
  • ఆత్మ యొక్క అస్వాభావిక అంశాలు తొలగించబడతాయో, అంతిమంగా ఆ ఆత్మకు ఎంపెరుమాన్ మరియు అతని  భక్తుల యందు శేషత్వభావన ఏర్పడుతుంది.
  • సంసారము యందు/వైపు  శేషత్వం  నిరర్థకమైనది, భగవానుని యందు/వైపు   శేషత్వం  విశేషమైనది,  అదే శేషత్వం భాగవతుల యందు/వైపు  అత్యంత విశేష పూర్ణమైనది.
  • ‘అంతిమ స్థితియగు శేషత్వమును(భాగవతుల యందు) అంగీకరించి మీ పాద భక్తునిగా మారినా కూడ మీరు ఇంకా పవళించి ఉన్నారే? ఇకనైనను లేచి మమ్ములను అనుగ్రహింపుము’అని తొండరడిపొడిఆళ్వార్ అభ్యర్థిస్తున్నారు.

నఙ్ఞీయర్ మరియు పెరియవాచ్చాన్ పిళ్ళైల వ్యాఖ్యాన ఆధారిత  తిరుప్పళ్ళి యెళుచ్చి తెలుగు అనువాదం సంపూర్ణం.

అడియేన్ నల్లా శశిధర్ రామానుజదాస

ఆధారం: http://divyaprabandham.koyil.org/index.php/2015/01/thiruppalliyezhuchchi-10-kadimalar/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
pramAthA (preceptors) – http://guruparamparai.wordpress.com
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org

Leave a Comment