జ్ఞానసారము 26

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

జ్ఞానసారము

<< పాశురము 25

ramanuja

పాశురము-26

“తప్పిల్ గురు అరుళాల్ తామరైయాళ్ నాయగన్ తన్

ఒప్పిల్ అడిగళ్ నమక్కు ఉళ్ళత్తు – వైప్పెన్ఱు

తేఱి ఇరుప్పార్గళ్ తేసు పొలి వైగుంతత్తు

ఏఱి ఇరుప్పార్ పణిగట్కే ఏయిందు”

అవతారిక

శరణాగతి మార్గము శ్రీమన్నారాయణునిచే చెప్పబడినది. ఈ విషయమును తమిళ కవి  తిరువళ్ళువర్ పొఱి వాయిల్ ఐయందవిత్తాన్ పొయ్దీర్ ఒళుక్క నెఱి”  అన్నారు. అనగా సర్వస్వామి అయిన సర్వేశ్వరుడు చెప్పిన నిజమైన మార్గమే ఉన్నతమైన మార్గము . మరొక చోట ఇలా అన్నారు. పఱ్ఱఱ్ఱాన్ పఱ్ఱినై”, (కోరికలే లేని వాడు కోరిన మార్గము). ” నెఱి ” అనగా మార్గముశరణాగతి మార్గము . ఇది సదాచార్యుని పురుషకారముతో చేయాలి .  శ్రీమన్నారాయణుని శ్రీపాదములకు శరణాగతి  చేసి పరమపదము చేరి నిత్య కైంకర్యము చేయాలనే కొరిక అందులో రుచి ఆయనే మనకు ఉత్తారకుడన్న మహా విశ్వాసము ఆ మార్గములో ప్రయాణించి అంతిమ ముగా పరమపదము చేరి నిత్య కైంకర్య భాగ్యమును పొందుట సదాచార్యులను ఆశ్రయించటము ద్వారానే పొందగలుగుతారు.

ప్రతిపదార్థము:

తప్పిల్ = జ్ఞాన అనుష్టానములలో లోపము లేనివారు

గురు = ఆచార్యులు

అరుళాల్ = కృపతో

తేఱి ఇరుప్పార్గళ్ = ధృఢ విశ్వాసము గలవారు

తామరైయాళ్ నాయగన్ తన్ = తామరలో పుట్టి అందులో వేంచేసి వుండే శ్రీమహాలక్ష్మి ధవుడైన శ్రీమన్నారాయ ణుని

ఒప్పిల్ = అసమానమైన

అడిగల్ = దాసులు

నమక్కు –= మన వంటి అజ్ఞులకు

ఉళ్ళత్తు = మనసులో ఉండే

వైప్పెన్ఱు = సుసంపద అని

తేరి ఇరుప్పార్గల్ = విశ్వాసము గలవారు

తేసు పొలి =తేజస్సుతో ప్రకాశించు

వైగుంతత్తు = పరమపదమును

ఏఱి = చేరు మార్గములో పయనించి చేరి

పణిగట్కే = అక్కడ కైంకర్యము చేయుటకు

ఏయిందు ఇరుప్పార్ = సిద్దమై ఉంటారు

తప్పిల్ గురు అరుళాల్……’ : తప్పిల్ గురు ‘ అంగా ఎప్పుడు ఏ తప్పు చేయని ఆచార్యుడు. తిరుకుఱళ్ లో  “కఱ్క అదఱ్కు తగ నిఱ్క” ( నేర్చిన దానికి కట్టుబడి వుండు) అన్నారు. సుజ్ఞానమును నేర్చిన ఆచార్యుడు దోషములను చేయజాలడు అని అర్థము.

తామరైయాళ్ నాయగన్ తన్....: తామరలో పుట్టి అందులో వేంచేసి వుండే శ్రీమహాలక్ష్మి ధవుడైన శ్రీమన్నారాయణుడు . 1. శ్రీమన్ ,2. నారాయణుడు అనే రెండు పదాలు ద్వయ మంత్రములో మొదటిభాగములో ఉంటుంది .తామరైయాళ్ నాయగన్ అంటే ద్వయములో చెప్పిన నారాయణుడు…. వాత్శల్యము, స్వామిత్వము , సౌశీల్యము , సౌలభ్యము గల శ్రీమన్నారాయణుడు . దానికి తోడు ఆయనకు గల అపారమైన జ్ఞానము ,శక్తి ,ప్రాప్తి , పూర్తి వలన , ఆయన మాత్రమే దాసులను ఉజ్జీవింప చేయగలడు . ఆయననే  దాసులందరు ఆశ్రయిస్తారు. నాయ గన్ తన్ అన్న పదము పై గుణములన్నింటినీ ప్రతిబింబిస్తుంది . ద్వయ మహా మంత్రములోని ‘ నారాయణ ‘ పదము కూడా దీనినే తెలియజేస్తుంది .

ఒప్పిల్ అడిగళ్…....అసమానమైన శ్రీమన్నారాయణుని శ్రీపాదములు …ద్వయ మహా మంత్రములోని ‘చరణౌ ‘ ఇందులో ఇమిడి వున్నడి .’ ఒప్పిల్ ..’అసమానమైన ‘ అని ఎందుకు అంటున్నారంటే మరెవరి సహాయము తీసుకోకుండా ఆ శ్రీపాదములే దాసులను రక్షించ గలవు .

నమక్కు ఉళ్ళత్తు …… మన వంటి అజ్ఞులైన వారు….. మన వంటి  వారిని రక్షించుటకు ఆయనే తగిన వాడన్నది లోక విదితమే . అది తెలిసిన వాడు ఆయనను తప్ప మరెవరినీ ఆశ్రయించడు . ద్వయ మహా మంత్రములోని“చరణౌ ” , “ప్రపద్యే” అన్న పదములు ఇక్కడ ఇమిడి వున్నాయి . ఆ శ్రీపాదములను హృదయములో నిలుపుకోవట మంటే గొప్ప నిధిని హృదయములో నిలుపుకున్నట్లే .  కాయికముగా ఆయన శ్రీపాదములను పట్టుకోవటము కాక మానసికముగా పట్టుకోవటము గనక దీనిని “మానస స్వీకారము” అంటారు .

తేఱి ఇరుప్పార్గళ్ …… అనుమానములేవీ లేకుండా ధృఢ విశ్వాసము కలిగి  వుండుట ….. ఆయన శ్రీ పాదములే రక్ష అని ధృఢ విశ్వాసము కలిగి  వుండుట . అటువంటి విశ్వాసము ఏర్పడటము  అంత శులభము కాడు .శరణాగతి చేసిన వారికి ఈ విషయములో అనుమానములు ఉండవు. అలా ఎవరికైనా  అనుమానములు ఉంటే వారికి  పరమపదము దక్కదు .  అటువంటి వారినే ‘ తేఱి ఇరుప్పార్గళ్ ‘ అన్నారు .

తేసు పొలి వైగుంతత్తు…… వారు అంతిమ గమ్యమైన పరమపదమునకు చేరుకుంటారు. దీనినే అళివిల్  ( చెదరని ఇల్లు)అంటారు . పరమపదములో  శ్రీమన్నారాయణునికి నిత్యకైంకర్యము చేస్తూ నిత్యానందమును పొందుతారు.

ఏఱి ఇరుప్పార్ పణిగట్కే ఏయిందు……..ఈ దాసులు పరమపదములో కైంకర్యము చేయుటకు తగిన వారు. “పణిగల్” (కైంకర్యము) అన్న పదము దీనినే తెలియజేస్తున్నది. “ఏయంధు ఇరుప్పార్”…అలా  కైంకర్యము చెయటానికి అర్హత కలిగి , ఆతృతతో ఎదురు చూస్తారు. ‘ పణి ‘ అన్న పదానికి మరొక అర్థము కూడా వుంది. ‘ పణి ‘ అంటే  “ఆదిశేషుడు” అని కూడా అర్థం ఉండి. అర్థాత్ ఈ దాసులు శ్రీమన్నారాయణునికి  కైంకర్యము చెయటములో  ఆదిశేషునికి సమానమైన వాళ్ళని చెపుతున్నారు . ఆదిశేషుడు” శ్రీమన్నారాయణునికి  కైంకర్యము ఎలాచేస్తాడంటే “సెన్ఱాల్ కుడయాం, ఇరుందాల్ సింగాసనమాం, నిన్ఱాల్ మరవడియాం, నీళ్ కడలుళ్ ఎన్ఱుం పునైయాం మణి విళక్కాం, పూంపట్టాం, పుల్గుం అణైయాం తిరుమార్కు అరవు”. శ్రీమన్నారాయణునికి ఆదిశేషుడు నడుస్తే గొడుగు , కూర్చుంటే సింహాసనం, నిలబడితే పీట, చేతి దిండు, మణి దీపము, పట్టుపరుపు…. ఇలా సకల సేవలు చేస్తాడని మన ఆళ్వార్లు ప్రబందములో పడారు.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2015/02/gyana-saram-26-arram-uraikkil/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment