శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
పరిచయము
మునుపటి పాశురములో, మాముణులు “ఇన్ఱళవుం ఇల్లాద అధికారం” అనే వాఖ్యాన్ని ఉపయోగించారు. ఈ పాశురములో, వారు శాస్త్రము ద్వారా కారణములు మరియు అన్వయములు ఉపయోగించి శోదిస్తున్నారు.
పాశురము 38
అంజిల్ అఱియాదార్ ఐంపతిలుం తాం అఱియార్
ఎన్శొల్ ఎనక్కో ఎతిరాశా! – నెంజం
ఉన తాళ్ ఒళిందవఱ్ఱైయే ఉగక్క ఇన్ఱుం
అనుతాపం అఱ్ఱు ఇరుక్కైయాల్
ప్రతి పద్ధార్ధములు
ఎతిరాశా! – ఎంబెరుమానారే!!!
నెంజం– మనస్సు, అల్పమైన విషయాలలో నీండా మునిగిన
ఉగక్క – ఆరాటపడుతూ
ఒళిందవఱ్ఱైయే – సరిహద్దు బయట ఉన్న విషయములు
ఉన– నీవు, మనకు అంతిమ గమ్యమైన మన స్వామి
తాళ్– మీ పాద పద్మములు, నిత్యానందానికి మూల బిందువు.
ఇన్ఱుం– ఇప్పటికీ కూడా (ఈవేళ)
ఇరుక్కైయాల్– నేను ఉన్నాను
అఱ్ఱు – ఏదీ లేకుండా
అనుతాపం – ఈ ప్రపంచంలోని అత్యంత అల్ప విషయాల ఆసక్తిపై ఎందుకు నా మనస్సు దిగజారిందనే ఒక భావన.
ఎన్శొల్ – ఒక ప్రసిద్ద సామెత ఉంది
అఱియాదార్ – ఏమీ జ్ఞానము/అర్థము చేసుకోనివారు
అంజిల్– ఐదు సంవత్సరాల వయస్సు, మనిషికి బుద్ధి వికసించే వయస్సు
ఐంపతిలుం – యాభై సంవత్సరాల వయస్సు ఉన్నవారు కూడా
తాం అఱియార్ – అర్థము చేసుకోలేరు
ఎనక్కో– ఈ సామెత నా కోసమే సృష్థించారా?
సరళ అనువాదము:
ఈ పాశురములో, మాముణులు ఒక ప్రసిద్ధ సామెతను ఇలా ఉల్లేఖిస్తున్నారు, “ఐదు సంవత్సరాల వయస్సులో విషయాలను నేర్చుకోలేని వ్యక్తి యాభై ఏళ్ళ వయస్సులో కూడా నేర్చుకోలేడు”. ఈ ప్రపంచంలోని అన్ని అణగారిన విషయాలను పొందాలని తన మనస్సు పరితపిస్తుందని, అలా ఉంటున్నందుకు పశ్చాత్తాపము కూడా పడట్లేదని వారు వివరిస్తున్నారు. ఈ లౌకిక అజ్ఞానం మరియు అంధకారంలో మునిగి ఉన్న తనని రక్షించమని శ్రీ రామానుజుల దివ్య పాద పద్మాల యందు శరణాగతి చేస్తున్నారు.
వివరణ:
మాముణులు ఇలా వివరిస్తున్నారు – “హే యతులకు నాయకుడా !!! “తీమణం (తిరువాయ్మొళి 2.7.8)” ప్రబంధములో చెప్పినట్లుగా నా మనస్సు ఈ లౌకిక అల్ప విషయాలలో మునిగి ఉంది. నమ్మాళ్వార్లు “యాదానుం పఱ్ఱి నీంగుం (తిరువిరుత్తం 95)” లో చెప్పినట్లుగా, నా మనస్సు నిరంతరం ఈ ప్రపంచంలోని అల్ప విషయాలను వెదుకుతూ వాటి పట్ల సంబంధాన్ని పెంచుకుంటుంది. నిరంతరం మనస్సు మీ పాద పద్మాల యందు దృష్టి పెట్టాలి, కానీ దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తుంది. ఈ ప్రపంచంలోని అన్ని అణగారిన విషయాలను ఆరగించి, అవే తన తుది గమ్యస్థానంగా భావించి వాటి ఆకర్షణకి లొంగిపోతుంది. అలా ప్రవర్తించి, మనస్సు తన హీన ప్రవర్తనకు బాధ కూడా పడటం లేదు. ఎన్నడూ పశ్చాతాప పడి దాన్ని సరిదిద్దుకోవాలని ప్రయత్నమూ చేయుటలేదు. బదులుగా అది ప్రపంచంలోని భోగ్య విషయాలకై ఆరాటపడుతుంది. “తస్మాత్ బాల్యే వివేకాత్మా” అనే వాఖ్యము ప్రకారం, విషయాల మధ్య వ్యత్యాసము గుర్తించడానికి మనిషిలో బుద్ధి వికసించేది ఐదేళ్ల వయస్సులో అని పరిగణించారు మన పెద్దలు. ఆ ఐదేళ్ల వయసులో, ప్రపంచంలోని తేడాలను నేర్చుకొని అర్థం చేసుకోలేకపోతే, యాభై ఏళ్లు నిండినప్పటికీ అతను అర్థం చేసుకోలేడు. ఇది పాత కాలంగా వాడుకలో ఉన్న ఒక ప్రసిద్ధ సామెత. ఇది నా కోసం ప్రత్యేకంగా సృష్టించబడిందా అని నేను ఆశ్చర్యపోతున్నాను, ఎందుకంటే ఇది నాకు ఖచ్చితంగా వర్తిస్తుంది అని వారు వివరిస్తున్నారు. నాకు ఏది మంచిదో నాకు తెలియదు. అందువల్ల, సర్వశక్తి సంపన్నుడు అయిన నా స్వామి శ్రీ రామానుజులను నాకు ఒక మార్గము చూపించమని నేను అభ్యర్థిస్తున్నాను. “నెంజముం తానొళిందవఱ్ఱైయే ఉగక్కుం”. “ఒక వ్యక్తి ఐదేళ్ల వయసులో నేర్చుకొనక / అర్థం చేసుకోకపోతే, అతడు యాభై ఏళ్ళ వయసులో కూడా అర్థం చేసుకోడు” అని మాముణులు చెప్పినట్లు కూడా దీనిని మనము భావించవచ్చు. అయ్యో! ఈ ప్రపంచంలోని అన్ని భౌతిక విషయాసక్తులకై నా మనస్సు ఆరాటపడుతుంది, పైగా పశ్చాతాప భావన కూడా లేదు. ఈ పశ్చాతాప భావన లేకపోవడం వల్లనే, నా మనస్సు అత్యున్నత గమ్యమైన మీ పాద పద్మాలు తప్పా ఈ విశ్వంలోని ఇతర అన్ని విషయాలకై నా మనస్సు ఆరాటపడుతూ ఉంది.
అడియేన్ శ్రీదేవి రామానుజదాసి
మూలము : https://divyaprabandham.koyil.org/index.php/2017/02/arththi-prabandham-38/
పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org