ఆర్తి ప్రబంధం – 22

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

ఆర్తి ప్రబంధం

<< ఆర్తి ప్రబంధం – 21

thirukkudanthai_aravamudhazhvar_divine_feet

ప్రస్తావన

ఇంతకు ముందటి పాశురమున మణవాళ మామునులు “ఎన్న భయమ్ నమక్కే” అను వాక్యముచే, తమకి ఇంకే భయము లేదని చెప్పెను. ఈ పాశురమున వారు అదే విధముగా, తిరువాయ్ మొళి పిళ్ళై తమపై నిష్కారణమైన కరుణ చూపు కారణముచే, శ్రీ రామానుజులు తమను అభిమానించెదరు. ఈ అభిమానము తమకు సంసారమను విస్తారమైన సాగరమును అతిక్రమించుటకు సహాయపడును మరియు శ్రీమన్నారాయణుని చరణకమలములయందు తమ స్థానమును ధృవీకరించును అని మామునులు చెప్పెను.

పాశురం 22

తీదఱ్ఱ జ్ఞాణమ్ తిరువాయ్ మొళిప్పిళ్ళై సీరరుళాల్
యేదత్తై మాఱ్ఱుమ్ ఎతిరాసర్ తన్ అభిమానమెన్నుమ్
పోదత్తై యేఱిప్ పవమామ్ పుణరిదనైక్ కడందు
కోదఱ్ఱ మాదవన్ పాదక్కరైయై కుఱుగువనే!!!

ప్రతి పద్ధార్ధం

తీదఱ్ఱ – ఏ విధమైన దోషము లేని వారు
గ్యాన – ఆత్మ యొక్క నిజ స్వరూపము గురించి పూర్తి జ్ఞానము పొందిన వారు
తిరువాయ్ మొళిప్ పిళ్ళై – తిరువాయ్ మొళితో వారికి ఉన్న సంబంధముచే “తిరువాయ్ మొళిప్ పిళ్ళై” అని ప్రసిద్ధి పొందెను. తిరువాయ్ మొళి, శ్రీమన్నారాయణుల కవి యగు నమ్మాళ్వార్లచే రచించబడిన దివ్యమైన రచన
సీరరుళాల్ – వారు మమ్ము నిష్కారణముగా కరుణించును
యేదతై మాఱ్ఱుమ్ – అందువలన మాలో ఉన్న విషయేచ్ఛ మరియు ఆశ అను దోషములు నశించిపోవును
ఎతిరాసర్ తమ్ – వారి (తిరువాయ్ మొళిప్ పిళ్ళై) అనుగ్రహము, అధిరోహించుటను ధృవీకరించు శ్రీ రామానుజుల కృపా కటాక్షము పొందుటకు సహాయపడును.
పోదత్తై యేఱిప్ – తడబడని నౌక యగు “విష్ణు పోతమ్”
పవమామ్ పుణరిదనైక్ కడన్దు – సంసారమను అగాధమైన సాగరమును దాటుటలో సహాయపడు
కుఱుగువనే! – కచ్చితముగా చేరు
కోదఱ్ఱ మాదవన్ పాదక్కరయై – శ్రియ: పతి శ్రీమన్నారాయణుని పాదపద్మములు. “విణ్ణోర్ పిరానార్ మాసిల్ మలరడిక్కీళ్”, “తుయరఱు సుడరడి”, “నిర్దోషమగునది మరియు ఎల్లప్పుడు ప్రకాశముగా మెరుగునది” అని వర్ణించబడు చరణకమలములు.
కుఱుగువనే!!!- చేరును

సామాన్య అర్ధం

ఈ పాశురమున మణవాళమామునులు తాము శ్రీమన్నారాయణుని చరణకమలములను చేరుట నిశ్చయము ఎందుకనగా మేము “విష్ణు పోతం” ము వలే ఉన్న నౌక యొక్క సహాయముచే సంసారమను సాగరము నుండి విముక్తి పొందెదను అని చెప్పెను. శ్రీ రామానుజులు విముక్తి పొందుటకు నిశ్చయముగ ఆ నౌకను అధిరోహించుటకు ఉపకరించెదరు. వారి ఆచార్యులగు, నిష్కళంకులైన తిరువాయ్ మొళి పిళ్ళైల అనుగ్రహముచే, శ్రీ రామానుజులు సాయము చేయుట నిశ్చయమగును.

వివరణ

వ్యాఖ్యాత తిరువాయ్ మొళి పిళ్ళైల గొప్పతనమును వర్ణించుట కొనసాగెను. వారు (తిరువాయ్ మొళి పిళ్ళై) “తత్ జ్ఞానం అజ్ఞానమతోన్యదుక్తమ్”, “విద్యాన్యాత్శ్శిల్పనైపుణ్యమ్” అను వాక్యములు తెలియపరుచినట్లు శ్రీమన్ నారాయణునికి సంబంధించని ఏ కార్యముతోనూ అనుబంధించుకోని నిష్కళంకులు. ఆతను ఈ భౌతిక విషయములచే కొంచము కూడా ప్రభావింపబడక, శ్రీ మహాలక్ష్మి యొక్క నాధులైన శ్రీమన్నారాయణునిపై  (“తామరైయాళ్ కేళ్వనయే నోక్కుమ్ ఉణర్వు”, ముదల్ తిరువందాది 67)  మాత్రమే తమ శక్తి మరియు చిత్తమును నిలుపు వారు. శ్రీమన్నారాయణుని యెడల భక్తి వారిలో ఎంత వ్యాపించియుండెననగా శ్రీమన్నారాయణుని భక్తులను వారికి ప్రభువుగా తలెచెదరు. శ్రీమన్ నారాయణునికి సంబంధించని గ్రంధములను గూర్చి వారు చింతింపరు. ముఖ్యముగా దివ్యమైన తిరువాయ్ మొళి యందు మరియు అందున ఉన్న విశేషమైన తాత్పర్యమునందు వారు మిక్కిలి నిమగ్నులైయుండిరి, కావున వారు ఈ ప్రపంచమున “తిరువాయ్ మొళి పిళ్ళై” అని కీర్తించబడెను. తిరువాయ్ మొళి యందు వారికున్న అగాధ ప్రియముచే, అందరు వారిని “తిరువాయ్ మొళి” తో  గుర్తించ సాగెను. మణవాళ మామునులు అట్టి గొప్ప ఆచార్యులైన తిరువాయ్ మొళి పిళ్ళైల శిష్యులు. మణవాళ మామునులు తమ ఆచార్యుల అనుగ్రహమే వారిని అభిమానించు శ్రీ రామానుజుల ఆశ్రయమున తమను చేర్చునని చెప్పెను. శ్రీ రామానుజులు  “కామాదిదోశహరమ్ (యతిరాజ వింశతి 1)” గా వర్ణించబడెను. మణవాళ మామునులు శ్రీ రామానుజుల సంబంధముచే తాము ఈ సంసారిక బంధమునుండి విముక్తి, “ఇదమిః వైష్ణవమ్ పోతమ్ సమ్యకాస్తే భవార్ణవే” అనగా “శ్రీమన్ నారాయణుని చరణకమలమునందు ఏ సంకటము లేక నిశ్చయముగ చేర్చునది” అని వర్ణించబడిన, “విష్ణు పోతమ్” వలే ఉన్న శ్రీవైష్ణవ నౌక యొక్క సాయముతో పొందెదనని కొనసాగించెను. “సంసార సాగరమ్ ఘోరమ్ అనన్త క్లేశ భాజనమ్” (జితన్తే స్తోత్రమ్ 4) అను వాక్యనుసారం మన శాస్త్రములలో ఈ సంసారము ఆపదలతో నిండి ఉన్న ఒక భయంకరమైన సముద్రముగా చెప్పబడి ఉండెను. మణవాళమామునులు ఆ నౌక ఈ సంసార సాగరమును అతిక్రమించి శ్రీమన్నారాయణుని పాదపద్మములయందు చేర్చునని చెప్పెను. “విణ్ణోర్పిరానార్ మలరడికీళ్ (తిరువిరుత్తమ్ 54)” మరియు “తుయర్ అఱు సుడరడి” (తిరువాయ్ మొళి 1.1.1) అను ప్రబంధ వాక్యమున చెప్పబడినట్లు శ్రీమన్నారాయణుని చరణకమలములు, నిత్యసూరులచే పూజింపబడునవి మరియు ప్రతియొక్కరి అజ్ఞానము, దుఃఖమును తొలగించునవి అని వర్ణించబడి ఉన్నది. ఆ పాదపద్మములు, “హేయ ప్రత్యనీకం” అను వాక్యమున చెప్పినట్లు ఏ విధమైన దోషములు లేనివి మరియు  నిష్కళంకమైనవి. అదియేగాక ఆ పాదపద్మములు మిక్కిలి ప్రకాశముతో మెరయుచున్నవి మరియు ఒకరిని రక్షించుటకు వేరొకరి సాయము అవసరము లేనటువంటివి. అట్టి శుద్ధతత్వమైన శ్రీమన్నారాయణుని చరణకమలములే తమ లక్ష్యము మరియు అక్కడ చేరుట నిశ్చయమని మణవాళ మామునులు చెప్పెను.

“కోదఱ్ఱ” అను పదము దోషము లేని గొప్పదైన మరియు చరణకమలములందు చేరుటకు యోగ్యత కలుగజేయును అను అర్థమును చెప్పవచ్చు. మరొక్క విధమున ఆ వాక్య భాగము “కోదఱ్ఱ మాదవన్” అనునది “దోషములు లేని మాధవుడు”  అని కూడా సూచించును. ఇక్కడ సూచించబడిన దోషము శ్రీమన్నారాయణులు “పిరాట్టి (అమ్మవారి) ” తో లేకుండ ఏకాంతముగా ఉన్నప్పుడు కలిగినది. ఇదే విషయమును తిరువడి యగు హనుమంతులు “రామస్యలోకత్రయ నాయకస్య శ్రీపాదకూలం మనసాజకామ” అను వాక్యములో అనునాదించెను. దీనినే నమ్మళ్వార్లు “మానెయ్ నోక్కి మడవాళై మార్బిల్ కొణ్డాయ్ మాధవా” లోను మరియు తమ వ్యధయొక్క ఉచ్చస్థానమున “ఉన్ తేనే మలరుమ్ తిరుపాదమ్ వినయేన్ సేరుమారు నీ అరుళాయ్ (తిరువాయ్ మొళి 1.5.5)” అని వ్యక్తపరిచెను. కావున పిరాట్టి (అమ్మవారు) (తిరువిల్లాద కోదు అఱ్ఱవన్) శ్రీమన్నారాయణునితో లేనపుడే వారికి దోషములు కానవచ్చును. అందువలన ఏ దోషములు లేని, పిరాట్టి (అమ్మవారి) తో కూడి ఉన్న శ్రీమన్నారాయణుని చేరుటయే మన లక్ష్యమగునని నిదర్శనమైయ్యెను.

అడియేన్ వైష్ణవి రామానుజ దాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2016/09/arththi-prabandham-22/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Comment