తిరుప్పళ్ళి యెళుచ్చి- 6 – ఇరవియర్

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

తిరుప్పళ్ళి యెళుచ్చి

5వ పాశురం

periyaperumal-art-2

పాశుర అవతారిక:

  • నఙ్ఞీయర్ మరియు పెరియవాచ్చాన్ పిళ్ళై లు తమ వ్యాఖ్యానములో ఇలా వివరించిరి – సమస్తదేవతలు కలసి ఈ భౌతిక విశ్వమునకు(భగవంతుని చే సృష్ఠి కావింపబడ్డ)  కార్యకలాపాలు నిర్వహించుటకు దేవసేనా నాయకుడి స్థానాన్ని సుబ్రమణ్యునకు  ఇచ్చి పట్టం కట్టిరి. దేవతలందరు తమ తమ భార్యలతో, సేవకులతో  మరియు వాహనాలతో ఎంపెరుమాన్ ను ఆరాధించుటకై వచ్చి తమతమ కోరికలను నెరవేర్చుకుంటున్నారు. (కనుక‌) తొండరడిపొడిఆళ్వార్ ఎంపెరుమాన్ ను మేల్కొని వారి కృపాదృష్ఠిని తమపై  ప్రసరింపచేయుమని ప్రార్థిస్తున్నారు.

ఇరవియర్ మణి నెడుం తేరొడుమివరో                                                                                                           ఇఱైయవర్ పదినొరు విడైయరుమివరో                                                                                                                   మరువియ మయలినన్ అరుముగనివనో                                                                                                             మరుదరుమ్ వశుక్కళుమ్ వన్దువన్దు ఈణ్డి                                                                                                           పురవియోడు ఆడలుమ్ పాడలుమ్ తేరుమ్                                                                                                               కుమర తణ్డమ్ పుగున్దు ఈణ్డియ వెళ్ళమ్                                                                                                         అరువరై అణైయ నిన్ కోయిల్ మున్నివరో                                                                                                       అరంగత్తమ్మా! పళ్ళియెళుందరుళాయే

ప్రతిపదార్థం:
మణి= ఉత్తమ
నెడు= పెద్దనైన
తేరొడుమ్ = రథములతో
ఇరవియర్= ద్వాదశాదిత్యులు
ఇఱైయవర్  = నిర్వాహకులు(సంసారుల)
పదినొరు విడైయరు= ఏకాదశ రుద్రులు
మరువియ= అమరిన/అనుకూలమైన
మయలినన్= నెమలి వాహనంగా కలవాడు
అరుముగనిన్ = షణ్ముఖుడు(ఆరుతలలవాడు)
మరుదరుమ్ = మరుత్తులు(49 మంది)/వాయుదేవతలు
వశుక్కళుమ్= (అష్ఠ) వసువులు
వన్దువన్దు= గుంపు గుంపుగా ఒకరినొకరు తోసుకుంటు
ఈణ్డి= సన్నిహితంగా వచ్చి(చేరి)రి
పురవియోడు  తేరుమ్= గుర్రములు,   రథములతో(ఆయా దేవతలు)
ఆడలుమ్ పాడలుమ్= ఆటలతో పాటలతో
కుమర తణ్డమ్ పుగున్దు=గుంపులు గుంపులుగా వచ్చి చేరిన దేవతలు
ఈణ్డియ వెళ్ళమ్= దట్టంగా/అధికంగా  ఉన్న సమూహం(నీటి ప్రవాహం వలె)
అరువరై అణైయ= మేరు పర్వతం వలె
కోయిల్= దేవాలయంలో
నిన్  మున్ = మీ దృష్ఠి ముందు
ఇవరో ,ఇవనో= వారందరు ఉపస్థితులైనారు
అరంగత్తమ్మా! = శ్రీరంగమున పవళించిన స్వామి,దేవాదిదేవా!
పళ్ళియెళుందరుళాయే= (కనుక)శయనము నుండి లేచి మమ్ములను కృపచూడుము.

సంక్షిప్త అనువాదం:

ద్వాదశాదిత్యులు తమ ఉత్తమ రథములపై వచ్చిరి. ఈ భౌతిక ప్రపంచమునకు నియంత్రికులైన /నిర్వాహకులైన   ఏకాదశరుద్రులు మరియు ప్రాపంచిక జనాలు వచ్చిచేరిరి. ఆరు తలలు కలిగి నెమలి వాహనాధిపతైన  షణ్ముఖుడు వచ్చిచేరిరి. నవచత్వారింశత్ (49) మరుత్తులు  మరియు అష్ఠవసువులు మొదలైన వీరందరు ఒకరినొకరు తోసుకుంటు వచ్చిచేరిరి. శ్రీరంగమున పవళించిన దేవాదిదేవా! లేచి మమ్ములను కృపచూడుము. పెద్దసంఖ్యలో దేవతలు తమతమ వాహనాలైన  రథాలు మరియు అశ్వములతో గుంపులు గుంపులుగా ఆటపాటలలో  నిమగ్నమై వచ్చిచేరిరి. పెద్దని మేరుపర్వతము వలె నుండు మీ దేవాలయం ముందర సుబ్రమణ్యునితో సహా దేవతా గోష్ఠులు  మీ అనుగ్రహమునకై  వచ్చి ఉన్నారు. శ్రీరంగమున పవళించిన నా దేవాది దేవా! మేల్కొని తమ కృపాదృష్ఠిని మాపై ప్రసరింపచేయుము.

నఙ్ఞీయర్ వ్యాఖ్యానములోని విశేషములు:

  • ప్రయోజనాంతపరులు (ప్రాపంచిక కోరికలు తీర్చుకొనేవారు)అగు దేవతలు మరియు అనన్య ప్రయోజనపరులు (ఎంపెరుమాన్ కైంకర్యమే పరమ ప్రయోజనముగా కలవారు – ఆళ్వారుల మాదిరి)  వచ్చి ఉన్నారు, పెరియపెరుమాళ్ మీరు దయతో లేచి కృపాదృష్ఠితో వారిని కరుణించుము అని తొండరడిపొడిఆళ్వార్, ప్రార్థిస్తున్నారు.

 పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానములోని విశేషములు::

  • ఏకాదశ రుద్రులు “ఇఱైయవర్” (నియంత్రికులు/నిర్వాహకులు)గా సంభోధించబడ్డారు- యజుః సంహిత 6.2.8 లో రుద్రుడు తాను దేవతలతో ఇలా ప్రార్థింపబడుచున్నాడు- “సోబ్రవీత్ వరమ్ వృణా అహమేవ|పశునామధిపతిరసాణితి తస్మాత్ రుద్రః పశునామధిపతిః||” నాతో ప్రార్థన చేస్తున్న దేవతలారా! నేను పశువలె  (గోవు/పశువులు/జంతువులు ) ఉన్న సంసారులకు అధిపతిని.   కావుననే ఆళ్వార్ చే వీరు ఇఱైయవర్ గా సంభోధించబడ్డారు. కావున వీరు కేవలం ఈ భౌతిక ప్రపంచ ప్రజలకు మాత్రమే నియంత్రికులు/నిర్వాహకులు.
  • ఈణ్డియ వెళ్ళమ్(వరద)అనగా-  వరద మాదిరి  దేవతలు గుంపులు గుంపులు గా ఎంపెరుమాన్ ను ఆరాధించుటకై శ్రీరంగమునకు వచ్చి ఉన్నారు.
  • కుమర దణ్డమ్– కు రెండు అర్థవివరణలు ఇవ్వబడ్డాయి.
    • మొదటిది- కుమరడు అనగా సుబ్రమణ్యుడని, + దణ్డమ్ అనగా దండం/కాండం/బెత్తం( సమర్థవంతమైన మందపాటిది అను సందర్భములోనిది) అని అర్థం. అనగా సేవకులు/సైన్యము లు పటిష్ఠమైన ధరించిన దండము( దేవతలు స్థలాభావం, భారీసమూహం చే  అతి దగ్గరగా నిలబడ్డారు)  .
    • రెండవది, దేవతలు సదా యవ్వన దశ(పదహారేండ్ల వయస్సు) లో కనబడతారు- ఎప్పుడు తమ యవ్వన స్థితిని కోల్పోరు. దణ్డమ్ – అనగా సేకరణ.  కనుక “కుమర దణ్డమ్” అన్నారు- అనగా దేవతల పెద్ద సమూహం.  దణ్డమ్ అనగా వారందరు ధరించిన ఆయుధములు అని కూడా అర్థం  వచ్చును.

అడియేన్ నల్లా శశిధర్ రామానుజ దాస

Source:  http://divyaprabandham.koyil.org/index.php/2015/01/thiruppalliyezhuchchi-6-iraviyar/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
pramAthA (preceptors) – http://guruparamparai.wordpress.com
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org

Leave a Comment