శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
పాశురము 66
క్రిందటి పాశురములలోని విషయములకు ఉదాహరణముగా ఎవరైనా ఉన్నారా అని తన మనస్సు అడిగినట్లుగా భావించి దానికి సమాధానము చెప్పుచున్నారు.
పిన్బళగరామ్ పెరుమాళ్ జీయర్ పెరున్దివత్తిల్! అన్బదువు మత్తు మిక్క ఆశైయినాల్* నమ్బిళ్ళైక్కు ఆన అడిమైగళ్ శెయ్ అన్నిలైయై నన్నెజ్ఞే! ఊనమఱ ఎప్పొళుదుమ్ ఓర్!!
పిన్బళగరామ్ పెరుమాళ్ జీయర్ ఆనందదాయకమైన పరమపదము పొందుటకు ఏ మాత్రము ఇచ్ఛగించక తన ఆచార్యులైన నంబిళ్ళైతోనే ఉంటూ పరమ ప్రీతితో వారికి తగిన కైజ్ఞ్కర్యములు చేస్తూవచారు. విలక్షణమైన ఓ మనసా నీవు అటువంటి స్థితిని ఎటువంటి దోషము లేకుండా తలచుమా!
పిన్బళగరామ్ జీయర్ నమ్బిళ్ళె ప్రియ శిష్యులు. నంబిళ్ళై శిష్యులుగా ఉన్న కాలములోనే వీరు జీయరుగా ఉండి నంబిళ్ళై తిరుమేని కైజ్ఞ్కర్యములు చేస్తుండినారు. వీరికి ఒకసారి శరీరమునందు ఏదోఒక అస్వస్థత వచ్చుటచే వైద్యుని వద్దకు వెళ్ళి ఔషధమును సేవించి అస్వస్థతను నయము చేసుకొనినారు. శ్రీవైష్ణవులు అదీకాక సన్యాసి ఈ విధముగా ఔషధము తీసుకొని శరీరమును బాగు చేసుకొనవచ్చునా అని ఒకరు అనగా, ఆ సమయమున చాలామంది చాలా కారణములను చూపినారు. ఒకరు వీరికి నంబెరుమాళ్ నందు మనసులేదని, ఇంకొకరు వీరికి శ్రీరంగం విడుచుటకు ఇష్టము లేదనీ, వేరోకరు వీరికి నంబిళ్ళై కాలక్షేప గోష్ఠి విడుచుటకు మనసంగీకరించుటలేదని పలికినారు. నంబిళ్ళై, జీయరును పిలిపించి కారణము అడుగగా వీరు తమ ఆచార్యులైన నంబిళ్ళై కావేరీలో స్నానమాచరించి వచ్చు సమయములో వారి తిరుమేని నుండి కారు స్వేద/చెమట బిందువులను సేవించు భాగ్యము ఇక్కడనే కదా ఉన్నది. దానిని విడుచుటకు మనస్సు అంగీకరించకయే తాను ఔషధమును సేవించినానని చెప్పి తమ ఆచార్యుల తిరుమేని మీదగల అభిమానము/భక్తిని వెలుబుచ్చినారు. దీనినే ఇక్కడ మామునులు కీర్తస్తున్నారు. నమ్మాళ్వార్లకు మధురకవి వలె ఎంబెరుమానారునకు వడుగనంబి మాదిరిగా వీరునూ ఒకరే.
అడియేన్ వీ.వీ.ఎల్.ఎన్. ఆచార్యులు రామానుజ దాసన్ 🙏
మూలము : https://divyaprabandham.koyil.org/index.php/2020/07/upadhesa-raththina-malai-66-simple/
ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి : https://divyaprabandham.koyil.org
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org