కణ్ణినుణ్ శిఱుత్తాంబు – 1 – కణ్ణినుణ్
శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమద్వరవరమునయే నమ: కణ్ణినుణ్ శిరుత్తాంబు అవతారిక పెరియవాచ్చాన్ పిళ్ళై అవతారిక మధురకవి ఆళ్వార్ తమ ఆచార్యులైన నమ్మాళ్వార్ల కిష్ఠమైన కృష్ణావతార చేష్ఠితాలను ఈ పాశురములో కొనియాడుతున్నారు. అళగియ మణవాళ పెరుమళ్ నాయనార్ అవతారిక నమ్మాళ్వార్ల మధుర స్వరూపాన్ని ఈ పాశురములో మధురకవి ఆళ్వార్లు ఆవిష్కరించారు. పరత్వమును పాలకడలి తోను, విభవావతారములను అమృత కలశముతోను పోల్చారు. అవతారములన్నింటిలోను కృష్ణావతారము, చేష్ఠితములన్నింటిలోను వెన్న దొంగిలించుట మధురాతి మధురం. రామావతారములో ఆయన … Read more