శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
శ్లోకము 31 – ఈ శ్లోకములో “కేవలము నీ దివ్య చరణముల దర్శనముతో సరిపోదు, నా శిరస్సుని నీ దివ్య తిరువడితో అలంకరించాలి” అని ఆళవందార్లు చెబుతున్నారు. తిరువాయ్మొళి 9.2.2లో చెప్పినట్టుగా “పడిక్కళవాగ నిమిర్త నిన్ పాదపంగయమే తలైక్కణియాయ్” (ముల్లోకాలంత పెరిగిన నీ దివ్య చరణములతో నా శిరస్సుని అలంకరించు), తిరువాయ్మొళి 4.3.6 “కోలమామ్ ఎన్ సెన్నిక్కు ఉన్ కమలం అన్న కురై కళలే” (కమలము లాంటి నీ దివ్యచరణములు నా శిరస్సుకి అలంకరణ).
కదా పునః శంఖ రథాంగ కల్పక
ధ్వజారవిందాంకుశవజ్రలాంఛనం।
త్రివిక్రమ! త్వచ్చరణాంబుజద్వయం
మదీయమూర్ధానమలంకరిష్యతి॥
త్రివిక్రమునిగా అవతరించిన ఓ నా స్వామి! శంఖము, చక్రము, కల్పవృక్షము, ధ్వజము, అరవిందము/తామరము, అంకుశము, వజ్రాయుధము గుర్తులు ఉన్న నీ రెండు దివ్య చరణములతో నా శిరస్సుని ఎప్పుడు అలంకరించెదవు?
శ్లోకము 32 – ఈ శ్లోకము నుండి 46వ శ్లోకము “భవంతం” వరకు, ఆళవందార్లు చతుర్భుజములు, పాద యుగళి, తిరువాభరణములు, దివ్యాయుధములు, ఉభయ దేవేరులు, దివ్య సేవకులు, సంపద మొదలైన వాటితో కూడిన భగవానుడిని ఆనందిస్తూ ఈ దివ్య పరమానంద అనుభవము యొక్క ఫలితముగా తాను ఎప్పుడు భగవానుడి సేవ చేయగలడని ప్రశ్నిస్తున్నారు. దీనితో, భగవానుడిని భక్తుల సమేతముగా పరమపదములో సేవించాలనే తన లక్ష్యము గురించి ఆళవందార్లు వివరిస్తున్నారు.
విరాజమానోజ్జ్వల పీతవాససం
స్మితాతసీసూనసమామలచ్ఛవిం।
నిమగ్ననాభిం తనుమధ్యమున్నతం
విశాలవక్షస్థలశోభిలక్షణం॥
అతి సుందర దివ్య ప్రకాశవంతమైన పీతాంబరము, నీలోత్పల పుష్పము వంటి మచ్చలేని సౌదర్యము, లోతైన నాభి, సన్నని నడుము, వారి దివ్య వక్షస్థములో శ్రీవత్సము పుట్టుమచ్చ వంటి సహజలక్షణముతో భగవానుడు ఉన్నాడు.
శ్లోకము 33 – ఆళవందార్లు భగవానుడి వీర్య శౌర్యములతో పాటు వారి దివ్య భజములను వీక్షిస్తూ ఆనందిస్తున్నారు.
చకాసతం జ్యాకిణకర్కశైశుభైః
చతుర్భి రాజానువిలంబిభిః భుజైః।
ప్రియావతంసోత్పల కర్ణ భూషణ
శ్లథాలకాబంధ విమర్ధశంసిభిః
శ్రీ మహాలక్ష్మి యొక్క కర్ణములను, చెవి దుద్దులను, ఉంగరాల శిరోజాలను అలంకరించే కలువ పుష్పముల ముద్రలను బహిర్గతము చేస్తూ పెరుమాళ్ళు శరప్రయోగము చేసియుడుట వలన రాటుదేలిన తమ దివ్య మంగళ చతుర్భుజములతో దేదీప్యమానముగా వెలుగుతున్నాడు..
శ్లోకము 34 – భగవానుని దివ్య భుజముల తరువాత, ఆళవందార్లు వారి దివ్య కంఠమును మరియు దివ్య ముఖ సౌందర్యముని ఆనందిస్తున్నారు.
ఉదగ్రపీనాంస విలంబి కుండల
అలకావళీబంధురకంబుకంధరం।
ముఖశ్రియా న్యక్కృతపూర్ణ నిర్మల
అమృతాంశుబుంబాంబురుహోజ్జ్వలశ్రియం॥
గుడ్రని దివ్య భుజముల వరకు భగవానుడి చెవి కుండలములు తాకుతున్న కారణముగా వారి దివ్య కంఠ భాగము అతి సుందరముగా కనిపించుచున్నది. వారికి ఉంగరాల శిరోజాలు ఉన్నాయి. మెడపైన మూడు గీతలు కూడా ఉన్నాయి. అప్పుడే వికసించిన పద్మము యొక్క తాజాతనమును, పౌర్ణమి యొక్క నిండు చంద్రుడిని జయిస్తున్న చందముగా వారి దివ్య ముఖ భాసిల్లుచున్నది…
శ్లోకము 35 – తిరువాయ్మొళి 7.7.8 “కొళిళైత్ తామరై” (కమల నేత్రములు వాటికవే దివ్యాభరణము వలే మెరుస్తున్నాయి) [ ఈ పాసురములో నమ్మాళ్వార్లు భగవానుడి దివ్య ముఖ సౌందర్యాన్ని ఒక్కొక్కటిగా ఆస్వాదిస్తున్నారు], దివ్య ముఖ సౌందర్యమును ఒక్కొక్క అంశముగా ఆ కలయికని ఆళవందార్లు ఆస్వాదిస్తున్నారు.
ప్రబుద్దముగ్ధాంబుజచారులోచనం
సవిభ్రమభ్రూలతముజ్జ్వలాధరం।
శుచిస్మితం కోమలగణ్డమున్నసం
లలాటపర్యంత విలంబితాలకం॥
అప్పుడే వికసించిన తామర పువ్వు రేఖలవంటి నేత్రములు, తీగలా మెలికెలు తిరిగిన దివ్య కను బొమ్మలు, దివ్యముగా మెరుస్తున్న పెదాలు, నిర్మలమైన చిరు మందహాసము, అందమైన చెక్కిళ్లు, ఎత్తైన ముక్కు, లలాటము (నుదురు) వరకున్న దివ్య శిరోజాలు…
శ్లోకము 36 – భగవానుడి దివ్యాభరణములు మరియు వారి ఆయుధాల కలయికను ఆళవందార్లు ఆస్వాదిస్తున్నారు.
స్ఫురత్కిరీటాంగదహారకంటికా
మణీంద్రకాంచిగుణనూపురాదిభిః
రథాంగశంఖాసిగధాధనుర్వరైః।
లసత్తుళస్యా వనమాలయోజ్జ్వలం॥
ఆకర్షణీయమైన మకుటము, దివ్య భుజకీర్తులు, దివ్య కుండలములు, దివ్య హారములు, శ్రీ కౌస్థుభ మణి, దివ్య వడ్డానము, దివ్య పాద అందెలు మొదలైన వాటితో ., చక్రము, శంఖము, నందకము, కౌమోదకీ గద, శారంగ ధనస్సు వంటి దివ్య ఆయుధములు, దివ్య తేజోమయమైన తిరుత్తుళాయ్ (తుళసి), వనమాలతో భగవానుడు మెరిసిపోతున్నారు.
శ్లోకము 37 – ఆళవందార్లు వచ్చే రెండు శ్లోకములలో (ఈ శ్లోకము, తరువాత శ్లోకము) పిరాట్టితో భగవానుడు కూడియుండుటను సేవిస్తున్నారు మొదటి శ్లోకములో, పిరాట్టి యొక్క గొప్పతనాన్ని మరియు ఈశ్వరుడికి ఆమె పట్ల ఉన్న ప్రేమను ఆళవందార్లు వివరిస్తున్నారు.
చకర్థ యస్యా భవనం భుజాంతరం
తత్వ ప్రియం ధామ యదీయజన్మభూః
జగత్సమస్తం యగపాంగసంశ్రయం
యదర్థ మంభోధిరమంత్యబంధి చ ॥
క్షీర సముద్రము నుండి ఉద్భవించిన పిరాట్టికి తన వక్షస్థలాన్ని ఆమెకు ప్రియమైన నివాసముగా ఇచ్చిన ఓ ఎంబెరుమాన్! సమస్థ లోకాలు ఆమె చల్లని దృష్ఠిపై ఆధారపడి ఉన్న పిరాట్టి కోసం సముద్రము చిలికావు, సముద్రముపై వంతెన కూడా కట్టావు.
శ్లోకము 38 – ఈ శ్లోకములో, పిరాట్టి (శ్రీ మహాలక్ష్మి) యొక్క అసీమితమైన అనుభవాన్ని, భగవానుడి కోసమే తన ప్రత్యేక అస్థిత్వాన్ని ఆళవందార్లు ఆస్వాదిస్తున్నారు. తిరువాయ్మొళి 10.10.6 లో “ఉనక్కేర్కుం కోల మలర్ప పావై” (అందమైన పద్మములో నివాసముండే శ్రీ మహాలక్ష్మి నీకు సరైన జోడి) అని చెప్పబడినట్లుగా.
స్వవైశ్వరూప్యేణ సదాऽనుభూతయాऽపి
అపూర్వవత్ విస్మయమాదధానయా।
గుణేన రూపేణా విళాసచేష్థితైః
సదా తవైవోచితయా తవ శ్రియా॥
నీ స్వరూపముతో నిన్ను ఆనందించినప్పటికీ, పిరాట్టి తన గుణములతో, సౌందర్యముతో, చక్కని కార్యములతో, అన్ని స్థితులలో (పరపదములో ‘పర’గా, క్షీరాబ్దిలో వ్యూహముగా, విభవము(అవతారములు), మొదలైన) నిత్య నూతనంగా, నీకు తగిన జోడిగా, నీ సంపదగా నిన్ను ఆశ్చర్యపరచుతుంది.
శ్లోకము 39 – పర్యంక విధ్యలో వివరించినట్టుగా ఆదిశేషునిపై భగవాన్తో పిరాట్టిని ఆళవందార్లు ఆనందిస్తున్నారు.
తయా సహాసీనమనంతభోగిని
ప్రకృష్థ విజ్ఞానబలైకధామని।
ఫణామణివ్రాతమయూఖమండల
ప్రకాశమానోదర దివ్యధామని॥
ఆదిశేషుడు గొప్ప శక్తి జ్ఞానానికి నివాసములాంటివాడు. అటువంటి ఆదిశేషుని వళ్ళో మధ్య భాగములో తన పడగలపైనున్న దివ్య మణుల కాంతిలో ఏకాంతముగా పిరాట్టితో భగవానుడు ప్రకాశిస్తున్నారు. తిరువనంతుని దివ్య స్వరూపముపై భగవాన్ శయనించి నిద్రిస్తున్నారు.
శ్లోకము 40 – కైంకర్య కోరికతో, తిరుఆదిశేషుని దివ్య సేవని ఆళవందార్లు సేవిస్తున్నారు. విష్ణుపురాణము 1.15.157లో చెప్పినట్టు “ఉపమానమశేషాణాం సాధునాం యస్సదాऽభవత్।” (సత్పురుషులకు ప్రహ్లాదుడు ఉదాహరణగా ఎలా నిలిచాడో), కైంకర్య కోరిక ఉన్నవారికి తిరువనంతుని సేవలు ఉత్తమ ఉదాహరణలు. అటువటి ఆదిశేషుని ఉత్తమ గతిని ఆళవందార్లు వివరిస్తున్నారు.
నివాస శయ్యాసనపాదుకాంశుక
ఉపదానవర్షారప వారణాదిభిః।
శరీరభేదైస్త్వవ శేషతాం గతైః
యథోచితం శేష ఇతీరితే జనైః॥
తిరువనంతుని దివ్య స్వరూపముపైన భగవానుడు శయనించగా, ఆదిశేషుడు భగవానునికి దివ్య రాజభవనముగా, శయనించడానికి శయ్యగా, కూర్చుండడానికి సింహాసనముగా, పాదుకలుగా (వారు ధరించే), వస్త్రముగా (వారు ధరించే), దిండుగా (వారు హత్తుకొనుటకు), వర్షము మరియు ప్రకాశము నుండి రక్షించేందుకు గొడుగుగా, నీకు ఎన్నో సేవలందించేందుకు ఎన్నెన్నో రూపాలు ధరించగా, అందరిచే తిరుఆదిశేషుడు “శేష” గా పిలువబడతాడు.
అడియెన్ శ్రీదేవి రామానుజ దాసి
మూలము: https://divyaprabandham.koyil.org/index.php/2020/10/sthothra-rathnam-slokams-31-to-40-simple/
ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి : https://divyaprabandham.koyil.org
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org