శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:
పాశుర అవతారిక:
- నఙ్ఙీయర్ మరియు పెరియవాచ్చాన్ పిళ్ళై లు ప్రధానంగా ఈ పాశురములో – గొప్ప సంగీత విద్వాంసులు మరియు మహా నర్తకులు ఎంపెరుమాన్ ను మేల్కొలిపి వారికి సేవ చేయుటకు వచ్చి ఉన్నారు, కావున తొండరడిపొడి ఆళ్వార్, ఎంపెరుమాన్ ను లేచి వారి కైంకర్యమును స్వీకరించమని ప్రార్థన చేస్తున్నారు అని వివరించారు.
ఏదమిళ్ తణ్ణుమై ఎక్కం మత్తళి యాళ్ కుళల్ ముళువమోడు ఇశై దిశై కెళుమి కీదంగళ్ పాడినర్ కిన్నరర్ గరుడర్ గళ్ కన్దరువర్ అవర్ కంగులుళ్ ఎల్లాం మాతవర్ వానవర్ శారణర్ ఇయక్కర్ శిత్తరుం మయంగినర్ తిరువడిత్తొళువాన్ ఆదలిల్ అవర్కు నాళ్ ఓలక్కమరుళ అరంగత్తమ్మా పళ్ళియెళుందరులాయే
ప్రతిపదార్థం:
ఏదమిళ్= నిర్థోష(దోష రహిత)
తణ్ణుమై= మృదంగం
ఎక్కం= ఒక తీగ వాద్యం
మత్తళి= మద్దెల
యాళ్= వీణ
కుళల్= వేణువు
దిశై= దిక్కుల యందు
ముళువమోడు= వీటి ధ్వనులతో
ఇశై కెళుమి కీదంగళ్ పాడినర్= అన్ని దిక్కుల యందు కీర్తనలు గానం చేయు వారు
కిన్నరర్- కిన్నరులు
గరుడర్ గళ్= గరుడులు
కన్దరువర్ అవర్= గంధర్వులు
కంగులుళ్ ఎల్లాం= రాత్రంతయు
మాతవర్= శ్రేష్ఠమైన ఋషులు
వానవర్= దేవతలు
శారణర్= చారణులు
ఇయక్కర్= యక్షులు
శిత్తరుం= సిద్ధులు
తిరువడిత్తొళువాన్= మీ శ్రీపాద సేవ త్వరలో
మయంగినర్= మైమరచిపోతున్నారు
ఆదలిల్= కావున
అవర్కు= వాళ్ళకు
నాళ్ ఓలక్కమరుళ= విశ్వరూప సందర్శనము(ప్రాతః కాలమున అనుహ్రహించు సేవ) కలిగించుము
అరంగత్తమ్మా!శ్రీరంగమున శయనించిన నా దేవాది దేవా!
పళ్ళియెళుందరులాయే= పడక నుండి మేల్కొని మమ్ము అనుగ్రహింపుము.
సంక్షిప్త అనువాదం:
కిన్నరులు,గరుడులు మరియు గంధర్వులు మొదలైనవారు దోషరహిత/ మళినరహిత మైన మృదంగం, మద్దెల, ఒక రకైమైన తీగ వాద్యం, వీణ మరియు వేణువు మొదలైన వాయిద్యాలను అన్ని వైపులా వినబడేలా వాయిస్తున్నారు. కొందరు రాత్రి అంతయు వచ్చిఉన్నారు మరికొందరు ప్రాతః కాలమున చేరుకొన్నారు. మాహా ఋషులు, దేవతలు, చారణులు, యక్షులు మరియు సిద్ధులు మొదలైనవారందరు మీ శ్రీపాద ఆరాధనకై వచ్చిఉన్నారు. (కావున) శ్రీరంగమున శయనించిన నా నాథ!తమరు మేల్కొని పెద్దసంఖ్యలో మీ విశ్వరూప సందర్శనమునకై వచ్చినవారినందరిని అనుగ్రహింపుము.
నఙ్ఞీయర్ వ్యాఖ్యానములోని ప్రధానాంశాలు:
- తొండరడిపొడి ఆళ్వార్, ఎంపెరుమాన్ తో ఇలా అంటున్నారు- వివిధ రకముల భక్తాగ్రేసరులందరు మీ విశ్వరూపసందర్శనకై త్వర/ఆత్రుత తో వేచి ఉన్నారు. సర్వులకు రక్షకులగు మీరు మేల్కొని అనుగ్రహించి, వారిని మీ కైంకర్యమునందు నిమగ్నులుగా చేయుము.
పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానములోని ప్రధానాంశాలు:
- చిన్న,పెద్ద అను తారతమ్యం లేకుండ ఎంపెరుమాన్ సర్వులకు రక్షకుడు అని నిర్థారిస్తున్నారు. తిరుమళిశై ఆళ్వార్ తమ నాన్ముగన్ తిరువన్దాది 47వ పాశురమున ఇలా వివరిస్తున్నారు.
నన్మణి వణ్ణనూర్ ఆళియుమ్ కోళ్ అరియుమ్ పొన్మణియుమ్ ముత్తముమ్ పూమరముమ్ పన్మణి నీర్ ఓడు పొరుతు ఉరుళుమ్ కానముమ్ వానరముమ్ వేడుం ఉడై వేఙ్గడమ్
ఈ పాశురమున తిరువేంగడం(తిరుమల) నివాసముగా కలిగిన తిరువేంగడముడయాన్ (శ్రీనివాసుడు) నలుపు మరియు నీల వర్ణపు మిశ్రముడు(మంచి ముత్యము వలె ప్రకాశించు దేహం కలవాడు) అలాగే యాళి(సింహ శరీరం ఏనుగు తొండం కలిగిన జంతువు)బంగారం, ప్రశస్తమైన వర్ణపు రాళ్ళు, ముత్యములు, పుష్పములతో నిండిన వృక్షములు, సమృద్ధిగా ప్రవహించు జలాశయములు, వజ్రాలతో కూడిన జలపాతాలు, వానరులు మరియు వేటగాళ్లతో నిండిన ఆ తిరువేంగడమును శ్రీనివాసునితో సహా కీర్తింపబడ్డాయి. కావున ఎంపెరుమాన్ తిరువేంగడమను ఆ కొండలో అగుపించు అన్నీరకముల జంతు జాలమును అనుగ్రహించుటకు అవతరించాడు.
అడియేన్ నల్లా శశిధర్ రామానుజదాస
Source: https://divyaprabandham.koyil.org/index.php/2015/01/thiruppalliyezhuchchi-9-ethamil/
archived in https://divyaprabandham.koyil.org
pramEyam (goal) – https://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org/
pramAthA (preceptors) – https://acharyas.koyil.org/
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org