శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:
నమ్మళ్వార్ మరియు మధురకవిఆళ్వార్
e-book: http://1drv.ms/1VeOigr
మామునులు, ఉపదేశ రత్న మాలలో, మధురకవి ఆళ్వార్ల తిరునక్షత్రమును (మేష మాసములో చిత్రా నక్షత్రము) ప్రత్యేకముగా పేర్కొన్నారు. నిజానికి వీరి తిరునక్షత్రము తక్కిన ఆళ్వార్ల తిరునక్షత్రము కంటే ప్రపన్నులైన రామానుజ సంబంధులకు చాలా ముఖ్యమైన రోజు. నమ్మాళ్వార్ల పట్ల వీరికున్న అపారమైన ఆచార్య ప్రపత్తియే దానికి కారణము. తరువాతి పాశురములో, నాలాయిర దివ్య ప్రబంధము మధ్యలో మధురకవి ఆళ్వార్ల కణ్ణినుణ్ శిఱుత్తాంబుకు పూర్వాచార్యులు స్థానము కల్పించిన కారణమును వివరించారు. ఈ ప్రబంధములో మధురకవి ఆళ్వార్ తదీయ శేషత్వమును ( భాగవత శేషత్వము) శ్రీవైష్ణవ సంప్రదాయనికే తలమానికమైన “చరమ పర్వనిష్ఠ”ను ఈ ప్రబంధములో అనుగ్రహించారు. అంతే కాక తమ ఆచార్యులైన నమ్మాళ్వార్ల శ్రీపాదాల పట్ల ఆజీవనము భక్తి విశ్వాసములతో ఉండి మనకు మార్గ నిర్దేశము చేసి చూపిన మహనీయులు.
నమ్మాళ్వార్లు, నాలుగు ప్రబంధములు అనుగ్రహించగా (తిరువాయ్ మొళి, తిరువిరుత్తం, తిరువాశిరియం మరియు పెరియ తిరువందాది) వాటిలో తిరువాయ్ మొళిలో (1102 పాశురములను ) “పయిలుం శుడరొళి” (2.7) “నెడుమాఱ్కడిమై”, (8.10) పదిగములలో మాత్రమే భాగవత నిష్ఠను పేర్కొని మిగిలిన ప్రబంధమతా ఎంపెరుమాన్ల వైశిష్ట్యాన్ని పాడారు. మధురకవి ఆళ్వార్ అనుగ్రహించినది ఒక్కటే ప్రబంధము. అది కూడ పదకొండు పాశురములు. కాని ప్రబంధము మొత్తము అచార్య నిష్ఠకే ప్రాముఖ్యతనిస్తూ పాడటము విశేషము.
ఈ ప్రబంధ ఔన్నత్యము వలన కణ్ణినుణ్ శిఱుతాంబునకు పెద్దలచే అనేక వ్యాఖ్యానములు చేయబడినవి. వీటిలో నంజీయర్, నంపిళ్ళై, పెరియవాచ్చాన్ పిళ్ళై మరియు అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ల వ్యాఖ్యానములు ప్రామాణికమైనవి. ఇవి కాక తంపిరాంపడి ( అరైయర్లు చేసిన వ్యాఖ్యానములు అరైయర్ సేవలప్పుడు ఉపయోగించేవి), ప్రతి పదార్థము, అరుంబదం (వ్యాఖ్యానములకు విస్తృతమైన విశ్లేషణలు) కూడా రచింపబడినవి.
నంపిళ్ళై-శ్రీరంగం
పెరియవాచ్చాన్ పిళ్ళై– తిరు శంగనల్లూర్
పైన తెలిపిన వ్యాఖ్యానముల సహాయము తోను ఎంపెరుమాన్, ఆళ్వార్, పూర్వాచార్యుల, అస్మదాచార్యుల అనుగ్రహముతోను తెలుగులో ఈ దివ్య ప్రబంధములోని విశేష అర్థములను తెలుసుకునే ప్రయత్నము చేద్దాము.
భగవద్విషయ(తిరువాయ్ మొళి)కాలక్షేపమునకు ముందు తిరుప్పల్లాణ్డు, కణ్ణినుణ్ శిఱుతాంబు సేవించటము సంప్రదాయము.
- తనియన్
- అవతారిక
- పాశురం 1
- పాశురం 2
- పాశురం 3
- పాశురం 4
- పాశురం 5
- పాశురం 6
- పాశురం 7
- పాశురం 8
- పాశురం 9
- పాశురం 10
- పాశురం 11
అడియేన్ చుడామణి రామానుజదాసి
ఆధారం: https://divyaprabandham.koyil.org/index.php/2015/01/kanninun-chiru-thambu/
archived in https://divyaprabandham.koyil.org
pramEyam (goal) – https://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org/
pramAthA (preceptors) – https://acharyas.koyil.org/
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org
0 thoughts on “కణ్ణినుణ్ శిరుతాంబు”