శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
పాశురము 60
ఈ పాశురము మొదలుగా శ్రీవచనభూషణము యొక్క ఉన్నతార్థమైన ఆచార్య భక్తిని విస్తారముగా కృపచేయుచున్నారు. ఈ పాశురములో ఆచార్య భక్తి లేనివానిని ఎంబెరుమాన్ తానే ఆదరించడని వివరిస్తున్నారు.
తన్ గురువిన్ తాళిణైగళ్ తన్నిల్ అన్బొన్ఱిల్లాదార్।
అన్బుతన్బాల్ శెయ్ దాలుమ్ అమ్బుయైకోన్ ఇన్బ మిగు
విణ్డాడు తానళిక్క వేణ్డియిరాన్ ఆదలాల్
నణ్డాఱ్ అవర్ గళ్ తిరునాడు॥
తమ యొక్క ఆచార్యుని తిరువడి యందు ఎవరికి భక్తి లేదనిన, అతను పెరియ పిరాట్టితో కూడిన తనయందు ఎంత భక్తి కలిగియుండినను ఎంబెరుమాన్ అతనికి తిరునాడు (మహదానందమునకు నెలవైన)/పరపదమునందు స్థానమిచ్చుటకు అనుమతించడు. అందువలన ఈ విదముగా ఆచార్య భక్తి లేనివాడిని పిరాట్టి, చేతనుల దోషములను కప్పిపుచ్చి ఎంబెరుమానునకు, పురుషకారము/సిఫారసు చేసినను స్వీకరించడని కృపచేయుచున్నారు.
పాశురము 61
సదాచార్య సంబంధము కలిగినవారికి శ్రీయఃపతియైన సర్వేశ్వరుడు తానే పరమపదప్రాప్తి అనుగ్రహిస్తాడని కృపచేయుచున్నారు.
ఞానమ్ అనుట్టానమ్ ఇవై నన్ఱాగనే యుడైయ
నాన గురువై అడైన్దక్కాల్ మానిలత్తీర్
తేనార్ కమలత్తిరుమామగళ్ కొళునన్।
తానే వైగున్దమ్ తరుమ్॥
విశాల భూమండల వాసులారా! అర్థ పంచక విషయముల సత్య జ్ఞానము, ఆ జ్ఞానమునకు తగిన అనుష్ఠానమును కలిగిన ఆచార్యులను శరణాగతి చేసినచో, తేనలూరుచున్న వికసిత తామర పుష్పములో నిత్యవాసము చేయునట్టి శ్రీమహాలక్ష్మికి నాథుడైన శ్రీమన్నారాయణుడు తానే స్వయమూగా అట్టి దాసులకు వైకుంఠమును ప్రసాదిస్తాడు.
ఈ పాశురములో మామునులు సదాచార్యులెలా ఉంటారనే విషయమును చాలా వివరముగా కృపచేయుచున్నారు. అర్థపంచక జ్ఞానము అనగా (ఆత్మ) తానెవరనే విషయ జ్ఞానం, ఎంబెరుమాన్ విషయ జ్ఞానం, ఉపాయ విషయ జ్ఞానం, ఉపేయ విషయ జ్ఞానం మఱియు ఉపాయ విరోధి ఎటువంటిదనే జ్ఞానం కలిగిన ఆచార్యులను కలిగి ఉండుట ఆవశ్యకము. దానిపైన ఆ జ్ఞానానుసారము ఎంబెరుమానే ఉపాయమని దృఢ విశ్వాసముతో ఉండి ఆచార్యుని మూలముగా ఎంబెరుమాన్ మరియు అచార్యనకు శరణాగతుడై ఉండి కైజ్ఞ్కర్యము చేయుటయే ధర్మమని భావించి ఉండాలి.
ఆ విధముగా ఆచార్యుని శరణాగతి చేసి అతనే గతియని దృఢ విశ్వాసముతో ఉండుటయే ఆవశ్యకమని ఈ పాశురములో కృప చేయుచున్నారు. ఈ విధముగా జీవించువారు పరమపదము చేరుటకు తమకు తాముగా ఎటువంటి ప్రయత్నము చేయనవసరము లేదు. ఎంబెరుమాన్ తనకు తానుగానే పరమపదమునకు గొనిపోవునని కృపచేయుచున్నారు. ఈ పాశురమే ప్రబంధము యొక్క సారమని తెలుపుచున్నారు.
అడియేన్ వీ.వీ.ఎల్.ఎన్. ఆచార్యులు రామానుజ దాసన్ 🙏
మూలము : https://divyaprabandham.koyil.org/index.php/2020/07/upadhesa-raththina-malai-60-61-simple/
ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి : https://divyaprabandham.koyil.org
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org