శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః
పరిచయము:
మునుపటి పాశురములో, “అఱమిగు నఱ్పెరుంబుదూర్ అవదరిత్తాన్ వాళియే” అనే వాక్యము ప్రకారము శ్రీరామానుజులు “శ్రీపెరుంబూదూర్” అనబడే క్షేత్రంలో అవతరించారు. ఆ వాక్యము నెపముగ భావించి, శ్రీరామానుజులు ఈ భూమిపైన మన కోసం అవతరించిన ఆ దివ్యమైన రోజుని మణవాల మాముణులు కీర్తిస్తున్నారు.
పాశురము 32
శంగర భాఱ్కర యాదవ బాట్ట ప్రభాకరర్ తంగళ్ మదం
శాయ్వుఱ వాదియర్ మాయ్గువర్ ఎన్ఱు శదుమఱై వాళ్ందిడు నాళ్
వేంగలి ఇంగిని వీఱు నమక్కిలై ఎన్ఱు మిగ త్తళర్ నాళ్
మేదిని నంజుమై ఆఱుం ఎన త్తుయర్ విట్టు విళంగియ నాళ్
మంగయరాళి పరాంగుశ మున్నవర్ వాళ్వు ముళైత్తిడు నాళ్
మన్నియ తెన్నరంగాబురి మామలై మఱ్ఱుం ఉవందిడు నాళ్
శెంగయల్ వావిగళ్ శూళ్ వయల్ నాళుళ్ శిఱంద పెరుమ్బూదూర్
చ్చీమాన్ ఇళైయాళ్వార్ వందరుళియ నాళ్ తిరువాదిరై నాళే
ప్రతి పద్ధార్ధములు
శంగర – శంకరుడు ప్రతిపాదించిన సిద్దాంతము
భాఱ్కర – భాస్కరుడు ప్రతిపాదించిన సిద్దాంతము
యాదవ – యాదవప్రకాశులు ప్రతిపాదించిన సిద్దాంతము
బాట్ట – భాట్టల సిద్దాంతము
ప్రభాకరర్ తంగళ్ మదం – ప్రభాకరుడు ప్రతిపాదించిన సిద్దాంతము, అటువంటి తత్వశాస్త్రములు
శాయ్వుఱ – నాశనం చేయబడ్డాయి (శ్రీరామానుజులు అవతరించిన రోజు అవతరించిన తరువాత)
వాళ్ందిడు నాళ్ శదుమఱై – నాలుగు వేదాలు ఆరోగ్యంగా జీవించిన రోజు (వేదములు యొక్క అర్థం స్పష్టంగా అర్థం చేసుకోబడిన రోజున)
వాదియర్ – వాదించే శంకరుని వంటివారు
మాయ్గువర్ ఎన్ఱు – కానీ చివరికి ఖచ్చితంగా విఫలమవుతారు.
నాళ్ – శ్రీరామానుజులు అవతరించిన రోజే దినము
వేంగలి – అమానుషమైన కలి
ఇంగిని వీఱు నమక్కిలై ఎన్ఱు – ఇక ఈ భూమిపైన ఉండేలా లేని
మిగత్తళర్ – భయంకరంగా కంపించి చివరికి క్షీణిస్తుంది.
నాళ్ – శ్రీరామానుజులు అవతరించిన రోజే దినము
మేదిని – భూమి కూడా
విళంగియ – తేజస్సుతో ప్రకాశించు
నంజుమై ఆఱుం ఎన త్తుయర్ విట్టు – భారం తొలగించబడుతుంది.
నాళ్ – శ్రీరామానుజులు అవతరించిన రోజే దినము
వాళ్వు – యొక్క స్తుతి
మున్నవర్ – మన పూర్వీకులు మొత్తం
మంగైయరాళి – తిరుమంగై ఆళ్వార్
పరాంకుస – నమ్మాళ్వార్
ముళైత్తిడు – తిరిగి పుడుతుంది, వికసిస్తుంది, అభివృద్ధి చెందుతుంది.
నాళ్ – శ్రీరామానుజులు అవతరించిన రోజే దినము
మన్నియ – పెరియ పెరుమాళ్ నిత్య నివాసమున్న
తెన్నరంగాపురి – పైగా దీనిని అందమైన శ్రీరంగం అని కూడా పిలుస్తారు
మామలై – “పెరియ తిరుమలై” అని పిలువబడే తిరువెంగడం
మఱ్ఱుం – ఇతర దివ్య దేశములు
ఉవందిడు – సంతోషంగా ఉంటుంది.
నాళే – ఆ రూజున
వందరుళియనాళ్ – శ్రీరామానుజులు అవతరించారు
సీమానిలయాళ్వార్ – శ్రీమాన్ గా “ఇళైయాళ్వార్” అనే పేరుతో
పెరుంబుదూర్ – శ్రీపెరుంబుదూర్
సూళ్ – దాని చుట్టి ఉంది
వావిగళ్ – (1) చెరువులు, సరస్సులు నిండి ఉన్నాయి
సెంకయల్ – ఎర్రని చేప
వయల్ – (2) వరి పొలాలు
నాళుం – శ్రీపెరుంబుదూర్ అని పిలువబడే ఈ దేశము, నిత్యము వర్ధిల్లుతుంది
శిఱంద – అందమైన, గొప్ప నగరం.
తిరువాదిరై – (శ్రీ రామానుజులు శ్రీపెరుంబుదూర్లో అవతరించిన తిరునక్షత్రం ఆర్ద్రా. ఇది దినమంటే. ఎంతటి సుదినము. “శ్రీమాన్ ఆవిరభూత్ భూమౌ రామానుజ దివాకరః” అని మనం తెలుకోవలసినది.
సరళ అనువాదము:
ఈ ప్రపంచంలో శ్రీరామానుజులు అవతరించిన అద్భుతమైన శ్రీ ఆర్ద్రా నక్షత్రాన్ని మణవాల మాముణులు కీర్తిస్తున్నారు. భూమిపైన వారు జన్మించినప్పుడు, అనేక మంచి విషయాలు జరిగాయి. అంత వరకు ఉన్న వేదాల యొక్క అపార్థములు చెప్పిన తత్వాలన్ని నాశనం చేయబడ్డాయి. కలి వణకడం ప్రారంభించి, శ్రీరామానుజులు ఉన్నంత కాలం తాను ఇక్కడ ఉండలేనని భయపడింది. ఈ భూమి, అందులోని దివ్య దేశాలు, ఆ దివ్య దేశ వాసులందరూ శ్రీరామానుజుల అవతారముతో వారి భారం తగ్గుతుందని ప్రతి ఒక్కరూ సంతోష పడ్డారు. ఎర్రని చేపల సమృద్ధితో నిండిన అందమైన చెరువులు కలిగి అందంగా నిర్మించబడిన నగరం శ్రీపెరుంబుదూర్లో దివ్య శ్రీరామానుజులు జన్మించారు. నిజంగా ఎంత అద్భుతమైన రోజు.
వివరణ:
విషయాలను సరిగ్గా చూడగలిగే దృష్టి లేని “కుదృష్థులు” అని కొంతమంది ఉన్నారు. వాళ్ళు వేదాల ముఖ్య ఉద్దేశ్యాన్ని స్పష్టంగా చూడకుండా, వాటిలో వివరించబడిన అర్థాలను నిస్సారంగా తప్పుదోవ పట్టించే రీతిలో వివరిస్తారు. సాధారణంగా వాళ్ళు రెండు విషయాలను నిరాకరిస్తారు (1) సర్వోన్నత భగవాన్ శ్రీమన్ నారాయణుని (విశేషణము) (2) వారి గుణాలు (వైశేష్యం). శంకర, భస్కర మొదలైన మతస్థులను కుదృష్థులుగా భావిస్తారు. ఈ కారణంగా వైధిక ధర్మం నిస్సహాయమైన స్థితిలో ఉండేది. శ్రీరామానుజులు ఈ ప్రపంచంలో అవతరించిన రోజున, కుదృష్థుల వాదనలు నాశనమై తిరిగి వేదాలు దృఢంగా వర్ధిల్లుతాయని, తాను కోల్పోయిన కీర్తిని తిరిగి పొందబోతుందని తెలుసుకొని సంతోషపడింది వేదం.
శ్రీరామానుజులు అవతరించిన రోజున, ఘోరమైన ‘కలి’ ఈ భూమిపైన ఇక ఎప్పటికీ హాయిగా జీవించలేదని భావించి వణకడం ప్రారంభించిన రోజది. ‘కలి’ ప్రభావితులైన కుదృష్థులు ఉక్కిరి బిక్కిరై అటూ ఇటూ పరిగెత్తారు, భూమి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుని ప్రకాశించింది అని, “తవం తారణి పెఱ్ఱదు” ఇరామానుశ నూఱ్ఱందాది 65లో వివరించబడింది. ఆళ్వారులు పాడిన ప్రదేశాలను దివ్య దేశాలంటారు, వాళ్ళల్లో తిరుమంగై ఆళ్వారులు అత్యధిక దేశాలలో పాడారు. అందువల్ల, శ్రీరామానుజులు అవతరించిన రోజున, ఆళ్వారుల కీర్తి మళ్లీ వృద్ధి చెందడం ప్రారంభించిందని చెప్పవచ్చు. దివ్య దేశములు కూడా ఈ రోజు చాలా ఆనందించాయి. ఈ దివ్య దేశాలలో పెరియ పెరుమాళ్ నిత్యనివాసమున్న శ్రీ రంగము, తిరుమల “అరువిసెయ్య నిర్ క్కుం మామలై” (తిరువిరుత్తం 50లో చెప్పినటుల) మొదలైన మరెన్నో దివ్య దేశాలున్నాయి. ఈ భూమిపైన, తిపువాదిరై (తిరు ఆర్ద్రా) నక్షత్రమున శ్రీపెరుంబూదూర్లో శ్రీ రామనుజులు అవతరించారు. ఈ ప్రదేశం ఎర్రటి చేపలు ఉన్న సరస్సులతో చుట్టుముట్టి ఉండి నిత్యము ఆ నగరం యొక్క అందాన్ని కాపాడుతూ ఉంటుంది. శ్రీ రామానుజులకు “ఇళైయాళ్వార్” అన్న నామము ఇవ్వబడింది. ఆ నామమే చాలా విషయాలను తెలుపుచున్నట్లు తోచును.
మణవాల మాముణులు ఆనందపడుతూ, “దినము అంటే ఈ దినము!” ఎంతటి సుదినము! శ్రీరామానుజులు ఈ భూమిపైన అవతరించిన ఈ రోజుకి మరేరోజైనా సరితూగుతుందా? అని ఆశ్చర్యపోరున్నారు. ఈ సమయంలో, “శ్రీమాన్ రామానుజ దివాకరః” అనే వచనాలను మనం గుర్తుచేసుకోవాలి. “తెన్నరంగాపురి మామలై మఱ్ఱుమువన్దిదు నాళ్” అన్న ఈ వాఖ్యము, తిరుమల శ్రీరంగ ఇత్యాది దివ్య దేశ వాసులందరూ శ్రీరామానుజులు ఈ భూమిపైన అవతరించిన ఈ రోజున సంతోషించారని చెప్పుకోవచ్చు. ఈ రెండు దివ్య దేశాలు మిగితా దివ్య దేశాలన్నింటికీ ప్రతినిధిత్వం వహిస్తాయి. “ఉన్ నామమెల్లాం ఎన్ఱాన్ నావినుళ్ళే అల్లుంపగలుం అమరుంపడి నల్గు” అని ఇరామానుశ నూఱ్ఱందాది తనియన్లో వెల్లడించినట్లుగా, ఎంబెరుమానార్, ఇరామానుశ, ఎతిరాశా అన్న వివిధ నమములను ఇక్కడ మణవాల మాముణులు ఉపయోగించారు. ఈ పాశురములో “ఇళైయాళ్వార్” అన్న నామము ఉపయోగించబడింది.
అడియేన్ శ్రీదేవి రామానుజదాసి
మూలము : https://divyaprabandham.koyil.org/index.php/2016/12/arththi-prabandham-32/
పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org