శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
శ్రీమన్నారాయణుడు నమ్మాళ్వార్లను అపారంగా అనుగ్రహించారు. నమ్మాళ్వార్లకు శ్రీమన్నారా యణునిపై అంతులేని భక్తి, పారవశ్యం, ప్రేమ. అందువలన ఆయన ఆ భక్తిపారవశ్యంతో నాలుగు ప్రబంధాలను పాడారు. అవి వరుసగా 1. తిరువిరుత్తమ్ 2. తిరువాశిరియమ్ 3. పెరియ తిరువందాది 4. తిరువాయ్మొళి. వీటిలో తిరువాయ్మొళి ప్రబందాన్ని సామవేద సారంగా అమరిందని పెద్దలు అంటారు. ముముక్షువు తెలుసు కోవలసిన విషయాలైన అర్థ పంచకం ఇత్యాదులను ఈ ప్రబంధంలో చక్కగా వివరించారు. నంబిళ్ళై అనే మహా ఆచార్యులు ఈ తిరువాయ్మొళికి చేసిన వ్యాఖ్యానాన్ని ‘ఈడు ముప్పత్తారాయిర పడి’ అని అంటారు. అంతకు ముందు కూడా కొందరు మహాచార్యులు తిరువాయ్మొళికి వ్యాఖ్యానాలు చేసినప్పటికీ ‘ఈడు ముప్పత్తారాయిర పడి’ తిరువాయ్మొళి సారాన్ని పూర్తిగా, వివరిస్తుందని పెద్దల అభిమతము.
మణవాళమామునులు అనుగ్రహించిన గొప్ప ప్రబందం తిరువాయ్మొళి నూత్తందాది. దీని రచనలో వారు స్వయంగా అనేక నిబంధనలను విధించుకొని దానిని అనుసరించి రచించటం అద్భుతమైన విషయం.
దీనిని అందాదిగా (ముక్తపదగ్రస్తం) రచించారు. అందువలన ఇది నేర్చుకోవటానికి, పాడుకోవటానికి అనువుగా వుంటుంది.
- తిరువాయ్మొళిలోని ఒక దశకానికి ఈడు వ్యాఖ్యానంలో చెప్పిన విషయాల సారాంశాన్ని ఒక పాశురముగా మామునులు ఆవిష్కరించారు .
- ప్రతి పాశురములోను నమ్మాళ్వార్ల తిరునామము తప్పక ఉండేట్లుగా ఈ ప్రబంధాన్ని కూర్చారు.
- ఈ ప్రబంధానికి పిళ్లైలోకంజీయరు అనుగ్రహించిన వ్యాఖ్యానం అద్భుతమైనది. ఈ ప్రబంధాన్ని మనం సులభంగా అధికరించటానికి ఆ గ్రంధాన్ని ఆధారము చేసుకుంటే మనకు చక్కగా అర్థం అవుతుంది అనటంలో సందేహం లేదు .
- తనియన్లు
- పాశురములు 1-10
- పాశురములు 11-20
- పాశురములు 21-30
- పాశురములు 31-40
- పాశురములు 41-50
- పాశురములు 51-60
- పాశురములు 61-70
- పాశురములు 71-80
- పాశురములు 81-90
- పాశురములు 91-100
అడియేన్ చూడామణి రామానుజ దాసి
మూలము: https://divyaprabandham.koyil.org/index.php/2020/09/thiruvaimozhi-nurrandhadhi-simple/
పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org