తిరుప్పళ్ళి యెళుచ్చి – 8 – వంబవిళ్

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

తిరుప్పళ్ళి యెళుచ్చి

7వ పాశురం

vishnu-and-naradha

పాశుర అవతారిక:


వంబవిళ్ వానవర్ వాయుఱై వళఙ్గ                                                                                                                             మా నిదికపిలై ఒణ్ కణ్ణాడిముదలా                                                                                                           ఎంపెరుమాన్ పడిమైక్కలం కాణ్డర్కు                                                                                                                 ఏఱ్పనవాయిన కొణ్డు నల్ మునివర్                                                                                                                         తుంబురు నారదర్ పుగున్దనర్ ఇవరో                                                                                                                   తోన్ఱినన్ ఇరవియుం తులంగు ఒళి పరప్పి                                                                                                   అంబరతలత్తు నిన్ఱు అగల్ కిన్ఱదు యిరుళ్ పోయ్                                                                                                       అరంగత్తమ్మా పళ్ళియెళుందరుళాయే

ప్రతిపదార్థం

వళఙ్గ= మీ ఔనత్యమునకు సమర్పింపబడిన
వాయుఱై= గరిక(గడ్డి)
మా= శ్లాఘ్యమైన/పొగడ తగిన
నిది= నిధులు- శంఖ పద్మ నిధులు(వారి హస్తముల యందు ధరించిన)
వంబవిళ్= పరిమళించు
వానవర్= దేవతలు
కపిలై= కామధేనువు
ఒణ్= ప్రకాశించు
కణ్ణాడిముదలా= అద్దము మొదలైనవి
ఎంపెరుమాన్= సర్వస్వామి /రక్షకుడు
కాణ్డర్కు= వారిని అనుగ్రహించుము
ఏఱ్పనవాయిన= తగినవి(మీ ఔనత్యమునకు)
పడిమైక్కలం కొణ్డు= ఉపకరణములు
నల్ మునివర్= విలక్షణమైన ఋషులు                                                                                                   తుంబురు నారదర్ = తుంబురుడు, నారదుడు (భగవానునికి నిరంతరం గాన కైంకర్యం చేయువారు)
పుగున్దనర్ ఇవరో= వచ్చి నిలబడ్డారు
ఇరవియుం= సూర్యుడు కూడా
తులంగు ఒళి= అధిక ప్రకాశం
పరప్పి= వ్యాపింపచేయు
తోన్ఱినన్= అగుపించెను
యిరుళ్= అంధకారం
అంబరతలత్తు నిన్ఱు=ఆకాశము నుండి
పోయ్   అగల్ కిన్ఱదు= కనిపించకుండా పోయినది
అరంగత్తమ్మా!= శ్రీరంగమున శయనించిన నా దేవాది దేవా!
పళ్ళియెళుందరుళాయే= లేచి మమ్ములను అనుగ్రహించుము

సంక్షిప్త అనువాదం:

ఓ దేవాది దేవా! విలక్షణ ఋషులైన తుంబురుడు, నారదుడు, స్వర్గమున నివసించు స్వతాహాగా పరమళించు దేవతలు, కానధేనువు మొదలైనవారు గరిక, అద్దం మరియు విలువైన సంపదలతో  తిరువారాధన సామాగ్రితో మీ తిరువారాధనకై వచ్చిఉన్నారు. సూర్యుడు ఉదయించి తన కిరణ ప్రాసారం చే అంధకారమును పోగొట్టాడు. శ్రీరంగమున శయనించిన నా దేవాది దేవా! లేచి మమ్ములను అనుగ్రహించుము.

నంఙ్ఞీయర్ వ్యాఖ్యానములోని ప్రధానాంశములు :

  • నల్ మునివర్= విలక్షణమైన ఋషులు- అనన్య ప్రయోజనులు- ఎంపెరుమాన్ కైంకర్యము తప్ప ఇతర ప్రయోజనములను వేటిని అభిలషించని వారు.
  • సూర్యుడు  బాహ్యాంధకారమును నశింపచేస్తాడు. కాని సర్వ రక్షకుడగు ఎంపెరుమాన్ అంతర అంధకారం(అఙ్ఞానం) పోగొడతాడు.
  • సూచన –  పిళ్ళైలోకాచార్యులు  తమ ముముక్షుపడి 36వ సూత్రమున ఇలా వ్యాఖ్యానించారు- “రక్షకత్వం” అనగా  కష్ఠ నివారణ ఇష్ఠ ప్రాప్తి ని కలిగించేది. తర్వాతి సూత్రములలో వివిధ వ్యక్తులకు  గల కష్ఠములను/ఇష్ఠములను పేర్కొన్నాడు. 38 సూత్రమున- ప్రపన్నులకు/ముముక్షువులకు,  సంసారులకు  (ప్రాపంచిక విషయాసక్తి గల వారు)  సంసార సంబంధము కష్ఠము మరియు పరమపదం చేరి ఎంపెరుమాన్ కి కైంకర్యం చేయుట ఇష్ఠప్రాప్తి. రక్షకత్వం భగవానునకే సాధ్యం.

 పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానములోని ప్రధానాంశములు:

  • నల్ మునివర్= విలక్షణమైన ఋషులు-భగవానుని ముఖవిల్లాసమునకై ధ్యానము చేయువారు.” అత్తలైక్కు ప్పాంగానవఱైయే మననం పణ్ణుమ్ అవర్గళ్”
  • పెరుమాళ్ శయనించునప్పుడు లాలి /జోల పాటలు ఆలకిస్తారు , ప్రాతః కాలము లేచునప్పుడు సుప్రభాతమును ఆలకిస్తారు. కనుకనే తుంబుర నారదులు వచ్చారని భావన.
  • నంఙ్ఞీయర్  మరియు   పెరియవాచ్చాన్ పిళ్ళై  ప్రధానముగా ఎంపెరుమాన్ మాత్రమే అంతర్గత చీకటిని(అఙ్ఞానం)వదిలించువాడని సిధ్ధాంతీకరించారు. 

అడియేన నల్లా శశిధర్ రామానుజదాస

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/01/thiruppalliyezhuchchi-8-vambavizh/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
pramAthA (preceptors) – http://guruparamparai.wordpress.com
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org

Leave a Comment