తిరుప్పావై – సరళ వ్యాఖ్యానము

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

ANdAl_srIvilliputhur_pinterest.com_sreedevi_balaji

శ్రీ మణవాళ మాముణుల యొక్క ఉపదేశ రత్నమాల 22వ పాశురము లో  ఆండాళ్ గొప్పతనాన్ని అద్భుతంగా వెల్లడి చేశారు.

ఇన్ఱో తిరువాడిప్పూరం ఎమక్కాగ
అన్ఱో ఇంగు ఆండాళ్ అవదరిత్తాళ్ – కున్ ఱాద
వాళ్వాన వైగుంద వాన్ బోగం తన్నై ఇగళ్ న్దు
ఆళ్వార్ తిరుమగళారాయ్

ఈ రోజు తిరువాడిప్పూరమా? (జేష్ఠ మాసంలో పూర్వఫాల్గుని నక్షత్రం రోజు). ఒక తల్లి తన బిడ్డను కాపాడటానికి బావిలోకి దూకినట్లే, శ్రీ భూమి పిరాట్టి శ్రీ వైకుంఠంలో అపరిమితమైన సుఖానుభవాన్ని పక్కన పెట్టి, మనల్ని ఉద్ధరించడానికి, పెరియాళ్వార్ యొక్క దివ్య కుమార్తె ఆండాళ్ గా భూమిపైన ఈ రోజున అవతరించింది. ఆమే  కేవలం శ్రీ వరాహ పెరుమాళ్ పలికిన పలుకులను నిజం చేయడానికి ఈ భూమిపైన అవతరించింది. “తమ పలుకులతో నన్ను స్తుతించడం ద్వారా, తమ మనస్సులో నన్ను ధ్యానించడం ద్వారా, పుష్పాలతో నన్ను ఆరాధించడం ద్వారా, జీవాత్మలు నన్ను సులభంగా పొందగలరు.” అని వరాహ పెరుమాళ్ భూమి పిరాట్టితో పలికిన పలుకులివి. ఏమి ఆశ్చర్యం! ఎంత దయ!

ఆండాళ్ తనను తాను గొల్ల భామగా, శ్రీవిల్లిపుత్తూర్ శ్రీ గోకులంగా, ఆమె స్నేహితులు గొల్ల భామలుగా, వడపెరుంగోయిల్లో (శ్రీవిల్లిపుత్తూర్లో) కొలువై ఉన్న భగవానుడిని శ్రీ కృష్ణునిగా, ఆ ఆలయాన్ని నందగోపుని నివాసముగా భావించింది. భగవానుడిని పొందడనికి భగవానుడే సాధనమని, కేవలం వారి ఆనందం కోసం కైంకర్యము చేయాలని, భక్తుల ద్వారా అతనిని సాధించిన తరువాత, నప్పిన్నై పిరాట్టి పోషించిన సిఫార్సు పాత్రతో, ప్రతి ఆత్మకి అది స్వరూపమని గొప్ప కృపతో సరళముగా అర్థం చేసుకోగల తిరుప్పావై అని పిలువబడే  తమిళ పాశురముల ద్వారా ఆమె వెల్లడి చేసింది.

తిరుప్పావై అన్ని వేదాలకు మూలంగా కీర్తించబడింది. మరో మాటలో చెప్పాలంటే, తిరుప్పావైలో వేదాల యొక్క సారాన్ని మనం చూడవచ్చు. వేదాలలో ఒక ముఖ్యమైన సూత్రము ఏమిటంటే, వేద నిపుణుల సహాయంతో భగవానుడి యొక్క దివ్య పాదాలను పొందగలము అని వివరించబడింది. అదే విధంగా, ఎమ్పెరుమాన్ ఆనందానికై, తనతో పాటు వారి భక్తుల సేవ కూడా చేయడం ముఖ్యమైనదిగా పరిగణించబడింది. ఈ అంశాన్ని మనం తిరుప్పావైలో ఆనందించవచ్చు. తిరుప్పావై ప్రబంధంలో ఎమ్పెరుమానార్ (భగవద్ శ్రీ రామానుజ)  భాగస్వామ్యం కూడా ఉన్నందున వారిని తిరుప్పావై జీయర్ అని పిలిచేవారు. ఈ ప్రబంధానికి మరో ప్రత్యేకత ఏమిటంటే, ఈ ప్రపంచంలో పిల్లల నుండి పెద్దల వరకు, ఎంతో ఆనందంతో ప్రతి ఒక్కరూ పఠించే ప్రబంధం అది తప్పా మరొకటి లేదు.

ఈ ప్రబంధానికి సరళమైన వివరణ మన పూర్వాచార్యుల వ్యాఖ్యానముల సహాయంతో వ్రాయబడింది..

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2020/05/thiruppavai-simple/

పొందుపరచిన స్థానము – http://divyaprabandham.koyil.org

ప్రమేయము (లక్ష్యము) – http://koyil.org
ప్రమాణము (గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (పూర్వాచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Comment