ఆర్తి ప్రబంధం – 11

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

ఆర్తి ప్రభందం

<< ఆర్తి ప్రబంధం – 10

vaduganambi-avatharasthalam

వడుగ నమ్బి

ప్రస్తావన

ఈ పాశురమున మణవాళ మామునులు శ్రీ రామానుజులు తనను ప్రశ్నించినట్లు తలెచెను. శ్రీ రామానుజులు ” ఓ మణవాళ మామునీ! నిళలుమ్ అడితారుమానోమ్ (పెరియ తిరువన్దాది 31)’, ‘మేవినేన్ అవన్ పొన్నడి (కణ్ణినుణ్ చిఱుత్ తాంబు 2)’, ‘రామానుజ పదచ్చాయా (ఎమ్బార్ తనియన్)‘, ఈ వాక్యములలో పేర్కొన్నట్లు మీరు పారతంత్రియమునకు ప్రతిరూపమగు భక్తుల స్థితిని చేరుటకు అపేక్షించుచుండెను (శేషులు (సేవకులు) పూర్తిగా తన శేషిని (యజమానులను) ఆశ్రయించి ఉండు గుణమే పారతంత్ర్యం. శేషి తానకు తోచిన విధమున శేషున్ని ఉపయొగించును, శేషుడు తన నిజ స్వరూపముచే వారికి ఎదురుగా ఎప్పుడును ఏమియును చెప్పరు). ఇట్టి బాంధవ్యము వడుగ నంబి వంటి వారికే సాధ్యమగును కదా?” అని శ్రీ రామానుజులు ప్రశ్నించెను. దీనికి మణవాళ మామునులు ” ఓ! రామానుజాచార్య ! మిమ్ము తప్ప వేరు దైవమెరుగని వడుగ నంబుల స్థితిని ప్రసాదింపుము. దయచేసి అట్టి స్థితిని నాకు అలవరుచుము. అట్లు నాకు అలవరచిన తరువాత మీరు నన్ను ఎంతవరకైనను మీకు తోచినయట్లు ఉపయోగించుము” అని సమాధానము చెప్పెను.

పాశురం 11

ఉన్నైయొళియ ఒరు దైవం మఱ్ఱఱియా
మన్నుపుగళ్సేర్ వడుగ నమ్బి తన్ నిలయై
ఎన్ఱనక్కు నీ తన్దు ఎతిరాసా ఎన్నాళుమ్
ఉన్ఱనక్కే ఆట్కొళ్ ఉగన్దు

ప్రతి పదార్ధము

 

ఎతిరాసా – ఓ! ఎమ్పెరుమానారే!!!
నీ తన్దు – మీరు ఇవ్వవలెను
ఎన్ఱనక్కు – నాకు (వడుగ నమ్బి యొక్క స్త్థి ని ఆకాంక్ష్మించు)
నిలయై – చరమ పర్వ నిష్ట (గురువే అన్ని అని తలచు చివరి స్థితి)
మన్ను – ఎల్లప్పుడు
సేర్ – చేరు
పుగళ్ – కీర్తి (అని పేర్కొనబడు)
వడుగనమ్బి తన్ – వడుగ నమ్బి వారు
ఉన్నై ఒళియ – మీ తప్ప
ఒరు దైవం మఱ్ఱఱియా –
ఆట్కొళ్ ఉగన్దు – (ఓ! ఎమ్పెరుమానారే) దయతో నా కైంకర్యములను ఆనందముతో స్వీకరింపుము
ఎన్నాళుమ్ –అన్ని కాలములన
ఉన్ఱనక్కే – మీ కొఱకు మాత్రమే

సామాన్య అర్ధం

మణవాళ మామునులు ఈ పాశురమున శ్రీ రామానుజులను తనకు వడుగ నంబి యొక్క ఆనందదాయకమైన స్థితిని ప్రసాదించమని ప్రార్ధించెను. శ్రీ రామానుజులను తప్ప మరియొక దైవమెరుగని వడుగ నంబి, శ్రీరామానుజుల ప్రధాన శిష్యులు. మణవాళ మామునులు శ్రీ రామానుజులతో తనకు అట్టి స్ఠితిని ప్రసాదించి తరువాత వారికి తోచినయట్లు ఉపయోగించుకొనమని కోరెను. అదియేగాక తనకు శ్రీ రామానుజులకు కైంకర్యము చేయుట ఎల్లవేళల సంతోషమని చెప్పెను.

వివరణ

“ఓ! యతిరాజా, నాకు వడుగ నంబుల ఉన్నత స్థితిని అనుగ్రహింపుము. వడుగ నంబి శ్రీ రామానుజుల శిష్యులు. వారికి వారి గురువైన శ్రీ రామానుజులను తప్ప వేరు ఒక దైవమెరుగరు. వడుగ నంబి శ్రీ రంగములో ఉన్న పెరియ పెరుమాళ్ ను కూడ శ్రీ రామానుజుల కైంకర్యమునకు ఆటంకముగా భావించెను. వారు పెరుమాళ్ మరియు ఆచర్యులను, ఇరువురి చెంత వెళ్ళువారిని వలే కారు. వడుగ నంబి తన ఆచార్యులనే దైవముగా తలచి, పెరియ పెరుమాళ్ గూర్చి ఏ విధమైన ధ్యాసనుఉంచలేదు. ఇట్టి అత్యంత ఆచార్య భక్తి చే వారు ఉన్నత స్థితి యందు ఉన్నారు”,అని మణవాళ మామునులు చెప్పెను. మణవాళ మామునులు ” ఓ! ఎమ్పెరుమానారే, ” ఎనక్కే ఆట్చెయ్ ఎక్కాలతుం (తిరువాయ్ మొళి 2.9.4)“ అని ఆళ్వార్లు చెప్పినట్లు, నన్ను ఎల్లప్పుడు మీ సేవయందు మాత్రమే ఉపయోగించుము.  మీ అధీనములో ఉన్నాను కావున, మీరు మీ సంతోషము కొరకు ఉపయోగించుము. ఎప్పుడు ఎక్కడ వెళ్ళినను నన్నూ మీతో తీసుకెళ్ళి మీ కైంకర్యమునకు మరియు సంతోషమునకు ఉపయోగించుము.” అని శ్రీ రామానుజులతో ప్రార్ధించెను.
“మన్ను పుగళ్ సేర్ వడుగ నమ్బి నిలై” అను వాక్యమును, “మన్ను నిలై సేర్ వడుగనమ్బి” అని కూడ వివరించ వచ్చు. పరమైన వాక్యమున “మన్ను నిలై సేర్” అను భాగము వడుగ నంబి అను నామవాచకమునకు విశేషణముగును. వడుగ నంబి చరమ నిష్ఠ స్థితి యందు చేరినచే నిత్యమైన కీర్తిని పొందెను.

అడియేన్ వైష్ణవి రామానుజ దాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2016/07/arththi-prabandham-11/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Comment