ఉత్తర దినచర్య శ్లోకం 12 – ఇతి స్తుతి

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

శ్రీ వరవరముని దినచర్య

<< స్లోకం 11

శ్లోకము 

ఇతి స్తుతి నిబన్దేన సూచిత స్వమనిషితాన్ !

భృత్యాన్ ప్రేమర్ధయా దృష్ట్యా సిఞిన్తం చిన్తయామి తమ్  !!

ప్రతిపదార్థము:

ఇతి = పైన చెప్పిన ఆరు శ్లోకాల ప్రకారం   

స్తుతి నిబన్దేన = స్తోత్రముగా కూర్చబడిన ప్రబందము  

సూచిత స్వమనిషితాన్ = తాము కోరుకున్నపురుషార్థాలను కలిగియుండి

భృత్యాన్ = అమ్మను కొనను అర్హతగల వస్తువులాగా ఉన్న కోయిలణ్ణన్ వంటి శిష్యులను  

ప్రేమర్ధయా =  ప్రీతి చేత చల్లబడిన

దృష్ట్యా = కృపా కటాక్షములతో  

సిఞిన్తం = స్తిమితపరచే  

తమ్  = మామునులను

చిన్తయామి = నిరంతరం ధ్యానిస్తూ వుంటాను.

భావము:

   ‘ ఉత్తర దినచర్య ‘ అన్న గ్రంథంలో  మొదటి ఆరు శ్లోకాలలో ఎఱుమ్బియప్పా అనే వారు తమ ఆచార్యులైన మణవాళ మామునులను  గురించి స్మరించారు. ఇప్పుడు ఆ స్తోత్రము మీది ప్రీతిచేత మణ వాళ మామునులను అనుభవించబోతున్నారు. ‘ఇతి’  అంటే ఈ ప్రకారంగా ముందు చెప్పిన ఆరు శ్లోకాలలో ఉన్న భావమును బట్టి అన్న అర్థం వస్తుంది. వాటిలో ‘ త్వం మే బంధు ‘(7), యా యావృత్తి’ (10 ) వరకు వున్న నాలుగు శ్లోకాలు వీరు రాసిన వరవరముని శతకంలో కూడా కనపడుతుంది. ‘ ఉన్మీల పద్మ ‘ (6) అన్న శ్లోకము , దాని ముందర ఉన్న ’ అపగతమానై ‘  అన్న శ్లోకము వీటితోనే అనుసంధానము చేస్తూ ఉన్నందున మరొకరు అనుగ్రహించారని ఎవరు ఆరోపించనందు వలన వాటిని కూడా కలిపే అనుసం దానం చేయటం ఆచారంగా వస్తున్నందు వలన ఈ నాలుగు శ్లోకాలను కూడా ఎఱుమ్బియప్పా అనుగ్రహించినట్లుగా గ్రహించబడింది .  ఈ అరు శ్లోకాలలో ‘ దివ్యం తత్ పాదయుగ్మం దిశతు ‘ (6), తవపదయుగ్మం దేహి ‘(9) , అంగ్రిద్వయం పశ్యన్  పశ్యన్’ (8) అని మూడు శ్లోకాలలో మామునులు శ్రీపాదాలను తమ శిరస్సు మీద ఉంచి అనుగ్రహించాలని , వాటిని ఎప్పుడూ  సేవించాలని కోరుకున్నారు. దీనిని బట్టి ఈ ఆరు శ్లోకాలలో అష్టదిగ్గజాలనబడే కోయిలణ్ణన్ ,వానమామలై జీయర్ తప్ప ఎఱుమ్బియప్పా , తిరువేంకట జీయర్ ,పరవస్తు పట్టర్ పిరాన్ జీయర్ , ప్రతివాది భయంకరం అణ్ణా,అప్పిళై, అప్పుళ్ళార్లు  తలా ఒకటి అనుసంధానము చేసారని గ్రహించవచ్చు. కోయిలణ్ణన్ అనే ఆచార్యులు నిరంతరం మామునులను భరించు పాదుకలుగాను, వానమామలై జీయర్ పాదాలనే అంటి వుండే పాదరేఖలుగాను ప్రసిద్ధులు వీరివురు. మామునులను ఎప్పుడు వీడక వారి శ్రీపాదాలను తమ శిర స్సు పై ధరించాలని ,వాటిని ఎప్పుడు సేవిస్తూ వుండాలని కోరుకున్నారని అణ్ణావప్పంగార్ స్వామి అభిప్రాయముగా చెపుతారు . ఎఱుమ్బియప్పా అనుగ్రహించిన ఈ ఆరు శ్లోకాలు ఒకటి వీరు అనుగ్రహించినట్లు మిగిలిన ఐదు శ్లోకాలు ఐదుగురు తలా ఒకటి అనుగ్రహించారని పెద్దల అభిప్రాయము.

అడియేన్ చూడామణి రామానుజ దాసి.

మూలము : https://divyaprabandham.koyil.org/index.php/2016/09/uththara-dhinacharya-12/

పొందుపరిచిన స్థానము: https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment