పూర్వ దినచర్య – శ్లోకం 5 – ఆంలాన

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

శ్రీ వరవరముని దినచర్య

శ్లోకం 5

ఆంలాన కోమలాకారం ఆతామ్ర విమలాంభరం!

ఆపీన విపులోరస్కం ఆజానుభుజ భూషణం!!

ప్రతి పదార్థము:

ఆంలాన కొమలాకారమ్ – ముడుచుకోని పుష్పము వలె వారి దివ్య మంగళ విగ్రహం ఉన్నది

ఆతామ్ర విమలాంభరం_ పరిశుద్దమైన కాషాయ వస్త్రమును ధరించిన వారు

ఆపీన విపులోరస్కం _ ఉన్నతమైన వక్షస్థలము గల వారు

ఆజానుభుజ భూషణం_ ఆజాను బాహువులు కల వారు

భావము:

ఎఱుంబిఅప్పా శ్రీపాదముల అందమును అనుభవించిన తరవాత దేహ సౌందర్యమును, సన్యాసారమానికి తగ్గ కాషాయ వస్త్రము యొక్క అందమును అనుభవిస్తున్నారు.  ఆంలానః  _ ఇది అడవి చెట్టే అయినా మిగిలిన అడవి చెట్ల కంటే మృధువుగా వుంటుందట. కిందటి శ్లోకములో చూపిన విధముగా శ్రీపాదములే కాక తిరు మేని ఆసాంతము మృధువుగా వున్నదని చెప్పటం జరిగింది. వీరు సాక్షాత్తు అనంతావతారము కదా! సన్యాసులకుచితమైన కాషాయ వస్త్రమునకు ఆ రంగు కాషాయ రాళ్ళతో చేసిన నీటిలో ముంచటము వలన వచ్చింది.  కాషాయ వస్త్రము తెల్లని దేహ సౌదర్యమును ఇనుమడింప చేస్తున్నది.(పపాగ)  అది ఎలా వుందంటే పాలకడలిలో ఉన్న పగడపుచెట్టులాగా వున్నది. (ఆపీన విపులోరస్కం ) ఎగు భుజములు ఉత్తమ పురుష లక్షణము. (ఆజాను భూషణం) జానువుల దాకా అంటే మోకాళ్ళ దాకా ఉన్న చేతులు దేహ శోభను పెంచటమే కాక ఉత్తమ లక్షణము కూడా.  శిష్యుల చేతులు పట్టుకొని నడవడానికి అనువుగా వుంటుంది.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

Source: https://divyaprabandham.koyil.org/index.php/2015/09/purva-dhinacharya-tamil-5/

archived in https://divyaprabandham.koyil.org

pramEyam (goal) – https://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
SrIvaishNava education/kids portal – http://pillai.koyil.org

Leave a Comment