తిరుప్పళ్ళి యెళిచ్చి – 1 – కదిరవన్

namperumal

పాశుర అవతారిక :

  • ఎంపెరుమాన్ ను ఆరాధించడానికి వచ్చిన దేవతలను, ఆళ్వార్ వారిని ఎంపెరుమాన్ ను మేల్కొలపమని అర్థిస్తున్నారని నఙ్జీయర్ వ్యాఖ్యానిస్తున్నారు.ఈ పాశురం ద్వారా శ్రీమన్నారాయణుడు అందరి దేవతలకు మరియు ఆరాధించే వారికి ఆరాధించడం లో అత్యున్నతుడని/సర్వోన్నతుడని /పరతత్వం అని స్థాపన చేస్తున్నారు .
  • సూర్యభగవానుడు కేవలం బాహ్యాంధకారాన్ని పోగొట్టగల సామర్థ్యం కలవాడు, కాని శ్రీమన్నారాయణుడు మాత్రమే అంతర్గత అంధకారాన్ని(అఙ్ఞానం)నిర్మూలించే సామర్థ్యం కలవాడు అని పెరియవాచ్చాన్ పిళ్ళై నిర్థారణ చేస్తున్నారు. అఙ్ఞానం తొలగినదని  మరియు ఎంపెరుమాన్ తాము మేల్కొని తనను  ఆరాధించడానికి వచ్చిన దేవతలను,రాజులను మొదలైనవారిని కటాక్షించుమని   ఆళ్వార్  ప్రార్థిస్తున్నారు.

కదిరవన్ కుణైదిశై చ్చిగరం వన్దణైందాన్
కనైయిరుళ్ అగన్ఱదు కాలైయం పొళుదాయ్
మదు విరిందొళుగిన మామలర్ ఎల్లాం
వానవర్ అరశర్గళ్ వన్దు వన్దీండి
ఎదిర్ దిశై నిఱైందనర్ ఇవరొడుమ్ పుగుంద
ఇరుంగళిర్ ఈట్టముమ్ పిడియొడుమురశుం
అదిర్ దలిళ్ అలై కడల్ పోన్ఱుళదు ఎంగుం
అరంగత్తమ్మా! పళ్ళియెళుందరుళాయే
ప్రతిపదార్థం 

అరంగత్తమ్మా= హే ప్రభూ! శ్రీరంగమున శయనించిన దేవాదిదేవా
కదిరవన్= సూర్యుడు
కుణైదిశై=తూర్పు దిశ
చ్చిగరం=శిఖరం పై (ఉదయగిరి పైన )
వన్దణైందాన్= తన స్థానంలోకి వచ్చినాడు
కనైయిరుళ్ = గాఢాంధకారం(రాత్రి సమయపు)
అగన్ఱదు= నశించినది
అం= అందమైనది
కాలై పొళుదాయ్ = ఉదయమే చేరుకున్న
మామలర్    ఎల్లాం= ఉత్తమ/ విశేషమైన పుష్పములు
విరిన్దు= వికసించిన
మదు ఒళుగిన= విరివిగా తేనె తో నిండిన
వానవర్= దేవతలు
అరశర్గళ్= రాజులు
వన్దు వన్దు =తొందరగా వచ్చి ఒకరినొకరు తోసుకుంటున్నారు
ఈండి= గుంపులుగా
ఎదిర్ దిశై = భగవానుని దివ్యమైన దృష్ఠి ప్రసరించు దక్షిణదిశ
నిఱైందనర్=  అంతటా నిల్చోవడం వల్ల నిండిపోయినది
ఇవరొడుమ్ పుగుంద=వారితో పాటు వచ్చి చేరిన
ఇరుంగళిర్ ఈట్టముమ్= మగ ఏనుగుల గోష్ఠి/గుంపు  (దేవతల మరియు రాజుల వాహనములు)
పిడియొడు= ఆడ  ఏనుగుల గోష్ఠి
మురశుం = సంగీత వాయుద్యాలు
అదిర్ దలిళ్= ఆ గుంపుల వల్ల పెద్ద శబ్దం ఉత్పన్నమవుతున్నది
ఎంగుం=అంతటా
అలై కడల్ పోన్ఱుళదు = అలలు.సముద్రపు తీవ్రమైన తరంగముల వల్ల వచ్చు శబ్దం
(ఆదలాల్)పళ్ళియెళుందరులాయే=(కవున) మీరు మేల్కొని మమ్ములను కటాక్షించుము

సంక్షిప్త అనువాదం:

శ్రీరంగమున శయనించిన దేవా! సూర్యుడు  ఉదయగిరిన ఉదయించి రాత్రి యొక్క గాడాంధకారాన్ని పోగొడుతున్నాడు. ప్రసన్నమైన ఉదయం ఆసన్నమైనది, పుష్పముల నుండి మధువు కారుచున్నది. మీ దృష్ఠి ప్రసరించు  దక్షిణం వైపునకు  దేవతలు మరియు రాజులు ఒకరినొకరు తోసుకుంటు గుంపులు గుంపులుగా సన్నిధికి వచ్చిచేరిరి. ప్రాంగణమంతా నిండి పోయినది. వారందరు  ఆడ మగ ఏనుగుల సమూహముతో(తమ తమ వాహనలు)‌ సంగీత వాయిద్యములతో కూడ వచ్చి చేరిరి. ఆసక్తిగా మరియు ఉత్సాహముగా ఎదురుచూస్తు వారి గోల మరియు వాయిద్యాల శబ్దం సముద్ర ఘోషను పోలి  నలుదిశలా ప్రసరిస్తున్నవి .   ఇక్కడ సమావేశమైన వారందరి కోసం  మీరు మేల్కొనికటాక్షించుము.

నఙ్ఞీయర్ వ్యాఖ్యానములోని ముఖ్యవిషయాలు:

  • పెరియాళ్వార్ తిరుమొళి 4.1.1 “కదిరాయిరం ఇరవి కలందెరిత్తాళ్ ఒత్త నీళ్ ముడియన్”- భగవానుని దివ్య శిరస్సు వేయి సూర్యుల కాంతితో స్వతహాగా ప్రకాశిస్తుంది.  శ్రీరంగనాథుని పాదపద్మములు ఉన్న దిశయగు తూర్పున సూర్యోదయం అగును. కావున ఇరు దిశలయందు భగవానుని తేజస్సు ప్రకాశంగా వెలుగుతుంది.
  • ప్రాతః కాలము విశేషముగా ఎంపెరుమాన్ ను ధ్యానించుటకు చాలా శుభప్రదమైన సమయం.
  • దేవతలు మరియు రాజులు(అహంకార భూతులగు)తమ తమ క్షుద్రమైన కోరికలను నెరవేర్చుకోవడానికి ఎంపెరుమాన్ సన్నిధికి చేరుతారు.
  • శ్రీరంగనాథుడు ఉభయవిభూతి నాథుడిగా(పారలౌకిక /ఆధ్యాత్మిక మరియు భౌతిక/లౌకిక లోకాలని నియమించేవాడు)   స్వతాహాగా కీర్తంపబడుతున్నాడు. ఆళ్వార్ తమను అనయన గతికునిగా భావిస్తున్నారు- దీనర్థం భగవానుడే తప్ప మరేతరులు తమకు రక్షకులు/శరణ్యులు  కారని.

పెరియవచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానములోని ముఖ్యవిషయాలు:

  • దినమును వెలుగు పరచుటకు పరిచారకుడు/దాసుడు ఎలాగైతే దీపమును తీసుకవస్తారో అలాగే మీరు మేల్కొనిన సూర్యుడు తనంతట తాను తన కిరణములను ప్రసరింపచేస్తాడు.  ఇది సూర్యుడు మీకై చేయు చిన్న కైంకర్యము. మీ దర్శనము మరియు కటాక్షమునకై తానుకూడ తూర్పున ఉదయిస్తున్నాడు. “బిషోదేతి  సూర్య”- అని తైత్తరీయోపనిషధ్ లో చెప్పినటుల  సూర్యుడు మీ భయముతో సరైన సమయమందు తన విధిని నిర్వర్తిస్తున్నాడు.
  •  పరాశరస్మృతి యందు”బ్రాహ్మే ముహూర్తం చ ఉత్తాయ చిన్తయేత్ ఆత్మానో హితమ్/ హరిః హరిః హరిః ఇతి వ్యాహరేత్ వైష్ణవః  పుమాన్” (వైష్ణవుడు తెల్ల వారుజామునే (దాదాపు 4గం||)లేచి  తన ఆత్మోజీవనమునకై ధ్యానము చేయ వలెను). హరి నామమును ముమ్మారు ఉచ్ఛరించాలి). తిరుప్పావై 29వ పాశురంలో “శిత్తుం శిరుకాలే వన్దున్నైచేవిత్తు”(తెల్లవారు జాముననే నిన్ను ఆరాధించుటకు వచ్చినాము)
  • శ్రీరంగనాథుడు తన దేవేరి అయిన శ్రీరంగనాయకి తో ఏ ఎడబాటులేక తన నివాసస్థలమగు శ్రీరంగ దివ్యదేశమున వేంచేసినాడు, మగగజము తన సహచరము(ఆడ గజం)తో ఈ దివ్యదంపతులను సేవించడానికి వచ్చినవి.

అడియేన్ నల్లా శశిధర్ రామానుజదాస

Source: https://divyaprabandham.koyil.org/index.php/2014/12/thiruppalliyezhuchchi-1-kathiravan/

archived in https://divyaprabandham.koyil.org

pramEyam (goal) – https://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org/
pramAthA (preceptors) – https://acharyas.koyil.org/
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org

Leave a Comment