ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 41 – 43

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

ఉపదేశ రత్తినమాలై

<< గతశీర్షిక

పాశురము 41

నలబైయొకటవ పాశురము. ఈ పాశురములో తిరుక్కురుగైపిరాన్ పిళ్ళాన్ తిరువాయ్ మొళికి చేసిన ఆరాయిరప్పడి (ఒక పడికి 32 అక్షరములు) వ్యాఖ్యాన వైభవమును మామునులు కృపచేయుచున్నారు.

తెళ్ళారుమ్ జ్ఞాన త్తిరుక్కురుగైప్పిరాన్
పిళ్ళాన్ * ఎతిరాశర్ పేరరుళాళ్ ఉళ్ళిరుమ్
అన్బుడవే మాఱన్మఱై ప్పొరుళై అన్ఱురైత్తదు!
ఇన్బమిగుం ఆఱాయి‌రమ్!!

ఎంబెరుమానార్లచే జ్ఞాన పుత్రునిగా అభిమానింపబడి ఉడయవర్ల నిర్హేతుక కృపకు పాత్రులైన తిరుక్కురుగై పిరాన్ పిళ్ళాన్ తిరువాయ్ మొళి యందు గల అమిత భక్తి చేతను చేతనుల మీదకల అమితమైన కృపచేతను నమ్మాళ్వార్ మాఱన్ కృప చేసిన తిరువాయ్ మొళికి ఎంబెరుమానార్ కాలములోనే దాసులకు మిక్కిలి సంతోషమును కలిగించే ఆరాయిరప్పడి వ్యాఖ్యానమును కృప చేసినారు. ఈ వ్యాఖ్యానము యొక్క పరిమాణము విష్ణుపురాణమునకు సమానము.

పాశురము 42

నలుబది రెండవ పాశురములో నఞ్జీయర్ కృపతో తిరువాయ్ మొళికి చేసిన ఒన్బదినాయిరప్పడి వ్యాఖ్యానము గురించి తెలుపుచున్నారు.

తఞ్జ్శరై జ్ఞానియర్ గళ్ దామ్ పుగழுమ్ వేదాన్తి!
నఞ్జీయర్ దామ్ భట్టర్ నల్లరుళాల్ * ఎఞ్జాద
ఆర్వముడన్ మాఱన్మఱై ప్పొరుళై ఆయ్ న్దుఱైత్తదు *
ఏరోన్బిదిన ఆయిరమ్!!

శాస్త్ర జ్ఞానము కలిగిన జ్ఞానులు వేధాంతిగా పిలువబడే నఞ్జీయర్ ను శ్లాఘిస్తారు. ఎందుకనగా వారు వేదాంతం (ఉపనిషత్తుల) లో నిష్ణాతులు. అట్టి నఞ్జీయర్ తమ ఆచార్యులైన పరాశర భట్టర్ యొక్క కరుణతో నమ్మాళ్వార్ మాఱన్ కృప చేసిన తిరువాయ్ మొళికి ఎటువంటి కొఱతలేని భక్తితో కృప చేసిన విశ్లేషణాత్మకమైన విపులమైన వ్యాఖ్యానము ఒన్బదినాయిరప్పడి. పరాశర భట్టర్ పరమ కృపతో సంస్కరింపబడి వారి వద్దనే సంప్రదాయ రహస్యార్థ వివరణములను తెలుసుకొని నఞ్జీయర్ తిరువాయ్ మొళికి వందసార్లు కాలక్షేపము చేసిన కీర్తిని పొందినవారు. వారి వ్యాఖ్యనము పరిమాణములో శ్రీభాష్యమునకు సమానము.

పాశురము 43

నలుబైమూడవ పాశురము. ఈ పాశురములో పెరియవాచ్చాన్ పిళ్ళై తిరువాయ్ మొళికి కృపచేసిన ఇరువదినాలాయిరపడి వ్యాఖ్యాన వైభవమును కృపచేయుచున్నారు మామునులు.

నమ్బిళ్ళె తమ్ముడైయ నల్లరుళాల్ ఏవి యిడ!
పిన్ పెరియవాచ్చాన్బిళ్ళై యదనాల్* ఇన్బా
వరుపత్తి మాఱన్మఱై ప్పొరుళై చ్చొన్నదు!
ఇరుపత్తి నాలాయిరమ్!!

లోకాచార్యులుగా కీర్తింపబడే నంబిళ్ళై, వారి యొక్క గొప్ప కరుణ మూలముగా వారి శిష్యులలో ముఖ్యులు వ్యాఖ్యాన చక్రవర్తియైన పెరియవాచ్ఛాన్ పిళ్ళైకి తిరువాయ్ మొళికి ఒక చక్కని వ్యాఖ్యానమును రచించమని ఆజ్ఞాపించగా, ఆ ఆజ్ఞయే కారణముగా తలచి అందముగా మరియు భగవత్ కృప వలన కలిగిన భక్తితో కూడిన నమ్మాళ్వార్ మాఱన్ కృప చేసిన తిరువాయ్ మొళికి పెరియవాచ్చాన్ పిళ్ళై కృప చేసిన వ్యాఖ్యనము ఇరువది నాలాయిరపడి వ్యాఖ్యనము. ఇది పరిమాణములో శ్రీమధ్రామాయణమునకు సమానము.

అడియేన్ వీ.వీ.ఎల్.ఎన్. ఆచార్యులు రామానుజ దాసన్

మూలము : https://divyaprabandham.koyil.org/index.php/2020/06/upadhesa-raththina-malai-41-43-simple/

ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి : https://divyaprabandham.koyil.org

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment