సప్తగాథై – పాశురము 1 – భాగము 2

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః

సప్తగాథై

<< మునుపు భాగము

ముక్తాత్మలు తిరుమాలై [2] వ పాశురం “పోయ్ ఇన్దిర లోకమ్ ఆళుమ్” (అర్చిరాది మార్గంలో పరమపదాన్ని చేరి అక్కడ భగవత గుణానుభవం అనుభవించేట్టుగా) అర్చిరాది మార్గములో పోయి విరజానదిలో స్నానం చేసి అమానవ కరస్పర్శ పురస్సరంగా అప్రాకృత దేహాన్ని ధరించి ప్రవేశించవలసినది పరమపదం. మరొకవైపు క్రూరమైన లోకంతో గల సంబంధం. ఈ రెండింటికి మధ్యన ఉన్నందున “అరఙ్గర్ మానగర్” (శ్రీరంగ మహానగరం) అనే రీతిలో ఈ రెండు విభూతులు అంటే అటు పరమపదం అంటే నిత్యవిభూతి ఇటు ఇహపరం అంటే లీలావిభూతికి కూడా విలక్షణమైన మూడవ విభూతిగా అనదగినట్లు ఉండే శ్రీరంగ దివ్యక్షేత్రములో పెరియాళ్వార్ తిరుమొళి [4-9-3] లో“అడియవరై ఆట్కొళ్వాన్ అమరుమూర్” (దాసుల నుండి కైంకర్యాన్ని స్వీకరించడానికై అమరి ఉండే ఊరు) అనే రీతిలో ఇక్కడ ఉండే వారి నుండి కైంకర్యాన్ని స్వీకరించడం కోసమే స్థావర ప్రతిష్ఠంగా నిలిచి వేంచేసి ఉన్నాడు శ్రీరంగనాథుడు.

శ్రీవిళాఞ్జోలైప్పిళ్ళైగారు శ్రీరంగనాథులనే ప్రధానముగా పలుకుతున్నారు. దానికి తగిన కారణములను అనుగ్రహిస్తున్నారు.

  • తిరువాయ్ మొళి [7-2-11] లో “ముకిల్వణ్ణ నడిమేల్ శొన్న శొల్ మాలై ఆయిరమ్” (మేఘవర్ణుడైన శ్రీరంగనాథుని ఉద్దేశించి పల్కిన వాఙ్మాలిక అయిన వేయి పాశురాలు అని) తిరువాయ్ మొళి తనియన్ లో “మదిళ్ అరఙ్గర్ వణ్ పుకళ్ మేల్ ఆన్ఱ తమిళ్ మఱై కళ్ ఆయిరముమ్” (ప్రాకారాలు కల శ్రీరంగము లోనికి శ్రీరంగనాథుని కళ్యాణ గుణాలను ప్రతిపాదించే ద్రావిడ వేదమైన వేయి పాశురాలు అని)  శ్రీరంగరాజస్తవం [78] లో “శఠకోప వాగ్వపుషి రఙ్గగృహేశయితమ్” (నమ్మాళ్వార్ల శ్రీసూక్తులలో, తిరుమేనిలో శ్రీరంగాలయంలో శయనించి ఉండే వానిని) అని పలికే రీతిని అనుగ్రహిస్తూ శ్రీరంగనాథునినే ప్రధానముగా పలుకుతున్నారు.
  • రెండవ కారణం “ప్రమాణం శఠజిత్ సూక్తిః ప్రమేయం రఙ్గచంద్రమాః” (ప్రమాణం – నమ్మాళ్వార్ల) శ్రీసూక్తి అయిన తిరువాయ్ మొళి, ప్రమేయమ్ శ్రీరంగములోని చంద్రుని వంటి శ్రీరంగనాథుడు) అనే రీతిలో ప్రమేయచరమమైన, ప్రమాణ చరమమైన తిరువాయ్ మొళి కి సాక్షాత్తు ప్రతిపాద్యుడు అయినందువలన “పదిన్మర్ పాడుమ్ పెరుమాళ్” పది మంది ఆళ్వార్లచేత కీర్తింపబడ్డ స్వామి.
  • గురుపరంపరలో ఆద్యుడు కనుక.
  • తిరుమల మొదలైన అభిమాన దివ్యదేశాలన్నింటికీ మూలస్థానమైనందున మిగిలిన అర్చామూర్తులను ప్రస్తావించకుండా ముందుగా శ్రీరంగాన్ని పలుకుతున్నారు.

 అమ్ పొన్ అరఙ్గర్ క్కుమ్: అంటూ వివరణ వివరణీయ భావాన్ని పొందినదైన అకార నారాయణ పదాల యొక్క అర్ధాన్ని “అరఙ్గర్ క్కు” అనే పదంలోని షష్ఠీ విభక్తి ద్వారా ప్రణవములో ఇమిడి ఉన్న అకారములో వచ్చి లోపించిన చతుర్థి యొక్క అర్ధాన్ని తెలియజేసేరు. అలాగే “మకారో జీవవాచకః” (మకారము జీవవాచకము) అన్నట్టుగా ప్రణవములో ఉన్నదైన శేషత్వానికి ఆశ్రయమైన చేతన వస్తువును అంటే జీవుని శబ్దముగా ప్రతిపాదించే మకారము యొక్క, దానిలో శబ్దముగా చెప్పబడని ఈ చేతనుని యొక్క నిత్యత్వ ఏకరూపత్వ బహుత్వాదులను శబ్దముగా నారశబ్దము తెలుపుచున్నది. అందువలన వివరణ రూపమైన నారశబ్దము యొక్క అర్ధాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ పలుకుతున్నారు.

 అవిక్కుమ్ఆత్మలు ప్రకృతిని ప్రత్యయముగా కలిగి ఉండడం అన్నది సహజమైనది. అందువలన “ఆయ” పదము శేషత్వాన్ని చెప్పేది అయి, అకారములో లుప్త చతుర్థి అయినది. ఈశ్వరునికి శేషత్వము అవ్వాల్సినది ఉండగా, ఇక్కడ చేతన గతముగా చెప్పడములో ఉద్దేశ్యము ఏమి అని ప్రశ్న వేసుకుంటున్నారు. ఇక్కడ శేషత్వము సంబంధ విశేషాత్మకమైనది. జీవేశ్వరులిద్దరిచే నిరూపించబడవలసినది అయినందున (ద్వినష్టం) కనుక అది ఈశ్వరగతమైనా, చేతనగతమని కూడా చెప్పడములో ప్రమాదం ఏమి లేదు అంటున్నారు.

అవిక్కుమ్: “అమ్ పొన్” అన్న పదాలు ఇక్కడ కూడా అంటే ఆత్మకి చేర్చి పలకాలి. ఈ రీతిలో నిరుపాధిక శేషి అయిన శ్రీరంగనాథుడు శేషమై, ప్రకృతి కంటే విలక్షణమైన, జ్ఞానానందమయమైన, జ్ఞాన గుణకమై, నిత్యమై, నిర్వికారమై, ఏకరూపమై, బద్ధ ముక్త నిత్యుల రూపములతో మూడు విధములుగా ఉండేదైన ఆత్మవస్తువు అని, తైత్తిరియ నారాయణ వల్లిలో “పతిం విశ్వస్య” (లోకానికి పతి అని) తిరువాయ్ మొళి [7-2-10] “మూవులకాళి” (ముల్లోకాలను పాలకుడు అని)) పెరియాళ్వార్ తిరుమొళి [4-9-10] “ఎన్నై యాళాన్” (నన్ను పాలించేవాడు) ఇత్యాదుల ద్వారా శ్రీరంగనాథుడే ప్రాప్త శేషి “సర్వహితం ప్రాణినాం వ్రతమ్” (జీవులందరి హితమే వ్రతము) అని అనడం చేత ప్రాణం అనేది పంచవృత్తి ప్రాణమే అయినా “అవిక్కోర్ పత్తుక్కొమ్బు” (నా ఆత్మకి శ్రీరంగనాథుడే ఆధారం ఆలంబనం). అనే రీతిలో చేతనుని పట్ల కూడా ఈ “అవి” అనే పదం ప్రయోగింపబడడం కనిపిస్తున్నందున, దానిని అనుసరించి వీరుకూడా ఈ రీతిలోనే “అవి” అనే పదాన్ని ఇక్కడ ఆత్మార్థకముగా ప్రయోగిస్తున్నారు.

అమ్ పొన్ అరఙ్గర్ క్కుమ్ అవిక్కుమ్: శ్రీపిళ్ళైలోకాచార్యులవారు అర్థపంచకం మరియు మొదలైన గ్రంథాలలో స్వస్వరూపంతో ప్రారంభించి, తరువాత పరస్వరూపాన్ని అనుగ్రహించినా, శ్రుతి వాక్యములలో యజుర్ బ్రాహ్మమ్ [3. 7] “యస్యాత్మన తరుంతరేమి” (నేను ఎవరి శేషమై ఉన్నానో, ఆ భగవానుని విడచి ఉండను) అకారం మొదలుగా కలిగినదై ఉండీ, హారీత సంహిత “ప్రాప్యస్య బ్రహ్మణో రూపమ్” (పొందాల్సినది పరమాత్మ రూపము) ఇత్యాది వచనాలలోను పరస్వరూపం ముందు, తరువాత జీవ స్వరూపం చెప్పబడడం చేత దానిని అనుసరించి వీరుకూడా, ఈ రీతిలోనే ముందు పరస్వరూపాన్ని, తరవాత జీవస్వరూపాన్ని నిర్దేశిస్తున్నారు.

“యువతిశ్చ కుమారిణీ” (లక్ష్మీదేవి యవ్వనాన్ని తక్కువగాను కౌమారాన్ని ఎక్కువగాను కల్గినది) అనే ప్రమాణంలో సముచ్చయార్ధమైన చకారం అన్వాచాయమైనట్లుగా (అంటే అప్రాధాన్యాన్ని సూచించేటట్లుగా) “అరఙ్గర్ క్కుమ్ అవిక్కుమ్” అనే చోటగల “ఉమ్” అనే సముచ్చయం అన్వాచయమే తప్ప సముచ్చయం కాదు. అయితే శేషభూతునకు, శేషికి సమప్రాధాన్యం లేదా అంటే అనుగ్రహిస్తున్నారు. బ్రహ్మసూత్రము [4.4.21[ “భోగమాత్ర సామ్య లింగాచ్చ” (భోగములో మాత్రం ఉండే సామ్యాన్ని గుర్తుగా కలిగి ఉన్నందువలన) మరియు [4.4.17] “జగద్వ్యాపారవర్జమ్” (జగత్తును నిర్వహించడంలో తప్ప మిగిలిన అంశాలలో మాత్రమే ముక్తునకు భగవానునితో సామ్యం ఉన్నది) అని అనడం వలన చేతనునికి ఈశ్వరునికి సామ్యం భోగములోనే తప్ప అన్ని విధాలైన సామ్యాలు జీవునకు పరమాత్మతో లేవు. ముండక ఉపనిషత్తులో [3.1.3] లో చెప్పినట్టు “నిరంజనః పరమం సామ్యముపైతి” పుణ్యపాపాల నుండి విముక్తి పొందినవాడు భగవానునితో పరమసామ్యాన్ని పొందుతున్నాడు అని శ్రీమద్ భగవద్గీత లో భగవానుడు అనుగ్రహించినట్టుగా [14.2] “మమ సాధర్మ్య మాగతాః” (నా సాధర్మ్యాన్ని పొందినవారు) అని “పెరియ తిరుమొళి [11.3.5] “తమ్మైయే నాళుమ్ వణఙ్గి త్తొళువార్కు తమ్మైయేయొక్క అరుళ్ శెయ్ వర్” (తననే నిత్యం నమస్కరించి కొలిచేవారికి తనతో సామ్యాన్ని భగవంతుడు అనుగ్రహిస్తాడు అని ఇత్యాదుల ద్వారా అన్వాచాయ సముచ్చయాలు అనుగ్రహిస్తున్నారు).

అడియేన జ్యోతిర్మయి రామానుజ దాసి

మూలము: https://divyaprabandham.koyil.org/index.php/2023/01/saptha-kadhai-pasuram-1-part-2/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

 

Leave a Comment