ఆర్తి ప్రబంధం – 31

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

ఆర్తి ప్రబంధం

<< ఆర్తి ప్రబంధం – 30

emperumAnAr-nammAzhwAr

పరిచయము: 

మునుపటి పాశురములో, మణవాళ మామునులు శ్రీ రామానుజులకు పలుమార్లు మంగళం పాడటం మనము చూశాము. అందరూ ప్రీతితో అలవరచుకోవలసిన విషయమది. ఈ పాశురములో, మణవాళ మామునులు శ్రీ రామానుజుల శౌర్యానికి నమస్కరిస్తూ మంగళం పాడుతున్నారు. అయితే వేద విరుద్దమైన అర్థాలను భోదించు వారిని, ఆ వేదార్థముల అసలు ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోని వారి వాదనలను నాశనం చేసిన శ్రీ రామానుజుల శౌర్యాన్ని కీర్తిస్తున్నారు. మునుపటి పాశురములో శ్రీ రామానుజుల తిరుమేనికి మంగళాలు అందించగా, ఈ పాశురములో వారి గుణానుభవము చేస్తున్నారు.

 పాశురము 31

అరుశమయ చ్చడి అదనై అడి అఱుత్తాన్ వాళియే!!!
అడర్ందు వరుం కుదిట్టిగళై అఱత్తుఱందాన్ వాళియే!!!
శెఱు గలియై చ్చిఱిదుం అఱ తీర్ త్తు విట్టాన్ వాళియే!!!
తెన్నరంగర్ శెల్వ ముఱ్ఱుం తిరుత్తి వైత్తాన్ వాళియే!!!
మఱైయదనిల్ పొరుళ్ అనైత్తుం వాయ్ మొళిందాన్ వాళియే!!!
మాఱనుఱై శెయ్ద తమిళ్ మఱై వళర్ త్తోన్ వాళియే!!!
అఱమిగు నఱ్పెరుంబూదూర్ అవదరిత్తాన్ వాళియే!!!
అళగారుం ఎతిరాశర్ అడియిణైగళ్ వాళియే!!!

ప్రతి పద్ధార్ధములు

వాళియే – చిరకాలం వర్ధిల్లాలి!!!
అడి అఱుత్తాన్ –  వేర్లతో సహా పెకిలించి నాశనం చేసినవాడు
అరుశమయ చ్చడి అదనై – వేదాలలో చెప్పబడిన దాని ప్రకారం నడుచుకోని ఆరు సిద్దాంతములు.
వాళియే – చిరకాలం వర్ధిల్లాలి!!!
అఱత్తుఱందాన్ – పూర్తిగా తరిమి కొట్టినవాడు
అడర్ందు వరుం –  అందరూ కలిసి పెద్ద సంఖ్యలో వచ్చినవారు
కుదిట్టిగళై– వేదములను వక్రీకరించిన, “నాన్ మఱైయుం నిఱ్క క్కుఱుంబుసెయ్ నీసరుం మాణ్డనర్” అన్న వాఖ్యములో వలే “కుదృష్థులు” అని అర్థం
వాళియే – చిరకాలం వర్ధిల్లాలి!!!
తీర్ త్తు విట్టాన్ – నాశనం చేసినవాడు
శెఱు గలియై – “కళి” అని పిలువబడే ప్రమాదకరమైన, విస్తృతంగా వ్యాపించి ఉన్న దుష్ట శక్తి
అఱ – వదలకుండా
చ్చిఱిదుం – ఒక చిన్న అణువు
వాళియే – చిరకాలం వర్ధిల్లాలి!!!
తిరుత్తి వైత్తాన్ – ఆదేశించి పరిపాలించినవాడు
శెల్వ ముఱ్ఱుం – సమస్థ సంపద
తెన్నరంగర్ –  అందముతో నిండి ఉన్న పెరియ పెరుమాళ్ (శ్రీ రంగనాధుడు)
వాళియే – చిరకాలం వర్ధిల్లాలి!!!
వాయ్ మొళిందాన్ –  తమ దివ్య వాక్కులను మనకి అందించిన (శ్రీ భాష్యం)
పొరుళ్ అనైత్తుం – అన్ని శాస్త్రములలో
మఱైయదనిల్ – వేదాలలో ప్రచారం చేయబడిన
వాళియే – చిరకాలం వర్ధిల్లాలి!!!
వళర్ త్తోన్ – ప్రచారం చేసి వ్యాప్తి చేసినవాడు
తమిళ్ మఱై – తమిళ వేదము
ఉఱై శెయ్ద – ఇవ్వబడిన
మాఱన్ – నమ్మాళ్వార్
వాళియే – చిరకాలం వర్ధిల్లాలి!!!
అవదరిత్తాన్ – అవతరించినవాడు
నఱ్పెరుంబూదూర్ – “శ్రీపెరుంబుదూర్” అని పిలువబడే పవిత్ర దేశం
అఱమిగు – తమిళ వేదంలో చెప్పబడిన విధంగా “సంపూర్ణ శరణాగతి” ని వ్యాప్తి చేయుట
వాళియే – చిరకాలం వర్ధిల్లాలి!!!
అడియిణైగళ్ – ఏకైక ఆశ్రయం, పాద పద్మములు
ఎతిరాశర్ – శ్రీ రామానుజులు
అళగారుం – సౌదర్యము మొదలైన గుణాలతో నిండి ఉన్న

సరళ అనువాదము:

శ్రీ రామానుజులు చిరకాలం వర్ధిల్లాలని మణవాళ మామునులు ఈ పాశురములో కోరుకుంటున్నారు. (1) వేద విరుద్దమైన ఆరు మహావృక్షాల లంటి సిద్దాంతాలను మటుమాయం చేసినవారు (2) వేద అపరాధులను తరిమికొట్టినవారు (3) ఈ ప్రపంచములో కలిని కలిప్రభావాన్ని నామరూపాలు లేకుండ చేసినవారు (4) శ్రీరంగాన్ని పునరుద్ధరింపజేసి, పూజా విధానములను క్రమబద్ధీకరింప చేసినవారు (5 “శ్రీ భ్యాష్యం” రూపంలో మనందరికీ వేదముల యదార్థములను ప్రసాదించినవారు (6) ఆసక్తిగల వాళ్ళల్లో తిరువాయ్మొళి సారాన్ని ప్రచారం చేసినవారు (7) అద్భుతమైన శ్రీపెరంబుదూర్లో అవతరించినవారు.  అందరికీ ఏకైక ఆశ్రయమైన అటువంటి శ్రీ రామానుజుల దివ్య శ్రీ పాదాలు చిరకాలము వర్ధిల్లాలి.

వివరణ:

మణవాళ మామునులు శ్రీ రామానుజుల స్వరూప లక్షణాలకు మంగళం పాడుతున్నారు. మొదట, వారు ఆరు మహా వృక్షముల వంటి వేద విరుద్దమైన సిద్దాంతములను వాటి వేర్లతో సహా పెలికి నామరూపములు లేకుండా సర్వనాశనం చేసిన మహానుభావునిగా శ్రీ రామానుజులను ప్రశంసిస్తూ కీర్తి పాడటం ప్రారంభిస్తున్నారు. “సాఖ్యోలుఖ్యాక్షపాదక్ష్పణక కపిలపతంజలి మదాణుసారిణః” అనే వాఖ్యము ప్రకారం, వేద విరుద్దమైన ఆరు తత్వశాస్త్రములున్నాయి. శ్రీ రామానుజులు వాటిని మూలముతో సహా పూర్తిగా నాశనం చేశారు. వాళ్ళందరినీ ఉక్కిరి బిక్కిరి చేసిన శ్రీ రామానుజులుకు మణవాళ మామునులు కీర్తి పాడుతున్నారు.  “నాన్ మఱైయుం నిఱ్క క్కుఱుంబు సెయ్ నీసరుం మాణ్డనర్ (ఇరామానుశ నూఱ్ఱందాది 99)” అనే ప్రబంధంలో వివరించినదాని ప్రకారంగా – వీళ్ళందరు ఎరెవరో కాదు, వేదములను వక్రీకరించినవారే అని అర్థమౌతుంది. “కలి” కారణంగా వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ అలోచనలను విసృతంగా ప్రచారం చేసి వ్యాప్తి చేయగలిగారు, ఈ ప్రపంచం మొత్తాన్ని ముంచెత్తారు. “అఱుసమయం పోనదు పొన్ఱి ఇఱందదు వెంకలి” అని ఇరామానుశ నూఱ్ఱందాది 49 వాఖ్యములో వివరించబడింది. ఏదేమైనా, ఈ ప్రపంచంలో కలిని, దాని ప్రభావాన్ని జాడని లేకుండా శ్రీ రామానుజులు నిర్ధారించారు. మణవాళ మామునులు అటువంటి దయగల శ్రీ రామానుజులకు కీర్తి పాడుతున్నారు. దీని తరువాత,  “శ్రీమన్ శ్రీరంగశ్రీయం అనుభద్రవాం అనుదినం సంవర్ధయా” అన్న వాఖ్యము ప్రకారం, శ్రీరంగ సంపదను, ఆ దివ్య క్షేత్రము యొక్క దినచర్యను క్రమబద్ధీకరించిన శ్రీ రామానుజులకు మంగళం పాడుతున్నారు. 

వేదములు వాటిని వివరించే వ్యక్తిపై ఆధారపడి ఉండుట చేత అవి నిత్యము భయం భయంగా ఉండేవి. వేదములను సమగ్రంగా అన్వయించక పోతే వాటి అసలు ఉద్దేశ్యాన్ని పొందలేరుము, అందువల్ల అనువాదంలో చాలావరకు కోల్పోయే అవకాశం ఉంది. శ్రీ రామానుజులు వేదార్థములను పూర్తిగా అర్థం చేసుకున్న తరువాత “శ్రీ భ్యాష్యం”ని (వేద వ్యాసుని బ్రహ్మ సూత్రాలకు భాష్యము) రచించి వేదముల యొక్క ఈ భయాన్ని తొలగించగలిగారు. వేదముల నిగూఢ అర్ధముల సారాన్ని వ్యాప్తి కూడా చేశారు. ఇంతటి మహోపకారాన్ని మనకందించిన శ్రీ రామానుజులను మణవాళ మామునులు కీర్తిస్తున్నారు.  తిరువాయ్మొళి యొక్క తనియన్ల లో, “వాళర్త ఇడత్తాయి ఇరామానుశ” అని ఒక వాఖ్యము ఉంది.  తమిళ వేదముగా ప్రఖ్యాతిగాంచిన “తిరువాయ్మొళి“ని ప్రచారము చేసిన శ్రీ రామానుజులకు మణవాళ మామునులు మంగళము పాడుతున్నారు. తిరువాయ్మొళిలో తెలుపబడిన శరణాగతి  సారాన్ని ప్రజలలో వ్యాప్తింపజేశారు. ఇది సామాన్యులకు చేరువ కావడానికి శ్రీపెరుంబుదూర్లో అవతరించిన శ్రీ రామానుజులు మాత్రమే కారణమని చెప్పవచ్చు. మానవాళికి చేసిన ఈ అద్భుతమైన సేవకు మణవాళ మామునులు వారికి వందనాలు సమర్పించుకుంటున్నారు.

చివరగా, మణవాళ మామునులు “సౌందర్యంతో నిండి ఉన్న శ్రీ రామానుజుల అద్భుతమైన దివ్య పాదయుగళి దీర్ఘకాలం జీవించనీ” అని చెప్పి ముగిస్తున్నారు. “అళగారుం” అనే పదం “అడియిణైగల్”కి (పాద పద్మములు) నామవాచకంగా  ఉపయోగించవచ్చు. ఈ పద్ధతిలో చూపించినచో, ఆ రెండు పాదాలు రెండు అందమైన తామర పువ్వులతో సమానంగా ఉంటాయని అర్థము చేసుకోవచ్చు. అంతే కాదు, ఇది శ్రీ రామానుజుల దివ్య పాదముల సహజ సౌందర్యాన్ని కూడా సూచిస్తుంది. “అఱమిగు నార్ పెరుంబూదుర్” అనే వాక్యముకి శ్రీ రామానుజులు ధర్మ ఉపాసకులైన వ్యక్తి అని అర్ధం, “ఇరామానుసన్ మిక్క పుణ్ణియన్ (ఇరామానుశ నూఱ్ఱందాది 91)” అనే ప్రబంధ వాఖ్యములో చూపబడింది.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2016/12/arththi-prabandham-31/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Comment