రామానుశ నూత్తందాది – సరళ వ్యాఖ్యానము – పాశురము 31- 40

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి క్రమము

<< మునుపటి శీర్షిక

ముప్పై ఒకటవ పాశురము:  అనేక జన్మలెత్తి (ఈ సంసార సాగరములో) బాధ పడుతున్న జీవులు, ఎంబెరుమానార్ కృపతో వారినే చేరుకున్నారని పరమానందముతో అముదనార్ తన హృదయానికి చెబుతున్నారు.

ఆండుగళ్‌ నాళ్‌ తింగళాయ్ ।‌ నిగళ్‌ కాలమెల్లాం మనమే 
ఈండు। పల్‌ యోనిగళ్‌ తోఱు ఉళల్వోం * ఇన్ఱు ఓర్ ‌ ఎణ్‌ ఇన్ఱియే                                   కాణ్‌ తగు తోళ్‌ అణ్ణల్‌ తెన్‌ అత్తియూరర్‌ కళల్‌ ఇణైక్కీళ్
ప్పూండ అన్బాళన్। ఇరామానుశనై ప్పొరుందినమే॥ (31)

ఓ మనసా! మనము అనేక జన్మలలో రకరకాల మనుషులు/పదార్థాల నడుమ లెక్కలేని రోజులు, నెలలు చివరికి సంవత్సరాలు శ్రమించాము. కానీ, ఈనాడు ఇక మరో ఆలోచన చేయక, దివ్య భుజాలతో తిరు అత్తియూర్లో (కాంచీపురము) నిత్య నివాముంటున్న దేవరాజ పెరుమాళ్ల దివ్య తిరువడిఘళ్ళ ని అమితంగా అభిమానించే ఎంబెరుమానార్లని పొందినందుకు  ఈ రోజు మనము అదృష్టవంతులుగా భావించాలి.  

ముప్పై రెండవ పాశురము:   ఎంబెరుమానార్ ని పొందిన అముదనార్ని ఈ ఆనంద స్థితిలో చూసిన కొందరు ఇలా అడిగారు, “మేము కూడా ఎంబెరుమానార్ ని పొందాలని ఆశిస్తున్నాము; కానీ మీ మాదిరిగా ఆత్మగుణాలు మాలో లేవు”. దానికి బదులుగా, “ఎంబెరుమానార్లని పొందిన వారికి ఆత్మగుణాలు వాటంతట అవే వస్తాయి” అని అన్నారు.

పొరుందియ తేశుం పొఱైయుం తిఱలుం పుగళుం। నల్ల
తిరుందియ ఞ్ఙానముం। శెల్వముం శేరుం* సెఱు కలియాల్‌                            వరుందియ ఞ్ఙాలత్తై  వణ్మైయినాల్।‌  వందెడుత్తళిత్త
అరుందవన్। ఎంగళ్‌ ఇరామానుశనై। అడైబవర్‌క్కే॥ ( (32)

ఈ కలి కాలములో బాధపడుతున్న లోకాన్ని చూసి ఔదార్యులైన రామానుజులు  ఉద్దరించి రక్షించారు.  ఎంబెరుమాన్ కి శరణాగతులైన వారికి ప్రతినిధిగా, మనతో శరణాగతి చేయించగల గొప్ప తపశ్శాలులై ఉన్నారు. వారిని పొందిన వారికి, స్వరూపము, సహనము, ఇంద్రియ నిగ్రహము, మంచి గుణాల వల్ల గొప్పదనము, స్పష్టమైన తత్త్వ జ్ఞానం, హితము, పురుషార్థము, భక్తి సంపద వంటివి వాటంతట అవే లభిస్తాయి. 

ముప్పై మూడవ పాశురము: ఎంబెరుమానార్ ని ఆశ్రయించేందుకు మన ఇంద్రియాలను ఎలా నియంత్రించుకోవాలనే ప్రశ్నకు బదులుగా, ఐదు దివ్య ఆయుధములు రామానుజుల నియంత్రణలో ఉంటాయని అముదనార్లు తెలియజేస్తున్నారు. ఐదు దివ్య ఆయుధములే రామానుజులుగా అవరించాయని చెప్పినట్టు మనం మరో అర్థము కూడా చెప్పుకోవచ్చు.

అడైయార్‌ కమలత్తలర్మగళ్‌ కేళ్వన్। కై ఆళి ఎన్నుం
పడైయోడు నాందగముం। పడర్‌ తణుడుం* ఒణ్‌ శార్ఞ్గ విల్లుం
పుడై ఆర్‌ పురి శంగముం। ఇంద ప్పూదలం కాప్పదఱ్కు ఎన్ఱు
ఇడైయే। ఇరామానుశ ముని ఆయిన ఇన్నిలత్తే॥  (33)

విరబూసిన పద్మము పిరాట్టి నివాస స్థలము. ఆమెకు భర్త అయిన భగవానుని దివ్య హస్తాలలో, దివ్య ఆయుధముల రూపంగా సుదర్శన చక్రము, నందక ఖడ్గములు, గద, శార్ఞ్గము, పాంచజన్యము విరాజిల్లును. ఈ దివ్య ఆయుధాలన్నీ ఈ భూమిపైన మన రక్షణార్థం ఎంబెరుమానార్ల వద్దకు వచ్చి చేరినవి. ఈ  దివ్య ఆయుధములన్నీ రామానుజులుగా అవరించాయని మనము మరో అర్థము కూడా తీసుకోవచ్చు.

ముప్పై నాల్గవ పాశురము:  కలి దోషాన్ని తొలగించి భూమిని కాపాడిన తరువాత కూడా రామానుజుల కళ్యాణ గుణాలు ప్రకాశించలేదు, తన కర్మ తొలగిన పిదప వారి గుణాలు గొప్పతనాన్ని పొందాయని అముదనార్లు తెలియజేస్తున్నారు.

నిలత్తై చ్చెఱుత్తుణ్ణుం నీశ క్కలియై। నినైప్పు అరియ
పలత్తై చ్చెఱుత్తుం। పిఱంగియదిల్లై* ఎన్‌ పెయ్‌ వినై తెన్‌
పులత్తిల్‌ పాఱిత్త అప్పుత్తర చ్చుమ్మై। పాఱుక్కియ పిన్।
నలత్తై ప్పొఱుత్తదు। ఇరామానుశన్ తన్ నయ ప్పుగళే॥ (34)

సామాన్యులకు అలవి కాని ఈ అపేక్షనీయమైన ఎంబెరుమానార్ల దివ్య కళ్యాణ గుణాలు కేవలం ఈ భూమిని బాధపెట్టి హింసిస్తున్న కలిని తొలగించిన తరువాత ప్రకాశించలేదు, నా పాపాలు తొలగి,  పిదప యమలోకములో ఆ పుస్తకములో నా పేరుమీద ప్రవేశింపబడిన పాపాల బరువు తగ్గిన తరువాత  మాత్రమే అవి దేదీప్యమానమైనవి.

ముప్పై ఐదవ పాశురము: రామానుజులు తొలగించిన పాపాలు తనలో మళ్లీ వచ్చి స్థిరపడితే ఎలా అని అడిగినపుడు, అలాంటి పరిస్థితికి ఆస్కారమే లేదు అని అముదనార్లు చెబుతున్నారు.

నయవేన్ ఒరు తెయ్వం నానిలత్తే। శిల మానిడత్తై
ప్పుయలే ఎన క్కవి పోఱ్ఱి శెయ్యేన్*  పొన్ అరంగం ఎన్నిల్‌
మయలే పెరుగుం ఇరామానుశన్। మన్ను మా మలర్‌త్తాళ్‌
అయరేన్। అరువినై ఎన్నై। ఎవ్వాఱు ఇన్ఱు అడర్ ‌ప్పదువే॥ (35)

ఇతర దేవతలను నేను ఆరాధించను. ఈ భూమిపైన అల్పులను వారి ఔదార్యాన్ని మేఘాలతో పోల్చి పాశురములను పాడను. శ్రీరంగము పేరు వింటేనే రామానుజులు పులకరించిపోతారు. అటువంటి రామానుజుల దివ్య పాదయుగళిని ఎన్నడూ మరవను. తొలగించడానికి కష్టమైన దుష్కర్మలు నా దగ్గరకి ఎలా వస్తాయి?

ముప్పై ఆరవ పాశురము: “నీవు వారిని మఱవలేవు అని అంటున్నావు. వారిని మెము కూడా పొందేందుకు దయచేసి వారి స్వభావము గురించి మాకు వివరించుము” అని  అముదనార్లని విన్నపించుకున్నారు. వారు వాత్సల్యముతో చెప్పసాగారు.

అడల్‌ కొండ నేమియన్। ఆరుయిర్‌ నాదన్। అన్జారణ చ్చొల్‌
కడల్‌ కొండ ఒణ్ పొరుళ్।‌ కండళిప్ప * పిన్నుం కాశినియోర్                                   ఇడరిన్ కణ్  వీళందిడ త్తానుం అవ్వొణ్ పొరుళ్‌ కొండు అవర్‌                                పిన్ పడరుం గుణన్ । ఎం ఇరామానుశన్ తన్ పడి ఇదువే॥ (36)

సమస్థ ఆత్మలకు స్వామియై, శత్రువులను ఓడించే శక్తి గల దివ్య చక్రాయుధము చెంత ఉన్న సర్వేశ్వరుడు, సమస్థ ఆత్మలను ఉద్దరింపబడాలని విశాద స్థితిలో ఉన్న అర్జునుడికి నిగూఢమైన, అమూల్యమైన అర్థములను కృపతో శ్రీ భగవద్గీతగా అందించారు. ఆ తరువాత కూడా, ఈ భూమిపైన ఉన్నవారు దుఃఖ సంసార సాగరములో మునిగి ఉన్నారు. సర్వేశ్వరుడు అందించిన ఆ అమూల్యమైన అర్థములను ( శ్రీ భగవద్గీత) ఉపయోగించి, అటువంటి వాళ్ళను రక్షించే స్వభావము ఎంబెరుమానార్లది.

ముప్పై ఏడవ పాశురము: అటువంటి ఎంబెరుమానార్ దివ్య తిరువడిని ఎలా పొందగలిగారు అని అముదనార్లని ప్రశ్నించినపుడు, పూర్తి జ్ఞానముతో వారిని పొందలేదని వారు తెలుపుతున్నారు. ఎంబెరుమానార్ దివ్య తిరువడిని అపేక్షించిన వారితో సంబంధము పెట్టుకోవాలనుకున్నవారు నన్ను వారి దాసునిగా చేసుకున్నారు అని వివరిస్తున్నారు.   

పడి కొండ కీర్‌త్తి। ఇరామాయణం ఎన్నుం పత్తి వెళ్ళం।                                              కుడి కొండ కోయిల్। ఇరామానుశన్ గుణం కూఱుం* అన్నర్‌
కడి కొండ మా మలర్‌ త్తాళ్।‌ కలందు ఉళ్ళం కనియుం నల్లోర్                                    అడి కండు కొండు ఉగందు।  ఎన్నైయుం ఆం‌ అవర్ ‌క్కాక్కినరే॥ (37)

ప్రపంచ వ్యాప్తి చెందిన, భక్తి సాగరమైన శ్రీ రామాయణానికి కేంద్రము ఎంబెరుమానార్. రామానుజ దాసులు వారి మంగళ గుణాలను నిత్యము ప్రశంసిస్తూ ఉంటారు. మనస్ఫూర్తిగా రామానుజ దాసుల దివ్య పాదధూళికి తమ భక్తిని సమర్పించుకుంటున్న మహాపురుషులు, ఈ నా స్థితిని చూసిన పిదప ఈ ఆత్మ (అముదనార్) కూడా రామానుజ దాసుడు కావాలని ఆశించిరి. అటువంటి రామానుజ దాసుల సంబంధము చేత వారు (అముదనార్లు) రామానుజులకు శిష్యులు అయ్యారు.

ముప్పై  ఎనిమిదవ పాశురము: ఎంబెరుమానార్ మహోన్నతుడని పరిగణించి, ఇంత కాలము వారి నీడలోకి ఎందుకు తీసుకోలేదని అముదనార్ ప్రశ్నిస్తున్నారు. 

ఆక్కి అడిమై। నిలైప్పిత్తనై। ఎన్నై ఇన్ఱు అవమే                                                            పోక్కి ప్పుఱత్తిట్టదు* ఎన్ పొరుళా మున్బు పుణ్ణియర్‌ తం
వాక్కిల్‌ పిరియా ఇరామానుశ।  నిన్ అరుళిన్ వణ్ణం                                              నోక్కిల్‌ తెరివరిదాల్।‌ ఉరైయాయ్‌ ఇంద నుణ్‌ పొరుళే॥ (38)

“నేను ఈశ్వరుడిని” అన్న భావనతో ఉన్న నన్ను నీ శిష్యునిగా చేర్చుకున్నావు. పైగా నీ దాసులకి దాసునిగా దృఢపరచావు. ఈ ఉన్నత స్థితిని అధీష్థించిన నన్ను ఏ కారణము చేత ఈ లౌకిక వ్యవహారములలో నెట్టావు? నిన్ను నిత్యము అనుభవించే అదృష్థవంతులు నిన్ను నిత్యము వారి సంభషణలలో ఉంచుకుంటారు. ఒక్కొక్కప్పుడు నీ కృపను చూసి అర్థము చేసుకోలేను. ఈ సూక్ష్మ విషయాన్ని నీవే నీ కృపతో వివరించాలి.   

ముప్పై తొమ్మిదవ పాశురము: మునుపటి పాశురములో ఎంబెరుమానార్ నుండి తన ప్రశ్నకు ప్రతిస్పందన రాలేదని అముదనార్లు, ఆ విషయము అలా పక్కన పెట్టి, ఎంబెరుమానార్ తనకు చేసిన ఉపకారాల గుర్తుచేసుకుంటారు, “ఇటువంటి రక్షణ కార్యాలు ఇంకెవరు చేస్తారు?” అని అముదనార్ తన మనస్సుకి చెప్పుకుంటున్నారు. 

పారుళుం పుదల్వరుం పూమియుం। పూంగుళలారుం ఎన్ఱే 
మరుళ్‌ కొండు ఇళైక్కుం। నమక్కు నెంజే* మఱ్ఱు ఉళార్  తరమో
ఇరుళ్‌ కొండ వెన్ తుయర్‌ మాఱ్ఱి। త్తన్ ఈఱిల్‌ పెరుం పుగళే।
తెరుళుం తెరుళ్‌ తందు। ఇరామానుశన్ శెయ్యుం శేమంగళే॥ (39)

భార్య పిల్లలు, ఐశ్వర్యము వంటి వ్యర్థమైన లౌకిక విషయాలలో మేము బాధపడుతున్నాము. అజ్ఞానముతో ఉద్భవించిన దుఃఖాలను ఎంబెరుమానార్ తొలగించి వారి నిత్యమైన అనంతమైన దివ్య మంగళ గుణాలను తెలిసుకునేలా జ్ఞానాన్ని ఇచ్చారు. ఓ మనసా! వారి రక్షణ చర్యలు కూడా ఇతరుల రక్షణ చర్యలలా అల్పమైనవా? 

నలభైవ పాశురము: ఈ ప్రపంచానికి రామానుజులు చేసిన మహోపకారములను స్మరిస్తూ అముదనార్ మహదానంద పడుతున్నారు.

శేమ నల్‌ వీడుం। పారుళుం తరుమముం। శీరియ నల్‌
కామముం। ఎన్ఱు ఇవై నాంగు ఎన్బర్* నాంగినుమ్ కణ్ణనుక్కే
ఆమదు కామం। అఱమ్ పొరుళ్‌ వీడిదఱ్కు ఎన్ఱు ఉరైత్తాన్।
వామనన్ శీలన్। ఇరామానుశన్ ఇంద మణ్మిసైయే॥ (40)

ప్రతిఫలమాశించక ఇతరుకు సహాయాన్ని అందించే శ్రీ వామనుడిని పోలిన వారు ఎంబెరుమానార్.  ధర్మ, అర్థ, కామ, మోక్షాలు మనము సాధించవలసినవి అని మన జ్ఞానులైన పెద్దలు అంటారు. ఇందులో, భగవాన్ పట్ల మన ప్రేమని కామముగా గుర్తిస్తారు. ఈ ప్రపంచములో ధర్మము మన పాపాలను తొలగిస్తుందని ఎంబెరుమానార్ కృపతో తెలుపుతున్నారు. దానములతో అర్థము, మన ధర్మానికి పరిపూర్ణత చేకూరుస్తుంది. భగవత్ కామముతో (భగవత్ ప్రీతి)  వీటన్నిటితో, మన మోక్ష సాధనము వృద్ది అవుతుంది.  

అడియెన్ శ్రీదేవి రామానుజ దాసి

మూలము: https://divyaprabandham.koyil.org/index.php/2020/05/ramanusa-nurrandhadhi-pasurams-31-40-simple/

ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి : https://divyaprabandham.koyil.org

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment