శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:
శ్లోకం 18
తత స్తత్ సన్నిధి స్తంభ మూల భూతలభూషణం ।
ప్రాజ్ముఖం సుఖమాసీనం ప్రసాదమధురస్మితం ।।
ప్రతి పదార్థము:
తతః = శ్రీరంగనాధునికి తిరువారాధనము చెసిన తరువాత
తత్ సన్నిధి స్తంభ మూల భూతల భూషణం = ఆ పెరుమాళ్ సన్నిధిలో ఉన్న స్తంభము క్రింద కూర్చుండి
ప్రాజ్ముఖం = తూరుపు ముఖము చేసి
సుఖం = సుఖముగా ,మనసును భగవంతుడి మీద కేంద్రీకరించి
అసీనం = పద్మాసనములో ఉండి
ప్రసాదమధురస్మితం = మనో నిర్మలత్వము వలన కలిగిన ప్రశాంత ముఖముతో వున్నారు.
భావము:
కిందటి శ్లోకములో చెప్పిన తిరువారాధన క్రమములో ద్వయ మంత్ర జపము కూడా ఉపలక్షణముగా ఉన్నది. అందువలన త్రికాలములలో తిరువారాధనానంతరము మంత్ర రత్నమనబడే ద్వయ మంత్రమును వెయ్యినొక్క సార్లు ,అలా వీలు కానప్పుడు నూటొక్క సార్లు, అదీ వీలు కాక పోతే ఇరవై ఎనిమిది సార్లు ఆజీవన పర్యంతము జపము చేయాలని పరాశరులుచే చెప్పబడినది. ఇలా జపము చేసేటప్పుడు మామునుల హృదయము ఆచార్యుల యందే లీనమై ఉంటుంది ఎందుకనగా వీరు ఆచార్య పరతంత్రులు కదా!
మామునులు నిర్మల మనస్కులవటము చేతవారి ముఖము జపము చేయునపుడు ప్రశాంతముగా వెలుగొందుతున్నది. మంచి పనులు చేసేటప్పుడు తూర్పు ముఖము చేసి వుండటము సంప్రదాయము కాబట్టి వీరు తూర్పు ముఖముగా కూర్చొని వున్నారి ‘ ప్రాజ్ముఖం సుఖమాసీనం ‘ అని చెప్పటము జరిగింది.
అడియేన్ చూడామణి రామానుజ దాసి
Source: https://divyaprabandham.koyil.org/index.php/2015/09/purva-dhinacharya-tamil-18/
archived in https://divyaprabandham.koyil.org
pramEyam (goal) – https://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
SrIvaishNava education/kids portal – http://pillai.koyil.org