శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః
అల్పాపి మేన భవదీయపదాబ్జభక్తిః శబ్దాదిభోగరుచిరన్వహమేధతే హా |
మత్పాపమేవ హి నిదానమముష్య నాన్యత్ర తద్ద్వారయార్య యతిరాజ దయైక సింధో ||
ప్రతి పదార్థము:
దయైక సింధో = సముద్రమంతటి దయ కలవాడా
ఆర్య = ఆచార్య
యతిరాజ = యతులకు రాజువంటి వాడా
మే = దాసునికి
భవదీయపదాబ్జభక్తిః = తమరి శ్రీపాదముల మీద స్థిరమైన భక్తిని
అల్ప అపి = కొంచము కూడా
న = లేదు
శబ్దాది భోగ రుచి = శబ్దాది విషయములు అనగా జ్ఞానేంద్రియములకు సంబంధించిన విషయములు
అన్వహం = అపారముగా
ఏదతే = పెరుగుచున్నవి
హా = కష్టము
అముష్య = సారమైన విషయములందు ఆసక్తి లేక పోవుట, అసారమైన విషయములందు ఆసక్తి పెరుగుటకు
నిదానం = మూలకారణము
మత్పాపమేవ = దాసుడి అనాది పాపము కారణము
అన్యత్న = మరొకటి కాదు
తత్ = ఆ పాపమును
వరాయ = పోగొట్టి దాసుని రక్షించాలి
భావమ:
” నిత్యం యతీంద్ర ” అన్న నాలుగవ శ్లోకములో , దాసుని మనసు తమరి దేహము మీద చింతనతో ఉన్నతిని పొందాలి. అది తప్ప ఇతర విషయములలో విముఖమై ఉండాలని కోరుకున్నారు. ఈ శ్లోకములో తమ మనసు దానికి వ్యతిరేకముగా ఉండుటను తెలుపు తున్నారు. అంతే కాక ఆ విముఖతును , దానికి కారణమైన పాపమును పోగొట్టి కృప చూపవలసినదిగా ప్రార్థిస్తున్నారు. దయ అంగా పర దుఃఖమును చూసి తాను దుఖించుట. ” దయైక సింధో ” అన్న ప్రయోగాము వలన అల్లాంటి దయ అపారముగా సముద్రమంతగా గల వారని, సముద్రము ఎండినా ఎండవచ్చు కాని యతిరాజుల దయ మాత్రము ఎన్నటికీ తరగదు అని చెపుతున్నారు. 1. ఆర్య శబ్దము ఆచార్య శబ్దమునకు సమముగా స్వీకరించి తెలియని తత్వ రహస్యములను తెలియజేసి మోక్షార్థమును పొందుటకు అర్హులను చేయు యతిరాజులకు అన్వయము. 2. ఆరాద్యాతి ఇతి ఆర్యః అనే వ్యుత్పత్యర్థము వలన వేదవిహితమైన సన్మార్గములో నడచుట, దానికి వ్యతిరేకమైన దారికి దూరముగా వుండుట అన్న అర్థముతో యతిరాజులు పరమ వైధికులని బోద పడుతున్నది. 3. అర్యతే- ప్రాప్యతే -ఆశ్రయింప బడుట ” అన్న అర్థము వలన మొక్షార్థమై అందరి చేత ఆశ్రయింప బడుతున్నారని బోద పడుతున్నది. ధుఖఃమును ఆమును సూచించు ” హా ” అన్న ఆశ్చర్యార్దకము తగిన విషయములఓ ఆశక్తి లేకుండుట, తగని విషయములఓ ఆశక్తిని కలిగి వుండుట తమకు ధుఖః హేతువని అంటున్నారు. అంతే కాక అల్ప సంతోషము నిచ్చే శబ్దాది విషయములలో ఆశక్తి వుండుట , అపరిమితానందమును ఇచ్చు యతిరాజుల శ్రీపాదముల మీద ఆశక్తి లేకుండుట తమను ఆశ్చ్రర్యానికి గురి చేస్తున్నదని రెండు అర్థాలను చెపుతున్నారు. దీనికి హేతువు ఏమిటంటే ” మత్పాపమేవ హి నిదానాం ” నా పాపమే కారణము అంటున్నారు. అనగా మునుపు భాగవతద్వేషము కలిగి వుండుట , భాగవతుల గోష్టీలో చేరక ముందు చేసిన పాపములను యతిరాజులు వారి శతృవుల మీద ప్రయోగిస్తారు. దాసుడిది అలా ప్రయోగించబడిన పాపము కాదు. దాసుడే చేసిన పాపము కాని మరొకటి కాదు, ” అన్యత్ న ” .సర్వేశ్వరుడు తన స్వతంత్రము చేత దాసుడితో ఆటలాడుట వలననో ,దాసుడు తగని వస్తువు లందు ప్రీతిని, తగిన వస్తువు లందు అప్రీతిని, కలిగివుండ లేదు. నా పురాకృత పాపమే కారణము అని అంటున్నారు.
అడియేన్ చూడామణి రామానుజ దాసి
మూలము: https://divyaprabandham.koyil.org/index.php/2015/10/yathiraja-vimsathi-tamil-slokam-6/
పొందుపరిచిన స్థానము: https://divyaprabandham.koyil.org
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org