శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:
శ్లోకం 17
అథ రంగనిధిం సమ్యగ్ అభిగమ్య నిజం ప్రభుం ।
శ్రీనిధానం శనైస్తస్య శోధయిత్వా పద ద్వయం ।।
ప్రతి పదార్థము:
అథ = పొద్దుటి అనుష్ఠానములు ముగించుకొని కావేరి నుండి మఠమునకు వేంచేసిన తరువాత
నిజం = తమ నిత్య ఆరాధనకు సంసిధ్ధులై
ప్రభుం = స్వామి అయిన
రంగనిధిం = తమ మఠములో వేంచేసి వున్న శ్రీరంగమునకే నిధి అయిన రంగనాథుని
సమ్యగ్ అభిగమ్యం = సాంప్రదాయానుసారము సమీపించి సాష్ఠాoగ నమస్కారము చేసి
శ్రీనిధానం = కైంకర్య శ్రీకి నిధి అయిన
తస్య పద ద్వయం = ఆ శ్రీరంగనాథుని శ్రీపాద ద్వయములను
శనైః = నిధానముగా
శోధయిత్వా = అభిషేకము చేసి
భావము:
శాండిల్య స్మృతిలో, స్నానంతరము భగవదభిగమము చేసే విధానమును ఈ విధముగా తెలిపారు. అనగా స్నానాంతరము ఊర్ద్వ పుండ్రములు ధరించి, కాళ్ళు కడుగుకొని, ఆచమనము చేసి, మనసును, ఇంద్రియములను నిగ్రహించుకొని,ప్రతి దినము, ఉభయ సంధ్యలలోను ,ఉదయము సూర్యుడుదయించు వరకు,సాయంత్రము నక్షత్రములు ఉదయించు వరకు మంత్రములను జపించుకొనుచూ వుండి తరవాత భగవదభిగమము చేసి ( భగవంతుడి దరి చేరి)తిరువారాధనము చేయాలి. ఇక్కడ రంగనాథుని శ్రీపాదములను కడుగుట తిరువారాధనమునకు ఉపలక్షణము. వీరు యత్రీంద్ర ప్రవణులు కావున తమ ఆచార్యులభిమానించిన శ్రీరంగనాథునికి తిరువారాధనము చేస్తున్నారు. భరతుడి భక్తుడైన శతృజ్ఞుడు భరతుడి ఆరాధ్య దైవమని శ్రీరాముడిని ఆరాధించిన విషయము ఇక్కడ మామునులుకు శ్రీరంగనాథుడు ఆరాధ్య దైవమని గ్రహించాలి.
అడియేన్ చూడామణి రామానుజ దాసి
Source: https://divyaprabandham.koyil.org/index.php/2015/09/purva-dhinacharya-tamil-17/
archived in https://divyaprabandham.koyil.org
pramEyam (goal) – https://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
SrIvaishNava education/kids portal – http://pillai.koyil.org