ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 12 -13

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

ఉపదేశ రత్తినమాలై

గతాశీర్షిక

పాశురం 12

ఈ పాశురములో మామునులు తై (పుష్య) మాసములో వచ్చే మఖా నక్షత్రమున అవతరించిన తిరుమణిశై పిరాన్/ఆళ్వార్ల కీర్తిని గురించి సకల జనులకు తెలియు విధముగా తెలుపుచున్నారు.

తైయిల్ మకమ్ ఇన్ఱు తారణియీర్ ఏత్తమ్! ఇన్ద త్తైయిల్ మగత్తుక్కు చ్చాత్తుగిన్ఱేన్ * తుయ్యమది పెత్త మళిశైప్పిరాన్ పిఱన్దనాళెన్ఱు! నల్ తవర్ గళ్ కొణ్డాడుమ్ నాళ్!!

జ్ఞానమునకు పరిశుధ్ధత అనగా పరమాత్మయైన శ్రీమన్నారాయణునందే మనస్సును లగ్నము చేసి సర్వస్వం అతని యందే సమర్పించి ఇతర దేవతలు/దేవతాంతరములయందు కొంచమైనా ఆసక్తి చూపకుండుట అని తిరుమణిశై ఆళ్వార్ల శ్రీసూక్తి. తిరుమణిశై ఆళ్వార్లకు వారి అభిమాన దివ్యదేశ పెరుమాళైన తిరుకుడందై ఆరావముదననుకు గల అన్యోన్య భావకారణముచేత వీరిని తిరుమణిశై పిరాన్ అనియు తిరుకుడందై ఆరావముదననుకు ఆళ్వార్లని సంభొదింపబడుచున్నారు. గొప్ప తపస్సు గలవారు అనగా శరణాగతిపై, ఆచార్య నిష్ఠలను కలిగిన తిరుమణిశై ఆళ్వార్ల శిష్యుడు కణికణ్ణన్ వంటివారు అదేవిధముగా భగవద్రామానుజులపై నిష్ఠ గలవారని వారి శ్రీసూక్తి.

పాశురం 13

ఈ పదమూడవ పాశురములో మాఘమాస పునర్వసు నక్షత్రం రోజున అవతరించిన కులశేఖరాళ్వార్ల గురించి లోకులందరూ తెలుసుకొనే విధముగా తెలుపుచున్నారు.

మాశిప్పునర్ పూశం కాణ్మిన్ ఇన్ఱు మణ్ణులగీర్! తేశిత్తు వశత్తుక్కు ఏదెన్నిల్ పేశుగిన్ఱేన్ కొల్లినగర్కోన్ కులశేఖరన్ * పిఱప్పాల్! నల్లవర్గళ్ కొణ్డాడుమ్ నాళ్!!

ఓ జనులారా నేను చెప్పేది వినండి. అదేమనగా మాఘమాసములో వచ్చు పునర్వసు నక్షత్రముననే మంచివారందరూ ఎవరినైతే పొగుడుతూ ఉంటారో అటువంటి కులశేఖరపెరుమాళ్ చేఱ దేశములోని కొల్లి నగరములో అవతరించినారు. వీరికి శ్రీరామచంద్రుని మీదగల అలవి కాని భక్తి కారణముచేత వీరు అందరిచేత పెరుమాళ్ అని సంభోధింప బడుచున్నారు. మంచివారనగా శ్రీవైష్ణవ సిధ్ధాంతమునందు ధృఢ విశ్వాసమును కలిగిన పరమ సాత్వికులు, జ్ఞాన, భక్తి పరులు మరియు భౌతిక విషయములయందు వైరాగ్యులు. మరొకవిధంగా చెప్పాలంటే మన పూర్వాచార్యుల వలే ఆత్మగుణ పరిపూర్ణత్వం కలిగినవారు.

అడియేన్ వీ.వీ.ఎల్.ఎన్. నరసింహాచార్యులు రామానుజ దాసన్

మూలము : https://divyaprabandham.koyil.org/index.php/2020/06/upadhesa-raththina-malai-12-13-simple/

ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి : https://divyaprabandham.koyil.org

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment