శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
<< తిరువాయ్మొళి నూఱ్ఱందాది – 81 – 90
పాశురం 91
అవతారిక: శరీర అవసానం రోజున మీకు మోక్షం ఇవ్వబడుతుంది అని సర్వేశ్వరుడు ఆళ్వార్లకు చెప్పారు. దారి తోడుతో పోవడానికి సిద్ధపడుతున్న నమ్మాళ్వార్లు ‘తాళతామరై’ అనే 91వ తిరువాయ్ మొళిలో చెప్పారు. అందులో వారు చెప్పిన శ్రీసూక్తిని ‘తాళడైంన్దోర్‘ అనే ప్రస్తుత పాశురంలో కృప చేస్తున్నారు.
తాళ్ అడైన్దోర్ తజ్ఞట్కుత్ తానే వళి త్తుణైయామ్
కాళమేగత్తైక్కదియాక్కి మీళుతలామ్
మేతమిలా విణ్ణులగిలేగ ఎణ్ణుమ్ మాఱనెన
క్కేదమ్ ఉళ్ళదెల్లామ్ కెడుమ్
ప్రతిపదార్థం:
తాళ్ అడైన్దోర్ తజ్ఞట్కు = తన శ్రీపాదములను ఉపాయముగా ఆశ్రయించిన వారికి
త్తానే వళి తుణై యామ్ = తానే మార్గబంధువను
కాళమేగత్తై = నీలమేఘం వంటి సర్వేశ్వరుడిని
క్కతి యాక్కి = మార్గరక్షకుడుగా చేసుకొని
మీళుతలామ్ ఏతమిలా = పునరావృత్తి దోషములేని
విణ్ణులగిల్ = పరమపదమునకు
ఏక ఎణ్ణుమ్ = వెళ్ళవలేనను కోరిన
మాఱనెన = శెఠగోపుల పేరు అనుసందించగానే
క్కేదమ్ ఉళ్ళదెల్లామ్ కెడుమ్ = సకల దుఃఖాలు నశించిపోతాయి.
భావము: తన శ్రీపాదములను ఉపాయముగా ఆశ్రయించిన వారికి తానే సుఖంగా, ఏ ఉపద్రవాలు లేకుండా తన దగ్గరకు చేర్చుకుంటాడు. నీలమేఘం వంటి సర్వేశ్వరుడిని మార్గరక్షకుడుగా చేసుకొని పునరావృత్తి దోషములేని పరమపదానికి వెళ్లాలని ఆళ్వార్లు కోరుకున్నారు. అలాంటి శఠగోపుల పేరు అనుసంధించగానే సకల దుఃఖాలు నశించిపోతాయి.
పాశురం 92
అవతారిక: నిరతిశయ భోగ్యమానంగా ఉన్న తిరువనంతపురంలో ఆదిశేష తల్పం మీద శయనించి ఉన్న పద్మనాభుడికి కైంకర్యం చేయాలని ఆశపడ్డారు. ఆ భావాలను ‘కెడు మిడర్‘ అనే 92వ తిరివాయ్ మొళిలో వివరించారు. దాని సంగ్రహంగా ‘కెడు మిడర్ వైకుందనై‘ అనే ప్రస్తుత పాశురంలో అనుగ్రహించారు.
కెడుమిడర్ వైగున్దత్తైక్కిట్టినాప్పోలే
తడముడై యనన్దపురమ్దన్నిల్ పడవరవిల్
కణ్డుయిల్ మాఱ్కాట్చెయ్య క్కాతలిత్తాన్ మాఱన్ ఉయర్
విణ్డనిలుళ్ళోర్ వియప్పవే
ప్రతిపదార్థం:
మాఱన్ = శఠకోపులు
ఉయర్ విణ్డనిల్ ఉళ్ళోర్ వియప్ప = ఉన్నతమైన పరమపదంలో ఉన్న నిత్యశూరులు కూడా ఆశ్చర్యపడేటట్లుగా
కెడుమిడర్ వైగున్దత్తై = దుఃఖరహితమైన శ్రీ వైకుంఠాన్ని
క్కిట్టినాప్పోలే = పొంది
తడముడై అనన్దపురమ్ తన్నిల్ = విశాలమైన తిరువనంతపురంలో
పడవరవిల్ = అనేక పడగలుగల శేషశయనం మీద
కణ్డుయిల్ మాఱ్క = కళ్ళు మూసుకొనిపడుకొని కటాక్షిస్తున్న సర్వేశ్వరుడికి
ఆట్చెయ్య =కైంకర్యం చేయాలని
క్కాదలిత్తాన్ = కోరుకున్నారు
భావము: దుఃఖరహితమైన శ్రీ వైకుంఠాన్నిపొంది సర్వేశ్వరుడికి కైంకర్యం చేయాలని ఆశపడ్డారు. అంత కంటే ముందు తిరువనంతపురంలో విశాలమైన అనేక పడగలుగల ఆదిశేషుడి మీద కళ్ళు మూసుకొని పడుకొని అందరినీ కటాక్షిస్తున్న సర్వేశ్వరుడికి కైంకర్యం చేయాలని కోరుకున్నారు. ఉన్నతమైన పరమపథంలో ఉన్న నిత్యసూరులు ఇది చూసి ‘పలు ఆటంకాలతో నిండి వుండే లీలా విభూతిలో ఉండి కూడా శఠకోపులు మన కంటే ఎక్కువ కైంకర్యం చేస్తున్నారే‘ అని ఆశ్చర్యపడ్డారు.
పాశురం 93
అవతారిక: భగవంతుడు ఇంకా ఈ సంసారంలోనే తనను ఉంచాలని సంకల్పించాడని ఆళ్వార్లు భావించారు. దానికి సర్వేశ్వరుడు తెలిపిన సమాధానాన్ని కృప చేస్తున్న ’వేమరు తోళినై’ అనే 93వ తిరువాయ్ మొళిలోని అర్ధాలను ‘వేమరు తోళిన్దిరై కోన్ ‘ అనే ఈ పాశురంలో అనుగ్రహించారు.
వేయ్ మరు తోళిన్దిరై కోన్ మేవుకిన్ఱ తేశత్తై
తాన్ మరువాత్తన్మైయినాల్ తన్నై ఇన్నమ్ పూమియిలే
వైక్కుమెనచ్చన్గిత్తుమాల్ తెళివిక్కత్తెళిన్ద
తక్క పుగళ్ మాఱనెజ్ఞళ్ శార్వు
ప్రతిపదార్థం:
వేయ్ మరు తోళ్ = వెదరు వంటి దృఢమైన భుజములుగల
ఇన్దిరై కోన్ = లక్ష్మీదేవి భర్త
మేవుకిన్ఱ తేశత్తై = వేంచేసియుండే స్థలాన్ని
తాన్ మరువాత్తన్మైయినాల్ = తాను చేరలేకపోయినందున
తన్నై ఇన్నమ్ పూమియిలే వైక్కుమెనచ్చన్గిత్తు = తనను సర్వేశ్వరుడు ఇంకా ఈ సంసారంలోనే ఉంచే ఆలోచన చేస్తున్నాడని అతిగా భయపడి
మాల్ తెళివిక్కత్తెళిన్ద = (అలా భయపడనవసరము లేదనిసర్వేశ్వరుడు స్పష్టం చేసాదని తెలుసుకొన్న
తక్క పుగళ్ మాఱన్ = కీర్తి గల శఠకోపులు
ఎజ్ఞళ్ శార్వు = మనకు రక్షకులు
భావము: సర్వాంగ సుందరి అయిన శ్రీదేవికి స్వామియైన, సర్వేశ్వరుడు నిత్య నివాసము చేస్తున్న దివ్యదేశాన్ని సమీపించి, అక్కడ కైకేర్యం చేయాలని కోరుకున్నారు ఆళ్వార్లు . అది దొరకనందున, భగవంతుడు ఇంకా ఈ సంసారంలోనే తనను ఉంచాలని భావించాడని అనుమానించారు. ఆ అనుమానం తీరేట్లుగా సర్వేశ్వరుడు సమాధానపరచగా సర్దుకొనిన గొప్ప కీర్తిగల నమ్మాళ్వార్లే మనకు రక్షకులు.
పాశు
అవతారిక: ఆళ్వార్లు భక్తి మార్గం అనుగ్రహించారు. ‘శార్వే తవనెఱి’ అనే 94 వ తిరువాయ్ మొళిలో మొదట అనుగ్రహించిన భక్తి మార్గం స్వసాధనతో ఫలించిన విధాన్ని తెలియజేశారు. ఆ దశక సారాన్ని ‘శార్వాకవే యడియల్’ అనీ ఈ పాశురంలో మామునులు అనుగ్రహించారు.
శార్వాకవేయడియిల్ తానురైత్త పత్తితాన్
శీరార్ పలత్తుడనే శేర్న్దదనై చ్చోరామల్
కణ్డురైత్త మాఱన్ కళలిణైయే నాడోఱుమ్
కణ్డుగక్కుమ్ ఎన్నుడైయ కణ్
ప్రతిపదార్థం:
అడియిల్ = వెనుక ‘వీడు మిన్ ముత్తముమ్‘ అనే తిరువాయ్ మొళిలో
శార్వాకవే = అందరికీ ఉపాయంగానే
తానురైత్త పత్తితాన్ = తమచేత చేయబడిన భక్తి
శీరార్ పలత్తుడనే = ప్రపత్తి అనే గొప్ప ఫలంతో
శేర్న్దతనై = చేరే ప్రకారాన్ని
కణ్డు = తెలిసికొని
చ్చోరామల్ ఉరైత్త = ఏ దోషములేకుండా కృప చేసిన
మాఱన్ = నమ్మాళ్వార్లు
కళలిణైయే = శ్రీ పాదములే
నాళ్ తోఱుమ్ = ప్రతిదినము
ఎన్నుడైయ కణ్డు = నా కళ్ళు
ఉకక్కుమ్ = దర్శించి ఆనందిస్తాయి
భావము: ‘త్తుడై‘ అనే మూడవ తిరువాయ్మొళిలో భక్తియే పరమ పరమ్యమని ఉపదేశించారు. ఇప్పుడు ఫలితం పొందడానికి అదే ఉపకరించిన విధానాన్ని చెబుతున్నారు. అటువంటి నమ్మా ళ్వార్ల శ్రీపాద కమలాలను ప్రతిదినం సేవించడం వలన నా కళ్ళు సంతోషాన్ని పొందుతున్నది అని ఈ పాశురంలో మామునులు ఉపదేశిస్తున్నారు.
పాశురం 95
అవతారిక: ‘కణ్ణన్ కళలిణై‘ అనే 95 వ దశకంలో ఆళ్వార్లు ‘భక్తి గలవాళ్ళు ఏ విధంగా నడచుకుంటారో సంగ్రహంగా చెప్పారు. ఆ దశక సారాన్ని అంటే ‘భక్తి గలవారి వ్యవహారము’ ‘కణ్ణనడియిణై’ అని ఈ పాశురంలో సంగ్రహంగా అనువదించి కృప చేస్తున్నారు.
కణ్ణనడియిణైయిర్ కాతలుఱువార్ శెయలై
త్తిణ్ణముఱవే శురున్గచ్చెప్పియే మణ్ణవర్క్కు
త్తాన్ ఉపతేశిక్కై తలైక్కట్టినాన్ మాఱన్
ఆన పుగళ్ శేర్ తన్న అరుళ్
ప్రతిపదార్థం:
కణ్ణన్ అడి ఇణైయిల్ = సర్వేశ్వరుడి శ్రీపాదములందు
కాతలువార్ శెయలై = భక్తిగలవారి కృత్యము
త్తిణ్ణమ్ ఉఱ = దృఢతను పొంది నిలుచునట్లు
మాఱన్ = శఠకోపులు
ఆన పుగళ్ శేర్ తన్ అరుళ్ = గొప్ప కీర్తి గల వారి కృపతో
శురున్గచ్చెప్పి = సంగ్రహముగా కృప చేసిన
మణ్ణవర్క్కు = భూలోక వాసులకు
త్తాన్ ఉపదేశిక్కై తలైక్కట్టినాన్ = తన ఉపదేశాన్ని పూర్తి చేశారు
భావము: ‘ కణ్ణన్ కళలిణై ‘ అనే తిరువాయ్ మొళిలో నమ్మాళ్వార్లు, భక్తులు ప్రేమను ప్రకటించే విధానాన్ని విస్తాతరంగా వివరించారు. కృష్ణుడి మీద భక్తి గలవారు చేసే సేవలను మనసుకు హత్తుకు పోయేటట్లు ఉపదేశించారు. ఆళ్వార్లు చేతనులకు తాము చేసిన ఉపదేశాన్ని ఈ దశకంతో పూర్తి చేశారు. ఆ వైభవమే ఈ పశుర రూపంలో మనకు మమునులు అనుగ్రహించారు.
పాశురం 96
అవతారిక: ఈ పాశురంలో పరమపదానికి తీసుకొని పోవడానికి తొందరపడుతున్నప్పుడు కూడా విధికి పరతంతుడై చేయడాన్ని చెప్పిన ‘అరుళ్ పెరు వార్’ అనే 96 వ తిరువాయిమొళిలోని పది పశురాల సారాన్ని’అరుళాలడియిల్’ అనే ఆరంభమయ్యే ప్రస్తుత పాశురంలో అనువదించి కృప చేస్తున్నారు.
అరుళాలడియిలెడుత్త మాల్ పా
లిరుళార్న్ద తమ్ముడమ్బైయిచ్చిత్తు ఇరువిశుమ్బి
లిత్తుడన్ కొణ్డేశు వివవిశైవు పార్త్తే యిరున్ద
శుత్తి శొల్లుమ్ మాఱన్ శెన్జొల్
ప్రతిపదార్థం:
అరుళాల్ = నిర్హేతకమైన కృప చేత
అడియిల్ ఎడుత్త = అజ్ఞానాన్ని పోగొట్టి, పూర్తిగా ఉద్ధరించి, కృపచేసి
మాల్ = సర్వేశ్వరుడు
అన్బాల్ = పరమ ప్రీతి వలన
ఇరుళార్త తమ్ ఉడమ్బై ఇచ్చిత్తు = అజ్ఞాన భూయిష్టమైన తమ దేహాన్ని అపేక్షించి
ఇరువిసుమ్బిల్ = పరమపదంలోకి
ఇత్తుడన్ కొణ్డు ఏక = ఈ శరీరంతోనే తీసుకొని వెళ్లడానికి
ఇవర్ = ఈ ఆళ్వార్ల
ఇశైవు పార్తు ఇరున్ద = అనుమతిని ఎదురుచూస్తున్న
శుత్తి = ఆయన నిర్మలత్వం గురించి
మాఱన్ శెన్జొల్ = ఆళ్వార్ల శ్రీ సూక్తి
శొల్లుమ్ = తెలియజేస్తుంది
భావము: ‘అరుళ్ పెరువార్’ అనే తిరువాయ్ మొళిలో శఠకోపులు మొదట తమను సంసారం అనే సముద్రం నుంచి నిర్హేతుక కృప చేత ఉద్ధరించి లేవనెత్తిన సర్వేశ్వరుడి కృపాను కొనియాడారు. అయితే సర్వేశ్వరుడు నమ్మాళ్వార్ల మలిన శరీరాన్ని, ఇదే చరమ దేహమని ఆదరణతో దానిని ఆశపడి ఈ శరీరంతోటే పరమపదానికి తీసుకొని పోవాలని నిశ్చయించుకున్నారు. దానికి ఆళ్వార్ల అంగీకారాన్ని ఎదురు చూస్తున్నారని తెలుయజేస్తున్నారు.
పాశురం 97
అవతారిక: సర్వేశ్వరుడు ఆళ్వార్ల దేహం మీది చాపల్యంతో దాని మీద చాలా ఆదరం చూపుతుండగా వీరు ’ప్రాప్య విరోధి’ అయిన ప్రాకృత శరీరాన్ని వదల మని స్వామిని ప్రార్థించారు. ఈ వైభవాన్ని తెలియజేసే ‘శెన్జొఱ్కవి’ అనే 97వ తిరివాయ్ మొళి సారాన్ని ఈ పాశురంలో అనుగ్రహించారు.
శెన్జొఱ్పరన్రనతు శీరారుమేనితనిల్
వన్జిత్తుచ్చెయ్ కిన్ఱ వాన్జైతనిన్ విన్జుతలై
క్కణ్డవనైక్కాఱ్కట్టిక్కై విడువిత్తుక్కొణ్డ
తిణ్డిఱల మాఱన్ నన్తిరు
ప్రతిపదార్థం:
శెన్జొల్ పరన్ = అర్ధగాంబిర్యము గల పదములతో కూడినది స్వయం పర్యవచన ప్రయోజన రూపమైనది ఆయన వేదం చేత ప్రతిపాద్యుడైన పరమపురుషుడు
తనతు = నమ్మాళ్వార్ల యొక్క
శీరారుమ్ మేని తనిల్ = జ్ఞానాది గుణ పరిపూర్ణమైన తిరుమేని పై
వన్జిత్తుచ్చెయ్గిన్ఱ వాన్జైతనిన్ విన్జుదలైక్కణ్డు = లోబంతో చూపుతున్న ప్రీతి అతిశయాన్ని చూసి
అవనైక్కాల్ కట్టి = ఆయన ముందరి కాళ్ళను బంధించి
క్కై విడువిత్తుక్కొణ్డ = తమను విడిపించుకొనిన
తిణ్డిఱల్ మాఱన్ = దృఢమైన శక్తి గల శఠకోపులు
నమ్ తిరు = మనకు సంపదగా ఉన్నారు
భావము: ద్రావిడ వేద ప్రతిపాద్యుడైన సర్వేశ్వరుడు, ఆళ్వార్ల జ్ఞానాది సంపన్నమైన తిరుమేని మీద మక్కువతో అమిత ఆదరం చూపారు. వారి చేతులను పట్టుకొని ‘మిమ్ములను ఈ శరీరంతోనే శ్రీవైకుంఠానికి తీసుకొని వెళతాం. దీనికి మీరు అంగీకరించండి’ అని ఆళ్వార్ల అంగీకారాన్ని కోరారు. ‘అలా చేయకూడదు స్వామి‘ అని సర్వేశ్వరుడి శ్రీపాదాలను పట్టుకొని స్వామి పట్టు నుంచి నమ్మాళ్వార్లు విడిపించుకున్నారు. అంతటి మహనీయులైన నమ్మాళ్వార్లే మనకు సర్వవిధములైన సంపద’ అని ఈ పాశురంలో తెలియజేస్తున్నారు.
పాశురం 98
అవతారిక: ఇప్పుడు ఆదరిస్తున్న సర్వేశ్వరుడు, ఇంత వరకు అనాదరించడానికి కారణం ఏమిటో చెప్పాలని పట్టుబట్టారు నమ్మాళ్వార్లు. సర్వేశ్వరుడు దానికి సమాధానం చెప్పలేదు. ఆ విషయాన్నే ‘అరుళ్ పెరువార్‘ అనే తిరువాయ్ మొళి 98వ దశకంలో నమ్మాళ్వార్లు చెప్పా రు. వారి ఆ శ్రీ సూక్తికి అనువాదంగా ‘తిరుమాల్‘ అనే ఈ పాశురం అమరింది.
తిరుమాల్ తమ్పాల్ విరుప్పమ్ శెయ్గిన్ఱ నేర్ కణ్డు
అరుమాయత్తన్ఱగల్విప్పాన్ ఎన్ పెరుమాల్ నీ
ఇన్ఱెన్పాల్ సెయ్వానెన్ ఎన్న ఇడరుఱ్ఱు నిన్ఱాన్
తున్ను పుగzహ్ మాఱనైత్ తాన్ సూzహ్న్దు
ప్రతిపదార్థం:
తిరుమాల్ = శ్రియఃపతి
తమ్పాల్ = తమ విషయంలో
విరుప్పమ్ శెయ్గిన్ఱ నేర్ కణ్డు = అత్యంత ఆదరం చూపించిన విధానం గమనించి
అన్రు అరు మాయత్తన్ఱగల్విప్పానెన్ = ఆనాడు అనాదిగా ప్రకృతిలోనే ఉంచి సర్వేస్వరుడు దూరం ఎందుకు చేస్తున్నాడో కదా!
ఇన్ఱు = ఇప్పుడు
ఎన్పాల్ = నా పట్ల
నీ పెరుమాల్ శెయ్వానెన్ = అతి వ్యామోహాన్ని ఎందుకు చూపిస్తున్నాడు?
ఎన్న = ఏమిటని ప్రశ్నిస్తే
తున్ను పుగళ్ = బాగా కీర్తి గల
మాఱన్ = నమ్మాళ్వార్లు
త్తాన్ శూన్దు = తనను చుట్టుముట్టి నిలబడిన
ఇడరుఱ్ఱు నిన్ఱాన్ = వారడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక స్తబ్దుగా నిలుచున్నాడు
భావము: తమ విషయంలో అత్యంత ఆదరం చూపించిన శ్రియఃపతిని నమ్మాళ్వార్లు ఈ విధంగా ప్రశ్నించారు. ఇంతవరకు ఈ ప్రకృతిలోనే ఎందుకు ఉంచినట్లు? ఇప్పుడు నా పట్ల అతి వ్యామోహాన్ని ఎందుకు చూపిస్తున్నాట్టు? కారణం ఏమిటని ప్రశ్నిస్తే సర్వేస్వరుడు సరైన కారణం ఏదీ చెప్పలేక స్తబ్దుగా నిలుచున్నాడు. అయినా నమ్మాళ్వార్లను అంటి పెట్టుకొనే ఉన్నాడు.
పాశురం 99
అవతారిక: అర్చిరాది మార్గ సత్కారాన్ని పూర్తిగా చూపగా అనుభవించి కృప చేసిన ‘శూళ్ విశుమ్బు’ అనే 99వ తిరువాయ్ మొళిలో నమ్మాళ్వార్లు అనుగ్రహించిన శ్రీ సూక్తికి సారముగా ఈ పాశురం అమరింది.
శూళ్న్దు నిన్ఱ మాల్ విశుమ్బిల్ తొల్లై వళి కాట్ట
ఆళ్ న్దతనై ముఱ్ఱుమనుపవిత్తు వాళ్నన్దజ్ఞు
అడియరుడనే యిరున్దవాఱ్ఱై యురై శెయ్దాన్
ముడి మకిళ్ శేర్ జ్ఞానముని
ప్రతిపదార్థం:
ముడి మకిళ్ శేర్ జ్ఞానముని = వకుళమాలతో అలంకరింపబడిన తమ తిరుముడితో పరజ్ఞానము గల నమ్మాళ్వార్లు
శూళ్న్దు నిన్ఱ మాల్ = తమను చుట్టి ఉన్న సర్వేశ్వరుడు
విశుమ్బిల్ = పరమపదమందు
తొల్లై వళి కాట్ట = అనాది మార్గమైన అర్చిరాది మార్గమును చూపించగా
ఆళ్ న్దతనై ముఱ్ఱుమనుపవిత్తు = అచ్చటనున్న ఆనంద సాగరంలో మునిగి దానిని తల మునకలుగా అనుభవించి
అజ్ఞువాళ్ న్దు = అక్కడనే నివాసం చేయు
అడియరుడనే యిరున్ద ఆఱ్ఱై = అనంత గరుడ విశ్వక్సేనాధులైన భాగవతులతో ఆనందనిర్బరులై ఉన్న ప్రకారము
ఉరై శెయ్ తాన్ = కృప చేశారు
భావము: ‘శూళ్ విసుమ్బు‘ అనే ఈ తిరువాయ్ మొళిలో, పొగడ పూలతో అలకరింపబడిన నమ్మాళ్వార్లు పరజ్ఞానోపేతులై ఉన్నారు. ఆయన విషయంలో అత్యంతము అభినివేశం చెందియున్న సర్వేశ్వరుడు ఆయనకు పరమపదానికి పోయే అర్చిరాది మార్గాన్ని సాక్షాత్కరింప చేసారు. దానితో మహా ప్రీతి చెందిన నమ్మాళ్వార్లు దానిని అనుభవించి, కృతజ్ఞులై పరమపదంలో నిత్య సూర్యులతో చేరే ప్రకారాన్ని తెలియజేశారు.
పాశురం 100
అవతారిక: తమ పరమ భక్తివలన పరమ ప్రాప్తి లభించిన ప్రకారాన్ని ఆళ్వార్లు తిరువాయ్ మొళిలోని నూరవ దశకం, ఆఖరి దశకం కూడా అయిన ‘మునియే నాన్ముగనే‘ అనే తిరువాయ్ మొళిలో చెప్పారు. ఆ శ్రీసూక్తుల సారాన్ని మామునులు ‘మునిమారన్‘ అనే ఈ పాశురంలో అనువదించి కృప చేస్తున్నారు.
ముని మాఱన్ మున్బురై శెయ్ ముఱ్ఱిన్బమ్ నీజ్ఞి
తనియాకి నిన్ఱు తళర్న్దు ననియామ్
పరమ పత్తియాల్ నైన్దు పజ్ఞయత్తాళ్ కోనై uRai
యొరుమై యుఱ్ఱు చ్చేర్న్దానుయర్న్దు 100 adiyAr
ప్రతిపదార్థం:
ముని = మనన శీలురైన
మాఱన్ = శఠకోపులు
మున్బురై శెయ్ = మునుపు తాను ప్రయోజనం పొందారని కృప చేసిన
ముఱ్ఱిన్బమ్ నీజ్ఞి = ఆనందమంతా తొలగిపోయి
తనియాకి నిన్ఱు తళర్న్దు = ఒంటరివాడై బాధపడి
ననియామ్ పరమ పత్తియాల్ నైన్దు = అధికమైన పరమ భక్తితో పరిపక్వత చెందినవారై
పజ్ఞయత్తాళ్ కోనై = శ్రియః పతిని
ఒరుమై యుఱ్ఱు ఉయర్న్దు చ్చేర్న్దాన్ = మనసులో నిశ్చయించుకొని అందువలన నిత్యశూరులతో సరి సమానమైన స్థాయి గలవారే ఉత్సాహముగల వారై ప్రత్యక్ష సాక్షాత్కారమయ్యేటట్లు చేరి, లక్ష్మీదేవితో కూడి ఉన్న మిధునానికి కైకేర్యం చేయటమనే భాగ్యాన్ని పొందారు.
భావము: సంసారి చేతనులను ఉజ్జీవింప చేయడమే తమ ముఖ్యమైన కార్యం అని భావించి, సర్వేశ్వరుడిని పూర్తిగా అనుభవించిన, పరమ భక్తి సంపన్నులైన ఆళ్వార్లు. ఇంతవరకు తాము అనుభవించిన భగవదనుభవాలన్నీ మానస సాక్షాత్కార అనుభవములే’ అని, తాము ఇంకా ఈ సంసారంలోనే ఉండడాన్ని తలుచుకొని బాధపడ్డారు. దానితో వెనకటి అనుభవ ఆనందాలని పోయి, తాము ఒంటరిగా ఈ సంసారంలో ఉంటూ, చాలా బాధ పడ్డారు.
తమకు కలిగిన పరమ భక్తి చేత పరిపక్వం చెందిన వారై, ప్రాకృతిక విషయాల మధ్యన ఉంటూ, తాము భగవత్స్వరూప గుణ అనుభవాలన్నింటిని దర్శించారు. అందువలన నిత్య సూర్యుల కంటే వీరు ఉత్కృష్టులైనవారు. తాము దృఢంగా ఆశ్రయించిన శ్రీయఃపతి, శ్రీమన్నారాయణుని చేరారు. ఆ వైభవాన్ని ‘మునిగే నాన్ముగనే‘ అనే దశకంలో 10 పాశురాలలో వర్ణించారు. ఆ పాశుర భావాన్ని హృద్యంగా మామునులు ఇక్కడ అందజేశారు. పెద్ద జీయర్ అనే మణవాళ మమునులు పాసురంతో ఈ ప్రబంధాన్ని సుసంపన్నం చేశారు.
మూలము: https://divyaprabandham.koyil.org/index.php/2020/10/thiruvaimozhi-nurrandhadhi-91-100-simple/
పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org