ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 16 -18

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

ఉపదేశ రత్తినమాలై

గతాశీర్షిక

పాశురం 16

ఈ పదహారవ పాశురము మొదలు ఐదు పాశురములలో మిగతా ఆళ్వావార్ల కంటే ఔన్నత్యము కలిగిన పెరియాళ్వార్ల వైభవమును సాయిస్తున్నారు.

ఇన్ ఱై ప్పెరుమై అఱిన్దిలైయో ఏళైనెజ్ఞై! ఇన్ ఱై క్కెన్నేత్త మెనిల్ ఉరైక్కేన్ * నన్ఱిపునై పల్లాణ్డు పాడియ నమ్ పట్టర్పిరాన్ వన్దుదిత్త! నల్లానియల్ శోదినాళ్!!

ఈ పాశురములో పెరియాళ్వార్లవతరించిన ఆణి మాస స్వాతీ నక్షత్ర గొప్పదనమును
తన మనస్సునకు మామునులు ఉపదేశిస్తున్నారు. మిగిలిన ఆఈ పాశురములో పెరియాళ్వార్లవతరించిన ఆణి మాస స్వాతీ నక్షత్ర గొప్పదనమును
తన మనస్సునకు లో మామునులు ఉపదేశిస్తున్నారు. మిగిలిన ఆళ్వావార్ల తిరునక్షత్రములయందే  నిమగ్నమైన ఓ చపల బుద్దీ ఆణిమాస స్వాతీ నక్షత్ర ప్రాశస్త్యము తెలుసా? నేను చెప్తాను విను. మంగళాశాసనమనే ఉత్కృష్ఠమైన తాత్పర్యమును తనలోనే నింపుకున్న తిరుపల్లాండును కృప చేసిన భట్టర్ పిరిన్ (పెరియాళ్వార్) అవతరించిన రోజు. అందుచేతనే గొప్పనైన రోజు ఈ రోజు.

పాశురం 17

పదహేడవ పాశురములో మామునులు పెరియాళ్వార్లవతరించిన ఆణిమాస స్వాతి నక్షత్రం అంటేనే మనసు కరిగిపోయేటటువంటి జ్ఞానులకు సమానమైన వారు ఈ లోకంలో ఎవరూ లేరని తన మనస్సునకు చెప్పుచున్నారు.

మానిలత్తినిల్ మున్ నం పెరియాళ్వావార్ వన్దుదిత్త! ఆనితన్నిల్ శోది యెన్ఱాల్ ఆదరిక్కుమ్ * జ్ఞానియర్కు ఒప్పోరిల్లై ఇవ్వులగుదనిల్ ఎన్ఱు నెఞ్జే! ఎప్పోదుం శిన్దిత్తిరు!!

ఓ మనసా ఈ విశాలమైన భూమి మీద పెరియాళ్వార్లవతరించిన ఆణిమాస స్వాతి నక్షత్ర రోజును వినినంతనే ఎవరి మనసు కలుగుతుందో అటువంటి జ్ఞానులకు ఈ లోకంలో సమానమైనవారు ఎవరూ లేరని సదా గుర్తంచుకో.

పాశురం 18

పదునెనిమిదవ పాశురములో ఎంబెరుమానునకు మంగళాశాసనము చేయటమనే పెద్ద వ్యత్యాసము వీరికీ ఇతరాళ్వార్లకు ఉండం చేతనే వీరిని పెద్ద/పెరియాళ్వార్లనే పేరు ఏర్పడినదని మామునులు కృపచేయుచున్నారు.

మజ్ఞ్గళాసనత్తిల్ మత్తుళ్ళ ఆళ్వావార్ గళ్! తజ్ఞ్గళార్వత్తు ఆళవు దానన్ఱి * పొజ్గుమ్ పరివాలే విల్లిపుత్తూర్ పట్టర్ పిరాన్ పెత్తాన్! పెరియాళ్వావార్ ఎన్నుమ్ పెయర్!!

ఎంబెరుమానునకు మంగళాశాసనము చేయుటయందు మిగిలిన ఆళ్వార్లకంటే అతి ఆతృత మరియు అధిక శ్రధ్ధా భక్తి కారణంగా శ్రీవిల్లిపుత్తూర్లో అవతరించిన విష్ణుచిత్తులే పెరియాళ్వార్లనే బిరుదాంకుతులై సుప్రసిధ్ధులైరి.

మంగళాశాసనమనగా ఇతరుల మంగళం/శుభమును కోరుట. సాధారణముగా పెద్దలు చిన్నవారికి మంగళాశాసనము చేయుట ఆచారము. ఇక్కడ ఒక ప్రశ్న ఏమనగా చిన్నవారు పెద్దలకు చేయవచ్చునా? ఈ విషయమై పూర్వాచార్యులలో ఒకరైన పిళ్ళైలోకాచార్యలు శ్రీవచన భూషణ దివ్య శాస్త్రములో ఒక అందమైన వ్యాఖ్యానము/వివరణ కృపచేసినారు. అదేమిటంటే ఎంబెరుమాన్ అందరి కంటే పెద్దవాడు. ఆత్మనేమో చాలా చిన్నది. ఇటువంటి పరిస్థితులలో “ఆత్మలైన మనము ఎంబెరుమానునకు మంగళాశాసనము చేయ వచ్చునా?” అని ప్రశ్నించుకొని “మంగళాశాసనము చేయుటయే మనకు మూల స్వరూపము/స్వభావము” అని వ్యఖ్యానించినారు. జ్ఞాన దృష్టిలో ఎంబెరుమాన్ పెద్దవాడైనప్శటికీ, ప్రేమ/భక్తి దృష్టిలో అటువంటి పరమాత్మకు ఈ సంసారములో ఎటువంటి ఆపద సంభవించునో అని భయపడడమే నిజమైన ప్రేమ/భక్తికి నిదర్శనము. దీనినే మనకు పెరియాళ్వార్లు చూపుచున్నారు. ఈ కారణం చేతనే వీరు మిగతా ఆళ్వార్లకంటే ప్రత్యేకము. అందుచేతనే పెరియాళ్వార్లని పేరు పొందినారు.

అడియేన్ వీ.వీ.ఎల్.ఎన్. ఆచార్యులు రామానుజ దాసన్ 🙏

మూలము : https://divyaprabandham.koyil.org/index.php/2020/06/upadhesa-raththina-malai-16-18-simple/

ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి : https://divyaprabandham.koyil.org

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment