తిరువాయ్మొళి నూఱ్ఱందాది – సరళ వ్యాఖ్యానము – తనియన్లు

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి క్రమము

తనియన్ – 1

అల్లుమ్ పగలుమ్ అనుభవిప్పార్ తఙ్గలుక్కు 

 చొల్లుమ్ పొరుళుమ్ తొగుత్తురైత్తాన్ – నల్ల 

మాణవాళ మామునివన్ మారన్ మఱైక్కు                                                               

తణవా నూఱ్ఱందాది తాన్ !

 

ప్రతిపదార్థము :

అల్లుమ్ పగలుమ్ = రేయింబవళ్ళు

చొల్లుమ్ పొరుళుమ్ = తిరువాయ్మొళిలోని శబ్దార్థములను

అనుభవిప్పార్ తఙ్గలుక్కు = తిరువాయ్మొళిని అనుభవించేవారికి  

నల్ల = లోక క్షేమాన్ని కోరే మంచి

మానవాళ మామునివన్ త్తాన్= పరమ విలక్షణులైన మణవాళమామునులు

మారన్ = కృపా సముద్రులైన నమ్మాళ్వార్ల

మరైక్కు = సామవేద సారమైన నమ్మాళ్వార్ల తిరువాయ్మొళికి

తణవాగ = పొందికగా

నూఱ్ఱందాది త్తాన్ = తిరువాయ్మొళి నూఱ్ఱందాది

తొగుత్తు = గ్రహించి, కూర్చి

ఉరైత్తాన్ = అనుగ్రహించారు

సంక్షిప్త వివరణ:

తిరువాయ్మొళి ని రాత్రింపగలు వదలకుండా విని దానిలోని అమృతాన్ని పానంచేసి ఆనందించాలన్న కోరిక అందరికి వుంటుంది. అందుకనే పరమ విలక్షణులైన మనవాళ మామునులు ఎంతో కృపతో తిరువాయ్మొళికి  సంగ్రహంగా ‘తిరువాయ్మొళి నూత్తందాది’  అనే గ్రంధాన్ని నూరు పాశురాలతో మనకు అనుగ్రహించారు. 

 

తనియన్ – 2

మన్ను పుగళ్ శేర్ మాణవాళ మామునివన్

తన్ అరుళాల్ ఉట్పోరుళ్గళ్  తన్నుడనే సొన్న

తిరువాయ్మొళి నూఱ్ఱందాదియామ్ తేనై

ఒరువా తరుందు నెంజే ఉఱ్ఱు !

ప్రతిపదార్థము :

నెంజే = ఓ మనసా

మన్ను పుగర్ శేర్ = ఈ లోకంలో స్థిరమైన కీర్తిని కలిగి ఉన్న

మానవాళ మామునివన్ = మానవాళ మామునులు

తన్నరుళాల్ = అపారమైన కృపతో

ఉట్పోరుళ్ గళ్ తన్నుడనే, = గంభీరమైన అర్థాలను

శొన్న = అనుగ్రహించిన

తిరువాయ్మొళి నూఱ్ఱందాది యామ్ తేనై = తిరువాయ్మొళి నూఱ్ఱందాది అనే తేనెను

 ఉఱ్ఱుమ్ = పొంది

ఒరువాద = అవిచ్ఛిన్నంగా

అరున్దు = అనుభవించు  

 సంక్షిప్త వివరణ:

               ఓ మనసా ! ఈ భూలోకంలో గొప్ప పేరుగాంచిన మానవాళ మామునులు చేత ఉజ్జీవనం కోసం ఎంతో కృపతో ఘనమైన తిరువాయ్మొళి నూత్తందాదిని అనుగ్రహించారు. తిరువాయ్మొళిలోని సారమనే తేనెలను నిరంతరం పానం చేసి తరించు.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము: https://divyaprabandham.koyil.org/index.php/2020/10/thiruvaimozhi-nurrandhadhi-thaniyans-simple/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Comment