శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః
శబ్దాది భోగవిషయా రుచిరస్మదీయా నష్ఠా భవత్విహ భవద్ధయయా యతీంద్ర |
త్వద్దాసదాసగణనాచరమావధై యః తద్దాసతైకరసతాsవిరతా మమాస్తు ||
ప్రతి పదార్థము:
ఓ యతిరాజా = యతులకు రాజైన వాడా
ఇహ = శరీరము ఉన్న ఈ స్థితిలో
అస్మదీయా = దాసుడి
శబ్దాది భోగవిషయా = శబ్దాది దోషాలైన రుచి, వాసన మొదలైనవి
భవద్ధయయా = ధుఃఖములను పోగొట్టు తమరి అపారమైన దయ వలన
నష్ఠా భవతు = రూపు మాసి పోవుగాక
యః = ఏ భాగ్యాశాలి
త్వద్దాస = ఒక వస్తువులా కొని అమ్ముటకు వీలైన విధముగా తమ ఆజ్ఞకు బద్దుడై
దాసగణనా = దాసులను లెక్క పెటే టప్పుడు
చరమావధౌ = చివరి వాడిగా
భవతి = ఉండి
తద్దాసతా = వాడి (భగవంతుడి) కోసము చేసే దాస్యములో
ఏకరసతా = ఏక లక్ష్యముతో
అవిరతా = నిత్యమై నిలుచుటకు
భవద్ధయయా = తమరి దయ
మమాస్తు = ఉండుగాక
భావము:
కిందటి రెండు శ్లోకములలో దాసుడిపై దయ చూపుటకు మీరే తప్ప మరొకరు లేరు అని యతిరాజులను ధృడముగా విన్నవించారు. ఈ శ్లోకములో యతిరాజులు తమకు కృప చేయ వలసిన విషయములను విన్నవిస్తున్నారు. అవి ఏమిటంటే శబ్దాది విషయములలో ఆశ పూర్తిగా తొలగిపోవాలి, యతిరాజుల దాస వర్గములో దాస ,దాస ,దాసాదిదాసుడిగా ఆఖరి దాసుడికి దాసుడు కావాలన్న రెండు కోరికలను ఈ శ్లోకములోని రెండు పాదాలలో క్రమముగా చెపుతున్నారు. యతిరాజుల కృప ఎంతటిది అంటే ఎవరైతే ఎక్కువ పాపాలను చేసి దాని వలన అధికముగ ధుఃఖమును అనుభవిస్తూ పరితపిస్తున్నారో , వారి మీద ఉండడటము కాదు, వారిని ఆ ధుఃఖజలధి నుండి ఉధ్ధరిస్తుంది. అందు వలననే కదా భగవంతుడు ‘ ఎంబెరుమాన్ ‘ కాగా, యతిరాజులు ‘ ఎంబెరుమానార్ ‘ అయ్యారు. భగవంతుడిని మించిన గొప్పగుణములు కలవారనే కదా తిరుకోట్టియుర్ నంబి తన శిష్యులైన రామానుజులను ‘ ఎంబెరుమానార్ ‘ అని పిలిచారు.’ భవదత్తయయా ‘అన్న ప్రయోగము వలన పై విషయము స్పష్టమవుతున్నది. భగవంతుడి కృప దాసుడిని ఉద్ధరించ జాలదు.తమరి కృప మాత్రమే దాసుడిని ఉద్ధరించ గలిగినది అని సారము.
అడియేన్ చూడామణి రామానుజ దాసి
మూలము: https://divyaprabandham.koyil.org/index.php/2015/10/yathiraja-vimsathi-tamil-slokam-16/
పొందుపరిచిన స్థానము: https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org