తిరుప్పళ్ళి యెళిచ్చి – 3 – శుడరొళి

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

తిరుపళ్లి యెళిచ్చి

2వ పాశురం

namperumal2

పాశుర అవతారిక:

శుడరొళి పరన్దన శూళ్ దిశై యెల్లాం

తున్నియ తారకై మిన్నొళి శురుఙ్గి

పడరొళి పశుత్తనన్ పనిమది ఇవనో

పాయిరుళ్ అగన్ఱదు పైమ్పొళిల్ కముగిన్

మడలిడై క్కీఱి వణ్ పాళైగళ్  నాఱ

వైకఱై కూరన్దదు మారుదం ఇదువో

అడలొళి తిగళ్ తరు తిగిరియన్దడక్కై

అరంగత్తమ్మా! పళ్ళియెళున్దరుళాయే.

ప్రతిపదార్థం

శూళ్ దిశై యెల్లాం= అంతటా(అన్ని దిక్కులయందు)

శుడరొళి= సూర్యుని కిరణాలు
పరన్దన = విస్తరంచినవి
తున్నియ=దగ్గరగా /దట్టంగా ఉన్న  (ఆకాశమున)                                                                                                       తారకై = నక్షత్రములు
మిన్నొళి= తేజస్సు
శురుఙ్గి= క్షీణించిన/తగ్గిన
పడరొళి= బాగా విస్తరించిన వెలుగు
పనిమది ఇవనో= ఈ చల్లని చంద్రుడు కూడ
పశుత్తనన్= తమ తేజస్సును కోల్పోయ్యారు
పాయిరుళ్= బగా విస్తరించిన అంధకారం
అగన్ఱదు= తొలగించబడింది
వైకఱై మారుదం ఇదువో= తెల్లవారుజాము యొక్క మలయమారుతం
పై పొళిల్=హరిత వనములు
కముగిన్= వక్క వృక్షములు
మడలిడై క్కీఱి = ఆ పత్రములు/మట్టలు వీడుట వలన
వణ్ పాళైగళ్  నాఱ= మంచి సువాసన
కూరన్దదు=వీచు (సుగంధమును మోస్తున్న)
అడల్=చాలా బలమైనది
ఒళి తిగళ్ తరు=తేజస్సుతో ప్రకాశించు
తిగిరి=శ్రీ సుదర్శనాళ్వాన్
అమ్ తన్దడక్కై=దివ్యమైన శ్రీ హస్తములు
అరంగత్తమ్మా!=    శ్రీరంగమున శయనించిన దేవాది దేవా!                                                                                  పళ్ళియెళున్దరుళాయే.= (కావున) కృపతో మేల్కొని మమ్ములను అనుగ్రహించుము

సంక్షిప్త అనువాదం: 
సూర్యకిరణములు అంతటా ప్రసరించినవి. బాగా ప్రకాశించిన నక్షత్రములు మరియు చంద్రుడు సూర్యుని కిరణముల వల్ల తాము ప్రకాశహీనమైనట్లు తెలుపుచున్నవి. గాండాంధకారము క్షీణించినది. తెల్లవారుజాము మలయమారుతం, వనములలోని వక్కచెట్ల దళములు/మట్టలు విడుట వలన వాటి సుగంధమును మోసుకొస్తున్నాయి. బాగా ప్రకాశవంతమై, ప్రభావం కలిగిన సుదర్శన చక్రమును దివ్యహస్తముల యందు ధరించి శ్రీరంగమున శయనించిన దేవాదిదేవా! కృపతో మేల్కొని మమ్ములను  అనుగ్రహింపుము.

నఙ్ఞీయర్ వ్యాఖ్యానములోని విశేషములు

  • ఎలాగైతే రాజు అగుపించగానే మోసగాళ్ళు పారిపోతారో(జీవితం పై  భయపడి). అలానే సూర్యుడు కనిపించగానే అంధకారం వెంటనే తొలగిపోవును.
  • శత్రువులందరు శ్రీచక్రత్తాళ్వార్ (శీసుదర్శనులు) ప్రభావం వలన నశిస్తారు. మనను తన ఆధీనంలో ఉంచుకొను  సహజ శత్రువు (మనతో జన్మించు శత్రువు) అగు మన ఇంద్రియములను ఎంపెరుమాన్ పై మరలించి వానిని అనుభవించినపుడు ఈ అంతర్గత శత్రువు నశించును.

పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానములోని విశేషములు:

  • సూర్యుని తేజస్సు ప్రకాశించినప్పుడు, మీ తేజస్సు (సూర్యుని తేజస్సుకు ఆధారమైన) కూడా ప్రకాశించును. అందుకే మేల్కొనుము. “తేజసామ్ రాశిమూర్జితం“- ( విష్ణుపురాణం 1.9.67)అను శ్లోకం  మరియు “పయులుం శుడరొళి” (తిరువాయ్ మొళి 3.7.1)అను పాశురములు భగవానుని తేజస్సు గురించి వివరిస్తాయి.
  • సుదర్శనచక్ర రహితముగా కూడా భగవానుని దివ్య హస్తములు సుందరముగా ఉండును. అదే సుదర్శనచక్ర సహితమైన శ్రీహస్తముల తేజస్సు బహుళ రెట్లు అధికమగును.
  • సంసార బాధలను అనుభవిస్తు, మీ దర్శణార్థం ఎదురు చూస్తున్న వారికై మీరు మీ దర్శనము ఇవ్వవలసినది. మేల్కొనుటకు బదులు ఇంకా శయనించితిరేలా? మీ అవతార ప్రయోజనమైన అనుగ్రహము ద్వారా మమ్ములను కరుణించుము.

అడియేన్ నల్లా శశిధర్ రామానుజ దాస

Source: http://divyaprabandham.koyil.org/index.php/2014/12/thiruppalliyezhuchchi-3-sudaroli/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
pramAthA (preceptors) – http://guruparamparai.wordpress.com
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org

Leave a Comment