ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 38 – 40

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

ఉపదేశ రత్తినమాలై

<< గతశీర్షిక

పాశురము 38

ముప్పదెనిమిదవ పాశురము. ఎంబెరుమానార్ ప్రపత్తి మార్గమును మంచిగా నడిపిస్తూ శ్రీభాష్యము మొదలగు గ్రంథముల రూపములో ఈ మార్గమును రక్షిస్తూ దీని మూలముగా మన సంప్రదాయమును బాగుగా ప్రవర్తింపచేసి ప్రతి ఒక్కరూ అర్థము చేసుకొను విధముగా నంబెరుమాళ్ వీరికి చేసిన గొప్ప మర్యాద గురించి తెలుపుచున్నారు.

ఎంబెరుమానార్ దరిశనమెన్ఱే ఇదుక్కు!
నమ్బెరుమాళ్ పేరిట్టు నాట్టివైత్తార్ అమ్బువియోర్
ఇన్దదరిశనత్తై ఎమ్బరుమానార్ వళర్త!
అన్దచ్చెయల్ అఱిగై క్కా!!

మన శ్రివైష్ణవ సంప్రదాయమునకు “ఎంబెరుమానార్ దర్శనమ్” అని నంబెరుమాళ్ కీర్తించి స్థాపించినారు. అది ఎందుకనగా ఎంబెరుమానార్ శ్రీభాష్యము మొదలగు గ్రంథముల మూలముగా మన సంప్రదాయమును అందరూ అర్థము చేసుకొను విధముగా చేయడం, అందుకు అనుగుణముగా దివ్యదేశముల యందు దిద్దుబాట్లు చేయడం. ఈ ప్రపత్తి మార్గమును బాగుగా పెంచి పోషించి అభివృద్ధి చేసినారు. ఈ విధముగా చేసి ఈ లోకములో అందరూ అర్థము చేసుకొను విధముగా నంబెరుమాళ్ దీనిని స్థాపించినారు. వీరి పరమ కరుణను తెలుసుకొనిన తిరుకోష్టియూర్ నంబి వీరికి “ఎంబెరుమానార్” అను తిరునామమును ఇచ్చుటను నంబెరుమాళ్ మనసులో తలంచి నంబెరుమాళ్ తామే నంబి ద్వారా ఈ కీర్తిని వారికి వచ్చునట్లు చేసినారని చెప్పవచ్చును.

పాశురము 39

ముప్పైతొమ్మిదవ పాశురము. ఈడు వ్యాఖ్యానము అనగా ద్వయ మంత్రార్థ రూపముగా తిరువయ్ మొళికి వ్యాఖ్యానము. ఎంబెరుమానార్ ఆజ్ఞతో మొదలై అనేక వ్యాఖ్యానములు పూర్వాచార్యుల ద్వారా వెలువడినవి. మామునులు ఎంబెరుమానార్ వివరించిన అర్థములనాధారముగా కృపతో వివరించుచున్నారు.

పిళ్ళాన్ నఞ్జీయర్ పెరియవాచ్చాన్ పిళ్ళై!
తెళ్ళార్ వడక్కుత్తిరివీధిపిళ్ళై!  మణవాళ యోగి
తిరువాయ్ మొళియై క్కాత్త!
గుణవాళరెన్ఱు నెఞ్జే! కూఱు!!

ఎంబెరుమానార్ ద్వారా జ్ఞాన పుత్రులు (అభిమాన పుత్రులు) గా పరిగణింపబడిన తిరుకురుగైపిరాన్, పరాశర భట్టర్ శిష్యులైన నఞ్జీయర్, వ్యాఖ్యాన చక్రవర్తియైన పెరియ వాచ్చాన్ పిళ్ళై, నంబిళ్ళై ప్రియ శిష్యులు మహాజ్ఞాన పూర్ణులైన వడక్కు తిరివీధీ పిళ్ళై, నఞ్జీయర్ దయకు పాత్రులైన వాధికేసరి అళగియ మణవాళ జీయర్ మొదలగు గొప్ప వారు తిరువాయ్ మొళిని కాపాడి వర్ధింప చేసినారు. దీనినే ద్వయ మంత్రము యొక్క వివరణగా భావిస్తారు. అందుచేత ఓ మనసా! ఆ మహానుబావులను స్తుతించు!

పాశురము 40

నలుబదవ పాశురము. తిరువాయ్ మొళికి ఆచార్యులు కృప చేసిన వ్యఖ్యానముల విశేషములను ఇంకా కీర్తించమని తన మనస్సునకు తెలుపుచున్నారు.

మున్దుఱవే పిళ్ళాన్ ముదలానోర్ శెయ్ దరుళుమ్!
అన్ద వియాక్కి యైగళ్ అన్ఱాగిల్ అన్దో
తిరువాయ్ మొళి ప్పొరుళై త్తేరున్దురైక్కవల్ల
గురువార్ ఇక్కాలం నెఞ్జే కూఱు!!

ఓ మనసా! పూర్వం తిరుక్కురుగై పిరాన్ పిళ్ళాన్ మొదలు పూర్వాచార్యులు తిరువాయ్ మొళికి నమ్మాళ్వార్ల మనోద్దేశ్యమునకు తగినట్లుగా వారి ఆచార్యుల ద్వారా విని సమర్ధమైన వ్యఖ్యానములు చేయకుండినచో ఈ కాలంలో తిరువాయ్ మొళి రహస్యార్థములను తెలుపగల వారెవరు నీవే చెప్పుమా!!
తిరువాయ్ మొళి ద్వయ మహామంత్రమునకు వ్యాఖ్యానముగా ఉన్నది. ద్వయ మంత్రములోని మొదటి పంక్తిలో చెప్పిన “పిరాట్టితో కూడిన ఎంబెరుమాన్ శ్రీమన్నారాయణుని తిరువడిగళే ఉపాయముగా పట్టుకొనదగినవి” మఱియు రెండవ పంక్తిలో చెప్పిన “ఈ విధముగా పిరాట్టితో కూడిన ఎంబెరుమానునకు అవిచ్ఛిన్న కైఙ్కర్యమును ప్రార్థించటము”. అటువంటి విషయములనే తిరువాయ్ మొళిలో నమ్మాళ్వార్లు వ్యాఖ్యానము చేసినారు.

అడియేన్ వీ.వీ.ఎల్.ఎన్. ఆచార్యులు రామానుజ దాసన్

మూలము : https://divyaprabandham.koyil.org/index.php/2020/06/upadhesa-raththina-malai-38-40-simple/

ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి : https://divyaprabandham.koyil.org

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment