శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
<< తిరువాయ్మొళి నూఱ్ఱందాది – 71 – 80
పాశురం 81
అవతారిక: ఇందులో సోపాధిక బంధువులను వదిలి నిరుపాధిక బంధువులను గురించి చెబుతున్న నమ్మాళ్వార్ల ‘కొండపెండీర్‘ అనే 81వ దశక సారాన్ని తెలియజేస్తున్నారు. సర్వేశ్వరుడు తప్ప మిగిలిన అందరూ ఆహ్వాదిక బంధువులే అని, సర్వేశ్వరుడు ఒక్కడే నిరుపాధిక బంధువు ఆళ్వార్ల ఉద్దేశ్యము.
కొణ్డపెణ్డిర్ తాన్ ముదలాక్ కూఱుమ్ ఉఱ్ఱార్ కన్మత్తాల్
అణ్డినవర్ ఎన్ఱే అవరై విట్టుత్ తొణ్డరుడన్
శేర్క్కుమ్ తిరుమాలైచ్చేరుమ్ ఎన్ఱాన్ ఆర్క్కుమ్ ఇతమ్
పార్క్కుమ్ పుగళ్ మాఱన్ పణ్డు
ప్రతిపదార్థం:
ఆర్కుమ్ ఇదమ్ పార్క్కుమ్ పుగళ్ = కీర్తిగల
మాఱన్ = నమ్మాళ్వార్లు
పణ్డు = పూర్వకాలంలో
కొణ్డ పెణ్డిర్ తాన్ ముదలాక్కూఱుమ్ = తన భార్య మొదలైన
ఉఱ్ఱార్ = బంధువర్గమంతా
కన్మత్తాల్ అణ్డినవర్ ఎన్ఱే = కర్మ అనే ఉపాధి వలన వచ్చిన వారే అని
అవరై విట్టు = ఆ ఔపాదిక బంధువులను వదిలి
త్తొణ్డరుడన్ సేర్క్కుమ్ తిరుమాలై = తనను ఆశ్రయించిన వారిని తనకు శేషభూతులైన వారితో చేర్చే శ్రీపతిని
శేరుమ్ ఎన్ఱాన్ = ఆశ్రయించండి అని కృప చేస్తున్నారు
భావము: కీర్తిగల భార్య, పుత్రులు మొదలైన సమస్త బంధువర్గమును తమ తమ కర్మాను గుణముగా వచ్చి చేరేవారే. అట్టి ఔపాదిక బంధాన్ని వదిలి పెట్టండి. తనను ఆశ్రయించిన వారిని, తనకు శేషభూతులైన వారితో చేర్చే, నిరుపాదిక బంధువైన శ్రీయఃపతిని ఆశ్రయించండి.’ అని కృప చేస్తున్నారు.
పాశురం 82
అవతారిక: ఈ పాశురములో సర్వవిధ బంధువుగా చేయాల్సినదంతా చేయాలి అని అళ్వార్లు ‘పణ్డై నాళాల్‘ అనే 82వ దశకంలో ప్రార్థించారు. ఆ భావాన్ని సంక్షిప్తంగా ఈ పాశురములో మామూలుగా కృప చేస్తున్నారు.
పణ్డై ఉఱవాన పరనై పుళిన్గుడిక్కే
కణ్డు ఎనక్కు ఎల్లా ఉఱవిన్ కారియముమ్ తణ్డఱ నీ
సెయ్దరుళ్ ఎన్ఱే ఇరన్ద సీర్ మాఱన్ తాళ్ ఇణైయే
ఉయ్ తుణై ఎన్ఱుళ్ళమే ఓర్
ప్రతిపదార్థం:
పణ్డై ఉఱవాన పరనై = అనాది సిద్ధ సంబంధం ఉన్న భగవంతుడిని
పుళిన్గుడిక్కే కణ్డు = తిరుపుళ్ళంగుడిలో సేవించి
ఎనక్కు = దాసునకు
ఎల్లా ఉఱవిన్ కారియముమ్ = సర్వవిధ బంధుత్వ కార్యములు
తణ్డఱ నీ సెయ్దరుళ్ ఎన్ఱే = ఆటంకం లేకుండా నువ్వు కృప చేయాలి అని
ఇరన్ద = ప్రార్ధించిన
శీర్ మాఱన్ = శ్రీ శఠకోపుల
తాళ్ ఇణైయే = శ్రీపాద ద్వయమే
ఉయ్ తుణై ఎన్ఱు = మనం ఉజ్జీవించడానికి తోడుగా ఉంటుంది అని
ఉళ్ళమే = ఓ మనసా
ఓర్ = అనుసంధించు (తెలుసుకో)
భావము: ఆళ్వారు చాలాకాలంగా సకల విధ బంధువైన సర్వేశ్వరుని ‘తిరుప్పుళ్ళిజ్ఞుడి’ దివ్య దేశంలో సేవించారు. ఓ శ్రియఃపతి! నువ్వు నా విషయంలో తల్లి, తండ్రి మొదలైన బంధువులు చేసే కృత్యాలన్నీ తొందరగా చేయాలని నమ్మాళ్వార్ ప్రార్థించారు. అలాంటి నమ్మాళ్వారు శ్రీపాదాలే మనకు ఉజ్జీవనంగా, ఉపాయంగా నిర్ధారించుకోవాలని తమ మనసుకు ఉపదేశిస్తున్నారు.
అవతారిక: ఈ పాశురంలో సర్వేశ్వరుడి సౌశీల్య గుణాలలో కాలు కూరుకుపోయిన నమ్మాళ్వారు ‘ఓరాయిరం‘ అనే 83వ దశకంలో చెప్పిన శ్రీసూక్తుల సంక్షిప్త సందేశంగా మామునులు కృప చేశారు.
ఓరానీర్ వేణ్డినవై ఉళ్ళదెల్లామ్ శెయ్గిన్ఱేన్
నారాయణన్ అన్ఱో నాన్ ఎన్ఱు పేరుఱవై
క్కాట్టవవన్ శీలత్తిల్ కాల్ తాళ్ న్ద మాఱనరుళ్
మాట్టివిడుమ్ నమ్ మనత్తుమై
ప్రతిపదార్థం:
నీర్ = తమరు
ఓరా = పరిశీలించి
వేణ్డినవై ఉళ్ళదెల్లామ్ = అపేక్షించు వాటినన్నిటిని
శేయ్గిన్ఱేన్ = నేను పూర్తిగా ఇస్తాను
నాన్ నారాయణన్ అన్ఱో ఎన్ఱు = నేను సర్వేశ్వరుడును, నారాయణయుడను కదా! అని
పేరుఱవైక్కాట్ట = జీవులతో తనకు గల నిత్య సంబంధం, బంధుత్వం చూపగా
అవన్ శీలత్తిల్ = పరమాత్మ సౌశీల్య గుణములలో
కాల్ తాళ్ న్ద = కాలుకూరు పోయిన
మాఱన్ అరుళ్ = నమ్మాళ్వార్ల కృప అనునది
నమ్ మనత్తు = మా మనసులో ఉన్న
మై = అజ్ఞానమును
మాట్టివిడుమ్ = నశింపజేయును
భావం: మీరు పరిశీలించి, అపేక్షించే వాటినన్నిటిని నేను పూర్తిగా ఇస్తాను. నేను సర్వేశ్వరుడును, నారాయణయుడను కదా! అని జీవులతో తనకు గల నిత్య సంబంధం, బంధుత్వం చూపించారు. పరమాత్మ సౌశీల్య గుణాలలో కాలు కూరుకు పోయిన నమ్మాళ్వార్ల కృప మా మనసులో ఉన్న అజ్ఞానాన్నినశింపజేస్తుంది అని భావము.
పాశురం 84
అవతారిక: సర్వేశ్వరుడు విలక్షణమైన విగ్రహుడు. ఆయనను ప్రత్యక్షంగా సేవించాలని ఆశించిన నమ్మాళ్వార్ల ‘మయ్యార్ కరుజ్ఞణ్ణి ‘ అనే 84వ దశకంలో పిలిచారు. ఆ శ్రీసూక్తులను మనవాళ మామునులు ఈ పాశురంలో సంక్షిప్తంగా కృప చేశారు.
మైయార్ కణ్ మా మార్బిన్ మన్నుమ్ తిరుమాలై
కై యాకి శజ్ఞుడనే కాణవెణ్ణి మెయ్యాన
కాతలుడన్ కూప్పిట్టుక్కణ్డుగన్ద మాఱన్ పేర్
ఓతవుయ్యుమే ఇన్నుయిర్
ప్రతిపదార్థం:
మైయార్ కణ్మా = కాటుక దిద్దిన కన్నులు గల శ్రీమహాలక్ష్మి
మార్బిల్ మన్నుమ్ = స్వామి హృదయం మీద నిత్య నివాసం చేస్తుండగా
తిరుమాలై = శ్రియఃపతిని
కై యాళి శజ్ఞునే= శ్రీ సుదర్శనం అనబడే చక్రాయుధాన్ని, పాంచజన్యం అనే దివ్య శంఖాన్ని శ్రీహస్తాలలో ధరించి ఉండగా
కాణవెణ్ణి = సేవించాలని భావించి
మెయ్యాన = మనసారా
కాతలుడన్ = ప్రేమతో ఆశించి
కూప్పిట్టు = ఆర్తితో పిలిచి
కణ్డు = ఆ విధంగా స్వామి కటాక్షించి దర్శనాన్ని ప్రసాదించగా దర్శించి సేవించి
ఉగన్ద = మహదానందం పొందిన
మాఱన్ పేర్ = నమ్మాళ్వార్ తిరునామము
ఓత = అనుసంధించగానే
ఇన్నుయిర్ = విలక్షణమైన ఆత్మ వస్తువు
ఉయ్యుమ్ = ఉజ్జీవించును
భావము: కాటుక దిద్దిన కన్నులు గల శ్రీమహాలక్ష్మి స్వామి హృదయం మీద నిత్య నివాసం చేస్తుండగా, శ్రియఃపతిని, శ్రీసుదర్శనం అనబడే చక్రాయుధాన్ని, పాంచజన్యం అనే దివ్య శంఖాన్ని, శ్రీహస్తాలలో ధరించి ఉండగా సేవించాలని భావించి, మనసారా ప్రేమతో, ఆర్తితో పిలిచారు. ఆ విధంగా స్వామి కటాక్షించి దర్శనాన్ని ప్రసాదించగా, దర్శించి, సేవించి మహదానందం పొందారు. అలాంటి నమ్మాళ్వార్ల తిరునామాన్ని అనుసంధించినంత మాత్రాన విలక్షణమైన ఆత్మ వస్తువు ఉజ్జీవింస్తుంది’ అని ఈ పాశురం భావం .
అవతారిక: ఇందులో సర్వేశ్వరుడిని తలపింప చేసే పదార్థాలను చూసి ఆళ్వార్లు బాధపడ్డారు. ఆ భావాలను తెలియజేసే ‘ఇన్ ఉయిర్చేవల్’ అనే తిరువాయ్ మోళి 85వ దశకంలో ఆళ్వార్లు చెప్పిన శ్రీ సూక్తులను సంక్షిప్తంగా మామునులు అనుగ్రహించారు.
ఇన్నుయిర్ మాల్ తోఱ్ఱినదు ఇజ్ఞెన్ నెజ్ఞిల్ ఎన్ఱు కణ్ణాల్
అన్ఱవనైక్కాణ వెణ్ణి ఆణ్ పెణ్ణాయ్ప్ పిన్నైయవ
న్తన్నై నినైవిప్పవఱ్ఱాల్ తాన్ తళర్న్ద మాఱనరుళ్
ఉన్నుమవర్క్కు ఉళ్ళమురుకుమ్
ప్రతిపదార్థం:
ఇన్నుయిర్ మాల్ = నాకు ధారకుడైన సర్వేశ్వరుడు
ఇజ్ఞు తోఱ్ఱినదు = ఈ దశలో ప్రత్యక్షమవడం
ఎన్ నెజ్ఞిన్ ఎన్ఱు = నా మనసులో ఎప్పుడూ
అన్ఱవనై కణ్ణాల్ క్కాణ వెణ్ణి = అప్పుడు అతడిని కన్నులారా అనుభవించాలని
ఆణ్ పెణ్ణాయ్ప్ = పురుషత్వం తొలగి స్త్రీత్వాన్ని పొంది
పిన్నైయవన్తన్నై నినైవిప్పవఱ్ఱాల్ = అతడిని స్మరింప చేయుచున్న మేఘ సమూహము మొదలైన వాటితో
తాన్ తళర్న్ద = తాను తడబాటు పొందిన
మాఱనరుళ్ = నమ్మాళ్వార్ల కృపను
ఉన్నుమవర్క్కు = అనుసంధించుకునే వారికి
ఉళ్ళమురుకుమ్ = మనసు ద్రవించును
భావము: తమకు అత్యంత అభిమత ప్రాణభూతుడైన సర్వేశ్వరుడిని మానస సాక్షాత్కారమును పొందారు ఆళ్వార్లు. ఆయనను ప్రత్యక్షంగా అనుభవించాలని ఆశించారు. అది లభించలేదు. అత్యంత ఆర్తి చెందిన ఒక నాయకి యొక్క దశను పొందారు. సర్వేశ్వరుడిని గుర్తుచేసే వస్తువులను చూసి బాధపడ్డారు. అలాంటి నమ్మాళ్వార్ల అవస్థను అనుసంధానం చేసిన వారి మనసు కలిగి నీరవుతుంది‘ అని ఈ పాశురం భావం.
అవతారిక: తమకు ప్రీతికరం కానీ గుణానుసంధానంతో ఆశ్చర్యపడుతూ నమ్మాళ్వార్ తమ తిరువాయ్ మొళిలోని 86వ దశకంలో పాశురాలను పాడారు. వారు అనుగ్రహించిన శ్రీ సూక్తిని అనువదించి మామునులు ఈ పాశురంలో కృప చేస్తున్నారు.
ఉరుగుమాల్ ఎన్ నెన్జమ్ ఉన్ శెయల్గళ్ ఎణ్ణి
పెరకుమాల్ వేట్కైయెనప్పేశి మరువుకిన్ఱ
విన్నాప్పుడన్ అవన్ శీరేయ్న్దురైత్త మాఱన్ శొల్
ఎన్ నాచ్చొల్లాదిరుప్పతెన్గు
ప్రతిపదార్థం:
ఉన్ శెయల్గళ్ ఎణ్ణి = మీ చేష్టలు తలుచుకొని
ఎన్ నెన్జమ్ ఉరుగుమ్ = నా మనసు నీరవుతున్నది
వేట్కైయెనప్పేసి = ఆపైన అభినివేశం కూడా పెరిగిపోతున్నది అని కృప చేసి
మరువుకిన్ఱ ఇన్నావుడన్ = వెనకటి పదార్ధములు స్వామిని తలపింప చేస్తూ బాధపడుతూ అందువలన కలుగుతున్న వ్యగ్రతతో
అవన్ శీరేయ్న్దురైత్త = స్వామి ప్రణయత్వ గుణాన్ని మనసులో ఉంచుకొని కృప చేసిన
మాఱన్ శొల్ = ఆళ్వార్ల శ్రీ సూక్తులు
ఎన్ నా = నా నాలుక
శొల్లాదిరుప్పతెన్గు = అనుసంధించకుండా ఉండడం సాధ్యమా!
భావము: స్వామి! మీ దివ్య చేష్టితాలను తలచుకొని నా మనసు కరుగుతున్నది. నిన్ను అనుభవించడానికి నాకు అభినివేశం ఎక్కువ అవుతున్నది’ అని చెప్పి ఆ అనుభవము లభించనందున బాధపడ్డారు. అయినా ఆగక మళ్లీ ఆయన గుణాలని అనుసంధిస్తున్న నమ్మాళ్వార్ల నాలుక ఎప్పుడు అనుసంధానం చేస్తూనే ఉంటుంది. అలా అనుసంధానం చేయకుండా ఉండడం సాధ్యమా! వారికి అంటే సాధ్యం కాదు. నమ్మాళ్వార్ల శ్రీ సూక్తిని అనుసంధానం చేయకుండా ఉండడం మనకు సాధ్యం కాదు.
అవతారిక: పాశురంలో సర్వేశ్వరుడు విగ్రహ సౌందర్యమే ఆలంబనగా దూతలను పంపించారు. ఆ విషయాన్ని నమ్మాళ్వార్ తమ తిరువాయ్ మొళి ‘ఎజ్ఞ్గా తలుక్కడి’ అనీ 87వ దశకంలో పాడారు. ఆ దివ్య సూక్తిని ఇక్కడ సంగ్రహంగా మామునులు కృప చేస్తున్నారు.
ఎన్గాదలుక్కడిమాల్ ఏయ్న్ద వడివళగు ఎ
న్ఱు అన్గాదు పఱ్ఱాశావాన్గవన్పాల్ ఎన్గుముళ్ళ
పుళ్ళినత్తై త్తూదాగప్ పోగవిడు మాఱన్ తాళ్
ఉళ్ళినర్కు త్తీన్గై అఱుక్కుమ్
ప్రతిపదార్థం:
ఎన్గాదలుక్కడి = మా ప్రీతికి కారణం
మాల్ ఏయ్న్ద వడివళగు ఎన్ఱు = భగవంతుడి స్వరూపానుబంధి అయిన, అనురూపమైన ఆయన విగ్రహ సౌందర్యం అని
అన్గాదు పఱ్ఱాసా ఆ = ఆ దశలో ఆ విగ్రహ సౌందర్యమే ఆలంబనంగా
ఆజ్ఞు అవన్పాల్ = అక్కడ అతడి విషయంగా
ఎన్గుమ్ ఉళ్ళ పుళ్ళినత్తై = అంతట ఉన్న పక్షి గణాలను
తూదాగప్ పోగవిడుమ్ = దూతగా పంపిన
మాఱన్ తాళ్ = నమ్మాళ్వార్ల శ్రీపాదాలను
ఉళ్ళినర్కు = అనుసంధించిన వారి
తీంగై అఱుక్కుమ్ = పాపాలను నశింప చేయును
భావము: ఆ విశ్లేష అవస్థలో గతంలో తాను అనుభవించిన సర్వేశ్వరుడి దివ్య అవయవ సౌందర్యాన్ని, నమ్మాళ్వార్లు స్మరించుకున్నారు. మళ్ళీ ఆ అనుభవం పొందాలనే ఆశతో ఆ సౌందర్యాన్ని అనుభవించాలని, ఆయన దగ్గరకు పక్షులను దూతగా పంపించారు. అలాంటి వారి శ్రీపాదాలను మనం ధ్యానిస్తే మనకు అన్ని విధాల ఆటంకాలు తొలగిపోతాయి’ అని ఈ పాశురంలో అనుగ్రహిస్తున్నారు.
అవతారిక: సర్వేశ్వరుడి దగ్గరికి పంపిన దూతలు తిరిగి వచ్చి స్వామి యొక్క సందేశాన్ని వినిపించాయి. దానిని అనుసరించి నడుచుకోననంత వరకు జరిగే ఆలస్యాన్ని నమ్మాళ్వార్లు సహించలేకపోయారు. ప్రాప్య త్వర ముందుకు నెట్టగా ‘తిరునావాయి’ అనీ దివ్యదేశానికి వెళ్లి అక్కడ స్వామిని సేవించాలని భావించారు. ‘అరుక్కుమ్ వినయ్ ‘ అనే 88వ దశకంలో ఈ విషయాన్ని నమ్మాళ్వార్లు ప్రస్తావించారు. దాని సంగ్రహాన్ని ఈ పాశురంలో మామునులు అనుగ్రహించారు.
అఱుక్కుమ్ ఇడర్ ఎన్ఱు అవన్పాల్ ఆన్గు విట్ట తూతర్
మఱిత్తు వరప్ పఱ్ఱా మనత్తా లఱప్పదఱి
శెయ్య తిరునావాయిల్ శెల్ల నినైన్దాన్ మాఱన్
మైయలినాల్ శెయ్వతఱియామల్
ప్రతిపదార్థం:
ఇడర్ అఱుక్కుమ్ ఎన్ఱు = మన దుఃఖాలను తొలగింప చేసేవాడని
అవన్పాల్ ఆన్గు విట్ట తూదర్ = ఆ భగవంతుడి వద్దకు పంపబడిన దూతలు
మఱిత్తు వరప్ పఱ్ఱా మనత్తాల్ = తిరిగి వచ్చేవరకు ఆలస్యాన్ని సహించలేని మనసుతో
అఱప్పదఱి = త్వరలో ముందుకు నెట్టబడి
మైయలినాల్ = కలత చెంది ఉన్నందున
శెయ్వతఱియామల్ = ఏమి చేయాలో తోచక
మాఱన్ = నమ్మాళ్వారు
శెయ్య తిరునావాయిల్ = విలక్షణమైన తిరునావాయికి
శెల్ల నినైన్దాన్ = వెళ్లడానికి సిద్ధపడుతున్నారు
భావము: ఆళ్వార్లు తమ దుఃఖాన్నంతా ‘ఆ సర్వేశ్వరుడికి చెప్పండి’ అని ‘ తిరుమూళికళం’ అనే దివ్యదేశంలో వేంచేసి ఉన్న పెరుమాళ్ళ దగ్గరకు పక్షులను దూతగా పంపించారు. వారు అనుగ్రహించే దాకా ఆగలేని త్వరలో ఉన్న నమ్మాళ్వార్ ఎలాగైనా సర్వేశ్వరుడిని సేవించాలని ‘అరక్కుంమ్ వినయ్‘ అనే తిరువాయ్ మొళిలో అందమైన ‘తిరునావాయ్‘ అనే దివ్యదేశానికి వెళ్లడానికి సిద్ధమయ్యారని ఈ పాశురంలో తెలియజేయబడింది.
అవతారిక: ఒక సంధ్యాకాలంలో కలిగిన నమ్మాళ్వా ర్ల అనుభవాన్ని అనువదించి కృప చేస్తున్నారు ప్రాప్తి త్వర వలన నంద్యాలలో గోపికలతో కృష్ణుడు కూడి ఉన్న సన్నివేశాన్ని తలుచుకోగా అక్కడ మల్లెపూల వాసన గుబాలించడం ఆయనకు అనుభవం అయింది. ఆ ప్రకారాన్ని ‘మల్లిగాయి కమరుం జనరల్’ అనే 89వ దశకల్లో వర్ణించారు దానిని ఈ పాశురం లో మామూలు మనకు సంగ్రహంగా అనుగ్రహించారు.
మల్లడిమై శెయ్యునాళ్ మాల్ తన్నైక్కేట్క అవన్
శొల్లుమ్ అళవుమ్ పఱ్ఱాత్ తొన్నలత్తాల్ శెల్గిన్ఱ
ఆఱ్ఱామై పేశి యలమర్ న్ద మాఱనరుళ్
మాఱ్ఱాగప్పోగుమెన్ఱన్ మాల్
ప్రతిపదార్థం:
మల్లడిమై శెయ్యునాళ్ = సంపూర్ణ కైంకర్యం చేసే కాలం ఎప్పుడు వస్తుందో
మాల్ తన్నైక్కేట్క = అని భగవంతుడిని చూసి ప్రశ్నించగా
అవన్ శొల్లుమ్ అళవుమ్ పఱ్ఱా = ఆయన నిర్ధారించి చెప్పేంతవరకు సహించి ఉండలేని
తొల్ నలత్తాల్ = స్వాభావిక భక్తి వలన
శెల్గిన్ఱ ఆఱ్ఱామై పేశి అలమన్ద మాఱన్ = తమలోని ఆర్తిని కృప చేసి
అరుళ్ = కృప అనేది
మాఱ్ఱాగ = అజ్ఞానానికి బదులుగా
ఎన్ఱన్ మాల్ పోగుమ్ = నా యొక్క అజ్ఞానం నివర్తించును
భావము: ఓ శ్రీయఃపతి మీ పాదాలకు ప్రతినిత్యం సమస్త కైంకర్యాలను చేసే భాగ్యం నాకెప్పుడూ కలుగుతుందో చెప్పు! అని అడిగారు నమ్మాళ్వార్లు. స్వామి సమాధానం చెప్పేంతవరకు ఆగలేక, అధికమైన ఆర్తి కలిగింది. అప్పుడు తన విశ్లేష దుఃఖాన్ని స్వామికి విన్నవించారు. అలాంటి వారి దివ్య కటాక్షమే మనలోన సకలవిధ అజ్ఞానాలను పోగొడుతుంది’ అని ఈ పాశురం యొక్క భావం.
అవతారిక: ఆళ్వార్లు తమకు కాస్త ఊరట లభించడంతో ‘మాలైనణ్ణి’ అనే 90వ దశకంలో, లోకంలో జనులకు ఉపదేశించిన పాసుర సారాన్ని ఇక్కడ అనుగ్రహిస్తున్నారు. భక్తి చేయలేనివారు, ఇతర కైంకర్యాలు చేయలేనివారు, ఈ పది పాశురాలను ప్రీతి పూర్వకంగా అనుసంధానం చేసి ఆయన శ్రీపాదాలకు నమస్కారం చేయండి’ అని నమ్మాళ్వారు చెప్పిన దశకం యొక్క సారాన్ని ఈ పాశురంలో మామునులు మనకు అనుగ్రహించారు.
మాలుమదు వాన్జై ముఱ్ఱుమ్ మన్నుముడమ్బిన్ ముడివిల్
శాల నణ్ణిచ్చెయ్వ నెనత్తాన్ ఉగన్దు మేలవనై
చ్చీరార్ కణపురత్తే శేరుమెనుమ్ శీర్ మాఱన్
తారానో నన్దమక్కు తాళ్
ప్రతిపదార్థం:
మాల్ = సర్వేశ్వరుడు
ఉమదు వాన్జై ముఱ్ఱుమ్ = మీయొక్క అపేక్షితములన్నింటిని
మన్నుమ్ ఉడమ్బిన్ ముడివిల్ = ఆత్మ ఉన్న శరీరావసానమున
శాల నణ్ణిచ్ చెయ్వన్ ఎన = పూర్తి చేస్తాననగా
తాన్ ఉగన్దు = తమ మనసు చాలా సంతోషించి
మేలవనై = ఆ పరమ పురుషుని
శీరార్ కణపురత్తే శేరుమ్ ఎనుమ్ = తిరుకంణ్ణపురమునకు పోయి ఆశ్రయించండి అని కృప చేసిన
శీర్ మాఱన్ = జ్ఞానాది గుణములు అపారముగా గల శఠకోపులు
నన్దమక్కు = మనకు
తాళ్ తారానో = తన శ్రీపాదాలను ప్రసాదించరా!
భావము: ‘మాలైనణ్ణి’ అనే తిరువాయ్ మొళిలో సర్వేశ్వరుడు, ‘మీ శరీర అవసానంలో మీ కోరికలను నెరవేరుస్తాను’ అని అనుగ్రహించారు. నమ్మాళ్వార్లు దానికి చాలా సంతోషించారు. అప్పుడు చేతనులతో, ‘మీరు సకల సంపదలతో అలరారుతున్న ‘తిరుకణ్ణపురం‘ అనే దివ్య క్షేత్రంలో వేంచేసి ఉన్న సర్వేశ్వరుడైన శ్రీయఃపతిని ఆశ్రయించండి’ అని ఉపదేశించారు. జ్ఞానాది సకల గుణ పరిపూర్ణుడైన నమ్మాళ్వార్ల శ్రీపాదాలే మనకు ప్రాప్యముగా ఉపకరిస్తాయని ఈ పాశురానికి అర్థం.
అడియేన్ చూడామణి రామానుజ దాసి
మూలము: https://divyaprabandham.koyil.org/index.php/2020/10/thiruvaimozhi-nurrandhadhi-81-90-simple/
పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org