తిరుప్పళ్ళి యెళిచ్చి – 4 – మేట్టిళ

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

తిరుప్పళ్ళి యెళిచ్చి

3వ పాశురం

100_0659

పాశుర అవతారిక:

  • తొండరడిపొడి ఆళ్వార్ ,   ఎలాగైతే శ్రీరాముడు తన భక్తులను కాపాడుటకై శత్రువులను  నిర్మూలించాడో ఆ మాదిరి  మీరు కూడ మిమ్ములను అనుభవించే/ఆనందించుటకు గల అడ్డంకులన్నీ తొలగించుటకు మేల్కొనవలెను అని ఎంపెరుమాన్  ను ప్రార్ధన చేస్తున్నారని నఙ్ఞీయర్ తమ వ్యాఖ్యానంలో అనుగ్రహిస్తున్నారు .
  • గోపాలురు తమ పశువులను మేతకు( ఇష్ఠానుసారంగా తిరుగుటకు మరియు గడ్డిని మేయుటకు)తీసుకపోతారు. తెల్లవారున వారు పశువుల మెడలలోని చిరుగంటల శబ్దమును మరియు తుమ్మెదల  ఝంకారమును విపిస్తుంది. కాన ఆళ్వార్,  శత్రుహంతకుడు మరియు సర్వరక్షకుడగు   ఎంపెరుమాన్ ను మేలుకొని తమని అనుగ్రహించమని ప్రాధేయపడుచున్నారు అని పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానం.

మేట్టిళ మేదిగళ్ తళైవిడుం ఆయర్ గళ్

వేయ్ ఙ్గుళలోశైయుమ్ విడై మణి క్కురలుమ్

ఈట్టియ ఇశై దిశై పరన్దన వయలుళ్

ఇరిందన శురుమ్బినమ్  ఇలంగైయర్ కులత్తై

వాట్టియ వరిశిలై వానవర్ ఏఱే

మాముని వేళ్వియై కాత్తు అవపిరదమ్

ఆట్టియ అడుతిఱళ్ అయోత్తి ఎమ్మరశే

అరంగత్తమ్మా! పళ్ళియెళుందరుళాయే

ప్రతిపదార్థం 

మేట్టిళ మేదిగళ్=పొడవైన లేత వయస్సులో ఉన్న గేదెలు
తళైవిడుం= మేపుటకు వదలబడిన
ఆయర్ గళ్= గోపకులు
వేయ్ ఙ్గుళలోశైయుమ్ = వెదురు వేణువు శబ్దం
విడై మణి = ఎద్దుల మెడలలోని గంటలు
క్కురలుమ్ = (గంటల)ధ్వని
ఈట్టియ ఇశై= రెండు రకముల శబ్దములు(వేణుశబ్దం మరియు గేదెల మెడలలోని గంటల శబ్దం)
దిశై పరన్దన= అన్నిదిక్కుల వ్యాపించిన
వయలుళ్ = పచ్చిక మడుల/బయళ్ళ యందు
శురుమ్బినమ్ = తుమ్మెదల గుంపు
ఇరిందన = ఆహ్లాదకరమైన శబ్దం (ఝుంకారం)మొదలైయినది
ఇలంగైయర్ కులత్తై = రాక్షస(లంకానగర)వంశము
వాట్టియ= నాశనంచేసిన /సంహరించిన
వరిశిలై = శారఙ్గమనెడి ధనుస్సును (ధరించిన)
వానవర్ ఏఱే = దేవాది దేవ!
మాముని= గొప్పముని(విశ్వామిత్రముని)
వేళ్వియై = యాగమును
కాత్తు= కాపాడి
అవపిరదమ్ ఆట్టియ = అవబృధస్నానం చేయించిన (యాగం పరిపూర్ణం అయిన తర్వాత చేయు పవిత్ర స్నానం)‌
అడుతిఱళ్ = శత్రువులను తుదముట్టించు గొప్ప/మిక్కిలి  పరాక్రమం/బలం  కలిగిన
అయోత్తి ఎమ్మరశే = అయోధ్యను ఏలు/పరిపాలించు  మా రక్షకుడా!
అరంగత్తమ్మా!= శ్రీరంగమున శయనించిన దేవాది దేవా!                                                                                                 పళ్ళియెళున్దరుళాయే.= (కావున) కృపతో మేల్కొని మమ్ములను అనుగ్రహించుము

సంక్షిప్త అనువాదం :
వేణువు నుండి వచ్చిన శబ్దం మరియు గోపాలకులచే మేతకు వదలబడిన లేత వయస్సులో ఉన్న గేదెల మెడలలోని గంటల శబ్దం అంతటా వ్యాపించినవి. పచ్చిక బయళ్ళలోని తుమ్మెదలు  దినారంభమున      ఆహ్లాదమైన తమ ఝుంకారములతో ప్రారంభించినవి. రాక్షసులను సంహరించి  విశ్వామిత్రుని యాగమును  పరిపూర్ణము గావించి అవబృధస్నానమును చేయించిన ఓ శ్రీరామా! శత్రువులను అతి సులువుగా సంహరించు గొప్ప/మిక్కిలి పరాక్రమము కలిగిన,  అయోధ్యను ఏలు మా రక్షకుడవు. శ్రీరంగమున శయనించిన దేవాది దేవా! మేల్కొని మమ్ములను కృపచూడుము.

నఙ్జీయర్ వ్యాఖ్యానములోని విశేషములు:

  • రావణునిచే తిప్పలు/కష్ఠాలు  పడ్డ ఆ దేవతల కోరికపై(బ్రహ్మను మొదలుకొని) ఎప్పుడైతే రావణుని తన శారఙ్గమను బాణంచే సంహరించాడో అప్పుడు   రాముడు ఎంతో సంతృప్తి చెందాడు. అలాగే  ఎంపెరుమాన్ కు  తన భక్తులు రక్షించబడ్డప్పుడే తనకు ఆనందం  అని విశేషంగా తెలుపబడుచున్నది.
  • ఇక్కడ అర్చావతార ఎంపెరుమాన్ వైభవం కీర్తించబడుతున్నది. శ్రీరాముడు తాను అయోధ్యలో వేంచేసి/జీవించి ఉన్నకాలంలో సేవించుటకు సాధ్యం , కాని శ్రీరంగనాథుణ్ణి (అర్చావతారం ) తరతరాల (శ్రీరామ విభవాతారం కన్నాతర్వాత నుండి) నుండి ఇప్పటివరకు సేవించవచ్చును. అర్చావతారములో ఉన్న  సౌలభ్యం గుణం ఇదే. అందరు అనుభవించుటకు సులభుడు.

పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానములోని విశేషములు:

  • పెరియవాచ్చాన్ పిళ్ళై యొక్క చమత్కార/ అందమైన భావన- ఆళ్వార్ భావన- ఆవులు మరియు లేగదూడలు మేల్కొనుటను ఎంపెరుమాన్ కు సూచిస్తున్నారు “అల్ఫఙ్ఞానము కలిగినవే మేల్కొన్నాయి, మరి తమరు సర్వశక్తిమంతుడవైన మహాఙ్ఞాని కదా మరి ఇంకా మేల్కొనలేదే?”
  • నరసింహ పురాణ శ్లోకంలో16.13- ఆహార నిద్రా భయ మైథునం తుల్యాని కల్వత్ర సమస్తజన్తోః| ఙ్ఞానాత్ విశిష్ఠో హి నరః పరేభ్యో ఙ్ఞానేన హీనః పశుభిః సమానః||దీనర్థం- ఆహారం, నిద్రా, భయం ,మైథునములు అన్నీ జీవులకు సాధారణమే. కాని మనిషి అన్నీ జీవులకన్న తెలివైనవాడు. ఒకవేళ మానవుడు ఙ్ఞానమును మంచికై వినియోగించకున్నచో వాడు పశు సమానుడు.
  • ఇక్కడ మాముని (గొప్పముని) అని విశ్వామిత్రుణ్ణి సంభోధించుటకు కారణం అందంగా వర్ణించబడింది. ముని అనగా – స్థిరమైన ఙ్ఞానాన్ని కలిగిన వాడు. విశ్వామిత్రుడు  తన తీవ్రమైన తపఃశక్తి వలన తాను ఏదైన సాధించగల సామర్థ్యం కలవాడు, కాని తన శక్తిని అల్ఫమైన కోరికలకు వినియోగించలేదు. తన స్వాతంత్ర్యమును వదలి ఆ యాగ రక్షణను శ్రీరాముని యందు ఉంచి  ఆ కార్యమును నేరవేర్చుకున్నాడు. ఎంపెరుమాన్ యందు ఉన్న ఈ పారతంత్ర్యము వలన తాను ‘మాముని’  అని ఆళ్వార్ చే సంభోధించ బడ్డాడు.
  • శ్రీరామాయణం బాలకాండ1.97లో “దశవర్ష  సహస్రాణి దశవర్ష శతాని చ| రామో రాజ్యం ఉపాసిత్వా బ్రహ్మలోకం గమిష్యతి||శ్రీరాముడు తన రాజ్యాన్ని 11000వేల ఏండ్లు పరిపాలించి తన నివాసానికి తిరిగి వెళ్ళి పోయాడు.శ్రీరాముడు కేవలం 11000 మాత్రమే జీవించాడు. కాని శ్రీరంగనాథుడు ఎన్నో ఎన్నోవేల సంవత్సరముల నుండి వేంచేసి ఉన్న భక్తసులభుడు, కావున శ్రీరంగమున పవళించిన దేవాదిదేవ! లేచి మమ్ములను అనుగ్రహించుము.

అడియేన్ నల్లా శశిధర్ రామానుజదాస

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/01/thiruppalliyezhuchchi-4-mettila/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
pramAthA (preceptors) – http://guruparamparai.wordpress.com
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org

Leave a Comment