నాచ్చియార్ తిరుమొళి – సరళ వ్యాఖ్యానము – ఇరండామ్ తిరుమొళి – నామమాయిరం

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

నాచ్చియార్ తిరుమొళి

<<మొదటి తిరుమొళి – తైయొరు తింగ

గొల్ల భామలను నిరాశ పరచినందుకు వాళ్ళు అన్య దేవత అయిన మన్మధుడి పాదాల యందు చేరాల్సి వచ్చినదని ఎంబెరుమానుడు బాధపడుతున్నాడు. వ్రేపల్లెలో శ్రీకృష్ణుడిగా ఉండే రోజుల్లో, గోకులవాసులు ఇంద్రుడికి ప్రసాదాన్ని సమర్పించారు. తాను అక్కడ ఉండగా వాళ్ళు అన్య దేవుడికి భోగము సమర్పించడం చూసి, ఆతడు వాటిని గోవర్ధన గిరికి అర్పించేలా చేసి, తనే ఆ ప్రసాదాన్ని తిన్నాడు. అదే విధంగా, ఆండాళ్ మరియు ఆమె స్నేహితురాళ్ళు తనని మాత్రమే విశ్వసించారు, కానీ మరొక దేవుడి వద్దకు వెళ్లారు. వాళ్ళు మరొక దేవుడి వద్దకు వెళ్లడం అనేది తన వల్లనే జరిగిందని గ్రహించి, ఇక ఎక్కువ సేపు వారిని వేచి ఉండకూడదని నిర్ణయించుకొని వాళ్ళ దగ్గరకి వెళ్లాడు. కానీ వారు అతనిపై కోపంతో, ఆతడిని పట్టించుకోకుండ ఇసుక గూళ్ళను కట్టుకుంటున్నారు. ఇది చూసి, వారి ఇసుక గూళ్ళను పడగొడదామని ప్రయత్నించగా వాళ్ళు అతన్ని అడ్దుకుంటారు. ఇది ప్రేమ తగాదాగా మరి ఆపై ఐక్య్మైయారు మళ్లీ విడిపోయారు.

మొదటి పాశురము:  ఇది పంగుని మాసం కనుక, మన్మధుడు వచ్చే సమయమిది, మేము ఇసుక గూళ్ళు కడుతున్నాము. వాటిని నీవు కూలగొట్టడం సరికాదు.

నామమ్ ఆయిరమ్ ఏత్త నిన్ఱ నారాయణా! నరనే! ఉన్నై
మామి తన్ మగనాగ ప్పెఱ్ఱాల్ ఎమక్కు వాదై తవిరుమే
కామన్ పోదరు కాలం ఎన్ఱు పంగుని నాళ్ కడై పారిత్తోం
తీమై శెయ్యుం శిరీదరా! ఎంగళ్ శిఱ్ఱిల్ వందు శిదైయేరే

ఈ పాశురములోని మొదటి వరుసకి రెండు వివరణలు ఉన్నాయి – 1) నర (మానవుడు) మరియు నారాయణ (భగవానుడు) రూపములో అవతరించిన శ్రీమన్నారాయణుని దేవలోక వాసులు సహస్ర నామాలతో కీర్తించారు.  2) శ్రీవైకుంఠంలో ఉన్న నారాయణుడు శ్రీ రాముడిగా నర అవతారము దాల్చినందుకు నిత్యసూరులు సహస్ర నామాలతో అతడిని కీర్తించారు. అలాంటి ఓ భగవానుడా! యశోద పిరాట్టి నిన్ను తన కుమారుడిగా భావించింది, కానీ మా బాధల నుండి మాకు విముక్తి లభిస్తుందా? ఇది పన్గుని మాసం కనుక, మన్మధుడు వచ్చే ఈ దారిని మేము అలంకరించాము. కొంటె చేతలతో అల్లరిపెట్టే ఓ శ్రీ మహాలక్ష్మీపతీ! మా ఈ చిన్ని చిన్ని ఇసుక ఇళ్లను కూలగొట్టడానికి ఇటువైపు రావద్దు.

రెండవ పాశురము:  “మేము ఎంతో శ్రమించి కట్టిన ఈ ఇసుక గూళ్ళని కొల్లగొట్టవద్దు” అని గొల్లపిల్లలు ఎంబెరుమానుడి వద్ద మొర పెట్టుకుంటున్నారు.

ఇన్ఱు ముఱ్ఱుం ముదుగు నోవ ఇరుందిళైత్త ఇచ్చిఱ్ఱిలై
నన్ఱుం కణ్ణుఱ నోక్కి నాంగొళుమ్ ఆర్వం తన్నై త్తణిగిడాయ్
అన్ఱు పాలగనాగి ఆలిలై మేల్ తుయిన్ఱ ఎం ఆదియాయ్!
ఎన్ఱుం ఉన్ తనక్కు ఎంగళ్ మేల్ ఇరక్కం ఎళాదదు ఎం పావమే

మేము మా నడుములు నెప్పెట్టేలా శ్రమించి నిర్మించుకున్న ఈ గూళ్ళని కదిలించకుండా, ఒకే చోటనే ఉండి ఆస్వాదించి మా కోరికను నెరవేర్చుము. ప్రళయ సమయంలో పసికందు రూపము దాల్చి లేత మర్రి ఆకుపై పడున్డె ఓ భగవానుడా! మా కారణభూతుడవు అయిన ఓ భగవానుడా! సర్వ వేళలా నీ పట్ల మాకు భక్తి ఉండక పోవడానికి కారణం మా పాపములు.

మూడవ పాశురము:  అతడి చూపులతో వారిని, వాళ్ళ చిన్ని చిన్ని ఇళ్లను కొల్లగొట్టి హింసించడం ఆపమని వాళ్ళు చెబుతున్నారు.

గుణ్డునీర్ ఉఱై కోళరీ! మద యానై కోళ్ విడుత్తాయ్ ఉన్నై
క్కండు మాల్ ఉఱువోంగళై క్కడై క్కణ్గళిట్టు వాదియేల్!
వండల్ నుణ్మణల్ తెళ్ళి యామ్ వళై క్కైగళాల్ శిరమప్పట్టోం
తెణ్దిరై క్కడల్ పళ్ళియాయ్! ఎంగళ్ శిఱ్ఱిల్ వందు శిదైయేలే

మహా శక్తివంతమైన సింహం వలె లోతైన మహా ప్రళయ సాగరములో శయనించి ఉన్నవాడా! గజేంద్రుడి (ఏనుగు) దుఃఖ నివారణ చేసిన వాడా! నిన్ను చూసిన తర్వాత నిన్ను కోరుతున్న మమ్మల్ని బాధించవద్దు. మేము ఈ చిన్ని ఇళ్లను గాజులు ధరించిన చేతులతో ఎంతో శ్రమించి ఒండ్రు మట్టితో నిర్మించాము. క్షీరసాగర తరంగాలు నీ దివ్య శయ్యగా ఉన్న ఓ భగవానుడా! ఇటువైపు వచ్చి మా ఈ చిన్న ఇసుక ఇళ్లను నాశనం చేయవద్దు.

నాలుగవ పాశురము: మంత్ర జాలము వలె మంత్ర ముగ్దులను చేసే అతడి ముఖంతో వాళ్ళను యేమార్చి వారి ఇసుక ఇళ్లను నాశనం చేయవద్దని వారు అతడిని వేడుకుంటున్నారు.

పెయ్యుమా ముగిల్ పోల్ వణ్ణా! ఉందన్ పేచ్చుం శెయ్గైయుం ఎంగళై
మైయల్ ఏఱ్ఱి మయక్క ఉన్ ముగం మాయ మందిరం తాన్ కొలో?
నొయ్యర్ పిళ్ళైగళ్ ఎన్బదఱ్కు ఉన్నై నోవ నాంగళ్ ఉరైక్కిలోం
శెయ్య తామరై క్కణ్ణినాయ్! ఎంగళ్ శిఱ్ఱిల్ వందు శిదైయేలే

వర్షాన్ని కురిపించే మేఘ వర్ణముతో ఉన్న ఓ భగవానుడా! నీ లీలలతో మమ్ములను మైమరపించి ముగ్దులను చేసే నీ దివ్య ముఖము ఎదైనా మాయ మందు లాంటిదా? ఎర్రటి తామర కలువలలాంటి దివ్య నేత్రములు కలవాడా! “వీళ్ళు తక్కువైన వాళ్ళు” అని నీవు అంటావేమోనని భయంతో నిన్ను బాధ పెట్టకూడదని మేము నిన్ను ఏమీ అనడం లేదు. మా ఈ చిన్ని గూళ్ళను పడగొట్టి చెల్లాచెదరు చేయవద్దు.

ఐదవ పాశురము: అతడు చేసే కొంటె వేశాలను చూసి తమకి కోపం వస్తుందని గమనించడం లేదా, అని వారు అతడిని ప్రశ్నిస్తున్నారు.

వెళ్ళై నుణ్మణల్ కొండు శిఱ్ఱిల్ విచిత్తిరప్పడ వీది వాయ్
తెళ్ళి నాంగళ్ ఇళైత్త కోలం అళిత్తియాగిలుం ఉందన్ మేల్
ఉల్లాం ఓడి ఉరుగల్ అల్లాల్ ఉరోడం ఒన్ఱుమిలోం కండాయ్
కళ్ళ మాదవా! కేశవా! ఉన్ ముగత్తన కణ్గళ్ అల్లవే

మాయ లీలలు చేసే ఓ మాధవా! ఓ కేశవా! వీధిలో అందరూ ఆశ్చర్యపోయేలా జల్లించిన చక్కటి తెల్ల ఇసుకతో అందమైన ఈ చిన్ని గూళ్ళని కట్టాము. నీవు వీటిని కూల్చేసినా మా మనసులు మాత్రమే విరిగి కరిగిపోతాయి, కానీ మీపై మాకు కొంచెం కూడా కోపం రాదు. నీ ఆ దివ్య ముఖంలో కళ్ళు లేవా? ఆ కళ్ళతో నీవే చూడు.

ఆరవ పాశురము: నీవు ఈ ఇసుక ఇళ్లను కొల్లగొడతానని చెప్పినప్పుడు దీనిలో నీ అంతరార్థము ఇంకేదో వేరే ఉంది, మాకు  అర్థం కాని విషయమది అని వారు అంటున్నారు.

ముఱ్ఱిలాద పిళ్ళైగళోం ములై పోందిలాదోమై నాళ్ తొఱుం
శిఱ్ఱిల్ మేలిట్టుక్కొండు నీ శిఱిదు ఉండు తిణ్ణెన నాం అదు
కఱ్ఱిలోం కడలై అడైత్తు అరక్కర్ కులంగళై ముఱ్ఱవుం
శెఱ్ఱు ఇలంగైయై ప్పూశల్ ఆక్కియ శేవగా! ఏమ్మై వాదియే!

మహా సముద్రంపై ఆనకట్ట కట్టిన ఓ ధీరుడా! లంకా నగరాన్ని యుద్దరంగంగా మార్చి రాక్షస వంశాన్ని మొత్తం నాశనం చేసిన ఓ యోధుడా! ఇంకా స్థనాలు ఎదగని చిన్నారులము మేము. మేము కట్టిన ఈ చిన్ని గూళ్ళని నీవు కూల్చివేయడంలో అంతరార్థము ఏదో ఉంది. మేము ఆ అర్థాన్ని ఇంకా అర్థము చేసుకోలేదు. మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు.

ఏడవ పాశురము: నీ దివ్య పత్నుల పేరిట మేము నిన్ను ఆదేశిస్తున్నాము. మా ఈ ఇసుక ఇళ్లను నాశనం చేయవద్దు.

పేదం నన్గు అఱివాగళోడు ఇవై పేశినాల్ పెరిదిన్ శువై
యాదుం ఒన్ఱు అఱియాద పిళ్ళగైళోమై నీ నలిందు ఎన్ పయన్?
ఓదమా కడల్ వణ్ణా! ఉన్ మణవాట్టిమారొడు శూళఱుం
శేదు బందం తిరుత్తినాయ్! ఎంగళ్ శిఱ్ఱిల్ వందు శిదైయేలే

నీవు మాట్లాడే రక రకాల మాటలను అర్థము చేసుకోగలిగే వారితో ఈ మాటలు మాట్లాడితే, అది నీకు బాగుంటుంది. మా లాంటి అమాయకులైన అమ్మాయిలను ఇబ్బంది పెడితే నీకు వచ్చే లాభమేమిటి?  సాగర వర్ణం కలిగి ఉన్నవాడా! మహాసముద్రంపై ఆనకట్ట నిర్మించిన ఓ ధీరుడా! మీ దివ్య పత్నులపై ఆన చేస్తున్నాము, ఇక్కడికి వచ్చి మా ఈ చిన్ని గూళ్లను కూల్చవద్దు.

ఎనిమిదవ పాశురము: విషయము ఎంత తీపిగా ఉన్నా తమ హృదయంలో చేదు నిండి ఉంటే, ఆ రుచి సహించదని అర్థం చేసుకోవాలని వాళ్ళు అతడికి వివరిస్తున్నారు.

వట్టవాయ్ చ్చిఱు తూదైయోడు శిఱు శుళగుం మణలుం కొండు
ఇట్టమా విళైయాడువోంగళై చ్చిఱ్ఱిల్ ఈడళిత్తు ఎన్ పయన్?
తొట్టు ఉదైత్తు నలియేల్ కండాయ్ శుడర్ చక్కరం కైయిల్ ఏందినాయ్!
కట్టియుం కైత్తాల్ ఇన్నామై అఱిదియే కడల్ వణ్ణనే!

నీ దివ్య హస్తములో దివ్య తేజోమయమైన చక్రాన్ని ధరించిన ఓ భగవానుడా! మహా సాగర స్వరూపుడా! గుండ్రపు మట్టి కుండలు, వరి పొట్టు, ఇసుకతో కట్టిన ఈ చిన్ని చిన్ని ఇళ్లను పదేపదే నాశనం చేయడం వల్ల నీకు ఏమిటి లాభం? నీ చేతితో తాకి, నీ పాదాలతో తన్ని ఇబ్బంది పెట్టకు. మనస్సు చేదుగా ఉన్నప్పుడు, చక్కెర కూడా చేదుగా అనిపిస్తుందని నీకు తెలియదా?

తొమ్మిదవ పాశురము:  వాళ్ళు కృష్ణుడితో ఎలా ఏకమై ఆనందించి ఆస్వాదించారో ఆ అనుభవాన్ని వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు.

ముఱ్ఱత్తూడు పుగుందు నిన్ ముగం కాట్టి ప్పున్ముఱువల్ శెయ్దు
శిఱ్ఱిలోడు ఎంగళ్ శిందైయుం శిదైక్క క్కడవైయో? గోవిందా!
ముఱ్ఱ మణ్ణిడం తావి విణ్ణుఱ నీండళందు కొండాయ్! ఎమ్మై
ప్పఱ్ఱి మెయ్ ప్పిణక్కిట్టక్కాల్ ఇంద పక్కం నిన్ఱవర్ ఎన్ శొల్లార్?

ఓ గోవిందా! నీ ఒక్క పాదముతో మొత్తం భూమిని కొలిచి, రెండవ పాదాన్ని ఆకాశాన్ని, ఆ పై లోకాలన్నింటినీ కొలిచినవాడా! నీవు  మా పెరట్లోకి వచ్చి, చిరునవ్వుతో ఉన్న  నీ దివ్య ముఖారవిందాన్ని మాకు చూపించి, మా హృదయాలను కొల్లకొట్టి దానితో పాటు మా ఈ చిన్ని చిన్ని ఇళ్లను పడవేస్తావా? ఆపై దగ్గరకు వచ్చి మమ్మల్ని ఆలింగనం చేసుకుంటే, జనాలు ఏమి అంటారు?

పదవ పాశురము: ఆమె ఈ పది పాశురాలను వాటి అర్థాలను తెలుసుకొని అనుసందానము చేసిన వారికి కలిగే ఫలితాన్ని వివరిస్తూ ఈ పదిగాన్ని పూర్తి చేస్తుంది.

శీతై వాయ్ అముదం ఉండాయ్! ఎంగళ్ శిఱ్ఱిల్ నీ శిదైయేళ్ ఎన్ఱు
వీది వాయ్ విళైయాడుం ఆయర్ శిఱుమియర్ మళలై చ్చొల్లై
వేద వాయ్ త్తొళిలార్గళ్ వాళ్ విల్లిపుత్తూర్ మన్ విట్టుచ్చిత్తన్ తన్
కోదై వాయ్ త్తమిళ్ వల్లవర్ కుఱైవిన్ఱి వైగుందం శేరువరే

వీధిలో ఆడుకుంటున్న ఆ చిన్న గోపికలు ఎంపెరుమానుడితో “సీతా పిరాట్టి అధరామృతాన్ని తాగినవాడా! మా ఈ చిన్న ఇళ్లను పడగొట్టవద్దు” అని ప్రార్థించారు. వేదాలకు అనుగుణంగా నడుచుకునే శ్రీ విల్లిపుత్తూర్కి నాయాకుడైన పెరియాళ్వార్ల కుమార్తె ఆండాళ్ రచించిన ఈ పది పాశురాలను పఠించి ఆ పదాలను గ్రహించినవారు ఎటువంటి లోటు లేకుండా శ్రీవైకుంఠం చేరుకుంటారు.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2020/05/nachchiyar-thirumozhi-2-simple/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *