శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః
వృత్య పశుర్నరవపుస్త్వహమీదృశౌఅపి శృత్యాదిసిద్వనిఖిలాత్మగునాశ్రయో అ యం |
ఇత్యాదరేణ కృతినోపి మిథః ప్రవక్తుం అద్యాపి వంచనపరౌఅత్ర యతీంద్ర!వర్తే ||
ప్రతి పదార్థము:
ఓ యతీంద్ర = ఓ యతిరాజా
వంచనపరః = పరులను వంచనచేయు వాడను
అహం = నేను
నరవపుః = మానవ రూపములో నున్న
పశువః = పశువును
వృత్త్య = దాసుడి వృత్తము ( తినుట,నిద్రించుట,మైధునము,భయము మొదలైన వాటిలో పశువుకు మనిషికి భేదము లేదు )వలన మనిషిగా
జ్ఞాయే = గుత్రింపబడుచున్నాను
ఈదృశః అపి = ఇలాంటి వాడినైనప్పటికి
శృత్యాదిసిద్ద నిఖిలాత్మగుణాశ్రయః = వేదము మొదలైన సకల శాస్ర్తములచే తెలుపబడిన ఆత్మగుణములు మూర్తీభవించిన
అయం = ఈ మణవాళమామునులనే
ఇతి = అయినందున
కృతినోపి = పామరులునే కాదు పండితులను
ఆదరేణ = ఆదరణతో
మిథః = పరస్పరము
ప్రవక్తుం = బోదించుటకు
అత్ర అపి = ఈ శ్రీరంగములో మరెక్కడ కాదు
అద్య = ఇప్పుడు
వర్తే = వేంచేసి వున్నారు
తత్వరాయ = పరులను వంచనచేయు గుణమును పారద్రోలి అనిగ్రహించాలి
భావము:
అహింస, సత్యవచనము ,కౄర కర్మములు చేయకుండుట, సుచిగా వుండుట, దయ, దాన గుణము కలిగివుండుట, ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము జ్ఞానము మొదలైనవి వేదములో వివరింపబడిన ఆత్మ గుణములు. వీరు ఈ గుణములన్నీ కలిగి వున్నారని చెపితే మరి కొందరు కూడా ఆకోవలోకి వస్తారని శోధన చేసి ఆత్మ గుణములకు నిలయము ఈ మణవాళమహామునులు ఒక్కరే అని చెప్పటము వలన సంతోషము కలుగుతుందని అంటున్నారు . నాలుగవ పాదములో అపి అన్న పదానికి అత్ర అని జోడించటము చేత దోషములే లేని నాధమునులు, యామునా చార్యులు , మరెందరో పూర్వాచార్యులు నివసించిన ఈ శ్రీరంగములో దాసుడు కూడా నివాసముంటున్నాడు. ఇంత కంటే దోషము మరొకటి కలదా ! పరులను వంచనచేయు గుణమును పారద్రోలి అనిగ్రహించాలి అని కోరుతున్నారు .
అడియేన్ చూడామణి రామానుజ దాసి
మూలము: https://divyaprabandham.koyil.org/index.php/2015/10/yathiraja-vimsathi-tamil-slokam-7/
పొందుపరిచిన స్థానము: https://divyaprabandham.koyil.org
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org