జ్ఞానసారము 30

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

జ్ఞానసారము

<< పాశురము 29

ramanuj

 
పాశురము-30

“మాడుం మనయుం కిళయుం మఱై మునివర్

తేడుం ఉయర్ వీడుం సెన్ నెఱియుం పీడుడయ

ఎట్టెళుతుం తందవనే ఎన్ఱు ఇరాదార్ ఉఱవై

విట్టిడుగై కండీర్ విధి”

 

అవతారిక:

లౌకిక పార లౌకిక యాత్రకు అవసరమైన సకల సంపదను తనకు అష్టాక్షరి మహా మమంత్రమును ఉపదేశించిన ఆచార్యుల కృప అన్న గ్రహింపు లేని వారితో సంబంధమును విడిచివేయాలని  శాస్త్రములో చెప్పబడినదని స్వామి అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్ ఈ పాశురములో చెపుతున్నారు . 

ప్రతిపదార్థము:

మాడుం = పాలనిచ్చే పశు సంపద

మనయుం = నివసించుటకు ఇల్లు

కిళయుం = బంధువులు

మఱై మునివర్ తేడుం = వేదాధ్యనము చేసిన మునులు కోరుకునే

ఉయర్ వీడుం =  పరమపదము

సెన్ నెఱియుం =  ఆ పరమపదమును చేరుటకు అర్చిరాది మార్గమును ప్రయాణించుట

పీడుడయ = ఉన్నతమైన

ఎట్టెళుతుం = అష్తాక్షరి మహా మంత్రమును

తందవనే = ఉపదేశించిన వారి కృపే

ఎన్ఱు ఇరాదార్ = కారణము అని తెలియని వారితో

ఉఱవై = సంబంధమును

విట్టిడుగై = పూర్తిగా వదిలి వేయుట

విధి =  శాస్త్రము విధించిన పధ్ధతి

కండీర్ = తెలుసుకొనండి

వ్యాఖ్యానము :

మాడుం ……తాను శరీరమును పోషించుకొనుటకు అవసరమైన పాలు, పెరుగు, వెన్న ,నెయ్యి మొదలగు సారవంతమైన పదార్థములను ఇచ్చే పశు సంపద.

మనయుం…….లౌకిక ఆనందమును పొందుటకు అవసరమైన ఇల్లు, బంధువులు ,ఇతరమైన సంపదలు.

మఱై మునివర్……వేదాధ్యయనము చేసి సుజ్ఞానమును పొంది సదా భగధ్యానములో గడిపే వారు కోరుకునే….

తేడుం ఉయర్ వీడుం ……..ఉన్నతమైన పరమపదము . ఇక్కడ ‘ ఉన్నతమైన ‘ అన్నారంటే ఇంతకంటే తక్కువైనది మరొకటీ ఉందని అర్థమవుతున్నది . అది కైవల్యము.. అనగా తన ఆత్మను తానే అనుభవిచాలని కోరుకునేది .అది ఉన్నతమైన ది కాదు . దానిని కోర రాదు. అందుకే ఇక్కడ ఉన్నతమైన అని చెప్పారు . ఉన్నతమైన పరమపదము ( వైకుందవాన్ భోగం తన్నై ) , దానిని పొందుటకు ప్రయాణీంచాల్సిన అర్చిరాది మార్గము అని అర్థము

పీడుడయ ఎట్టెళుతుం తందవనే ఎన్ఱు ఇరాదార్ ఉఱవై…….జనన మరణ చక్రము నుండి విడివడి  నిత్య కైంకర్య భాగ్యమును పొంది నిత్యానందుడుగా ఉండటానికి ఉపకరించే అంత గొప్ప సంపదను ఇచ్చింది ఎవరు? ఆచార్యులు కదా! వారు అష్టాక్షరి అనే తిరుమంత్రమును, దాని అర్థమును అపారమైన కృపతో ఉపదేశించుట వలననే ఈ సంపద లభించింది అన్న జ్ఞానము లేని వారితో సంబంధమును …

విట్టిడుగై …….పూర్తిగా వదిలి వేయుట…

విధి………విధి… తప్పనిసరి అని శాస్త్రము చెపుతున్నది

కండీర్……. తెలుసుకొనండి. అర్థాత్ తిరుమంత్రమును ఆచార్య ముఖత పొందని వారితో సంబంధమును విడిచి వేయాలి . అచార్య సంబంధము లేని వారితో మనకు కూడా సంబంధము ఉండకూడదు అని ఈ పాశురములో చెపుతున్నారు .

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2015/02/gyana-saram-30-madum-manayum/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *