స్తోత్ర రత్నము – సరళ వ్యాఖ్యానము

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

ఆళవందారులు మరియు నాథమునులు - కాట్టు మన్నార్ కోయిల్

ఆళవందార్లు, నాథమునులు – కాట్టు మన్నార్ కోయిల్

పూజ్యులైన ఆచార్య పురుషులు నాథమునుల మనముడైన ఆళవందార్లు విశిష్థాద్వైత సిద్దాంతము / శ్రీవైష్ణవ సాంప్రదాయములో మహాపండితులు. వారు ప్రాప్య ప్రాపకములకు సంబంధించిన విశేష సూత్రాలను ద్వయ మహామంత్ర వివరణతో ఈ స్తోత్ర రత్నములో వెల్లడి చేశారు. ఈ స్తోత్రం మనకు అందుబాటులో ఉన్న, మన పూర్వాచార్యుల మొట్టమొదటి సంస్కృత స్తోత్ర గ్రంథము.

ఇళైయాళ్వార్ని (శ్రీ రామానుజులు) ఆళవందార్ల శిష్యులుగా చేర్చుకోవాలనే సంకల్పంతో పెరియ నంబి కాంచిపురానికి వెళతారు. అప్పట్లో శ్రీ రామానుజులు తిరుక్కచ్చినంబి నాయకత్వంలో దేవపెరుమాళ్ళ కోసం సాళైక్కిణఱు (ఒక బావి) నుండి తీర్థము (జలం) తీసుకువచ్చే కైంకర్యన్ని చేస్తుండేవారు. పెరియ నంబి స్తోత్ర రత్నములోని కొన్ని శ్లోకాలు సేవిస్తుండగా విని ఆకర్శితులైన ఇళైయాళ్వార్లు, ఆ తరువాత మన సాంప్రదాయములోకి ప్రవేశించారు. తరువాత కాలములో ఇళైయాళ్వారులు ఎంబెరుమానార్లుగా పిలువబడ్డారు. ఈ ప్రబంధము పట్ల వారికి ఎనలేని ప్రీతి ఉండేది. ఆ కారణముగా ఇందులోని కొన్ని వివరణ (గద్యము) లను వారి శ్రీవైకుంఠ గద్యములో ఉపయోగించారు.   

పెరియ వాచ్ఛాన్ పిళ్ళై ఈ దివ్య ప్రబంధానికి విస్తృత వ్యాఖ్యానము వ్రాశారు. ఈ స్తోత్ర గోప్యార్థాలను పెరియ వాచ్ఛాన్ పిళ్ళై వారి వ్యాఖ్యానములో మంచి వాక్చాతుర్యంతో వివరించారు. వారి వ్యాఖ్యానాల ఆధారంగానే ఈ శ్లోకముల సరళ వివరణ మనమిక్కడ ముందు ముందు చూస్తాము. 

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2020/10/sthothra-rathnam-simple/

ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి : http://divyaprabandham.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment