శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
పాశురము 57
ఇట్టి ఉత్కృష్ఠ గ్రంథ వైభవ ప్రాశస్త్యములను తెలుసుకొనియూ దానియందు ఈడుపాడు/ఆధరాభిమానములు లేకుండా ఉండేవారిని చూచి బాధపడుచున్నారు.
తేశికర్ పాల్ కేట్ట శెళుమ్బొరుళై చ్చిన్దైదన్నిల్
మాశఱవే యూన్ఱ మననం శెయ్ దు ఆశరిక్క
వల్లార్ గళ్ దామ్ వశనభూషణత్తిన్ వాన్ పొరుళై।
కల్లాదదు ఎన్నో కవర్ న్దు॥
ఆచార్యుల వద్ద శాస్త్రార్థములను సమగ్రముగా నేర్చుకొని చింతన చేస్తూ ఆచరణలో పెట్టి తమ మనసులో గల కామ క్రోదాది దోషములను పోగొట్టుకొను తగిన యోగ్యత కలిగియూ శ్రీవచనభూషణములోని ఉత్క్రష్ఠ అర్థములను తెలుసుకొన లేకుండుటకు కారణమేమో? వీరు శాస్త్రములను నేర్చుకొని అనుష్ఠించవలసిన మానవ జన్మము నందు జన్మించియూ ఈ గ్రంథముయందు ఆశపడక వీరు ఈ విధముగా నష్ట పోవుచున్నారు కదా!
పాశురము 58
శ్రీవచనభూషణములోని ఉత్కృష్ఠ రహస్యార్థములను ఏ విధముగా నేర్చుకోవాలనేవారలకు తగు సమాధానమును కృప చేయుచున్నారు.
శచ్చమ్ పిరదాయమ్ తాముడైయోర్ కేట్టక్కాల్।
మెచ్చుమ్ వియాక్కియై దానుణ్డాగిల్! నచ్చి
అదికారియుమ్ నీర్ వశనభూషణత్తుక్కత్త
మదియుడై యీర్ మత్తి యత్త రాయ్॥
శ్రీవచనభూషణమునకు అర్పణము చేయగల బుద్ది కలవారా! దీనికి ప్రసిద్ధమైన వ్యాఖ్యానములను ఎవరైనా కృపచేసినచో వాటిని ఎవరైనా సత్సంప్రదాయ నిష్ఠతో ఉన్నవారు, వాటిని విని పరవశిస్తారో అట్టివాటిని ఉడయవరులను ఆచార్య పరంపర మధ్యలో కలిగిన మీరూ నేర్చకోండి.
ఈ గ్రంథమునకు మామునులు చాలా సూక్ష్మమైన ఒక వ్యాఖ్యానమును కృపచేయుటకు పూర్వమే తిరునారాయణపురము నందు ఆయి జనన్యాచార్యులు మొదలగువారు వ్యాఖ్యానములను అనుగ్రహించినారు.
పాశురము 59
శ్రీవచనభూషణము నందు మఱియు తత్సమానమైన ప్రాభవముగల ఆచార్యులయందు తమకు గల అభిమానమును ఆనందపూర్వకముగా తెలుపుచున్నారు.
శీర్ వశనభూషణత్తిన్ శెమ్బొరుళై శిన్దై దన్నాల్
తేఱిలుమామ్ వాయ్ కొణ్డు శెప్పిలుమామ్ ఆరియర్ గాళ్
ఎన్దమక్కు నాళుమ్ ఇనిదాగా నిన్ఱదు ఐయో।
ఉన్దమక్కు ఎవ్విన్బం ఉళదామ్॥
ఆచార్యులారా! శ్రీ వచన భూషణము నందు గల ఉత్క్రష్ఠ అర్థములను మనసారా అనుభవించినను, నోరారా ఉచ్ఛరించినను తనకది ఎల్లలేని ఆనందమును కలిగించును. మీకు ఎటువంటి ఆనందానుభూతి కలుగుచున్నదో? ఆళ్వార్లు ఎంబెరుమానును ఆరావముదము (అతృప్తాఽమృతము)గా అనుభవించినారు. ఆచార్యులు ఆళ్వార్లను వారి అరుళచ్చెయళ్ళను ఆరావముదముగా అనుభవించినారు. మామునులు శ్రీవచనభూషణమును ఆరావముదముగా అనుభవించుచున్నారు.
అడియేన్ వీ.వీ.ఎల్.ఎన్. ఆచార్యులు రామానుజ దాసన్ 🙏
మూలము : https://divyaprabandham.koyil.org/index.php/2020/07/upadhesa-raththina-malai-57-59-simple/
ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి : https://divyaprabandham.koyil.org
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org