శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
పాశురము 73
ఈ ప్రబంధమును నేర్చుకొని అనుభవించు వారికి కలుగు ఫలమును చెప్పి ప్రబంధమును ముగించుచున్నారు.
ఇన్దఉపదేశ!రత్తినమాలై దన్నై! శిన్దైదన్నిల్ నాళుమ్! శిన్దిప్పార్!ఎన్దై యెతిరాశర్! ఇన్నరుళుక్కు ఎన్ఱుమ్ ఇలక్కాగి! శదిరాగ! వాళ్ న్దిడువర్ తామ్!!
పూర్వాచార్యుల ఉపదేశ సారమైన ఉపదేశ రత్తినమాలై ఈ ప్రబంధము నందు వారి చింతనము సర్వదా ఉంచు కొనువారు నా స్వామియైన యతిరాజ ఎంబెరుమానార్ యొక్క అవ్యాజ కరుణకి పాత్రులై చిరకాలము జీవిస్తారు.
ఆళ్వార్ల తిరువవతార క్రమము, వారియొక్క తిరువవతార స్థలములు, వారియొక్క అరుళ్చెయల్/శ్రీసూక్తులకు అచార్యులు అనుగ్రహించిన వ్యాఖ్యానములు, ఆ అరుళ్చెయల్ మఱియు వ్యాఖ్యానముల సారమైన శ్రీవచన భూషణమనే దివ్య శాస్త్రము యొక్క ప్రాశస్త్యము దానిలో చూపబడిన “ఆచార్య అభిమానము” అనే ఉన్నతమైన సూత్రము మొదలగు వాటిని ఎల్లవేళలా మననము చేయువారు కరుణాపూర్ణులైన భగవత్ రామానుజుల కరుణతో ఈ లోకములో కైజ్ఞ్కర్యశ్రీ తో జీవించి తదనంతరం ఉన్నతమైన నిత్య కైజ్ఞ్కర్యమును పొంది జీవితమును సార్థకము చేసుకొనగలరు/ఉజ్జీవించగలరు.
ఎఱుమ్బియప్ప కృపచేసిన ప్రత్యేక పాశురం – చివరలో ఒక్కసారే సేవించు ఆచారము.
మున్నుయిర్ గాళ్ ! ఇజ్ఞ్గే మణవాళమామునివన్! పొన్నడియామ్! శెజ్ఞ్గమలప్పోదుగళై! ఉన్నిచ్చిరత్తాలే తీణ్డిల్! ఆమానవనుమ్ నమ్మై! కరత్తాలే! తీణ్డల్ కడన్!!
ఈ లోకములో జీవించు చేతనులారా! ఈ సంసార మండలముననే మణవాళ మామునుల యొక్క తిరువడిగళనే బంగారు ఎఱ్ఱని తామరలవంటి పాదపద్మములను మీ శిరస్సులందు ధరించి సర్వదా స్మరిస్తూ ఉన్నచో దేహత్యాగానంతరము అర్చిరాది మార్గములో ప్రయాణించి, విరజానదిని దాటి, అమానవుడు మిమ్ములని తన హస్తముతో స్పృసించగా దివ్య శరీరమును పొంది, అపరిమితానంద నిలయమైన శ్రీవైకుంఠమునందున్నటువంటి తిరుమామణి మంటపమును చేరి ఎంబెరుమాన్/పరమాత్మచే స్వీకరింపబడి భగవత్ దాసులతో కూడి ఉండి నిత్య కైజ్ఞ్కర్యములు చేయుచూ ఉండగలరు.
ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయర్ తిరువడిగళే శరణం.
అడియేన్ వీ.వీ.ఎల్.ఎన్. ఆచార్యులు రామానుజ దాసన్ 🙏
మూలము : https://divyaprabandham.koyil.org/index.php/2020/07/upadhesa-raththina-malai-73-conclusion-simple/
ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి : https://divyaprabandham.koyil.org
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org