కణ్ణినుణ్ శిరుతాంబు – 4 – నన్మైయాల్

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

కణ్ణినుణ్ శిరుతాంబు

<< పాశురం 3

nammalwar-art

అవతారిక:

ప్రతి పాశురము కిందటి పాశురమునకు కొనసాగింపుగా అమరింది.
నంజీయర్ 

* నంజీయర్ ,  నమ్మాళ్వార్లు, పరమాత్మ, ఎందరో మహాత్ములు కూడా వదిలి వేసిన మధురకవి ఆళ్వార్లను స్వీకరించటానికి చేసిన ఉపకారమును వివరిస్తున్నారు. మధురకవి ఆళ్వార్లు దీనికి తమ గుణలోపములే కారణముగా అభిప్రాయ పడుతున్నారు.

నంపిళ్ళై:

* నమ్మాళ్వార్లు మధురకవి ఆళ్వార్లను అనుగ్రహించక ముందు స్థితిని చెపుతున్నారని నంపిళ్ళై అభిప్రాయ పడుతున్నారు.

పెరియవాచ్చాన్ పిళ్ళై

* మధురకవి ఆళ్వార్లు మొదట భగవంతుడితో సంబంధము (పాశురము-1) వద్దనుకున్నారు. తరువాత (పాశురము-3) భగవంతుడితో సంబంధమును కోరుకున్నారు అని పెరియవాచ్చాన్ పిళ్ళై అభిప్రాయ పడుతున్నారు. నమ్మాళ్వార్ల అనుగ్రహమును పొందాలంటే ఆయనకు ప్రియమైన భగవంతుడుని కూడా ఇష్టపడాలి కదా అని మధురకవి ఆళ్వార్లు భావించారని వీరు చెపుతున్నారు.

అళగియ మణవాళ పెరుమళ్ నాయనార్:

*మధురకవి ఆళ్వార్లకు కిందటి పాశురములో తన హృదయమును ఆవిష్కరించి తమకు నమ్మాళ్వార్లకు ఉన్న సంబంధమును తెలియజేసారు. ఋషులు, ఆళ్వార్లు ఈ చరాచర జగత్ కు   మాతాపితలు శ్రీమన్నారాయణుడే అని ఘోషిస్తుండగా మీరు మాత్రము నమ్మాళ్వార్లను ఎందుకు ఆశ్రయించారని అడిగారు. నా నీచత్వము వలన ఋషులు, ఆళ్వార్లు నన్ను వదిలివేశారు. కాని నమ్మాళ్వార్లు మాత్రము నా నీచత్వమునే గుణముగా భావించి అనుగ్రహించారన్నారు అని  అళగియ మణవాళ పెరుమళ్ నాయనార్  అనుగ్రహించారు.

పాశురము:

నన్మైయాల్ మిక్క నాన్మఱైయాళర్గళ్

పున్మైయాగక్ కరుతువర్ ఆతలిల్

అన్నైయాయ్ అత్తనాయ్ ఎన్నై ఆణ్దిదుం తన్మైయాన్

శటకోపన్ ఎన్ నంబియే
ప్రతి పదార్థము:

నన్మైయాల్ మిక్క = సుగుణములతో నిండిన

నాన్మఱైయాళర్గళ్ = ద్రావిడ వేద(నాలాయిర దివ్య ప్రబంధము) పారంగతులు

ఎన్నై = నన్ను

పున్మైయాగక్ కరుతువర్ ఆతలిల్ = అన్నీ చెడు లక్షణములను కలిగి వున్న నన్ను)పాలించే

అన్నై ఆయ్ = తల్లిలా

అత్తన్ ఆయ్ = తండ్రిలా

ఎన్నై ఆణ్డిడుం తన్మైయాన్ = నన్ను పాలించే గుణమున్న

శటకోపన్ = నమ్మాళ్వార్

ఎన్ నంబి = నా స్వామి
భావము:

సుగుణములతో నిండిన ద్రావిడ వేద(నాలాయిర దివ్య ప్రబంధము) పారంగతులు, (దాసుని)అన్నీ చెడు లక్షణములను కలిగి ఉన్న నన్ను, తల్లిలా తండ్రిలా పాలించే గుణమున్న నమ్మాళ్వారే నా స్వామి.

నంజీయర్ వ్యాఖ్యానము:

“నన్మైయాల్ మిక్క నాన్మఱైయాళర్గళ్” అంటే “పరదుఃఖ అసహిష్ణు పరసమృధ్ధి ఏక ప్రయోజనం”. మనసు, హృదయము పరిశుద్ధముగా ఉన్నవారు ఆచరించే విధానము ఇది. కూరత్తాళ్వాన్, ఆణ్దాళ్(కూరత్తాళ్వాన్ల ధర్మపత్ని),శ్రీమహాలక్ష్మి వంటివారు.

*“అన్నైయాయ్ అత్తనాయ్” – మాతా, పితా, ఆచార్య సంబంధమును తెలియ జేస్తున్నారు. మాతా-ప్రియమును, పితా-హితమును, ఆచార్యులు-పురుషార్థమును కోరుకుంటారు.

*“ఎన్ నంబి”- నమ్మాళ్వార్లు తనను పరిశుధ్ధము చేసుకోవటమే కాక నన్ను కూడా పరిశుధ్ధ పరచగలిగిన సమర్ధులు.

నంపిళ్ళై ఈడు వ్యాఖ్యానము:

*సకల నీచగుణ సమాహారమైన నన్ను నమ్మాళ్వార్లు తప్ప అనుగ్రహించగలవారు వేరెవరు ఉన్నారు.

* కాకాసురుడు సీతాపిరాట్టి పట్ల అపచారము చేసినప్పుడు శ్రీరాముడు ఒక గడ్డిపోచను బ్రహ్మాస్త్రముగా మంత్రించి ప్రయోగించినప్పుడు, కాకాసురుని ముల్లోకములలో ఎవరూ కాపాడలేక పోయారు. ఆఖరికి శ్రీరాముడే క్షమించి రక్షించాడు. అలాగే నమ్మాళ్వార్లు మాత్రమే దాసుడిని అనుగ్రహించగల వారు.

*నమ్మాళ్వార్లు తిరువాయ్ మొళి 2.3.2 లో “తాయాయ్ త్తందైయాయ్ అఱియాదన అఱివిత్త అత్తా” అన్నారు. మధురకవి ఆళ్వార్లు నమ్మాళ్వార్లను అలా భావించారు.

పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానము:

*వీరి వ్యాఖ్యానము నంపిళ్ళై వ్యాఖ్యానమును పోలి వుంటుంది.

* వేదము నుండి ఉట్టంకించటమంటే వేదమును అర్థము చేసుకొని అనుభవించిన వారని కదా అర్థము. వారిని “ఆనృసంశ్య ప్రధానర్” అంటారు. అనగా ఈ సంసారము నుండి ఉధ్ధరించు వారు.

*“శఠకోపులు” అంటే జననకాలములో “శఠము” అనే వాయువుపై కోపించిన వారు. ఆ “శఠము” అనే వాయువు జీవాత్మలోని ఙ్ఞానమును పోగొట్టి అఙ్ఞాన కూపములో పడవేస్తింది. అటువంటి “శఠము” అనే వాయువుపై కోపించిన “శఠకోపులు” తనలోని అఙ్ఞానమును కూడ తొలగించగల వారని గ్రహించిన మధుర కవులు పై మూడు పాశురములలో నమ్మాళ్వార్లను “కురుకూర్ నంబి” అని పాడినవారు ఈ పాశురములో “శఠకోపులు” అని పేర్కొనటము విశేషము.

అళగియ మణవాళ పెరుమళ్ నాయనార్ వ్యాఖ్యనము:

* నమ్మాళ్వార్లు “నలత్తాల్ మిక్కార్” తిరువాయ్ మొళి 5.8.3 (మంచి గుణముతో నిండిన) అన్నారు. ఇక్కడ మధురకవి ఆళ్వార్లు “నన్మైయాల్ మిక్క” (మంచి గుణముతో పాటు దయాగుణము కూడా నిండిన వారు) అన్నారు. సీతా పిరాట్టి రాక్షస స్త్రీల పై కరుణను చూపమని హనుమతో చెప్పింది. కూరత్తాళ్వాన్ పెరుమాళ్ళను నాకు అనుగ్రహించినదే నాలూరాన్ ను (తన శిష్యుడు తన కండ్లు పోవటానికి కారణమైన వాడు) కూడా అనుగ్రహించాలని కోరారు. ప్రహ్లాదుడు కూడ తనను హింసించిన రాక్షసులపై దయను చూపాడు.

*“నన్మైయాల్ మిక్క నాన్మఱైయాళర్గళ్” –వేదమును అధ్యయనము చేయటము వలన పొందిన కారుణ్యము. “మాతా పితా సహస్రేభ్యో వత్సలతరం శాస్త్రం” (శాస్త్రం మాతా పితల కంటే వేయి రెట్లు రక్షణను ఇస్తుంది.)

*మధురకవులు తనలో అపారమైన కళంకము నిండి ఉన్నదని భావించటము చేత మహాఙ్ఞానులు కూడా వదిలివేశారని బాధపడు తున్నారు.

*శ్రీవైకుంఠ స్తవము 2వ శ్లోకములో “యద్వా శరణ్యం అశరణ్య జనస్య పుణ్యం” (మరెవరు లేని వారికి ఆ  యాదవుడే శరణ్యము) అన్నట్లుగా నమ్మళ్వార్లు, మధురకవులును అందరూ వదిలివేసినా  స్వీకరించారు.

*“ఎన్నై ఆణ్డిడుం తన్మైయాన్” –నమ్మళ్వార్లు చెపుతుండగా తిరువాయ్ మొళిని గ్రంథస్థము చేసే ఈ కైంకర్యము నాకు ఎంతో ఉన్నతమైనది.

*“ఎన్నై ఆణ్డిడుం” – వడక్కు త్తిరువీధి ప్పిళ్ళై (నాయనార్ల తండ్రిగారు) పొలిందు నిన్ఱ పిరాన్ –ఆళ్వార్ తిరునగరి ఉత్సవర్లను సేవించటము మరచినా నమ్మాళ్వార్లన్ సేవిస్తే సరిపోతుంది, ఎందు కంటే నమ్మాళ్వార్లే జీవాత్మలను స్వామి దగ్గరకు చేరవేస్తారు అన్నారు.

మధురకవి ఆళ్వార్ తిరువడిగలే శరణ్యం

అడియేన్ చుడామణి రామానుజ దాసి

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/01/kanninun-chiru-thambu-4-nanmaiyal/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
pramAthA (preceptors) – http://guruparamparai.wordpress.com
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org

Leave a Comment