శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
<< తిరువాయ్మొళి నూఱ్ఱందాది – 51 – 60
అవతారిక: 61
అవతారిక: ఇంద్రియాల వలన ఎంత బాధ పడతామో అని భయపడి మొరపెట్టిన మొరను ఈ శ్రీ సూక్తిలో తెలియజేస్తున్నారు.
ఉణ్ణిలా ఐవరుడన్ ఇరుత్తి ఇవ్వులగిల్
ఎణ్ణిలా మాయన్ ఎన్నై నలియ ఎణ్ణుగిన్ఱాన్
ఎన్ఱు నినైన్దు ఓలమిట్ట ఇన్ పుగళ్ సేర్ మాఱన్ ఎన
కున్ఱి విడుమ్ పవక్ కన్గుల్
ప్రతిపదార్థం :
ఇవ్వులగిల్ = ఈ లోకంలో
ఉళ్ నిలావు = లోపల ఉన్న
ఐవరుడన్ ఇరుత్తి = పంచేంద్రియాలనే శత్రువులతో ఉండేట్లు చేసి
ఎణ్ణిలా మాయన్ = అనంతమైన ఆశ్చర్య గుణాలు గల సర్వేశ్వరుడు
ఎన్నై నలియ = నన్ను బాధించాలని
ఎణ్ణుగిన్ఱాన్ = భావిస్తున్నాడు
ఎన్ఱు నినైన్దు = అని తలచి
ఓలమిట్ట = మొఱ పెట్టగా
ఇన్ పుగళ్ సేర్ = కీర్తి గల
మాఱన్ ఎన = నమ్మాళ్వార్లు
పవక్కన్గుల్ = సంశరమనే కాళ రాత్రి
కున్ఱి విడుమ్ = నశించిపోతుంది
భావము: ఆశ్రితులను రక్షించడం అనాసితులను శిక్షించడం మొదలైన గుణాలు గలవాడై అత్యాశర్యకరమైన చేష్టలను చేస్తూ జగత్ సృష్టి చేసిన సర్వేశ్వరుడు ప్రపత్తి చేసిన నన్ను స్వీకరించలేడు కదా! నన్ను పంచేంద్రియాలనే శత్రువులతో నిండిన ఈ శరీరంలోనే ఉంచి బాధించాలని సంకల్పించాడు అని నిశ్చయించుకొని చాలా భయపడి, అయినా ఆయన సన్నిధిలో మొరపెట్టుతున్న విరాగైన నమ్మాళ్వార్ల ఆర్తిని అనుసంధించినవారు మహా ఘోరమైన ఈ సంసారాన్ని వదిలి ఉత్తమ పురుషోర్ధాన్ని పొందుతారు.
అవతారిక: 62
అవతారిక: ఈ పాసురంలో నాయిక అవస్థలను చూసి తల్లి తల్లడిల్లి పోయి రంగనాథుడి దగ్గర ఈ పిల్ల విషయంలో ఏం చేస్తావు అని అడుగుతున్న విధానాన్ని కృప చేస్తున్నారు.
కన్గుల్ పగలరతి కైవిన్జి మోగముఱ
అన్గదనైక్ కణ్డోర్ అరన్గరైప్ పార్త్తు – ఇన్గివళ్పాల్
ఎన్ శెయ నీర్ ఎణ్ణుగిన్ఱదెన్నుమ్ నిలై శేర్ మాఱన్
అన్జొలుఱ నెన్జు వెళ్ళైయామ్
ప్రతిపదార్థం :
కన్గుల్ పగల్ = రాత్రింబగళ్ళు
అరతి కైవిన్జి = ఆర్తి అధికమై
మోగముఱ = మోహన్ పొంది
అన్గదనైక్కండు = అక్కడ ఆ వస్తువును చూసి
ఓర్ అరన్గరైప్పార్తు = శ్రీరంగనాధుని చూసి
ఇన్గివళ్పాల్ = ఇక్కడ ఈమె విషయంలో
ఎన్ శెయ నీర్ ఎణ్ణుగిన్ఱతు = మీరు ఏమి గెలిచారు
ఎన్నుమ్ నిలై శేర్ = అని తల్లి ప్రశ్నించే దశను పొందిన
మాఱన్ = ఆళ్వార్లు
అన్జొలుఱ = శ్రీ సూక్తిని అనుసంధించగా
నెన్జు వెళ్ళైయామ్ = మనసు పరిశుద్ధమవుతుంది
భావము: భగవంతుని పొందలేక రాత్రింపగళ్ళు మాటలకు అందని బాధని అనుభవించే నాయిక అవస్థను ఆడవాళ్లు పొందారు. నాయకుడైన శ్రీ రంగనాథుడు గురించి ఎన్నో విధాలుగా మొరపెట్టి తెలివి తప్పి అవస్థ పడడం చూసి, ఓ రంగనాథ నీ విషయంలో అతి ప్రావణ్యంతో బాధపడుతున్న ఈ అమ్మాయిని కటాక్షించవా! లేక పిల్లను నశింప చేస్తావా! ఏం చేయదలుచు కున్నావు? అని శ్రీరంగనిధుడితో మొరపెట్టుతున్న తల్లి గారి దశని పొందిన ఆళ్వార్ల శ్రీ సూక్తులు అనుసంధించిన వాళ్ళకి ఉపాయాంతర నిష్ట మొదలైన దోషాలన్నీ నశిస్తాయి అని ఈ పాశురంలో తెలియజేశారు.
అవతారిక: 63
అవతారిక: ఇందులో తెన్ తిరుప్పేరరై నగరం చేత కొల్లగొట్టబడిన మనసు గల వారు చెబుతున్న పాశురాన్ని అనువదించి కృప చేస్తున్నారు.
వెళ్ళియ నామమ్ కేట్టు విట్టగన్ఱ పిన్ మోగమ్
తెళ్ళియ మాల్ తెన్తిరుప్పేర్ శెన్ఱు పుగ – ఉళ్ళమ్ అన్గే
పఱ్ఱి నిన్ఱ తన్మై పగరుమ్ శఠకోపఱ్కు
అఱ్ఱవర్గళ్ తామ్ ఆళియార్
ప్రతిపదార్థం :
వెళ్ళియనామమ్ = హోగ్యమైన భగవాన్ నామాలు
కేట్టు = తల్లి చెప్పగానే
మోగమ్ విట్టగన్ఱ పిన్ = మోహం వదిలిపోయిన తరువాత
తెళ్ళియ మాల్ = వివేకవంతుడైన సర్వేశ్వరుడు
తెన్తిరుప్పేర్ = తెన్తిరుప్పేర్ నగరంలోకి
శెన్ఱుపుగ = పోయ్ ప్రవేశించగా
ఉళ్ళమ్ అన్గే పఱ్ఱి నిన్ఱ తన్మై పగరుమ్= తమ మనస్సు అక్కడ స్థిరంగా నిలిచి ఉండటాన్ని సాధించిన
శఠకోపఱ్కు = ఆళ్వార్ల విషయంలో
అఱ్ఱవర్గళ్ తామ్ = అనన్య అర్హులైన వారు
ఆళియార్ = గంభీర హృదయము గలవారు
భావము: సర్వేశ్వరుడి కళ్యాణ గుణాలను చుట్టుపక్కల వారు అనుసంధిచారు. వాటిని వినగానే అంత వరకు ఉన్న మొహాన్ని తొలగించుకొని ఆశ్రిత రక్షణార్థం ఆ సర్వేశ్వరుడు వేంచేసి ఉన్నతెన్ తిరుప్పేర్ దివ్య దేశం చేరడానికి ప్రయత్నించగా అప్పుడు తల్లిగారు అడ్డుకున్నారు. వాళ్ళ మాట వినకుండా తన మనసు అక్కడ వేంచేసి ఉన్న పెరుమాళ్ళ మీద అనురాగం కలిగి ఉంది అని నమ్మాళ్వార్లు ఈ పాశురములో చెప్పారు. జ్ఞాన భక్తి ఆది సకల గుణ సంపన్నులు ఆయనకు అంతరంగ భక్తులవుతారు.
అవతారిక: 64
అవతారిక: భగవంతుడి విజయ పరంపరలను నమ్మాళ్వార్లు చెప్పిన విధానాన్ని ఇక్కడ అనుగ్రహించారు.
ఆళివణ్ణన్ తన్ విసయమ్ ఆనవై ముఱ్ఱుమ్ కాట్టి
వాళ్ ఇదనాల్ ఎన్ఱు మగిళ్న్దు నిఱ్క – ఊళిల్ అవై
తన్నై ఇన్ఱు పోల్ కణ్డు తాన్ ఉరైత్త మాఱన్ సొల్
పన్నువరే నల్లదు కఱ్పార్
ప్రతిపదార్థం :
ఆళివణ్ణన్ = సముద్ర వరుడైన భగవంతుడు
తన్ విసయమ్ ఆనవై ముఱ్ఱుమ్ కాట్టి = తన విజయ పరంపరలను పూర్తిగా చూపి
ఇదనాల్ వాళ్ ఎన్ఱు = దీనితో సుఖముగా జీవించమని (ఆళ్వార్లకు కృప చేసి)
మగిళ్న్దు నిఱ్క = సంతోషించి ఉండగా
ఊళిల్ అవై తన్నై = గతానికి చెందిన అపదానాలను
ఇన్ఱు పోల్ కణ్డు = వర్తమానంలో జరుగుతున్న వాటి లాగా కనిపింపచేసి
తాన్ ఉరైత్త = తమ అనుభవాలను తెలియపరచడానికి కృప చేసిన
మాఱన్ సొల్ = ఆళ్వార్ల తిరువాయ్ మొళి
పన్నువరే = అనుసందించువారే
నల్లదు కఱ్పార్ = విలక్షణమైన శ్రీ సూక్తులను అభ్యసించిన వారు అవుతారు
భావము: భగవంతుడు ఆళ్వార్ల ఆర్తి తొలగించడానికి తన విజయ పరంపరాలను పూర్తిగా సాక్షాత్కరింపచేసి, ‘వీటిని అనుభవిస్తూ మీరు సుఖంగా ఉజ్జీవించండి’ అని కటాక్షించారు. నమ్మాళ్వార్లు తాము భూతకాలంలో జరిగిన వాటిని, వర్తమానంలో జరుగుతున్న వాటిని దర్శించారు. ఆ అనుభవాన్ని వాగ్రూపంలో కృప చేసి’ ఆళియెళ ‘ అనే తిరువాయ్ మొళిని అనుసంధించారు. దీనిని తెలుసుకున్నవారు తమకు ఇష్టమైన హితమైన శాస్త్ర జ్ఞానాన్ని అభ్యసించిన వారు అవుతారు.
అవతారిక: 65
కఱ్ఱోర్ కరుదుమ్ విసయన్గళుక్కెల్లామ్
పఱ్ఱామ్ విభవ గుణప్ పణ్బుగళై – ఉఱ్ఱుణర్న్దు
మణ్ణిల్ ఉళ్ళోర్ తమ్ ఇళవై వాయ్న్దురైత్త మాఱన్ సొల్
పణ్ణిల్ ఇనిదాన తమిళ్ పా
ప్రతిపదార్థం :
కఱ్ఱోర్ = సకల శాస్త్రాలు, వాటి తాత్పర్యాలు అభ్యసించిన వారైనా దశరథ వసుదేవాదులు
కరుదుమ్ = ఆదరించిన
విశయన్గళుక్కెల్లామ్ = విజయ్ గాధ అన్నిటి కిని
పఱ్ఱామ్ = ఆశ్రయమైన
విభవ గుణప్ పణ్బుగళై = విభవ అవతార గుణ స్వభావములను
ఉఱ్ఱుణర్న్దు = బాగుగా అభ్యసించి, తెలుసుకొని
మణ్ణిల్ ఉళ్ళోర్ తమ్ ఇళవై = భూమిపై ఉన్నవారు భగవద్ అనుభవమును చేజార్చుకొనిన ప్రకారమును
వాయ్న్దురైత్త = అనుభవించి కృప చేసిన
మాఱన్ శొల్ = నమ్మాళ్వార్ తిరువాయ్ మొళి
పణ్ణిల్ ఇనిదాన = రాగ తాళ యుక్తమైన పరమ భోగ్యమైన
తమిళ్ పా = ద్రావిడ బ్రహ్మ సంహిత
భావము: సకల శాస్త్రవేత్తలైన దశరథ వాసుదేవాదులు ఎంతో ఆదరంతో ప్రశంసించిన అవతారాలలోని దివ్య చేష్ఠితాలకు మూలభూతుడైన, భగవంతుడి కళ్యాణ గుణాలను బాగా తెలుసుకోవాలి. దానికి బదులుగా ఇటువంటి గొప్ప గుణాలను చేజార్చుకున్న లోకులు చెడిపోతున్నారే! అని వీరి వైముఖ్యాన్ని ప్రతిపాదిమచ్చారు. నమ్మాళ్వార్ల తిరువాయ్ మొళికి రాగ తాళయుక్తంగా, పరమ భోగ్యంగా, ద్రావిడ చందో రూపంలో ఉన్నటువంటిది. దీనిని అందరూ అభ్యసించడానికి అనుకూలంగా ఉందని మనవాళమామునులు ఆనందిస్తున్నారు.
అవతారిక: 66
అవతారిక: ఇందులో ఎంబెరుమానార్ గుణాలను చెప్పి మొరపెట్టుకుంటున్న ‘పామరుమూవులకమ్‘ అనే తిరువాయ్ మొళికి సంక్షిప్త రూపం. బాణపు దెబ్బ తిన్న వారిలాగా పడి వుంది బాధపడే స్థితిని తెలియజేసే దశకం అర్థాన్ని ఈ ‘పామరువువేతమ్’‘ అనే పాశురంలో తెలియజేశారు.
పామఱువు వేదమ్ పగర్మాల్ గుణన్గళుడన్
ఆమళగు వేణ్డర్పాడామ్ అవఱ్ఱైత్ – తూమనత్తాల్
నణ్ణియవనైక్ కాణ నన్గురుగిక్ కూప్పిట్ట
అణ్ణలై నణ్ణార్ ఏళైయర్
ప్రతిపదార్థం :
మాల్ గుణన్గళుడన్ = భవ్యమైన కళ్యాణ గుణములతో ఉన్న
ఆమళగు వేణ్డర్పాడామ్ అవఱ్ఱైత్ = చక్కని అందం పరత్వము అనెడి వాటిని
తూమనత్తాల్ నణ్ణి = పరిశుద్ధ అంతఃకరణ సాక్షాత్కారము చేత చేరి అనుభవించి
అవనైక్కాణ = వెనుక చెప్పిన గుణవిశిష్టుడైన అతడిని ప్రత్యక్షంగా చేరి అనుభవించ గోరి
నన్గురుగి = పూర్తిగా కరిగి నీరై
క్కూప్పిట్ట = అయ్యో అని మొరపెట్టిన
అణ్ణలై = స్వామి అయిన నమ్మాళ్వార్లను
నణ్ణార్ = ఆశ్రయించని వారు
ఏళైయర్ = దీనులే
భావము: ఈ పాశురంలో సర్వలక్షణ సంపన్నమై, వేదములచేత ప్రతిపాదింపబడిన ఎంబెరుమాన్ సౌందర్యం, దివ్య మంగళ విగ్రహ గుణాలు, పరత్వాది దివ్యాత్మ గుణాలు, మానస సాక్షాత్కారాన్ని పొంది అనుభవించారు. దానినే బాహ్య సాక్షాత్కారములో అనుభవించాలని ఆశించారు. కానీ లభించక నమ్మాళ్వార్ దుఃఖితులై, శిథిలమై ఆక్రోశిస్తున్నారు. అంతటి పరమ పావనమైన నమ్మాళ్వార్లను ఆశ్రయించకుండా లోకులు అన్య విషయాలపై వ్యామోహం పెంచుకుని, దీనంగా దుఃఖిస్తున్నారు అని మామనులు ఈ పాశురంలో అనుగ్రహించారు.
అవతారిక: 67
అవతారిక: పరమాత్మ కళ్యాణ గుణాలు అవయవ శోభ అన్నీ కలిసి బాధించగా, దుఃఖితురాలైన నాయక స్వామివారి లావణ్యాన్ని చూసి, విశ్లేష బాధను అనుభవించింది. ఈ విషయాన్ని ‘ఏళైయరావి’ అనే దశకంలో ఆళ్వార్లు వర్ణించారు. దాన్ని సంక్షిప్త రూపమే ఈ పాశురంగా అమరింది.
ఏళైయర్గళ్ నెన్జై ఇళగువిక్కుమ్ మాలళగు
సూళ వన్దు తోన్ఱిత్ తుయర్ విళైక్క – ఆళుమనమ్
తన్నుడనే అవ్వళగైత్ తాన్ ఉరైత్త మాఱన్పాల్
మన్నుమవర్ తీవినై పోమ్ మాయ్న్దు
ప్రతిపదార్థం :
నెజ్ఞు = మనసు
ఇళగువిక్కుమ్ = ద్రవింప చేస్తున్న
మాలళగు = ఎంబెరుమాన్ సౌందర్యం
శూళ వన్దు తోన్ఱి = ఎటు చూసినా కనపడి
తుయర్ విళైక్క = విశ్లేష దుఃఖాన్ని కలిగించగా
ఆళుమనమ్ తన్నుడనే = ఆ దుఃఖ సముద్రంలో మునిగి ఉన్న
అవ్వళగై = ఆ సౌందర్యాన్ని
తామ్ ఉరైత్త = తానే అనుభవించి కృప చేసిన
మాఱన్పాల్ = నమ్మాళ్వారును
మన్నుమవర్ = స్థిరంగా ఆశ్రయించి ఉన్న వారి
తీవినై = పాపాలు
మాయ్న్దు పోమ్ = నశించిపోతాయి
భావము: సర్వేశ్వరుడి దివ్య మంగళ విగ్రహ సౌందర్యం అంతట కనపడుతుంటే, దాన్ని ప్రత్యక్షంగా అనుభవించడానికి సాధ్యం కాక, మానస సాక్షాత్కార సౌందర్యమే అయింది. అందు వల్ల ఆర్తితో నమ్మాళ్వారు ఎంబెరుమాన్ సౌందర్యాన్ని ‘ఎళైయరావి ‘ అనే దశకంలో పాడారు. ఆ దశకనికి సంక్షిప్త రూపమైన ఈ ‘ఏళైయర్గళ్ నెన్జై’ అనే పాశురంలో మామునులు అనుగ్రహించారు. దీనిని అర్థంతో తెలుసుకుని అనుసంధానం చేసిన వాళ్ళు అంతరంగిక భక్తులు అవుతారు. ఇంకా వారు అన్ని ప్రతిబంధాల నుంచి విముక్తులవుతారు అని ఈ పాశురంలో మామునులు తెలియజేశారు.
అవతారిక: 68
అవతారిక: ‘మాయామల్ తన్నై వైత్త’ అనే దశకంలో నమ్మాళ్వార్లు సర్వేశ్వరుడు దర్శింపజేసిన విచిత్ర జగదాకారతను అనుభవించి ఆశ్చర్యంతో పాశురాలను కృప చేశారు.
మాయామఱన్నై వైత్త వైశిత్తిరియాలే
తీయా విశిత్తిరమా చ్చేర్ పొరుళో డాయామల్
వాయ్న్దు నిఱ్కు మ్మాయన్ వళమురైత్త మాఱనై నామ్
ఏయ్న్దురైత్తు వాళునాళ్ ఎన్ఱు
ప్రతిపదార్థం:
మాయామల్ తన్నై వైత్త = తమ శేషత్వ స్వరూపం పోకుండా తమను నిలిపిన
వైశిత్తిరియాలే = విచిత్రాకారత వలన
తీయా విశిత్తిరమా = అగ్ని ఆది పంచభూతాల వ్యవహారం దేనికదే ఉండే విధంగా
శేర్ పొరుళోడు = చేతన వర్గాలు కూడా అదే విధంగా వేరు వేరు రూపాలు కలవి గనుక విచిత్రమైన పదార్థాలతో
ఆయామల్ = వాటిలో ఉండే దోషాలను లెక్క చేయకుండా
వాయ్న్దు నిఱ్కుమ్ = కలిసి ఉన్న
మాయన్ వళమ్ = సర్వేశ్వరుడు విభూతి సారాన్ని
ఉరైత్త = కృప చేసిన
మాఱనై = నమ్మాళ్వార్లను
నామ్ ఏయ్న్దురైత్తు = మనం ఆశ్రయించిన వారి తిరునామాలను చెప్పి
వాళుమ్ నాళ్ ఎన్ఱు = ఉజ్జీవించే సమయం ఎప్పుడు వస్తుందో కదా!
భావము: ఆకించన్యం, అనన్యగతిత్వం, ఆర్తి మొదలైన అధికార పూర్తి గల నన్ను శరణుడు, సమర్ధుడు అయిన సర్వేశ్వరుడు శ్రీవైకుంఠానికి తీసుకొని పోకుండా, ఈ లీల విభూతిలోనే ఎందుకు ఉంచాడో!’ అని ఆశ్చర్యంగా ఉంది. దీనికి కారణం ఏమిటని ఆలోచిస్తే సర్వేశ్వరుడు అతి విచిత్రమైన తన విభూతిని దర్శింప చేయగా, అక్కడ కనపడుతున్న పృధి వ్యాది పదార్థాలలో అంతర్యామిగా ఉన్న సర్వేశ్వరుడు విభూతులను దర్శించి, అనుభవింప జేశాడు. ఆ అనుభవాన్ని ఆళ్వార్లు ‘మాయావామన’ అనే దశకంలో కృప చేశారు. అలాంటి నమ్మాళ్వార్లను ఆశ్రయించి, వారి కళ్యాణ గుణాలను అనుసంధించుకుంటూ ఉజ్జివించడం ఎప్పటికీ జరుగుతుందో !’ అని ఆళ్వార్ల గుణం మీద మామునులు అభినివేశం చెందుతున్నారు.
అవతారిక: 69
అవతారిక: ఇందులో సర్వేశ్వరుడు నమ్మాళ్వార్లతో తిరువాయ్ మొళి పాడించుకుని ఆనందించిన విధానాన్ని అనుసంధానం చేసుకుని అధ్యవశాయాన్ని పొందడాన్ని తెలియజేశారు. సర్వేశ్వరుడు చేసిన మహోపకారానికి ప్రత్యుపకారం ఏమీ కనపడదు!’ అని ఆళ్వార్లు వాపోతున్న దశకాన్ని మామునులు సంక్షిప్తంగా ఈ పాశురంలో అనువదించారు.
ఎన్ఱనై నీ ఇన్గు వైత్తదు ఏదుక్కెన మాలుమ్
ఎన్ఱనక్కుమ్ ఎన్ తమర్క్కుమ్ ఇన్బమదామ్ – నన్ఱు కవి
పాడ ఎనక్ కైమ్మాఱిలామై పగర్ మాఱన్
పాడణైవార్క్కు ఉణ్డామ్ ఇన్బమ్
ప్రతిపదార్థం
ఎన్ఱనై = సంసారంలో ఇమడలేని నన్ను
నీ ఇన్గు వైత్తదు = నీవు ఈ విభూతిలో ఉంచటం
ఏదుక్కెన = ఎందుకు అని ప్రశ్నించగా
మాలుమ్ = సర్వేశ్వరుడు కూడా
ఎన్ఱనక్కుమ్ = నాకును
ఎన్ తమర్క్కుమ్ = నా దాసులకును
ఇన్బమదా = భోగ్యముగా
నన్ఱు కవి పాడ ఎన = మంచి కవిత్వాన్ని పాడి వినిపించడానికి
క్కైమ్మాఱిలామై = భగవంతుడు చేసిన ఉపకారానికి ప్రతిపకారం చేయలేకపోవటానికి
పగర్ = విన్నవించిన
మాఱన్ పాడ = నమ్మాళ్వార్లు పాడగా
అణైవార్క్కు = వారిని ఆశ్రయించు వారికి
ఇన్బమ్ ఉణ్డామ్ = ఆనందం కలుగుతుంది
భావము: అత్యంత ఆర్తితో ఉన్న తనను ఇంకా ఈ లోకంలో ఎందుకు ఉంచావు? ఈ లోకంలో నేను ఇమాడ లేకుండా ఉన్నాను ‘అని ప్రశ్నిస్తే‘ నేను, నా భక్తులతో కూడిన పరివారం విని ఆనందించడానికి చక్కని తిరువాయ్ మొళి పాడి మాకు వినిపించడానికి ఉంచాను’ అని సర్వేశ్వరుడు చెప్పాడు. అది విని , ఈ విధంగా నన్ను కటాక్షించినందుకు ప్రత్యుపకారం నేను ఏంచేయగలను?అని వాపోతున్న నమ్మాళ్వార్లను ఆశ్రయించినవారు మహా ఆనందాన్ని అనుభవిస్తారు అని ఈ పాశురంలో మామునులు తెలియజేస్తున్నారు. ‘ఎన్ఱైక్కు మెన్నై‘ అనే 69 వ దశకానికి ఈ పాశురం సంక్షిప్త రూపం.
అవతారిక: ఆళ్వార్లు ‘ఇన్బమ్ పయక్క‘ అనే తిరువాయ్ మొళిలో వాచిక కైంకర్య గొప్పదనాన్ని తెలియజేశారు. తిరువారన్ విళై అనే దివ్యదేశంలో తాము చేసే వాగ్రూప కైంకర్యం గురించి చేప్పారు. ఆ దశక సారాన్ని ‘ఇన్బక్ కవి పాడు‘ అనే ఈ పాశురంలో మామునులు అనుగ్రహించారు.
ఇన్బక్ కవి పాడువిత్తోనై ఇన్దిరైయోడు
అన్బుఱ్ఱు వాళ్ తిరువాఱన్విళైయిల్ తున్బమఱక్
కణ్డడిమై సెయ్యక్ కరుదియ మాఱన్ కzహలే
తిణ్డిఱలోర్ యావర్క్కుమ్ దేవు
ప్రతిపదార్థం:
ఇన్బక్ కవి పాడువిత్తోనై = భోగ్యమైన తిరువాయ్ మొళిని తమ చేత పాడించిన సర్వేశ్వరు
ఇన్దిరైయోడు = పెరియ పిరాట్టితో కలిసి
అన్బుఱ్ఱు వాళ్ = ఆనందిస్తూ నేను చేస్తున్న
తిరువాఱన్విళైయిల్ = తిరువారన్ విళై అనే దివ్యదేశంలో
తున్బమఱక్కణ్డు = తమ విశ్లేష దుఃఖం తీరిపోవడం గమనించి
అడిమై శెయ్యక్కరుదియ = కైంకర్యం చేయాలని ఆశించిన
మాఱన్ కళలే = నమ్మాళ్వార్ల శ్రీపాదాలే శరణం అనే
తిణ్డిఱలోర్ యావర్క్కుమ్ = దృడ అత్యవసయం గలవారికి
దేవు = పరదేవత అగును
భావము: తిరువారన్ విళై అనే దివ్యదేశంలో భోగ్యమైన తిరువాయ్ మొళిని తమ చేత పాడించిన సర్వేశ్వరుడు పెరియ పిరాట్టితో కలిసి ఆనందిస్తూ తాము చేస్తున్న కైంకర్యం వలన తమ విశ్లేష దుఃఖం తీరిపోవడం ఆళ్వార్లు గమనించారు. అలా నిరంతరం పరమాత్మ కైంకర్యంలో గడపాలని ఆశించిన మధురకవులు, నాధమునులు వంటి నమ్మాళ్వార్ల శ్రీపాదాలే శరణం అనే దృడ అత్యవసయం గలవారికి ఆయన పరదేవత అవుతారు.
అడియేన్ చూడామణి రామానుజ దాసి
మూలము: https://divyaprabandham.koyil.org/index.php/2020/10/thiruvaimozhi-nurrandhadhi-61-70-simple/
పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org