తిరుప్పావై – సరళ వ్యాఖ్యానము – తనియన్లు

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

తిరుప్పావై

neeLA_thunga

నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం  
పారార్థ్యం స్వం శ్రుతి శత శిర సిద్ధ మధ్యాపయంతీ
స్వోచ్ఛిష్టాయాం స్రజి నిగళితం  యా బలాత్కృత్య భుంక్తే
గోదా తస్యై నమ ఇద మిదం భూయ ఏవాస్తు భూయః
 

నీళాదేవి (భగవానుడి పత్నులలో ఒకరు) అవతారమైన నప్పిన్నై పిరాట్టి యొక్క స్తనములపైన శ్రీ కృష్ణుడు నిద్రిస్తున్నాడు. ఆమె స్తనము పర్వతము యొక్క లోయలా ఉంది. ఆండాళ్ అంతకు ముందు తాను ధరించిన దండతో  శ్రీ కృష్ణుడిని బధించింది. ఆమె శ్రీ కృష్ణుడిని మేల్కొలుపుతూ, వేదాంతములలో స్పష్టంగా చూపబడిన పారతంత్రియం (ఆండాళ్ యొక్క పారతంత్రియం ) గురించి వారికి తెలియజేస్తుంది. బలవంతంగా భగవానుని వద్దకు వెళ్లి అతనిని ఆనందించి, చిరకాలం అక్కడే ఉన్న ఆమెకు నా వందనాలు. 

అన్నవయల్ పుదువై ఆండాళ్ అరంగఱ్కు 
ప్పన్ను తిరుప్పావై ప్పల్పదియం – ఇన్నిశైయాల్ 
పాడి క్కొడుత్తాళ్ నఱ్పామాలై  పూమాలై 
శూడిక్కొడుత్తాళై చ్చొల్లు 

చుట్టూ హంసలు పొలాలలో విహరిస్తున్న శ్రీవిల్లిపుత్తుర్లో అవతరించిన ఆండాళ్ నాచియార్, దయతో తిరుప్పావై ప్రబంధాన్ని తీపి ఆనవాలతో రచించి, శ్రీ రంగనాథునికి పద్యాలమాల రూపముగా అర్పించింది. ఆమె పూలతో చేసిన దండలను మొదట తాను ధరించి ఆపై సమర్పించింది కూడా. ఆ గొప్ప ఆండాళ్ గురించి పాడండి.

శూడిక్కొడుత్త శుడర్ క్కొడియే! తొల్పావై 
ప్పాడి యరుళ వల్ల పల్వళైయాయ్ – నాడి నీ 
వేంగడ వఱ్కెన్నై విది యెన్ఱ ఇమ్మాత్తం 
నాం కడవా వణ్ణమే నల్గు

పూలమాలలు మొదట తాను ధరించి ఆపై సమర్పించిన మెరిసే లత లాంటి ఓ! అమ్మా, చాలా కాలంగా పాటిస్తున్న పావై నోంబు (నోము) గురించి దయతో పాడి, తన దివ్య చేతులకు గాజులు ధరించిన ఓ అమ్మా! తిరువెంగడంలో భగవానుడికి దాసిగా ఉండాలని నీవు మన్మథుని వేడుకున్నావు. మేము వారిని వేడుకునే అవసరం రాకుండా నీ కృపా వర్షాన్ని మాపై కురిపించాలి.

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

మూలము: https://divyaprabandham.koyil.org/index.php/2020/05/thiruppavai-thaniyans-simple/

పొందుపరచిన స్థానము – https://divyaprabandham.koyil.org

ప్రమేయము (లక్ష్యము) – https://koyil.org
ప్రమాణము (గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (పూర్వాచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Comment