తిరువెళుకూట్ఱిరుక్కై- అవతారిక

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: తిరువెళుకూట్ఱిరుక్కై << తనియన్లు               తిరుమంగై ఆళ్వార్లు ఈ సంసారములోని సుఖ: దుఖ:ములను చూసి విరక్తి చెందారు. పెరియ తిరుమొళిలో, అనేక దివ్య దేశములను వర్ణించారు. అది చూసి ఈయన శ్రీవైకుంఠమునే మరచిపోయారని భగవంతుడే ఆశ్చర్య పోయి ఈ సంసారము యొక్క స్వరూపమును చూపారు. పెరియ తిరుమొళిలో ఆఖరి దశకము  “మాఱ్ఱముళ”లో  ఆళ్వార్లు ఈ సంసారములో ఉండటము నిప్పులలో ఉన్నట్లు అని పాడారు.  ఆ దుఖ:మును … Read more

తిరువెళుకూట్ఱిరుక్కై – తనియన్లు

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: తిరువెళు కూట్ఱిరుక్కై మొదటి తనియన్  పిళ్ళైలోకం జీయర్   మణిప్రవాళ భాష(సంస్కృత తమిళ భాషల  మిశ్రమం)లో అనుగ్రహించిన తనియన్ వ్యాఖ్యానము ఇక్కడ వర్ణింపబడింది. దేవాలయాన్ని ఎలాగైతే  ప్రాకారములు రక్షించునో  ఆ మాదిరిగా ఆ భగవానుని ప్రాకారములను (వైభవమును)  రక్షించు  షట్ప్రబంధములను అనుగ్రహించిన తిరుమంగైఆళ్వార్ కు పల్లాండు (మంగళాశాసనం) ను చేయు తనియన్. ఆచార్యులు నేరుగా వీరిని స్తుతిస్తున్నారు. అన్నీ దివ్యదేశముల యందు ఆళ్వార్ ప్రస్తుతం … Read more

తిరువెళుకూట్ఱిరుక్కై

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: e-book of the whole series: http://1drv.ms/1J8z9Go Audio పన్నిద్దరాళ్వార్లలో ఒకరైన తిరుమంగైఆళ్వార్ల కు మాత్రం అనేక ప్రత్యేకతలున్నాయి. లోకములో అందరూ ఆచార్యులను ప్రార్ధించి పంచసంస్కారము పొందుతారు. కాని వీరు మాత్రము మానవమాత్రులను ఆశ్రయించక తిరునరయూర్ నంబిని  ఆశ్రయించి  పంచసంస్కారములను పొందారు. తిరుక్కణ్ణపురం పెరుమాళ్ళ దగ్గర తిరుమంత్రార్థమును పొందారు. వీరిది శార్ఘ అంశమని పెద్దలు చెపుతారు. అందుచేతనేమో వీరి పనులు, పాటలు బాణములా వాడిగా వుంటాయి. … Read more

తిరుప్పళ్ళి యెళుచ్చి – 10 – కడిమలర్

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: తిరుప్పళ్ళి యెళుచ్చి 9వ పాశురం పాశుర అవతారిక: నఙ్ఞీయర్ వ్యాఖ్యానములో ప్రధానంగా – తొండరడిపొడి ఆళ్వార్ ఇలా వివరిస్తున్నారు ” మొదటిపాశురంనుండి 9వ పాశురం వరకు ఋషులు , దేవతలు తమ నిగూడమైన ఉద్ధేశ్యాలను/ఆశయాలు నెరవేర్చబడగానే వారిని వదలివేసారు. ఈ పాశురమున ఆళ్వార్– ఎంపెరుమాన్ ను  మీరు దయచేసి మేల్కొని మమ్ములను అనుగ్రహింపుము, అలానే మీరు మేల్కొంటున్నపుడు ఆ నిద్రాకాలిక ముఖ సౌందర్యమును సేవించాలని … Read more

తిరుప్పళ్ళి యెళుచ్చి – 9 – ఏదమిళ్

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: తిరుప్పళ్ళి యెళుచ్చి 8వ పాశురం   పాశుర అవతారిక: నఙ్ఙీయర్ మరియు పెరియవాచ్చాన్ పిళ్ళై లు    ప్రధానంగా ఈ పాశురములో – గొప్ప సంగీత విద్వాంసులు మరియు మహా నర్తకులు ఎంపెరుమాన్ ను మేల్కొలిపి వారికి సేవ చేయుటకు వచ్చి ఉన్నారు, కావున తొండరడిపొడి ఆళ్వార్,  ఎంపెరుమాన్ ను లేచి వారి కైంకర్యమును స్వీకరించమని ప్రార్థన చేస్తున్నారు అని వివరించారు. ఏదమిళ్ తణ్ణుమై ఎక్కం … Read more

తిరుప్పళ్ళి యెళుచ్చి – 8 – వంబవిళ్

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: తిరుప్పళ్ళి యెళుచ్చి 7వ పాశురం పాశుర అవతారిక: నఙ్ఞీయర్ వ్యాఖ్యానములో ప్రధానంగా – ప్రాతఃకాల సమయం ఎంపెరుమాన్ ను ఆరాధించుటకు సరైన/తగిన సమయం. అనన్య ప్రయోజనులైన (కేవలం కైంకర్యమే ప్రధానంగా కలవారు)ఋషులు ఆరాధనకై అవసరమగు వస్తుసామగ్రితో వచ్చి ఉన్నారు. కాన తొండరడిపొడిఆళ్వార్,  ఎంపెరుమాన్  ను తమ యొక్క ఆరాధనలను స్వీకరించమని ప్రార్థనచేస్తున్నారు. పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానములో ప్రధానంగా- ఎంపెరుమాన్ తిరువారాధనకై   చాల మంది … Read more

తిరుప్పళ్ళి యెళిచ్చి- 7 – అన్దరత్త

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: తిరుప్పళ్ళి యెళుచ్చి 6వ పాశురం పాశుర అవతారిక:  నఙ్ఙీయర్ మరియు పెరియవాచ్చాన్ పిళ్ళై లు క్రిందటి పాశురములో(6వ)సంక్షిప్తంగా అనుగ్రహించిన వివరణను ఈ పాశురం మరియు రాబోవు రెండు పాశురములలో సవివరంగా వ్యాఖ్యానిస్తున్నారు. నఙ్ఙీయర్ ప్రధానంగా,  ఇంద్రుడు మరియు సప్తఋషులు మొదలైన వారందరు ఆకాశమంతా నిండిపోయి ఎంపెరుమాన్ శ్రీపాదములను విశేష శ్లోకములతో కీర్తిస్తు ఆరాధిస్తున్నారు.  పెరియవాచ్చాన్ పిళ్ళై  ముఖ్యంగా ఇలా వివరిస్తారు-  త్తైత్తరీయ ఉపనిషద్ లో పేర్కొన్న “బైశాస్మాత్” (దేవతలు … Read more

తిరుప్పళ్ళి యెళుచ్చి- 6 – ఇరవియర్

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: తిరుప్పళ్ళి యెళుచ్చి 5వ పాశురం పాశుర అవతారిక: నఙ్ఞీయర్ మరియు పెరియవాచ్చాన్ పిళ్ళై లు తమ వ్యాఖ్యానములో ఇలా వివరించిరి – సమస్తదేవతలు కలసి ఈ భౌతిక విశ్వమునకు(భగవంతుని చే సృష్ఠి కావింపబడ్డ)  కార్యకలాపాలు నిర్వహించుటకు దేవసేనా నాయకుడి స్థానాన్ని సుబ్రమణ్యునకు  ఇచ్చి పట్టం కట్టిరి. దేవతలందరు తమ తమ భార్యలతో, సేవకులతో  మరియు వాహనాలతో ఎంపెరుమాన్ ను ఆరాధించుటకై వచ్చి తమతమ కోరికలను నెరవేర్చుకుంటున్నారు. (కనుక‌) తొండరడిపొడిఆళ్వార్,  ఎంపెరుమాన్ … Read more

తిరుప్పళ్ళి యెళుచ్చి – 5 – పులంబిన

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: తిరుప్పళ్ళి యెళుచ్చి 4వ పాశురం శ్రీరాముడు శ్రీరంగవిమానమును  మరియు శ్రీరంగనాథుణ్ణి , శ్రీవిభీషణాళ్వాన్ కు అనుగ్రహించుట పాశుర అవతారిక: నఙ్ఞీయర్ వ్యాఖ్యానమున- తొండరడిపొడి ఆళ్వార్ ,  ఎంపెరుమాన్ ను ఇలా ప్రాధేయపడుతున్నారు ‘భక్తులయందు తారతమ్యం చూపని  ఎంపెరుమాన్ సన్నిధికి  దేవతలందరు పూమాలికలతో ఆరాధించుటకు గుంపులు గుంపులుగా వచ్చి ఉన్నారు,  కనుక మీరు మేల్కొని వారందరి కైంకర్యమును స్వీకరించుము’. పెరియవాచ్చాన్ పిళ్ళై – క్రిందటి పాశుర వ్యాఖ్యానమున , పచ్చిక … Read more

తిరుప్పళ్ళి యెళిచ్చి – 4 – మేట్టిళ

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: తిరుప్పళ్ళి యెళిచ్చి 3వ పాశురం పాశుర అవతారిక: తొండరడిపొడి ఆళ్వార్ ,   ఎలాగైతే శ్రీరాముడు తన భక్తులను కాపాడుటకై శత్రువులను  నిర్మూలించాడో ఆ మాదిరి  మీరు కూడ మిమ్ములను అనుభవించే/ఆనందించుటకు గల అడ్డంకులన్నీ తొలగించుటకు మేల్కొనవలెను అని ఎంపెరుమాన్  ను ప్రార్ధన చేస్తున్నారని నఙ్ఞీయర్ తమ వ్యాఖ్యానంలో అనుగ్రహిస్తున్నారు . గోపాలురు తమ పశువులను మేతకు( ఇష్ఠానుసారంగా తిరుగుటకు మరియు గడ్డిని మేయుటకు)తీసుకపోతారు. తెల్లవారున … Read more