కణ్ణినుణ్ శిరుతాంబు – 8 – అరుళ్ కొణ్డాడుం

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

కణ్ణినుణ్ శిరుతాంబు

<< పాశురం 7

githacharya-nammazhwarగీతాచార్య – నమ్మాళ్wఆర్

అవతారిక:

నంజీయర్   అభిప్రాయము :

వేదమును అనుగ్రహించి  చేతనులకు  చేసిన  భగవంతుని కృప  కంటే  తిరువాయ్ మొళిని అనుగ్రహించిన నమ్మాళ్వార్లు కృప  గొప్పదని  మధురకవులు  ఈ  పాశురములో  పాడుతున్నారని నంజీయర్ల అభిప్రాయము.

నంపిళ్ళై

మధురకవులు ఈ పాశురములో   “నమ్మాళ్వార్ల కీర్తిని పాడుతాను”   అని అంటున్నారని  నంపిళ్ళై మరియు పెరియవాచ్చాన్ పిళ్ళై ఎత్తి చూపుతున్నారు, ఎందుకనగా నమ్మాళ్వార్ల  కృప  తత్వ త్రయము  కంటే  గొప్పది (చిత్, అచిత్ , ఈశ్వర )

అళగియ మణవాళ పెరుమళ్ నాయనార్ల అవతారిక:

మధురకవులు  నమ్మాళ్వార్ల కృపను పాడుతున్నారు. “అందరూ భగవంతుడి కృపను   గొప్పచేసి చెప్పుతుండగా  మీరు మాత్రము  నమ్మాళ్వార్ల  కృపను  గొప్ప చేసి  పాడుతున్నారు ఎందుకు? ” అని అడగగా, దానికి మధురకవులు  భగవంతుడి కృప మోక్షము పొందటానికి ఉపకరిస్తుంది. కాని మోక్షమును   పొందటానికి ముందుగా  కావలసిన  ఙ్ఞానము  పొందాలి.  అది  నమ్మాళ్వార్లు  ఇస్తారు.  అందువలన నమ్మాళ్వార్ల  కృప అన్నింటికంటే గొప్పదని  జవాబిచ్చారు. మోక్షప్రాప్తి  ఙ్ఞానము మీద అధారపడింది.  ఙ్ఞానము మాత్రము లక్ష్యము మీద ఆధార పడదు. .  మోక్షమును  పొందటానికి  ముందే  ఙ్ఞానమును  పొందాలి.

4వ  పాశురములో  మధురకవులు తన  దోషాలను  చెప్పుకున్నారు.  5వ పాశురములో తన దోషాలను రెండు  విధాలుగా ( ఆత్మ స్వాతంత్ర్యము కలిగినదనియు మరియు ప్రాపంచిక భోగములను అనుభవించటుకును ) చెప్పుకున్నారు. 7వ పాశురములో నమ్మాళ్వార్లు తన దోషాలను, అవరోధాలను  తొలగించారని చెప్పారు. ఈ పాశురములో నమ్మాళ్వార్లు తన దోషాలను, అవరోధాలను ఎట్లు తన దోషాలను నిశ్శేషముగా పోగొట్టారని చెప్పుతున్నారు.

*దేహమే ఆత్మ అనియు మరియు ప్రాపంచిక భోగములను అనుభవించట(ఆత్మ స్వరూపం కానివి) అను అడ్డంకులు నిజమైన ఆత్మ ఙ్ఞానము వలన మరియు భగవంతుడికి , ఆత్మ కు ఉన్న సంబంధము ఙ్ఞానము  (అధ్యాత్మ ఙ్ఞానము/విద్య) వలన తొలిగిపోతాయి. ఙ్ఞానము  వలన  కర్మ పెరగకుండా వుంటుంది .అప్పటికే చేకూర్చబడిన కర్మ తొలగిపోతుంది. మరిన్ని కర్మములు చేయు వాంఛను ఆచార్యులు తొలగిస్తారు , ఉన్న కర్మను భగవంతుడు పోగొడ్తారు, ఆచార్యులు నిజమైన  ఆత్మ ఙ్ఞానము  ఇవ్వడము వలన భగవంతుడు కర్మను తొలగిస్తాడు.

పాశురము

అరుళ్ కొణ్డాడుం అడియవర్ ఇంబుఱ

అరుళినాన్ అవ్వరుమఱైయిన్ పొరుళ్

అరుళ్ కొణ్డు ఆయిరం ఇన్ తమిళ్పాడినాన్

అరుళ్ కణ్డీర్ ఇవ్వులగినిల్ మిక్కతే

ప్రతి పదార్థము:

అరుళ్ కొణ్డాడుం = పరమాత్మ కృపను పొగుడుతున్నారు

అడియవర్ =  భక్తులు

ఇంబుఱ = ఆహ్లాదము  కలిగించు

అ అరుమఱైయిన్ పొరుళ్ = ఆ అసాధారణమైన (గ్రహించుటకు కష్టమైన) వేద సారము

అరుళినాన్ = కృపచేస్తాడు

అరుళ్ కొణ్డు = అపారమైన దయతో

ఇన్ తమిళ్  = సుందరమైన తమిళము లో

ఆయిరం = – తిరువాయ్ మొళి వేయి పాశురములు

పాడినాన్ = పాడారు

అరుళ్ కణ్డీర్ = కేవలము వారి దయ మాత్రమే

ఇవ్వులగినిల్ = ఈ లోకములో

మిక్కతే = ఔన్నత్యము

భావము:

ఈ లోకములో  అపారమైన దయతో నమ్మాళ్వార్లు వేయి  పాశురముల  తిరువాయ్ మొళిలో  వేదములోని సారమును కృపచేసారు. ఇది వారి ఔన్నత్యమునకు గొప్ప ఉదాహరణ.

నంజీయరు వ్యాఖ్యానము:

*  మహాభారత శాంతి పర్వము 358.73 లో   “హ్రుష్టా:” ( శ్వేత ద్వీపములో ముక్తాత్మలు ఆనందముగా భగవంతుని గురించి పాడుతూ వుంటారు. ) అని చెప్పినట్లు, భక్తులు ఆనందముగా నిశ్చిత బుద్దితో భగవంతుని గురుంచి చింతన చేస్తూ వుంటారు.

* గీతాచార్యులైన   భగవంతుడు, కొద్దిగా తన వైపు వంగిన వారికి వేదసారమును బోధించాడు.  వేదములో రహస్యముగా   చెప్ప బడిన అర్థములను గీతలో సులభముగా  బోధించాడు. నంజీయర్  మాత్రమే  భగవత్సబంధముగా వ్యాఖ్యానము   చేసారు. తక్కిన వ్యాఖ్యాతలు   నమ్మాళ్వార్ల  పరముగానే  వ్యాఖ్యానము  చేసారు.

*భగవంతుడు అర్హులకు మాత్రమే గీతను బోధించాడు. కానినమ్మాళ్వార్లు  అనర్హులకు  కూడా వేదసారమును బోధించారు.

*భగవంతుడు రణరంగములో ఉన్న వారికి మాత్రమే  గీతను బోధించాడు.  తిరువాయ్ మొళి  1.5.11 లో  “పాలేయ్ తమిళర్  ఇశైకారర్  పత్తర్ పరవుముం  ఆయిరం” అన్నట్లు ( తమిళము మాట్లాడగల వారు, కవులు, గాయకులు, భక్తులు తిరువాయ్ మొళి  వేయి పాశురములను ఆశ్రయించి  పాడి, మాట్లాడి, ఆడి సంతోషిస్తారు )అందరికి అందుబాటులో * తిరువాయ్ మొళి 9.4.9 లో “తొణ్డర్కముదుణ్ణ చ్చొల్ మాలైగళ్” ( భక్తులకు అమృత సమమైన పాశురములు) అన్నది అక్షర సత్యము.

* నంపిళ్ళై ఈడు వ్యాఖ్యానము:

*అరుళ్ కొణ్డాడుం   అడియవర్  –  భగవంతుడి  కృపను నమ్మాళ్వార్లు   కృపతో  పొలుస్తారు.  కాని  నమ్మాళ్వార్లు  తిరువాయ్  మొళి 8.8.3  “అతువుం అవనతు ఇన్నరుళ్”(అది కూడా వాడి కరుణయే)  అని తిరువాయ్ మొళి 10.6.1 “అరుళ్ పెఱువార్ అడియార్”( భగవంతుడి కృపను పొందిన వారు భాగవతులు) అని పాడారు.

*అరుళ్ కొణ్దు –  తిరువాయ్ మొళి 1.1.1 “మయర్వఱ మదినలం అరుళినన్”  అన్నట్లుగా వారుగా ఏదీ పాడలేదు . భగవంతుడు కృప చేసిన మేరకే  వారు తిరువాయ్ మొళి 7.9.4 “ఎన్నాగియే తప్పుతలిన్ఱిత్ తనైక్కవి  తాన్ శొల్లి”( దాసుడిద్వారా భగవంతుడు తన ఔన్నత్యములను పాడారు). నమ్మాళ్వార్లు  ఈ పాశురములను  పాడిన  తరవాత  అపార ఆనందమును అనుభవించారు.

*ఇంతమిళ్ పాడినాన్  – ఎంతో క్లిష్ట విషయములను తమిళములో పాడారు.

*ఇవ్వులగినిల్ మిక్కతే  –  చిత్,  అచిత్, ఈశ్వరుడు అను తత్వత్రయముల కంటే  గొప్పది.

 పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానము:

*అరుళ్ కొణ్డాడుం అడియవర్ – భగవంతుడి  కృపను నమ్మళ్వార్లు తిరువాయ్ మొళి  8.8.3  “అదువుం  అవనతు ఇన్నరుళ్”( అది కూడా ఆయన కృప) అన్నారు. తొణ్డరడిప్పొడి ఆళ్వార్లు  తిరుమాలై-46 లో  “ఆనైక్కన్ఱు అరుళై ఈంద”(ఆ రోజు గజేంద్రుడికి కృపను చూపిన) అని, పూదత్తాళ్వార్లు  ఇరణ్డాం తిరువందాది-56  “అరుళ్ పురింద సిందై” (భగవంతుడి దయాపూరితమైన చింతన) అని,  పెరియాళ్వార్లు  పెరియాళ్వార్ తిరుమొళి  5.4.1 లో “నిన్నరుళే పురింతిరుంతేన్” (నీ దయను మాత్రమే కోరుతున్నాను) అని, పేయాళ్వార్లు మూన్ఱాం తిరువంతాది-16 లో “అరుళా తొళియుమే”(ఎల్లప్పుడు  దయామయుడు) అని, తిరుమంగై ఆళ్వార్లు  “ఆళియానరుళే”(చక్రపాణి కృప) అని, భగవంతుడి ప్రసాద గుణమును కొనియాడారు.

*అరుమఱై –  వేదములోని అర్థములను తెలుసుకోవటము కష్ఠ సాధ్యము. దానిలోని సారము (రహస్య భాగము) ఉపనిషత్తులు.  సత్త్వగుణము గల వారు మాత్రమే ఉపనిషత్సారమును తెలుసు కోగలరు. వారి ధనము ఉపనిషత్ ఙ్ఞానము.  అది భగవంతుడి కృప వలన లభిస్తుంది. అటువంటి ఙ్ఞానము  (ఇంబుఱ)  బ్రహ్మ సూత్రం 1.1.15లో “తత్తేతు వ్యపదేసాచ్చ”( జీవాత్మ  వైయుక్తికము )అని చెప్పినట్ల్లుగా,  ఆ  ఆనందము వ్యక్తి  అనుభవమును  బట్టి  మారుతూ వుంటుంది.

*ఆయిరం  ఇన్  తమిళ్ పాడినాన్  – తిరువాయ్ మొళిలోని  ఒక్క పాశురము చాలు.  కాని నమ్మళ్వార్లు ఆత్మ ఉజ్జీవనము కోసము  వేయి  పాశురములు పాడారు.  దానిలో ఎన్నో క్లిష్ఠమైన అర్థాలు, సూత్రాలు, ఇమిడ్చి సామాన్యులు అర్థము చేసుకునే  రీతిలో  కూర్చారు.

*పాడినాన్ అరుళ్ కణ్డీర్ – నమ్మాళ్వార్ల  కృప,   భగవంతు డి కృప కన్నా గొప్పది.  భగవంతుడు   వదిలి  వేసిన జీవాత్మలను  కూడా  ఈయన  ఉజ్జీవింప చేశారు.

 అళగియ మణవాళ పెరుమళ్ నాయనార్ వ్యాఖ్యానము:

* అరుళ్ కొణ్డాడుం అడియవర్ ఇంబుఱ  –   నమ్మళ్వార్లు   తిరువాయ్ మొళి  సాత్వికుల  కోసము పాడారు.  భగవంతుడి తృప్తి కోసము కాదు.

*అడియవర్ –  దాసులు- శేషత్వ ఙ్ఞానము కల వారు. శేషత్వ ఙ్ఞానము కైంకర్య ప్రాప్తినిస్తుంది.

*అరుళ్ కొణ్డాడుం అడియవర్ –  -కైంకర్యమునకు భగవంతుడి కృప సాధనమని  కొందరు  అనుకుంటారు.  కృప ఉపాయము,  కైంకర్యము  పురుషార్థము.  ఎవరైతే భగవంతుడి కృప  గొప్పదను కుంటారో వారు  ఆ కృపనే  గొప్పచేసి పాడతారు.  భగవంతుడికి అనేక గొప్ప గుణములున్నా కృప ప్రధానమైనది.  దేవతాంతరములకన్నా భగవంతుడు ఎలా గొప్పవాడో, కృప కూడా ఇతర  గుణముల కన్నా గొప్పది.  ఇది లేనిదే  మిగిలిన  గుణములు  ప్రకాశించవు.

*భగవంతుడి కృప శక్తుడికి (కర్మ,ఙ్ఞాన, భక్తి యోగములు చేయగల వాడు) , అశక్తుడికి (శరణాగతి చేసిన వాదు) కూడా కావాలి.  కర్మ,ఙ్ఞాన, భక్తి  యోగములు చేయగల వాడి కృషిని  భగవంతుడు చూస్తాడు. వారిపై  కృపను చూపి , కోరికలను తీరుస్తాడు.  ప్రపన్నులకు  ఆకించన్యమును  చూసి  కృపను చూపుతాడు.

*భగవంతుడు కృపను చూపడానికి  రెండు   ప్రమాణములను సూచించారు. పెరియ తిరువంతాది  26 లో నమ్మళ్వార్లు “అరుళెన్నుం తణ్దు” (కృప అనే కర్ర) అని,  తిరుమంగై ఆళ్వార్లు,  పెరియ తిరుమొళి  6.2.4లో  “అరుళెన్నుం ఒళ్ వాళ్” ( కృప  అనే  కత్తి )  అని పాడారు.   నమ్మళ్వార్లు  బ్రాహ్మణ్యము  కలవారు  కావటము  చేత  కర్ర  అన్నారు.  కాని  తిరుమంగై  ఆళ్వార్లు   క్షాత్రము  కల వారు  కావటము  చేత కత్తి  అన్నారు.  అరుంపదములో,  నమ్మళ్వార్ల  ప్రశాంత  ప్రకృతి  వలన వారిని  బ్రాహ్మణ అని చెప్పినట్లు వివరించటము జరిగింది.

*ఇంబుఱ – భగవంతుడి  కృపకు  ఆయన  అనుగ్రహము  కావాలని  సాత్త్వికులకు  తెలుసు.  వారు  నమ్మళ్వార్ల అనుగ్రహము కూడా పొందుటకు  ఆనందపడతారు.

*అరుమఱైయిన్  పొరుళ్  –  మఱైయిన్  అరుం  పొరుళ్ (వేదము  యొక్క  రహస్యార్థములు ). -కృప ఉపాయము  కైంకర్యము  పురుషార్థము.

*పొరుళై అరుళినాన్ –నమ్మళ్వార్లు  వేదమును  అనుగ్రహించక  పోతే (వారి వర్ణం వలన) చతుర్థవర్ణము వారు (శూద్రులు ),  వేదమును పాడుకోలేక  పోయేవారు. వారు   అనుగ్రహించటము  వలన అందరూ పాడుకోగలుగు తున్నారు.

*ఆయిరం ఇంతమిళ్  పాడినాన్  –   ప్రణవము  అతి  సంక్షిప్తమైనది.  మహాభారతము   అతి విస్తారమైనది. తిరువాయ్ మొళి  అతి  సంక్షిప్తము  కాక  అతి  విస్తారము  కాక  సులభమైన  తమిళములో  వేయి  పాశురములు కలది.

* పాడినాన్   – వేదము  అపౌరుషేయము.  దానిని  సప్రమాణముగా  నమ్మళ్వార్లు పాడారు.  ఏ ఒక్కరో  నిగ్రహము లేకుండా  పాడితే  సప్రమాణముగా   ఉండేదో  లేదో?  నమ్మళ్వార్లు తిరువాయ్ మొళి  7.9.3 లో  “ఆం ముదల్వన్ ఇవనెన్ఱు తఱ్ఱేఱ్ఱి  ఎన్  నా   ముతల్  వందు పుగుందు  నల్లి  కవి  తూముతల్  పత్తర్కు త్తాన్  తన్నైచ్చొన్న ఎన్ వాయ్ ముతల్ అప్పనై” (ఆ పరమాత్మ  దాసునికి  ఙ్ఞానము నిచ్చి,  నాలుకపై  కూర్చుండి,  ముముక్షువులు   ఆనందించే అమృతోపమానమైన   పాశురములను  పాడారు ) అందు వలన  ఇది సప్రమాణమైనది.

*అరుళ్ కణ్డీర్ ఇవ్వులగినిల్ మిక్కతే  – నమ్మళ్వార్ల  కృప  గొప్పదని,  ఈ  లోకములో  అందరికీ  తెలిసిన విషయము. పాశురము  కాదు, ఎవరు రాశారని  కాదు,  ఎవరు  కృపతో  తిరువాయ్ మొళి  రాయటానికి  నమ్మళ్వార్లను అనుగ్రహించారని  కాదు,  అన్నిటి కంటే నమ్మళ్వార్ల  దయ చాలా గొప్పది.

* ఇంతమిళ్ పాడినాన్… –. గీతను ఇచ్చిన  భగవంతుడిది  దయ  కాదు.  కృపతో   తిరువాయ్ మొళి   ఇచ్చిన  నమ్మళ్వార్లదే  దయ.

*ఇంతమిళ్ పాడినాన్   అరుళ్ కణ్డీర్   ఇవ్వులగినిల్  మిక్కతే  – తిరువాయ్ మొళి  10.6.11  “కేట్టారార్ వానవర్గళ్ శెవిక్కినియ సెంచొల్” ( పరమపద వాసులు కూడా తిరువాయ్ మొళిని మళ్ళీ మళ్ళీ వినాలని కోరుకుంటారు.) అని నమ్మళ్వార్లే  పాడారు. ఈ సంసారము  నమ్మళ్వార్ల కృపతో  నిండి   వున్నది.

*ఆయిరం… –  గీతను చెప్పిన  కృష్ణుడి పేరు వినగానే  ఎవరూ  అంజలి ఘటించడము లేదు.  కాని తిరుక్కురుకూర్ అని వినగానే   అంజలి ఘటిస్తారు (తిరువాయ్ మొళి సేవాకాలంలో ప్రతి దశకము చివర తిరుక్కురుకూర్ అని అనగానే అందరూ   తప్పక  అంజలి  ఘటిస్తారు).

*కణ్డీర్  – శాస్త్రము సహాయముతో భగవంతుడి కృపను తెలుసుకో గలము.  కాని నమ్మళ్వార్ల  దయను పరమపదమునకు  పోకుండానే ఇక్కడే  ఈ లోకములోనే   ప్రత్యక్షముగా  చూడగలము.

అడియేన్ చుడామణి రామానుజ దాసి

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/02/kanninun-chiru-thambu-8-arul-kondadum/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
pramAthA (preceptors) – http://guruparamparai.wordpress.com
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org

Leave a Comment