Category Archives: Arththi prabandham

ఆర్తి ప్రబంధం – 48

Published by:

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

ఆర్తి ప్రబంధం

<< ఆర్తి ప్రబంధం – 47

పరిచయము:

మునుపటి పాశురములో, భక్తులకు అన్ని రకాల కైంకర్యాలు చేయడం గురించి మాముణులు ప్రస్తావించారు. “ఇరామానుజాయ నమః” అనే మంత్రాన్ని ధ్యానించేటప్పుడు, కైంకర్యం చేయాలనే కోరికను, సంకల్పాన్ని ఎవరు ఇచ్చారో వారిని గుర్తు చేసుకుంటున్నారు. ఈ పాశురములో శ్రీ రామానుజులకు, వారి దాసులకు కైంకార్యం చేయమని, తనకు ఇంద్రియాలను, అవయవాలను అనుగ్రహించినది పెరియ పెరుమాళ్ళేనని వివరిస్తున్నారు. ఈ విషయాన్ని వారు మిక్కిలి సంతోషముతో తెలియజేస్తున్నారు.

పాశురము 48:

ఎణ్ణదు ఎన్నెంజం ఇశైయాదు ఎన్ నావు ఇరైంజాదు శెన్ని
కణ్ణానవై ఒన్ఱుం కాణలుఱా కలియార్ నలియ
ఒణ్ణాద వణ్ణం ఉలగు అళిత్తోన్ ఎతిరాశన్ అడి
నణ్ణాదవరై అరంగేశర్ శెయ్ద నలం నమక్కే!!!

ప్రతి పద్ధార్ధములు:

నణ్ణాదవరై – శరణు వేడుకోని వ్యక్తులు ఉన్నారు
ఎతిరాశన్ అడి –  శ్రీ ఎంబెరుమానార్ల దివ్య తిరువడి
అళిత్తోన్ – రక్షించారు
ఉలగు – ఈ లౌకిక
కలియార్ – కలియుగ వాసులు, మనస్సాక్షి ఉన్నవారు
నలియ ఒణ్ణాద వణ్ణం –  కలి క్రూరత్వంలో చిక్కుకోకుండా
ఎన్నెంజం – (అటువంటి వాళ్ళ పట్ల) నా మనస్సు  ఉండదు
ఎణ్ణదు – వాటి గురించి ఆలోచించు
ఎన్ నావు – నా వాక్కు
ఇశైయాదు – వారి గురించి ఉండదు, అది మాట కానీ / ప్రశంస కానీ.
శెన్ని– నా శిరస్సు
ఇరైంజాదు – తల వంచను (వాళ్ళ యందు).
కణ్ణానవై – నా కళ్ళు
ఒన్ఱుం కాణలుఱా – ఏదీ చూడను (వాటికి సంబంధించినవి).
అరంగేశర్ –  దానితో సంబంధించిన చింతన, ఇంద్రియాలను నాకు పెరియ పెరుమాళ్ళు అనుగ్రహించారు.
శెయ్ద నలం నమక్కే – ఈ ఇంద్రియాలు వేరొకరికి లోబడి ఉండవు.  శ్రీ రామానుజులు మాత్రమే వాటికి అర్హులు. ఈ గొప్ప సహాయం కేవలం నంపెరుమాళ్ళ  ఆశీర్వాదము ద్వారానే సాధ్యమైంది.

(కలియార్ నలియ ఒణ్ణాద వణ్ణం ఉలగు అళిత్తోన్ ఎతిరాశన్ – ఈ వాఖ్యానికి “క్రూరమైన కలి తీవ్రత నుండి ప్రపంచాన్ని రక్షించిన శ్రీ రామానుజ” అని కూడా అర్ధము చెప్పుకోవచ్చు.

సరళ అనువాదము:

శ్రీ రామానుజుల దివ్య పాద పద్మాలకు శరణాగతి చేయని వాళ్లని ఎదుర్కోవలసి వచ్చినప్పుడు, అతని మనస్సు, కళ్ళు, నోరు మరియు శిరస్సు అవి చేయవలసిన పనులను చేయవని మాముణులు తెలుపుతున్నారు. తన కళ్ళు వారిని చూడవు, తల వంచదు, మనస్సు ఆలోచించదు, నోరు వాళ్ళ గురించి మాట్లాడదని వివరిస్తున్నారు. పెరియ పెరుమాళ్ళు శ్రీరంగరాజుల అనంత కృపతో ఈ అనుగ్రహ అవకాశం తనకు లభించిందని కీర్తిస్తున్నారు.

వివరణ: 

“తాళ్వొన్ఱిల్లా మఱై తాళ్ందు తల ముళుదుం కలియే ఆళ్గిన్ఱ మాళ్వందాలిత్తవన్” అని ఇరామానుశ నూఱ్ఱందాది 16వ పాశురములో వివరించినట్లుగా,” క్రూరమైన కలి క్రోధము నుండి ఈ ప్రపంచాన్ని ఎంబెరుమానార్లు రక్షించారు”, అని మాముణులు వివరిస్తున్నారు. మన అంతిమ గమ్యం సాధనము రెండూ ఎంబెరుమానార్ల దివ్య తిరువడియే అని ఇరామానుశ నూఱ్ఱందాది 16వ పాశురములో “పేర్ ఒన్ఱు మఱ్ఱిల్లై” అని చెప్పబడింది. దీనిని గ్రహించక ఎంబెరుమానార్ల తిరువడి యందు శరణాగతి చేయని వారి పట్ల నా ఇంద్రియాలు మరియు అవయవాలు వేరే విధంగా ప్రవర్తిస్తాయి. “నైయుం మనం అన్ గునంగళై ఎణ్ణి”, “నిత్యం యతీంద్ర (యతిరాజ వింశతి 4)” లో వర్ణించినట్లు నా మనస్సు ఉప్పొంగి ఎంబెరుమానార్ల అద్భుత గుణానుభవంలో మునిగిపోతుంది. కానీ ఎంబెరుమానార్ల తిరువడి యందు శరణాగతి చేయని వాళ్ళ విషయానికి వస్తే, ఇంద్రియాలతో పాట్లు నా మనస్సు కూడా ఆలోచించడం, ప్రశంసించడం, మాట్లాడటం, చూడటం మానేస్తాయి. పెరియ పెరుమాళ్ళు శ్రీ రంగరాజుల దివ్య కృపయే నా ఈ ప్రవర్తనకు కారణం. “నణ్ణాదవరై అరంగేశర్ శెయ్ద నలం” తో కలిపి ఉపయోగించిన “నలం” అనగా ఇక్కడ “సంపద” అని అర్ధం. “మనః పూర్వో వాగుత్తరః” అనే వాఖ్యము ప్రకారం, మన నోటితో మన మనస్సు దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది, మన మనస్సు బుద్ది తమ ఆలోచనలను మాటల ద్వారా తెలియపరచుతాయి.  అయినప్పటికీ, “నావియల్ ఇశై మాలైగళ్ యేత్తి” అని తిరువాయ్మొళి  4.5.4 వ పాశురములో చెప్పినట్లు నా నోరు వారి గురించి మాట్లాడదు, కీర్తించదు. “ప్రణమామి మూర్ధ్నా (తనియన్ కూరత్తాళ్వాన్లు అనుగ్రహించిన)” లో చెప్పిన్నట్లుగా శ్రీ రామానుజులకు  నమస్కరిస్తున్న నా శిరస్సు ఎప్పటికీ వాళ్ళని నమస్కరించదు. “కాణ్ కరుదిడుం కాణ” అని ఇరామానుశ నూఱ్ఱదాది 102 వ పాశురములో మరియు “శ్రీ మాధవాంగ్రి” అని యతిరాజ వింశతి 1వ పాశురములో వివరించినట్లుగా, నా కళ్ళు వాళ్ళని ఎప్పటికీ చూడవు. “కాలియార్” అనే పదము కలి యుగానికి స్వరూపము. “ఏవినార్ కలియార్” అని పెరియ తిరుమొళి 1.6.8వ పాశురములో వివరించినట్లుగా, కలి ప్రభావాలు చాలా శక్తివంతమైనవి, అవి తమ హృదయాలలో భయాన్ని కలిగించి వారిని భయంతో వంచుకునేలా చేస్తాయి. 

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2017/03/arththi-prabandham-48/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

ఆర్తి ప్రబంధం – 47

Published by:

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

ఆర్తి ప్రబంధం

<< ఆర్తి ప్రబంధం – 46

పరిచయము:

మాముణులు సంతోషంగా “ఎతిరాశర్ క్కాళానోం యాం” అని పలికి, “రామానుజ” అనే దివ్య నామము యొక్క గొప్పతనాన్ని వెల్లడి చేయాలని ఆశిస్తున్నారు. గతంలో “మాకాంత నారణనార్”,  “నారాయణన్ తిరుమాల్” అని చెప్పినట్లుగా ఇది “నారాయణ” అనే దివ్య నామము కంటే చమత్కారమైనది, భిన్నమైనదని మాముణులు వివరిస్తున్నారు.

పాశురము 47:

ఇరామానుశాయ నమవెన్ఱు ఇరవుం పగలుం శిందిత్తిరా
మానుశర్గళ్ ఇరుప్పిడం తన్నిల్ ఇఱైప్పొళుదుమిరా
మానుశర్ అవర్ క్కు ఎల్లా అడిమైయుం శెయ్యవెణ్ణి
ఇరా మానుశర్ తమ్మై మానుశరాగ ఎంకొల్ ఎణ్ణువదే

ప్రతి పద్ధార్ధములు:

మానుశర్గళ్ – కొంత మంది ఉన్నారు
ఇరా – చేయనివారు
ఇరవుం పగలుం – రాత్రింబగళ్ళు
శిందిత్తు  – ధ్యానిస్తూ
ఇరామానుశాయ – శ్రీ రామానుజ
నమవెన్ఱు –  “ఇరామానుశాయ నమః” అని జపిస్తూ  (“నేను నా కోసము కాదు రామానుజుల కోసము అని”)
మానుశర్ అవర్ క్కు – కొంత మంది (కూరత్తాళ్వాన్ల వంటి వారు)
ఇరా – జీవించని వారు
ఇఱైప్పొళుదుం – ఒక్క అణు క్షణము కూడా
ఇరుప్పిడం తన్నిల్ – పైన పేర్కొన్న వాళ్ళు ఉన్న దేశము (రాత్రింబగళ్ళు “ఇరామానుశాయ నమః” అని జపిస్తూ ఉండని)
మానుశర్ తమ్మై – మనుషులు
ఇరా – చేయనివారు
శెయ్యవెణ్ణి– ఆచరించు
ఎల్లా అడిమైయుం – అన్ని రకాల కైంకర్యములు (కూరత్తాళ్వాన్ల వంటి వారికి),
మానుశరాగ ఎంకొల్ ఎణ్ణువదే – వారిని మనుషులుగా ఎలా పరిగణించవచ్చు, అవి కేవలం ఆవులతో సమానమైనవి.

సరళ అనువాదము:

మూడు వర్గాల మనుషులు ఉంటారు. మనకి సరళంగా ఉండడం కోసం వారిని A వర్గము, B వర్గము, C వర్గము అని పిలుద్దాం. A వర్గము వాళ్ళూ “ఇరామానుశాయ నమః” అని రాత్రింబగళ్ళు జపించని వాళ్ళు. B వర్గము వాళ్ళు A వర్గము వాళ్ళతో సహవాసము చేయరు. B వర్గము వాళ్ళ ఉదాహరణ మనము కూరత్తాళ్వాన్లను తీసుకోవచ్చు. చివరి వర్గము C వాళ్ళు  B వర్గము వాళ్ళ గొప్పతనాన్ని గుర్తించడంలో విఫలమై వారికి కైంకార్యం చేయటానికి ఇష్టపడరు. వర్గము C వాళ్ళని మనుషులుగా ఎలా పరిగణించగలమని మాముణులు ప్రశ్నిస్తున్నారు, వాస్తవానికి వాళ్ళు కేవలం పశువుల వంటి వాళ్ళు, వారి పనుల బట్టి వాళ్ళు ఆవు వంటి వారని వివరిస్తున్నారు.

వివరణ: 

“ప్రతి ఒక్కరూ ‘ఇరామానుజాయ నమః’ అన్న పవిత్ర మంత్రాన్ని ఏక ధాటిగా ప్రతి నిత్యము జపించాలి” అని మాముణులు వివరిస్తున్నారు. పెరియ తిరుమోళి 1.1.15 – “నళ్ళిరుళ్ అళవుం పగలుం నాన్ అళైప్పన్” లో తిరుమంగై ఆళ్వార్లు  వివరించిన విధంగా దీనిని అందరూ పగలు రాత్రి తేడా లేకుండా ఆచరించాలి.  అయినప్పటికీ, ఇది పఠించని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు.”ఇరామానుజాయ నమః” అన్న పవిత్ర మంత్రాన్ని ధ్యానించని అటువంటి వాళ్ళ మధ్య ఉండకూడదని మనము గ్రహించాలి. ఆవుతో పోల్చదగిన ఈ వర్గపు వారితో ఎటువంటి అనురాగము లేదా ఆప్యాయత ఉంచుకో కూడదు. శాస్త్రం  నియమాలను అనుసరించేవారు (కూరత్తాళ్వాన్ వంటివారు), ఈ రకమైన వాళ్ళతో ఎన్నడూ సహవాసము చేయకూడదు. రెండవది, “ఇరామానుజాయ నమః” అన్న ఈ పవిత్ర మంత్రాన్ని ధ్యానించని మునుపటి వర్గము వారితో సంబంధం లేని ఈ వ్యక్తుల గొప్పతనాన్ని తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం మరియు అభినందించడం చాలా ముఖ్యం. తిరువరంగత్తముదనార్లు “ఎత్తొళుంబుం సొల్లాల్ మనత్తాల్ కరుమతినాల్ సెయ్వన్ సోర్విన్ఱియే” అని ఇరామానుశ నూఱ్ఱందాది 80వ పాశురములో వెల్లడిజేసినట్లు, అటువంటి ఉన్నత ఆత్మలకు నిత్యము కైంకర్యము చేయడానికి ప్రయత్నించాలి, పరితపించాలి.  “మానిడవరల్లర్ ఎన్ఱే ఎన్ మనత్తే వైతేన్” అని వివరించినట్లుగా అటువంటి ఉన్నత వ్యక్తులకు కైంకార్యం చేయని వ్యక్తులను, ఆవులతో పోల్చదగినవారని సెలవిస్తున్నారు. మాముణులు చివరకు తనను తాను ఒక ప్రశ్న అడిగి ముగిస్తున్నారు. “ఇరామానుజాయ నమః” అన్న ఈ పవిత్ర మంత్రాన్ని ధ్యానించని వారితో సాంగత్యము చేయని వారికి కైంకర్యము చేయని ఇటువంటి వాళ్ళని మనుషులుగా నేను ఎలా పరిగణించాలి?  నేను వారిని ఎప్పుడూ మనుషులుగా ఊహించలేను”, అని మాముణులు ముగిస్తున్నారు.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2017/03/arththi-prabandham-47/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

ఆర్తి ప్రబంధం – 46

Published by:

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

ఆర్తి ప్రబంధం

<< ఆర్తి ప్రబంధం – 45

పరిచయము:

మునుపటి పాశురములో, మాముణులు తమ ఆచార్యుల గొప్పతనాన్ని కీర్తించారు, వారి దయ వల్లనే తాను ఉద్దరింపబడ్డారని వివరించారు. ఈ పాశురములో, వారు దానిని మరింత లోతుగా వివరిస్తున్నారు.

పాశురము 46:

తిరువాయ్మొళి ప్పిళ్ళై తీవినైయోందమ్మై
గురువాగి వందు ఉయ్యక్కొండు – పొరువిల్
మది తాన్ అళిత్తరుళుం వాళ్వన్ఱో నెంజే
ఎతిరాశర్కు ఆళానోం యాం

ప్రతి పద్ధార్ధములు:

నెంజే– ఓ నా మనసా!!!
యాం– మనము
ఆళానోం – వారి సేవకులుగా మారాలి
ఎతిరాశర్కు – ఎంబెరుమానార్ల

(దానికి కారణం)
తిరువాయ్మొళి ప్పిళ్ళై – తిరువాయ్మొళి ప్పిళ్ళై (మాముణుల ఆచార్యులు)
గురువాగి – ఆచర్యులుగా అవతరించారు
వందు – మనము ఉన్న ప్రదేశానికి వచ్చారు
తీవినైయోందమ్మై – వాస్థవానికి మనము క్రూరమైన పాపపు మేఘము వంటి వాళ్ళము
ఉయ్యక్కొండు – వారి కృప ద్వారా స్వీకరింపబడ్డాము మరియు “ఉద్ధరింప తగినది” గా భావించబడ్డాము
అళిత్తరుళుం – వారు మనల్ని ఆశీర్వదించారు
మది తాన్ – తిరుమంత్ర జ్ఞానంతో వికసించే జ్ఞానం
పొరువిల్– ఇది సాటిలేనిది
వాళ్వన్ఱో – (ఓ నా మనసా!!!) ఈ గొప్ప అవకాశం వల్ల కాదా? (ఖచ్చితముగా వారి వల్లనే మనం ఎంబెరుమానార్ల దాసులుగా మారాము.

సరళ అనువాదము:

ఈ పాశురములో, మాముణులు తమ ఆచార్యుల గొప్పతనాన్ని కీర్తిస్తున్నారు. వారు తాను ఉన్న చోటికి వచ్చి తిరుమంత్రాన్ని ప్రసాదించినందువల్ల, తాను ఆ శ్రీమన్నారాయణ దాసులకు దాసునిగా నిలవగలిగారని వివరిసున్నారు.

వివరణ: 

ఇక్కడ మొదట తిరువాయ్మొళి పిళ్ళై గొప్పతనం వివరించబడింది. శ్రీమన్నారాయణుని యొక్క భక్తులకు (‘భూసురులు’ (ఈ ప్రపంచంలోని  దివ్య జీవులు) అని కూడా పిలువబడే శ్రీవైష్ణవులకు) తిరువాయ్మొళి అనెడి దివ్య ప్రబంధము మధువు వంటిదని, దాని గురించి నమ్మళ్వార్లు స్వయంగా “తొణ్డర్ క్కముదుణ్ణచ్చొల్ మాలైగళ్ సొన్నేన్ (తిరువాయ్మొళి 9.4.9)”లో వివరించారు. తిరువాయ్మొళి పిళ్ళై అనే ఒక ఆచార్య పురుషులు తిరువాయ్మొళిని ఊపిరిగా  పీల్చుకుని, అందులోనే జీవిస్తుండేవారు. వారు దానిలోని వివిధ రకాలైన మాధుర్యాలను ఆస్వాదించగలిగారు. 1) ఆ ప్రబంధ పదాల అమరిక నుండి వచ్చే మాధుర్యము, 2) వాటి అర్థాల నుండి వచ్చే మాధుర్యము, 3) పాశురాలలో నుండి ఉట్టి పడే రస అనుభవ మాధుర్యము వంటివి అనేకము వారు అతిమధురముగా అనుభవించినారు. వారు తిరువాయ్మొళి యొక్క ఉద్దేశ్యంతో జీవించారు, మిగతా అన్ని శాస్త్రాలను గడ్డిపోచతో సమానముగా భావించేవారు. వారు నమ్మాళ్వార్ల దివ్య పాద పద్మాలకు శరణాగతులై అన్ని వేళలా వారికి అనేక కైంకర్యాలు చేసేవారు. తిరువాయ్మొళితో ఉన్న అనుబంధం ద్వారా వారు ప్రపంచానికి సుపరిచితులు కాబట్టి, వారు “తిరువాయ్మొళి పిళ్ళై” గా ప్రసిద్దికెక్కారు. మాముణులు తమ హృదయంతో ” ఓ నా ప్రియమైన హృదయమా! మనల్నిద్దరినీ చూడు. “ఒప్పిల్లాత్ తీవినైయేనై ఉయ్యక్కొండు (తిరువాయ్మొళి 7.9.4)” లో వివరించిన విధంగా మనము క్రూరమైన పాపాల పుట్టకి సూచకముగా ఉన్నాము. తిరువాయ్మొళి పిళ్ళై అచార్యునిగా అవతరించి మమ్మల్ని విముక్తి చేశారు”, “తేనార్ కమల త్తిరుమామగళ్ కొళునన్ తానే గురువాగి” అని మాముణులు  స్వయంగా దీనిని తమ ఉపదేశ రత్న మాల 61 పాశురములో ఉల్లేఖించారు. “వారు మనమున్న చోటికి వేంచేసి, తిరుమంత్రం మూల ప్రవాహముగా వచ్చిన జ్ఞానాన్ని మనకిచ్చారు. ఇది ఇతర శాస్త్రముల నుండి వచ్చిన జ్ఞానానికి భిన్నంగా ఉంటుంది. హే నా మనసా! ఈ గొప్ప అవకాశం వల్ల మనం ఉద్ధరించబడి, మన ఆచార్యులైన ఎంబెరుమానర్లను సేవించే సువర్ణావకాశం మనకు  లభించించి కదా? కచ్ఛితముగా మనకు ఈ అవకాశం లభించడానికి ఏకైక కారణం వారే. శ్రీమన్నారాయణుని దాసులకు దాసులుగా ఉండుటయే తిరుమంత్రంలో తెలియజేయబడిన పరార్థము. ఈ వాస్తవాన్ని గ్రహించినందువల్ల, మనము ఎంబెరుమానర్ల నిత్య దాసులముగా మారాము”.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2017/03/arththi-prabandham-46/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

ఆర్తి ప్రబంధం – 45

Published by:

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

ఆర్తి ప్రబంధం

<< ఆర్తి ప్రబంధం – 44

పరిచయము:

మునుపటి పాశురములో, మాముణులు “మాకాంత నారణణార్ వైగుం వగై” వాఖ్యములో సర్వవ్యాపి శ్రీమన్నారాయణ గురించి వివరిస్తున్నారు. ఈ పాశురములో, తాను మునుపటి పాశురములో వివరించిన విధంగా అత్యల్పులైన “మోహాంతకులు”లో తాను ఒకరని భావిస్తున్నారు, అనగా, శ్రీమన్నారాయణ అవగాహన లేని, అంధకార ఒంటరి తనాలను మాత్రమే చూసే వారి సమూహంలో తానూ ఒకరని, అత్యల్పమైన వ్యక్తిగా తనను తాను భావిస్తున్నారు. సర్వవ్యాపి శ్రీమన్నారాయణను, అతడితో తన నిత్య సంబంధాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమయ్యాడని వారు భావిస్తున్నారు. ఈ విషయాన్ని గ్రహించడంలో విఫలమయ్యాడని, అందుకని మోహాంతకులలో ఒకడు అయ్యాడని భావిస్తున్నారు. అయినప్పటికీ, ఇది కేవలము ఆచార్య సంబంధము వల్లనే తాను ఉద్ధరించబడ్డారని మాముణులు తన మనస్సుకి గుర్తుచేస్తున్నారు. ఇది ఈ పాశురములోని ముఖ్య అంశము.

పాశురము 45:

నారాయణన్ తిరుమాల్ నారం నాం ఎన్నుం ముఱై
ఆఱాయిల్ నెంజే అనాది అన్ఱో – శీరారుం
ఆచారియనాలే అన్ఱో నాం ఉయ్ందదు ఎన్ఱు
కూశామల్ ఎప్పొళుదుం కూఱు

ప్రతి పద్ధార్ధములు:

నెంజే – ఓ నా మనసా!!!
నారాయణన్ తిరుమాల్ – “తిరుమాలే నానుం ఉనక్కు పళవడియేన్”, అన్న వాఖ్యములో చెప్పబడినట్లుగా శ్రియః పతి శ్రీమన్నారాయణుడే సమస్థ ఆత్మలకు అధిపతి. “నారం” అని సమిష్టిగా పరిగణిస్తారు.
నారం నాం – మనము నిత్య ఆత్మలము.
ఆఱాయిల్ – ఒకవేళ అది నిరూపించబడాలంటే
ఎన్నుం ముఱై – ఆ నిత్య సంబంధము (శ్రీమన్నారాయణ ఆత్మల మధ్య)
అనాది అన్ఱో – ఇది నిన్నటి మొన్నటి నుండి మొదలైనదా? కాదు. అది శాశ్వతమైనదనుట నిజము కాదా?  (అవును ఇది నిజమే)
(ఓ నా మనసా!!!)
శీరారుం –  ఆ సంబంధాన్ని (మనకు) చూపించి బలపరచిన ఒక వ్యక్తి, అదే వ్యక్తి జ్ఞానము ఇత్యాది ఎన్నో శుభ లక్షణాలతో సంపూర్ణుడు.
ఆచారియనాలే అన్ఱో – వారు ఆచార్యులు. అది వారి వల్ల కాదా?
నాం ఉయ్ందదు ఎన్ఱు – మనము విముక్తి పొందటానికి కారణం ఖచ్చితంగా వారే.
(ఓ నా మనసా!!!)
కూఱు – దయచేసి వాటి గురించి చెప్పుతూ ఉండుము
ఎప్పొళుదుం – అన్ని సమయాల్లో
కూశామల్ – ఏ బిడియము లేకుండా

సరళ అనువాదము:

ఈ పాశురములో, మాముణులు శ్రీమన్నారయణకు ఆత్మకు  మధ్య ఉన్న సంబంధాన్ని పునః స్థాపించి, బలపరచే వ్యక్తి అయిన ఆచార్యుల గొప్పతనాన్ని కీర్తిస్తున్నారు. ఈ ఉద్దరణకి ముందు, ఏ అవగాహనలేని ఒక నిర్జీవునిగా ఉండేవాడని తెలుయజేస్తున్నారు. అందువల్ల, కేవలము ఆచార్య కృప వల్లనే ఉద్ధరించబడ్డారని తలచమని మాముణులు తన హృదయానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

వివరణ: 

“హే!  ప్రియమైన నా హృదయమా !!! “తిరుమాలే నానుం ఉనక్కు పళవడియేన్ (తిరుప్పల్లాండు 11)” గురించి పెరియాళ్వార్లు ప్రస్తావించారు అని మాముణులు చెబుతున్నారు. ఆతడు శ్రియః పతి, శ్రీకి దివ్య పతి శ్రీమన్నారాయణుడు. మనల్ని (ఆత్మలు) “నారం” అంటారు. శ్రీమన్నారాయణ ఆత్మల మధ్య సంబంధం శాశ్వతమైనది, అనాది నుంచి ఉంది, ఎప్పటికీ ఉంటుంది . ఈ సంబంధ మూలము గురించి పరిశోధిస్తే, ఈ సంబంధం నిన్న లేదా కొంతకాలం క్రితం సృష్టించబడినది కాదని మనకి తెలుస్తుంది. ఇది అనాది కాలం నుండి ఉంది, కనుక ఇది సృష్టించినది కాదు పరమ నిత్యమైనది.  అయినప్పటికీ, మనము (మాముణులు, వారి మనస్సు) దీనిని గ్రహించలేదు, ఈ సంబంధం గురించి పట్టించుకోక, దాని గురించి ఎటువంటి జ్ఞాన విచారణ చేయలేకపోయాము. ఈ సంబంధాన్ని గ్రహించగల సామర్థ్యం లేని అచేతనులు లాగా ఉండేవాళ్ళము. మన ఆచార్యులు ఈ సంబంధాన్ని మనకు అర్థం చేయించి మనలో దాని ప్రాముఖ్యతను బలపరచాక అంతా మారిపోయింది. జ్ఞానం, శుభ గుణాలతో నిండిన ఉన్న మహా పురుషులు అచార్యులు. కేవలం మన ఆచార్యుల చేత మాత్రమే మనము ఉద్ధరింప బడ్డాము. “పెరుమైయుం నాణుం తవిర్ందు పిదఱ్ఱుమిన్ (తిరువాయ్మొళి 3.5.10)”లో చెప్పినట్లుగా, దయచేసి ఈ వాస్తవం గురించి మాట్లాడండి. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని తెలుసుకునేలా బహిరంగంగా మాట్లాడండి” అని చెబుతున్నారు. ఈ విషయాన్ని ప్రమేయ సారము “ఇఱైయుం ఉయిరుం” 10 వ పాశురములో వివరించబడింది.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2017/03/arththi-prabandham-45/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

ఆర్తి ప్రబంధం – 44

Published by:

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

ఆర్తి ప్రబంధం

<< ఆర్తి ప్రబంధం – 43

పరిచయము:

మునుపటి పాశురములో, “ఇంద ఉలగయిల్ పొరుందామై ఏదుమిల్లై అంద పోగ ఆశైయిల్లై” అని మాముణులు అన్నారు. అంటే తనకు ఈ లౌకిక జీవితముపై  నిరాసక్తి లేదు, పైగా పరమపదానికి వెళ్ళాలనే కోరిక కూడా లేదని మాముణులు తెలుపుతున్నారు. ఈ మాట చెప్పిన తరువాత, ఈ లోకములో ఇతర మనుషులను చూసి, వారు చేసే మనులను గమనించారు. వాళ్ళు నిరంతరం అపరాధాలు చేసి పాపాలను మూటకట్టుకోడానికి కారణమేమిటో వారు గ్రహించారు. ఈ పాశురములో ఇదే వివరించబడింది.

పాశురము 43:

మాకాంత నారణనార్ వైగుం వగై అఱిందోర్ క్కు
ఏకాంతం ఇల్లై ఇరుళ్ ఇల్లై
మోకాంతర్ ఇవ్విడం ఏకాంతం ఇరుళ్ ఎన్ఱు భయం అఱ్ఱు ఇరుందు
సెయ్వర్గళ్ తాం పావత్తిఱం

ప్రతి పద్ధార్ధములు:

నారణనార్ – సర్వజ్ఞుడు మరియు సర్వశక్తిమంతుడైన శ్రీమన్నారాయణుడు
మాకాంత – లక్ష్మికి పతి
వైగుం వగై – ఈ విశ్వంలోని ప్రతి చేతనాచేతనములలోపల మరియు బయట వ్యాపించిన (ఈ అర్ధం నారాయణ నామములో ఇమిడి ఉంది)
అఱిందోర్ క్కు–  ఎవరైతే తెలుకొని అర్థము చేసుకుంటారో
ఏకాంతం ఇల్లై – ఏకాంతం లేదు
ఇరుళ్ ఇల్లై – అంధకారము కూడా లేదు.
మోకాంతర్ – “మోహాంత తమసాస్వృత్తః” అన్న వాఖ్యములో చెప్పినట్లుగా,  ప్రాపంచిక విషయాలతో అంధులైన వారు. వారు ఏమీ చూడరు మరియు ఆలోచించరు
ఇవ్విడం ఏకాంతం ఇరుళ్ ఎన్ఱు – ఎవరూ లేని వారికి ఈ ప్రదేశము ఏకాంతమయము.
భయం అఱ్ఱు ఇరుందు – వారు నిర్భయముగా ఉంటారు
సెయ్వర్గళ్ తాం – వారి అజ్ఞానము కారణంగా, మరలా చేస్తూనే
పావత్తిఱం  – ఎన్నో ఎన్నో పాపాలు

సరళ అనువాదము:

ఈ పాశురములో, మాముణులు రెండు రకాల మనుషుల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరిస్తున్నారు. మొదటి రకము వాళ్ళు నిత్య తేజోమయుడైన శ్రీమన్నారాయణని ప్రతిచోటా చూస్తారు. అందువల్ల వారు ప్రతిచోటా అతడి సాన్నిధ్యాన్ని అనుభవిస్తారు కాబట్టి  వాళ్ళు ఒంటరిగా ఉన్నారని భావించే అవకాశము వారికి ఉండదు. అతడు కాంతితో నిండిన వాడు కాబట్టి వారు చీకటిని ఎరుగరు. మరొక పక్క చూస్తే, ఎంతో మంది దీనిని గమనించక వారు చీకటిలో ఒంటరిగా ఉన్నారని భావిస్తారు.  ఇది వారి పతనానికి కారణమై వాళ్ళు అనేక పాపాలలో పాల్పడేలా చేస్తుంది.

వివరణ: 

నమ్మాళ్వార్లు తమ తిరువాయ్మొళి (1.10.8) లో “సెల్వ నారణన్” అనే నామాన్ని ఉపయోగించారు. ఆతడు దివ్య పెరియ పిరాట్టి అయిన శ్రీమహాలక్ష్మికి పతి. ప్రతి చేతనాచేతనుల లోపల వెలుపల ఆతడు వ్యాపించి ఉన్నాడు.  ఇదే “నారాయణ” నామమునకు సారమని చెప్పబడింది. శ్రీమన్నారాయణ యొక్క ఈ సర్వవ్యాపి గుణాన్ని గ్రహించిన కొంతరు ఉన్నారు. “నారాయణ పరంజోతిః (నారాయణ సూక్తం 4)”, “పగల్ కణ్డేన్ నారాణనైక్కణ్డేన్ (ఇరండాం తిరువందాది 81”), “అవన్ ఎన్నుళ్ ఇరుళ్ తాన్ అఱ వీఱ్ఱిరుందాన్ (తిరువాయ్మొళి 8.7.3) అని ప్రబంధ వాఖ్యాలలో వర్ణించినట్లుగా వాళ్ళు ఆతడిని అన్ని చోట్లా ప్రకాశవంతుడైన పెరుమాళ్లని చూస్తారు. వారు అంధకారం, ఒంటరితనములను ఎన్నడూ ఎరుగరు. వాళ్ళు ఎప్పుడూ ఒంటరి వారు కారు, నిత్యము వారి తోటి వారితో ఉంటారు. ఒంటరిగా ఉన్నట్టు భావించరు కనుక, వారికి ఎటువంటి భయం ఉండదు. “హృతి నారాయణం పశ్యనాప్య కచ్చత్రహస్తా యస్వతారధౌచాపి గోవిందం తం ఉపాస్మహే (విష్ణు పురాణము)” లో చెప్పినట్లు వాళ్ళు ఎక్కడా చీకటిని చూడరు.

దీనికి విరుద్ధంగా, “మోహాంతకులు” గా ముద్రవేయబడిన మరో రకమైన మనుషులు కూడా ఉన్నారు. “మోహాంత తమసా వృత్తః” అనే వాఖ్యముతో వర్గీకరించబడినట్లుగా, వీళ్ళు అంధకారము కారణంగా ముందు ఏమి ఉందో చూడగల సామర్థ్యం లేని వాళ్ళు. “అంతర్భహిస్సకల వస్తుశు సంతమీశం ఆంధః పురస్తితం ఈవహం అవీక్షమాణః” (యతిరాజ వింశతి 12)” లో వివరించినట్లుగా, శ్రీమన్నారాయణుడు ప్రతి చేతనాచేతనుల లోపల వెలుపల నిత్యము సమానముగా ప్రకాశిస్తాడు. తమ ఆంతరంగిక కళ్ళతో అతడిని చూడలేని వాళ్ళు, ఏదో విరుద్ధంగా చూసి అతడిని గ్రహిస్తారు. ఎవరూ లేని ఒక ప్రదేశాన్ని వారు అక్కడ ఎవరూ లేరని, చీకటి మాత్రమే ఉందని వాళ్ళు భావిస్తారు. “తస్యాంతి కేత్వం వ్రజినం కరోషి” అనే వాఖ్యములో వివరించబడిన విధంగా అది వారిలో నిర్భయాన్ని ప్రేరేపించి, ఎవరు లేరు కదా అని అనేక పాపాలను చేయిస్తుంది. శ్రీమన్నారాయణను గ్రహించని ఈ రకమైన మనుషుల స్థితి ఇదేనని మాముణులు భావిస్తున్నారు.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2017/03/arththi-prabandham-44/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

ఆర్తి ప్రబంధం – 43

Published by:

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

ఆర్తి ప్రబంధం

<< ఆర్తి ప్రబంధం – 42

పరిచయము:

మునుపటి పాశురములో, “ఇరంగాయ్ ఎతిరాశా” అనే వాక్యాన్ని మాముణులు ఉపయోగించారు. అనగా మాముణులు విసుగు చెందారని సూచిస్తుంది. పరమపదానికి వెళ్లాలనుకునే వ్యక్తికి రెండు విషయాలు అవసరం (1) అక్కడికి వెళ్ళాలనే ఆసక్తి ఉండటం,  (2) ఇక్కడ ఈ భూమిపై ఉండాలని ఆసక్తి లేకపోవడం. ఈ రెండు అవసరాలు “ప్రాప్య భూమియిల్ ప్రావణ్యముం త్యాజ్య భూమియిల్ జిహాసయుం (శ్రీ వచన భూషణం 458)” నుండి సంగ్రహించబడింది. పరమపదానికి వెళ్లాలనుకునే వ్యక్తిలో అవసరమైన ఈ రెండు తనలో లేవని భావించి మాముణులు విసుగు చెందుతున్నారు. వారు ఈ విషయాన్ని గురించి బాధపడి, ఈ రెండు అర్హతలు లేకపోతే శ్రీ రామానుజులు తనకి పరమపదాన్ని ఎలా అనుగ్రహిస్తారని ఆశ్చర్యపోతున్నారు.

పాశురము 43:

ఇంద ఉలగిల్ పొరున్దామై ఏదుమిల్లై
అంద ఉలగిల్ పోగ ఆశైయిల్లై
ఇంద నమక్కు ఎప్పడియే తాన్ తరువర్ ఎందై ఎతిరాశ
ఒప్పిల్ తిరునాడు ఉగందు

ప్రతి పద్ధార్ధములు:

ఏదుమిల్లై– (నాలో) అణువు మాత్రము కూడా
పొరున్దామై – ఆసక్తి లేకుండుట నాను దిగజార్చ వచ్చు
ఇంద ఉలగిల్ – ఈ క్రూరమైన లోకాన్ని త్యజించాలి
ఆశైయిల్లై  – (నాలో కూడా) ఆసక్తి లేదు
పోగ – వెళ్ళే
అంద ఉలగిల్ – అందరికీ అత్యున్నత గమ్యమైన పరమపదానికి.
ఇంద నమక్కు – అటువంటి వ్యక్తి పట్ల (నేను), ఈ రెండు ముఖ్య అర్థతలు లేని
ఎప్పడియే తాన్ – ఎలా
ఎందై– నా తండ్రి
ఎతిరాశ– ఎంబెరుమానార్
తరువర్ – యిచ్చు వారు
ఉగందు– సంతోషంగా
తిరునాడు – పరమపదము
ఒప్పిల్ – సాటిలేని

సరళ అనువాదము:

ఈ పాశురములో, మాముణులు పరమపదానికి వెళ్లాలనుకునే వ్యక్తికి అవసరమైన రెండు అర్హతలు తనలో లేవని వివరిస్తున్నారు. ఈ భౌతిక జగత్తుపై తనకు ఎలాంటి ద్వేషం కూడా లేదని వారు చెబుతున్నారు. మరో వైపు,  పరమపదాన్ని అధీష్థించాలనే తాపత్రేయం కూడా లేదు. ఇలాంటి దుస్థితితో, తన తండ్రి అయిన ఎంబెరుమానార్లు  ఎలా సంతోషంగా పరమపదాన్ని అనుగ్రహిస్తారోనని ఆశ్చర్యపోతున్నారు.

వివరణ: 

“కొడువులగం కాట్టెల్ (తిరువాయ్మొళి 4.9.7)”లో క్రూరమైనది వివరించబడిన ఈ ప్రపంచముపై నాకు ఎటువంటి నిరాసక్తి లేదు అని మాముణులు తెలియజేస్తున్నారు. “వాన్ ఉలగం తెళిందే ఎన్ఱెయ్దువదు (పెరియ తిరుమొళి 6.3.8) లో ప్రతి ఒక్కరూ వెళ్ళాలని ఆరాటపడే ప్రదేశంగా వర్ణించబడిన పరమదానికి వెళ్ళాలని నాకు ఆసక్తి లేదు. ఇటువంటి పరిస్థితిలో, నా తండ్రి అయిన ఎంబెరుమానార్లు సంతోషంగా నన్ను సాటిలేని ఆ  పరమపదానికి ఎలా తీసుకెళ్లగలరు?

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2017/02/arththi-prabandham-43/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

ఆర్తి ప్రబంధం – 42

Published by:

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

ఆర్తి ప్రబంధం

<< ఆర్తి ప్రబంధం – 41

పరిచయము:

శ్రీ రామానుజులు తమ మనస్సులో, “అకించన్యము” (తన కంటు ఏమీ లేకపోవడం)” మరియు “అనన్యగతిత్వం (వేరే ఆశ్రయం లేకపోవడం)” తో ఉన్న మాముణులను తాను పొందడం ఎంత అదృష్థము అని భావిస్తున్నారు. శ్రీ రామానుజులు సంతోషించి, వారి ఇవ్వవలసిన వాటి గురించి ఆలోచిస్తున్నారు. ప్రేమ, భక్తి  కలిగి ఉన్న మాముణులను ఆశీర్వదించడం ప్రారంభించారు. మన ఇంద్రియాల వినాశకర ప్రభావాలను చిత్రీకరించిన “ఉణ్ణిలావియ (తిరువాయ్మొళి 7.1)” ను ఈ సమయంలో మాముణులు వివరించడతో తమ “అనన్యగతిత్వ” గుణాన్ని మరింత వ్యక్తపరచారు. మాముణుల నుండి ఇది వింటూ, వారిని వెంటనే రక్షించకపోతే తాను ఇక జీవించలేనన్న స్థితికి శ్రీ రామానుజులు చేరుకుంటారు.

పాశురము 42:

ఐంపులంగళ్ మేలిట్టు అడరుంపొళుదు అడియేన్
ఉన్ పదంగళ్ తమ్మై నినైత్తు ఓలమిట్టాల్
పిన్బు అవైతాం ఎన్నై అడరామల్ ఇరంగాయ్ ఎతిరాశ
ఉన్నై అల్లాల్ ఎనక్కు ఎణ్డొ?

ప్రతి పద్ధార్ధములు:

ఐంపులంగళ్ – (నా)  ఐదు ఇంద్రియాలు
మేలిట్టు – నాపై ఎంత అధిక ప్రభావము ఉండిందంటే
అడరుంపొళుదు – ప్రతి ఒక్కరు తమ తప్పులను
అడియేన్– (అప్పుడు) నేను, నా స్వామి శ్రీ రామానుజుల నిత్య దాసుడు
నినైత్తు –  ధానించు (గజేంద్రుడు భగవానుడిని ధ్యానించి నట్లే).  మొసలి గజేంద్రుని కాలు పట్టుకొని నదిలోకి లాగాలని ప్రయత్నించినపుడు, ఆ ఏనుగు ఎదిరించి పోరాడసాగింది. ఇలా 1,000 దేవ సంవత్సరాలు వారి మద్య యుద్దము జరిగింది. (మనిషి యొక్క ఒక సంవత్సరము దేవతలకు ఒక దినము). అలా అంత కాలం తరువాత, మొసలి బలము పెరిగి ఏనుగు నేలపై తన పట్టు కోల్పోవడం ప్రారంభించింది. మొసలి ఉండేది నీళ్ళల్లో కాబట్టి నీటిలో దాని శక్తి రెట్టింపు అవడం ప్రారంభించింది. అలాగే, ఏనుగు ఉండేది భూమిపైన కాబట్టి ఏనుగు తన శక్తిని నేలపైనే చూపించగలదు. కానీ ఇప్పుడు, యుద్ధంలో మొసలి పైచేయిగా ఉన్నందున, అది ఆ ఏనుగుని నీటిలోకి మరింతగా లాగి, ఏనుగు యొక్క తొండము తప్పా మిగతా శరీరమంతా నీటిలోకి లాగేసింది. ఈ సమయంలో, గజేంద్రుడు తన శత్రు నాశనము చేసి  తనను రక్షించ గలిగే వాడు శ్రీమన్నారాయణుడు తప్పా మరెవరూ కాదని గ్రహించారు. “నారాయణావో” అని ఆర్తితో పిలుస్తూ తనను రక్షించమని గజేంద్రుడు ప్రార్థించాడు. ఎలాగైతే గజేంద్రుడు ఆర్తితో పిలిచాడో, మాముణులు తన నిస్సహాయతని గ్రహించి శ్రీ రామానుజులను రక్షించమని ఆర్తితో పిలుస్తున్నారు).
ఉన్ – మీరు
పదంగళ్ తమ్మై – పాద పద్మాలు.
ఓలమిట్టాల్– (అదే సమయములో నీ దివ్య చరణాలను ధ్యానిస్తూ) ఒకవేళ మీ దివ్య “రామానుజ” నామముతో మిమ్మల్ని పిలిచితే
ఎతిరాశ – ఓ!!! యతుల నాయకుడా
పిన్బు – ఇకపై  (మీ తామర పాదాలను ద్యానిస్తూ నీ నామాన్ని ఆర్తితో జపించి)
ఇరంగాయ్ – దయచేసి ఆశీర్వదించండి
ఎన్నై – నేను
అవైతాం – అధిక హాని కలిగించే ఇంద్రియములు
అడరామల్ – నాపై దాడి చేయకుండా.
ఉణ్డొ? – మరొక రక్షకుడు ఉన్నాడా? (నీవే ఏకైక రక్షకుడవు, మరెవరూ లేరు కనుక)
ఎనక్కు – నాకు
ఉన్నై అల్లాల్ – నీవు తప్పా?

“ఉన్ పదంగళ్ తమ్మై నినైందోలమిట్టాల్ప” అనే వాఖ్యానికి అర్ధము – రామానుజులను తమ మనస్సులో ధ్యానిస్తూ “ఎంబెరుమానార్ తిరువడిగళే శరణం” అని గట్టిగా ఆర్తితో పిలవాలి.

సరళ అనువాదము:

ఈ పాశురములో, శ్రీ రామానుజులే తనకు ఏకైక రక్షకుడు అని మాముణులు చెబుతున్నారు. అనేక ఇబ్బందులతో బాధపడుతున్న ప్రజలందరికీ వారే రక్షకులు. తన నిస్సహాయతను గ్రహించి, శ్రీమన్నారాయణను తన ఏకైక రక్షకుడిగా విశ్వసించిన గజేంద్రునితో మాముణులు తనను తాను పోల్చుతూ తన “అనన్యగతిత్వం” గుణాన్ని స్థాపిస్తున్నారు. అదేవిధంగా, మాముణులు, శ్రీ రామానుజుల దివ్య పాద పద్మాలను ధ్యానిస్తూ, తన ఆత్మ రక్షణ కొరకు వారి నామాన్ని ఆర్తితో గట్టిగా పలికారు.

వివరణ: 

మాముణులు తన పంచేంద్రియాలు తనపై దాడిచేస్తున్నాయని, తనని వేర్వేరు దిక్కుల్లోకి లాగుతున్నాయని వివరిస్తున్నారు. “కోవై ఐవర్ ఎన్ మెయ్ కుడియేఱి (పెరియ తిరుమోళి 7.7.9)” అనే ప్రబంధంలో చెప్పినట్లుగా, ప్రతి ఇంద్రియము నన్ను తన దాసునిగా చేసుకొని వాటి అవసరాలను తీర్చమని నన్ను వేధిస్తున్నాయి. ఆ సమయంలో, నా స్వామి శ్రీ రామానుజుల నిత్య దాసుడనైన నేను, సహాయం చేయమని మీ నామ స్మరణ చేస్తూ ఆర్తితో పిలిచాను. మొసలి పట్టులో చిక్కుకున్న గజేంద్రుడు సహాయం కోసం శ్రీమన్నారాయణని పిలిచిన ఘట్టానికి ఈ ఘట్టము పోలినది. “గ్రాహం ఆకర్షతే జలే” అనే వాఖములో చెప్పినట్లుగా, మొసలి తన స్వస్థానమైన నీరులో శక్తిని పొందుతుంది. గజేంద్రుని కాలుని నీళ్ళల్లోకి లాగినప్పుడు,  “మనసా చింతయన్ హరీం (విష్ణు ధర్మం)” అన్న వాఖ్యము ప్రకారం గజేంద్రుడు శ్రీమన్నారాయణున్ని తన మనస్సులో ధ్యానించాడు.  ఇది “నారాయణావో” అని సర్వరక్షకుడు అయిన నిన్ను నేను పిలిచాను”..

నా పంచేంద్రియాలు నన్ను జయించి నన్ను నియంత్రించే స్థితి ఆత్మకు పూర్తిగా హానికరము, అలా కానివ్వద్దని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. హే యతుల రాజా!!! మీరు తప్పా నన్ను రక్షించగల వారు ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. అందువల్ల, మీరు నన్ను కాపాడాలి”. “ఉన్ పదంగళ్ తన్నై నినైందోలమిట్టాల్” అనే వాఖ్యానికి, “శ్రీ రామానుజుల దివ్య పాద పద్మాలే తనకు ఏకైక ఆశ్రయం” అని తన మనస్సులో మాముణులు భావించి, వారి గురించి వారి  దివ్య పాద పద్మాలను అమితంగా ధ్యానిస్తూ “శ్రీ రామానుజా” అని ఆర్తితో పిలిచారు.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2017/02/arththi-prabandham-42/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

ఆర్తి ప్రబంధం – 41

Published by:

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

ఆర్తి ప్రబంధం

<< ఆర్తి ప్రబంధం – 40

పరిచయము:

శ్రీ రామానుజుల మనస్సులో ప్రశ్న ఉందని ఊహించి మాముణులు ఇస్తున్న సమాధానము ఈ పాశురము. ప్రశ్న ఈ విధంగా ఉంది. “హే మాముని! నీవు నీ అపరాధాలను చూడకుండా  పెద్ద అనుకూలతను అనుగ్రహించమని కోరుతున్నావు. ఇది చేయ గలిగేదేనా”? అని శ్రీ రామానుజులు ప్రశ్నిస్తున్నారు. దానికి మాముణులు సమాధానమిస్తూ – “స్వామీ! దయచేసి నాపై కనికరం చూపండి. ఈ ప్రకృతి సంబంధము నాచే అనేక అపరాధములు చేయించింది. పాపాలు చేయడంలో నాకు సాటిలేరు ఎవరూ. ప్రతి జీవిని రక్షించి వారందరికీ ముక్తి కల్పించడానికి మీరు ఈ ప్రపంచంలో అవతరించారు. అందువల్ల, మీ ఆశీర్వాదాలను నాపై కురిపించాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను”.

పాశురము 41:

ఎన్నైప్పోల్ పిళై శెయ్వార్ ఇవ్వులగిల్ ఉణ్డో?
ఉనైప్పోల్ పొరుక్కవల్లార్ ఉణ్డో?
అనైత్తులగుం వాళప్పిఱంద ఎతిరాశా మామునివా
ఏళైక్కు ఇరంగాయ్ ఇని

ప్రతి పద్ధార్ధములు:

ఇవ్వులగిల్ ఉణ్డో? – ఈ విశ్వం మొత్తాన్ని వేదికినా
శెయ్వార్ – చేసేవారు
పిళై– పాపాలు
ఎన్నైప్పోల్ – నా వంటి?
ఉనైప్పోల్ – మీలా ఇంకొకటి ఉందా?
పొరుక్కవల్లార్ ఉణ్డో?– ఓపికగా సహిస్తూ  (జనుల అపరాధాలను)?
ఎతిరాశా  – “ఎతిరాశా” అని పేరు ఉన్న
మా – గౌరవనీయులు
మామునివా– యోగులలో సమూహంలో అగ్రగామిగా గౌరవించబడు !!!
ప్పిఱంద– మీ అవతారానికి కారణము
అనైత్తులగుం – (అందరూ) అన్ని లోకాలు
వాళ  – జీవించి (ముక్తి మార్గములో)
ఇరంగాయ్ ఇని – దయచేసి మీ కృప చూపించండి!!!
ఏళైక్కు – చపలం అని పేర్కొనబడే నేను (తాను చూసిన ప్రతీదీ కావాలని కోరుకునే వ్యక్తి)

సరళ అనువాదము:

ఈ పాశురములో, మాముణులు తన కంటే ఎక్కువ పాపాలు చేసిన వారెవరు లేరని చెబుతున్నారు. అలాగే, ఓపికగా క్షమించి స్వీకరించే గొప్ప వ్యక్తి శ్రీ రామానుజులు తప్ప మరెవరూ లేరని వారు తెలుపుతున్నారు. కాబట్టి, తాను చేసిన అసంఖ్యాక పాపాల కారణంగా తనను విశేషముగా ఆశీర్వదించమని శ్రీ రామానుజులను అభ్యర్థిస్తున్నారు. ఈ ప్రపంచంలో శ్రీ రామానుజుల అవతారానికి గల మొట్ట మొదటి కారణం అందరినీ ఉద్ధరించడమేనని వారు వివరిస్తున్నారు. అందుకని తనకు సహాయం చేయమని మాముణులు శ్రీ రామానుజులను వేడుకుంటున్నారు.

వివరణ: 

ఒక వ్యక్తి యొక్క అల్పత్వము  గురించి రామానుజ నూఱ్ఱందాది 48 “నిగరిన్ఱి నిన్ఱ ఎన్ నీశదైక్కు” నుండి ఒక ఉల్లేఖన ఇస్తున్నారు. “పాపాలకు సంబంధించి నాతో తరితూగే వ్యక్తిని వెదకడానికి వెళితే, ఆ వ్యక్తి ఖాళీ చేతులతో తిరిగి రావలసిందే”, “పాపాలు చేయుటలో తనకి మించిన వారు లేరు”, అని మాముణులు చెబుతున్నారు. రామానుజ నూఱ్ఱందాదిలోని అదే పాశురములో “అరుళుక్కుం అహ్ దే పుగల్” అని మరొక వాఖ్యము ఉంది. అనగా, పాపముల వ్యవహరణలో మరియు వాటిని శాంతముగా ఓర్చుకోవడంలో శ్రీ రామానుజులకు సాటి ఉన్న వారు ఈ విశ్వములోనే లేరు అని అర్థము. “హే ఎంబెరుమానారే!!! తమరు నిరంతరము సమస్త లోకాలలోని ప్రతి వస్తువుని మరియు ప్రతి వ్యక్తిని ఈ బంధాల సంకెళ్ళ నుండి ఎలా విముక్తులను చేయాలనే ధ్యానిస్తుంటారు”, అని మాముణులు కీర్తిస్తున్నారు. ఇదే మీ అవతార రహస్యము. వాళ్ళని మెరుగుపరచి ఎలా విముక్తులను చేయాలా నని నిత్యము వారు ఆలోచిస్తుంటారు. అందువల్ల, మీ కృపని నాపై కురిపించమని వేడుకుంటున్నాను. నేను నిరుపేద వర్గానికి చెందినవాడిని. (ఇక్కడ నిరుపేద అనగా  మనస్సు యొక్క బలహీన స్థితిని సూచిస్తుంది. చూసిన ప్రతిదాన్ని అనుభవించాలని మనస్సు కోరుకుంటుంది. ఈ స్థితిని “చపలం” అని పిలుస్తారు).

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2017/02/arththi-prabandham-41/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

ఆర్తి ప్రబంధం – 40

Published by:

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

ఆర్తి ప్రబంధం

<< ఆర్తి ప్రబంధం – 39

పాశురము 40:

అవత్తే పొళుదై అడియేన్ కళిత్తు
ఇప్పవత్తే ఇరుక్కుం అదు పణ్బో?
తివత్తే యాన్ శేరుం వగై అరుళాయ్ శీరార్ ఎతిరాశా
పోరుం ఇని ఇవ్వుడంబై ప్పోక్కు

ప్రతి పద్ధార్ధములు:

అడియేన్ – నేను, నిత్య దాసుడను (శ్రీ రామానుజులకు)
అవత్తే కళిత్తు– అలా వృధా చేశాను
పొళుదై – పాద పద్మాల యందు దాసుడిగా గడపాల్సిన ఆ విలువైన కాలము (శ్రీ రామానుజుల).
పణ్బో? – (ఓ శ్రీ రామానుజ!!) మీ హోదాకి గుణాలకి సరి తూగుతుందా?
ఇరుక్కుం అదు – నేను ఉండాలంటే
ఇప్పవత్తే – ఈ సంసారం ఒక శత్రువు (నాకు మీ నిత్య సేవ చేయనీయకుండుట వల్ల).
శీరార్ ఎతిరాశా – ఓ యతిరాజా! శుభ గుణాలతో నిండి ఉన్న
ప్పోక్కు– నాశనము
ఇని ఇవ్వుడంబై – ఈ దేహము మరియు
అరుళాయ్ – దయచేసి ఆశీర్వదించండి
యాన్– నేను
శేరుం వగై – చేరుకోవడానికి  సాధనముగా
అవత్తే – పరమపదము
పోరుం – “సంసారం” అనే ఈ చరసాల నాకు సరిపోతుంది.

సరళ అనువాదము:

మాముణులు చాలా కాల వృధా చేసారని బాధపడుతూ, ఆ సమయము తమ స్వామి అయిన శ్రీ రామానుజులను సేవించగలిగి ఉండేవారని భావిస్తున్నారు. ఈ భౌతిక ప్రపంచంలో శాశ్వతంగా ఉండాలని అనుకుంటున్న ఈ శరీరాన్ని తాను ఎందుకు ముక్కలుగా నరకలేదో వారు రామానుజులను ప్రశ్నిస్తున్నారు. అలా చేయగలిగితే, తాను ఎప్పటినుంచో ఆరాటపడుతున్న పరమపదానికి వెళ్లగలిగితే, అక్కడ శ్రీ రామానుజులకు నిత్య సేవ చేయగలడు అని తెలుపుతున్నారు.

వివరణ: 

మాముణుల ఇలా అభ్యర్థిస్తున్నారు – “హే శ్రీ రామానుజా! మీకు సేవ చేయడానికే నేను పుట్టాను. అయితే ఇన్ని సంవత్సరాలు, నేను మీకు నిరంతరాయంగా సేవ చేయగలిగిన సువర్ణ సమయాన్ని వృధా చేశాను. నేను ఈ సంసారంలో కూరుకుపోయి ఉన్నాను. ఈ ప్రాపంచిక లోకములో నేను ఎప్పటికీ ఇక్కడే ఉండాలనేది మీ కృపకి సరితూగదు. అందువల్ల, మిమ్ములకు నిరంతరం సేవచేసుకునే అవకాశ భాగ్యము నిత్యము రెట్టింపు అయ్యే ప్రదేశమైన పరమపద మార్గాన్ని నాకు అనుగ్రహించమని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. “పరమపదం ఎన్నుం తివం” అని వర్ణించబడుతున్న ఆ ప్రదేశానికి వెళ్ళాలని పరితపించి ఉన్నాను. కానీ అలా జరగాలంటే, హే ఎంబెరుమానారే! యతుల నాయకుడా! మంగళ గుణాల సంపూర్ణుడా! ఇక ఈ సంసారంలో నా బసను ముగించమని అభ్యర్థిస్తున్నాను. అజ్ఞానానికి మూలమైన ఈ దేహము, మీకు శాశ్వతమైన సేవకి అవరోధమైన ఈ దేహము, ఈ ప్రపంచంలో ఆత్మతో కలిసి జీవిస్తున్న ఈ నా దేహాన్ని నాశనం చేయమని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. మీ సేవ చేయడమే అత్యున్నత లక్ష్యము, దయతో అనుగ్రహించమని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను ”. ఈ పాశురాన్ని మరో రకంగా కూడా పఠిస్తారు, అనగా, “అడియేన్ ఇప్పవత్తే ఇరుకుమదు పణ్బో?” – ఈ ప్రపంచంలో ఉండడం నా గుణ చిహ్నమా అని మాముణులు శ్రీ రామానుజులను ప్రశ్నిస్తున్నారని దీనికి మనము అర్థం చెప్పుకోవచ్చు.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2017/02/arththi-prabandham-40/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

ఆర్తి ప్రబంధం – 39

Published by:

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

ఆర్తి ప్రబంధం

<< ఆర్తి ప్రబంధం – 38

పరిచయము:

ఈ పాశురములో, మాముణులు తమ దగ్గరలో ఉన్న ఒక సమూహానికి కలిగిన ప్రశ్నకి సమాధానమిస్తున్నారు.  మాముణుల దగ్గర ఉన్న వాళ్ళు వారిని “హే మాముని!!! మీ మునుపటి పాశురములో శ్రీ రామానుజుల (“ఉన తాళ్ ఒళిదవఱ్ఱయే ఉగక్కుం”) దివ్య పాద పద్మాలు తప్పా మిగతా వాటిపై మీ మనస్సు మరలుతుందని మీరు అన్నారు. ఇలా ఉన్న మీరు ఆ అల్ప ప్రాపంచిక విషయాలన్నిటితో జతబడి ఉన్నారు కాబట్టి,  ఏ సారము లేని  మిమ్మల్ని శ్రీ రామానుజులు ఎలా స్వీకరించారు? లౌకిక సంబంధము కారణంగా ప్రతికూల నడవడితో నిండి ఉన్న మిమ్మల్ని శ్రీ రామానుజులు ఎలా ఆమోదించారు”? మాముణులు సమాధానమిస్తూ, “నేను వారి పాద పద్మాల యందు శరణాగతులైన సమయంలో, ఎన్నో విరుధ అంశాలతో నిండి ఉన్న నన్ను చూసి వారు తమ భోగ్య వస్తువులుగా స్వీకరించారు. వాటిని వారు అనుకూలముగా భావించి నన్ను స్వీకరించారు”. మాముణులు ఒక ఉదాహరణ ఇస్తూ ఈ విషయాన్ని నిరూపింస్తున్నారు.

పాశురము 39:

వేంబు కఱియాగ విరుంబినార్ కైత్తెన్ఱు
తాం పుగడాదే పుశిక్కుం తన్మైపోల్
తీంబన్ ఇవన్ ఎన్ఱు నినైత్తు ఎన్నై ఇగళార్ ఎతిరాశర్
అన్ఱు అఱిందు అంగీకరిక్కైయాల్

ప్రతి పద్ధార్ధములు:

విరుంబినార్ తాం – ఆనందించే వారు
వేంబు – వేప ఆకులు
కఱియాగ – పక్కన కూరతో నంచుకొనేటట్టుగా
పుగడాదే – వాటిని పారి వేయరు
కైత్తెన్ఱు–  “చేదుగా ఉంటుందని” అనుకొని.
పుశిక్కుం – ఎంతో ఆనందంగా తింటారు
తన్మైపోల్– ఇది ఆ వ్యక్తుల స్వభావము

(అదేవిధంగా)
ఎతిరాశర్– ఎంబెరుమానారే!!!
ఇగళార్ – నన్ను త్యజించరు
నినైత్తు – అని అనుకొని
ఎన్నై – నేను (మాముణులు)
తీంబన్ ఇవన్ ఎన్ఱు  – పాపాత్ముడను
అన్ఱు – వారికి శరణాగతి చేసిన ఆ రోజు
అఱిందు – నేను పాపాత్ముడిని అని తెలిసి కూడా
అంగీకరిక్కైయాల్– వారు నా పాపాలను తన ఆనందముగా భావించారు, నన్ను సంతోషంగా స్వీకరించారు.

సరళ అనువాదము:

మాముణులు ఈ పాశురములో శ్రీ రామానుజుల వాత్సల్య గుణాన్ని కీర్తిస్తున్నారు. వారు తన పాపాలను తన భోగ్య వస్తువుగా భావించారని వివరిస్తున్నారు. కొంతమంది తమ భోజనములో వేప ఆకులు ఉంటే, అవి చేదని తీసి పారేయకుండా యిష్టంగా భుజిస్తారు, అన్న ఉదాహరణను వారు ఉల్లేఖిస్తున్నారు.

వివరణ: 

తిరుమళిశై ఆళ్వార్ల నాన్ముగన్ తిరువందాది పాశురము 94 – “వేంబుం కఱియాగుమెన్ఱు” ప్రకారం, కొంతమంది వేపను, వేప ఆకులను కాయ కూరలాగా తమ భోజనములో భాగముగా భుజిస్తారు. మాముణులు ఈ పాశురాన్ని ఉల్లేఖిస్తూ తమ విషయాన్ని నిరూపిస్తున్నారు.  “కొంతమంది  తీపి కాని చేదు ఆహార పదార్థాలను ఇష్థపడుతుంటారు. అలాంటి వాళ్ళు చేదు వస్తువులైన వేపను తమ ఆహారములో కలిపి తింటుంటారు. వారు స్వయంగా వాటిని సేకరించి వాటిని యిష్టపడి తింటుంటారు. చాలా చేదుగా ఉంది అని తలచుకుంటూ మరి తింటుంటారు. అదేవిధంగా, నేను నా స్వామి అయిన శ్రీ రామానుజుల దివ్య పాద పద్మాలకు శరణాగతి చేసినప్పుడు, నేను పాపాలతో నిండిన వాడనని వారికి తెలుసు. అయినా కానీ వారు నేను పాపినని నిర్లక్ష్యము చేయలేదు. బదులుగా వారు నాలోని ఆ అపరాధాలను మరియు పాపాలను తమ భోగ్య వస్తువుగా భావించారు”, అని మాముణులు వివరిస్తున్నారు.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2017/02/arththi-prabandham-39/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org