ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 51 – 52

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

ఉపదేశ రత్తినమాలై

<< గతశీర్షిక

పాశురము 51

యాబై ఒకటవ పాశురము. ఈ పాశురములో నంబిళ్ళైకు లోకాచార్యులనే విలక్షణమైన తిరునామము వచ్చిన ఐతిహ్యమును మామునులు కృపచేయుచున్నారు.

తన్నుపుగళ్ క్కన్దాడైత్తోళప్పర్ తమ్ముగప్పాల్|
ఎన్న ఉలగారియనో ఎన్ఱు ఉరైక్క ప్పిన్నై
ఉలగారియనెన్నుమ్ పేర్ నమ్బిళ్ళెక్కు ఓజ్ఞ్గి|
విలగామల్ నిన్ఱదు ఎన్ఱుమ్ మేల్||

కులము మఱియు జ్ఞానము వలన కలిగిన గొప్ప వైభవమును పొందిన కందాడై తోళప్పార్ మొదలియాణ్డాన్ (భగవద్రామానుజుల మేనల్లుడు మఱియు ప్రియ శిష్యులు) యొక్క పౌత్రులు (మనుమలు). వీరు నమ్బిళ్ళె యొక్క జ్ఞానమునందు ఈర్ష్య కలిగి ఉండి, ఒకపర్యాయము నంబెరుమాళ్ సన్నిధిలోనే భక్తుల సమక్షములో నమ్బిళ్ళను అవమాన పరచి తమ తిరుమాళిగై (గృహమున) కు వెళ్ళగా అక్కడ వీరి ధర్మపత్ని వీరి దుశ్చర్యను తెలుసుకొని ఖండించి ఆ కళంకమును రూపుమాపుకోమని కోరగా వీరును తమ తప్పిదమును తెలుసుకొని నమ్బిళ్ళె వద్దకు పోయి క్షమా ప్రార్థన చేయుటకై వెళ్ళగా అక్కడ నమ్బిళ్ళె ద్వారము తెరచి ఉన్నప్పటికీ వారి తిరుమాళిగై లోనికి వెళ్ళకుండా ద్వారము వద్దనే వీరి కొఱకై ఎదురు చూస్తున్నారు. వీరు వారి వద్ద క్షమా ప్రార్థన చేయుటకు ముందే నమ్బిళ్ళె వీరిని ఉద్ధేశించి “మొదలియాణ్డాన్ తిరువంశస్తులైన మీరు కోపించు విధముగా నేను నడుచుకొంటినని కనుక నన్ను క్షమించి దయ చూపండని” అని కోరగా  తోళప్పన్ నమ్బిళ్ళె యందు పరమ ప్రీతితో “ఈ విధముగా నేను ఇప్పటి వరకు ఎవరినీ చూడలేదు. మీరు ఏ కొద్ది మందికో ఆచార్యులు కారు. యావత్ లోకానికే ఆచార్యులుగా ఉండ తగిన అర్హత కలిగినవారు. మీరే లోకాచార్యులని” ప్రకటించినారు. అప్పటి నుంచి నమ్బిళ్ళై లోకాచార్యులనే పేరుతో ప్రఖ్యాతులైరి.

పాశురము 52

యాబై రెండవ పాశురము. ఈ పాశురములో లోకాచార్యులనే తిరునామము లోక ప్రసిద్దము ఎలా పొందిందో కృప చేయుచున్నారు.

పిన్నై వడక్కుతిరువీధి ప్పిళ్ళై  అన్బాల్
అన్న తిరునామత్తై,  ఆదరిత్తు  మన్నుపుగళ్
మైన్దఱ్కు చ్చాత్తుగైయాల్ వన్దు పరన్దదు ఎజ్ఞ్గుమ్
ఇన్ద తిరునామమ్ ఇజ్ఞ్గు||

క్రిందటి పాశురములో తెలిపిన ఐతిహ్యము తర్వాత నంబిళ్ళై ప్రియ శిష్యులైన వడక్కుతిరువీధి పిళ్ళై తమ ఆచార్యుల తిరునామము “లోకాచార్యులు” మీదగల అభిమానముతో తమ ఆచార్యుల కృపతో తనకు జన్మించిన పుత్రునికి, తగిన గొప్ప కీర్తి ఉన్న వారికి “పిళ్ళ లోకాచార్యులు” అనే తిరునామము పెట్టుటచే ఈ తిరునామము లోక ప్రసిద్దిని పొందినది. మామునులు తామూ “వాళి ఉలగాచార్యన్” అని అమితమైన ప్రేమతో  పిళ్ళై లోకాచార్యులను కీర్తించినారు. పిళ్ళై లోకాచార్యులు తమ అమితమైన జ్ఞానముతో రహస్య గ్రంథములను లోకులందరూ తెలుసుకొని ఉజ్జీవింపబడే విధముగా రచించినారు. దీని వలననే వీరి తిరునామము లోకములో గొప్పగా కీర్తింపబడుతున్నది.

అడియేన్ వీ.వీ.ఎల్.ఎన్. ఆచార్యులు రామానుజ దాసన్

మూలము : https://divyaprabandham.koyil.org/index.php/2020/07/upadhesa-raththina-malai-51-52-simple/

ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి : https://divyaprabandham.koyil.org

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment